*దేవుడు ఎక్కడున్నాడో తెలుసా*
*అందమైన జీవితం అందరికీ ఉండదు .. కానీ మనస్ఫూర్తిగా అభిమానం పంచే వాళ్ళుంటే ఆ లోటు తెలియదు.*
* భార్య అలక తీర్చే భర్త , భర్త అలసట అర్థం చేసుకొనే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకొని ముందుకు సాగిపోయే బంధమే..వివాహ బంధం!*
*మనిషి ఏదైనా నమ్మితే పూర్తిగా నమ్మాలి , "లేదా" పూర్తిగా నమ్మకుండా ఉండాలి . అంతేగానీ సగం సగం నమ్మకాలు ఎప్పుడూ ప్రమాదమే.*
*మనిషికి ఆశ ఎక్కువ .. నచ్చిన ప్రతీదీ కావాలంటుంది మనసు. కానీ కాలం ఎవరికి ఏమి ఇవ్వాలో అదే ఇస్తుంది.*
*మనిషి జీవితం రైలు ప్రయాణం వంటిది. ధనవంతుడు.. ఎ సి బోగీలో వెళ్తాడు , మధ్యతరగతి వాడు స్లీపర్ క్లాస్ బోగీలో వెళ్తాడు , పేదవాడు సాధారణ బోగీలో వెళ్తాడు.*
*కానీ ఎలా ప్రయాణం చేసి వెళ్ళినా అందరూ చేరవలసిన గమ్యానికే చేరతారు . అందరూ దిగేది ఒక ప్లాట్ ఫాం మీదకే . రైలు ఎక్కి ప్రయాణం చేస్తున్నంత వరకే ఈ తేడాలు.*
*అలాగే జీవితం కూడా అంతే . ఈ శరీరంలో ప్రాణం ఉన్నంతవరకే ఈ తేడాలు. అది గ్రహించుకుని ధన-పేద బేధం లేకుండా అందరితో కలిసి మెలిసి , ఒకరికొకరు సహాయ సహకారాలు చేసుకుంటూ సంతోషంగా బ్రతకడం అలవాటు చేసుకుంటే అందరూ ఏసీ బోగీ లో ప్రయాణం చేస్తున్నంత ఆనందంగా గడిచిపోతుంది .*
*మనకి డబ్బుందికదా అని దేవుడికి ఇస్తే పుణ్యం వస్తుంది అనుకోవడం పొరపాటు. అదే పేద వాళ్ళకి పెడితే వాళ్ళు పొందే సంతోషంలో దేవుడుంటాడు. అది దేవుడికే ఇస్తున్నామనే భావన మనలో కలగాలి. అప్పుడే పేదవాడి కళ్ళల్లో కనిపించే ఆనందం మనకు తృప్తి , దేవుడి ఆశీర్వాదం మనకు లభిస్తుంది.*
*మనం చేసే పని ఎంతమంది చూస్తున్నారు అన్నది ముఖ్యం కాదు .. అది ఎంతమందికి ఉపయోగ పడుతుంది అన్నది ముఖ్యం.*
*మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడక్కరలేదు మంచితనం కనబడితే చాలు.*
* ఇక్కడ మారాల్సింది మనిషి యొక్క మనసు, ఆలోచించే విధానం.*
*మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే కనిపిస్తాయి , చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి.*
*అవసరం ఉన్నా .. లేకపోయినా ఒకేలా ఉండాలి. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వితం కావు . అర్థం చేసుకొనే ఓర్పు , సర్దుకుపోయే నేర్పు , బాధ్యత గల మనస్సూ ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది.*
*చదువు ద్వారా సంస్కారం, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్న వారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే జీవిత సత్యం!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment