🙏🙏🙏🙏
🙏 *భగవంతుడు కనపడతాడా?*
----------------------------------------------------
భగవంతుడు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ చదువుకునే ఊహా మాత్రమేనా? వాస్తవంగా ఇప్పుడు కనిపిస్తారా?
అవును ఇప్పుడూ కనిపిస్తారు!
రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ‘నువ్వు నేను మాట్లాడుకున్నట్లు, చక్కగా నిన్ను పలకరిస్తారు.’
అలా బృందావన్ లో ‘బన్కి భీహారి’ గుడిలో చూడవచ్చు. “గుడిలో అడుగు పెట్టగానే మధుర పరిమళం మనసును చుట్టేస్తుంది. ‘రాధే రాధే’ అంటూ నామస్మరణంతో మార్మోగిపోతుంది.”
ఆ అందమైన నయనాలు చూస్తే ఇక చూపు తిప్పుకోలేము! అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రాధ గోపిక లా మారిపోతారు. “ఒక్కసారి ఆ చూపులో చిక్కుకుంటే జీవితంలో ఎపుడూ బయట పడలేము.
ఆ చూపు ప్రశ్నిస్తుంది? ఆ చూపు నవ్వుతుంది! నేను ఉన్నాను! అంటుంది. తను మాత్రమే లోకంలా తన లోకంలో నేనులా ఈ మేనుకు ఇక స్పృహ ఉండదు.”
ఎందరో ఐ.ఏ.యస్ ఐ.పియస్ లు వచ్చి వారి జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాలతో అన్నింటిని విడిచి అందరిని విడిచి.. ‘రాధే రాధే’ అంటూ ఆయన పాదాలు ప్రణమిల్లుతూ విలపిస్తునారు.
హరిదాస్ జీ అనే ఓ గొప్ప గోస్వామి ఉండేవారు. “నిధివన్ లో కూడా రాధా కృష్ణ తో ఆయన ఎపుడూ సంభాషిస్తూనే ఉంటారు.”
నిరంతరం రాధా మాధవ జపం చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ అలౌకిక స్థితిలో ఉంటారు. ఒకరోజు వారిని చూడటానికి ఓ వ్యాపారి వచ్చారట. వట్టి చేతులతో వెళ్లకూడదు అని ఓ ఖరీదైన సెంట్ బాటిల్ తీసుకుని వెళ్లరాట.
“గురువుగారూ ఈ అత్తరు రాధాకృష్ణ కు సమర్పించండి!” అన్నారట.
వారు ఓ నవ్వు నవ్వి ఆ అత్తరు తీసి పొదలో వేశారట.
పాపం వ్యాపారి మనసులో చాలా మధన పడ్డారట. “ఇక నేను వెళ్ళి వస్తాను గురువుగారూ” అన్నారట.
“హ ... సరే, ఒక్కసారి ‘బన్ కీ భీహారి’ దర్శనం చేసుకుని వెళ్ళు!” అన్నారట.
ఇక వ్యాపారి కృష్ణ మందిరం నకు వెళ్లారట, వెళ్ళగానే గుడి అంతా తాను తెచ్చిన సెంట్ వాసనతో గుభాళిస్తోంది అట. ఇక ఆత్రం ఆపుకోలేక పరుగు పరుగున హరిదాస్ జీ దగ్గరకు వచ్చి.. “స్వామీ గుడి అంతా నేను తెచ్చిన సెంట్ వాసన వస్తోంది ఎలా?” అన్నారట.
ఆయన నవ్వుతూ “నాయనా మనం ఇద్దరం ఇక్కడ కూర్చున్నప్పుడు రాధా కృష్ణ హోలీ ఆడుతున్నారు. అమ్మవారి పన్నీరు బాటిల్ లో పన్నీరు అయిపోయింది అందుకే నీ బాటిల్ రాధమ్మకు ఇచ్చాను” అన్నారట.
హరిదాస్ జీ అదృష్టానికి వ్యాపారి కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరుగుతూ స్వామి సేవలో ఉండి పోయారట.
ఇప్పటికీ గుడిలోకి అడుగు పెట్టగానే కమ్మటి పరిమళం వస్తుంది.
స్వామి దర్శనం చేసుకుని గోవర్దన పరిక్రమకు ఆటోలో బయలు దేరాము. ఎండ మండిపోతోంది, నాలుక ఎండి పోతోంది. మేము ఆటోలో వెళుతున్నాము. కాని కాలి నడకన చెప్పులు కూడా లేకుండా కొన్ని వేల మంది ‘రాధే రాధే’ అంటూ సాస్టాంగ ప్రణామం చేస్తూ భానుడి ప్రతాపాన్ని హిమగిరి చల్లదనంలా భావిస్తూ ఆ గోవర్దన గిరిని ముద్దాడుతూ ఆడుతూ పాడుతూ పరిక్రమ చేస్తూ ఉన్నారు. అసలు శుద్ద భక్తి అంటే వారిదే!”
ఒక డివోటీ కృష్ణ ను చంకన ఎత్తుకుని, మరొకరు విసనకర్రతో వారి చేతిలో ఉన్న కృష్ణకు విసురుతూ, మరొకరు ఎండ తగలకుండా కొంగు కప్పుకుని తీసుకుని వెళుతున్నారు.
‘తను నాతోనే నాలోనే ఉన్నారు నా పక్కనే’ ఉన్నారు. ఎంత అద్బుతమైన భావన?! ఈ భావనలో జీవించాలన్నా జన్మ సుకృతం ఉండాలి.
ఇక జరిగిన కధలోకి వస్తే పాపం ఓ అమాయకుడు కూతురి పెళ్లికోసం ఇల్లు తనఖా పెట్టి ఒకరి దగ్గర అప్పు చేశాడట. తనకు వీలున్నపుడు అప్పు తీర్చుకుంటూ వచ్చారట. చివరిలో తన తనఖా కాగితాలు ఇవ్వమంటే ఆ సేట్ ఇవ్వలేదట. ‘వెళ్ళి కోర్టులో చెప్పుకో నాకు డబ్బు ఇచ్చినట్లు ఎవడు నీకు సాక్ష్యం?’ అన్నారట.
ఇక ఆ అమాయకుడు రోదిస్తూ భీహారి దగ్గర కూర్చుని ‘నువ్వు తప్ప నాకు ఎవరు సాక్ష్యం?’ అని విలపించారట.
కోర్ట్ లో కేస్ నడిచింది ఇతను ఓడిపోతారు అని అందరు లాయర్లు చెప్పారట.
చివరికి జడ్జ్ గారు ‘నీకు సాక్ష్యం ఎవరు?’అని అడిగారాట.
‘భీహారి’ అని చెప్పారట.
‘ఎక్కడ ఉన్నారు?’
‘బృందావన్ గుడిలో ఉంటారు.’
‘అవునా అయితే అతన్ని హాజరు కమ్మ’ని నోటీస్ ఇస్తూ గుడి గోడకు నోటీస్ అంటించి వెళ్లారట.
ఎటూ ఓడిపోతాను అని అతను కోర్టు కు కూడా వెళ్లలేదు అట.
తీర్పు ఇచ్చే రోజు కోర్టులో అటెండర్ ‘భీహారి, భీహారి’ అని పిలిచారట. ఓ నడివయసు వ్యక్తి నల్లటి కంబళి కప్పుకుని చేతిలో కర్ర పట్టుకుని చిరునవ్వుతో కోర్ట్ లో అడుగు పెట్టి నేనే సాక్షిని అన్నారట.
జడ్జ్ గారు డబ్బులు ఇవ్వడం నువ్వు చూశావా అన్నారట.
వెంటనే… ఏ ఏ తేదీలలో ఏ సమయంలో ఎంత రొక్కం ఇచ్చినదో చెప్పారట. ‘ఆ రసీదులు సేఠ్ భీరువా మూడో అరలో ఉన్నాయి’ అని చెప్పారట.
జడ్జ్ గారు నిజమో కాదో పరిశీలించ మని చెప్పారట.
శేట్ ఇంట్లో అన్ని కాయితాలు దొరికాయి. తీర్పు ఇచ్చి తిరిగి చూస్తే సాక్ష్యం చెప్పిన వ్యక్తి లేరు. జడ్జ్ గారు ఎంతో ఆలోచించారు మరుసటి రోజు బృందావన్ వచ్చి విచారణ చేశారు అలాంటి వ్యక్తి ఎవరు గుడిలో కానీ చుట్టూ పక్కల గానీ లేరు. ఇక ఆయనకు అర్దం అయింది వచ్చింది సాక్షాత్ ఆ కృష్ణే అని తన జాబ్ కు రాజీనామా చేసి భీహారి సేవలో ఉండిపోయి జడ్జ్ బాబా గా పేరుగాంచి ఆ బృందావన్ లో కలసి పోయారట.
ఇక ఆ అమాయకుడు కేసు గెలిచాడు. భగవంతుడే సాక్ష్యం చెప్పాడు అని అర్దం అయింది. ఇప్పటికి ఆ ఆస్థి విలువ కొన్ని కోట్లు అట. ‘నాది ఎంత దురదృష్టం? నేను తనను చూడలేక పోయాను.’ అనుకుని మాకు కూడా ఆ స్వామి దర్శనం ఇవ్వక పోతారా? అని రోజూ పరిక్రమ చేసేవారికి భోజనం, మంచి నీళ్ళు ఇస్తూ మానవ సేవ చేస్తున్నారు.
ఎందరో మహానుభావులు ఇప్పటికీ అక్కడ ఉంటూ ఆయన స్పర్శనం దర్శనం పొందుతూ జన్మ ధన్యం చేసుకుంటున్నారు ..
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
No comments:
Post a Comment