Saturday, August 26, 2023

నిగూఢ రహస్యాలు(ఓషో) మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం Chapter -3

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు(ఓషో)* 🌺
🌹 *Chapter -- 3* 🌹
🌹 *మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం* 🌹
🌸 *Part --1*🌸

☘️ నుదుటి పై ధరించే సింధూరం లేదా గంధం గుర్తుల గురించి మాట్లాడే ముందు రెండూ చారిత్రాత్మక సంఘటనల గురించి తెలుసుకోవాలి.

🌿 *1వ సంఘటన:--*  1888 లో, దక్షిణ భారత దేశంలో రామానుజం అనే ఒక వ్యక్తి బీద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. అతడు పేరుమోసిన గణిత శాస్త్రజ్ఞుడు అయ్యాడు.

🌼 ఆ రోజుల్లో, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ప్రొఫెసర్ హార్డీకి ఒక జాబు వ్రాయమని ఎవరో అతనికి సలహా ఇచ్చారు. అతడు జాబు వ్రాయ లేదు, కానీ రెండు రేఖాగణిత సంబంధిత సిద్ధాంత సమస్యలకు సమాధానం కనుక్కుని హార్డీకి పంపాడు. వాటిని అందుకుని హార్డీ (Hardy) చాలా ఆశ్చర్యపడ్డాడు, అంత చిన్న వయస్సులో ఆ సిద్ధాంతాలకు ప్రతిపాదనలు, సమాధానాలు వ్రాయగలిగాడంటే నమ్మలేకపోయాడు. రామానుజానికి వెంటనే జాబు వ్రాసి ఇంగ్లండుకి రమ్మని ఆహ్వానించాడు. రామానుజాన్ని మొదటి సారి కలిసినప్పుడు, గణిత శాస్త్ర క్షేత్రంలో అతడి ముందు తానొక చిన్న పిల్లాడిలాంటి వాడినని హార్టీకి అనిపించింది.

🌸 సమస్యని పరిష్కరించడానికి ఒక ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞుడు 6 గంటలు తీసుకుని, అందునా నిస్సందేహంగా అదే నిర్దిష్టమైన సమాధానం అని చెప్పలేని స్థితిలో ఉంటే - రామానుజం వెంటనే, ఏ విధమైన తప్పు లేకుండా దాన్ని పరిషరించే వాడు. అతడు మానవాతీతుడు. మానవ మస్తిష్కం అర్థం చేసుకోలేనిది ఏదో జరుగుతోంది.

🍀 అతడు ఏదైనా గణిత శాస్త్ర సమస్యని పరిష్కరించాలని కూర్చున్నప్పుడల్లా అతడి కనుబొమల మధ్య భాగంలో ఏదో జరగడం మొదలు పెట్టేది. ఆ నిర్దిష్ట స్థలం కేంద్రంగా, అతడి కను గుడ్లు రెండూ పైకి తిరిగేవి. యోగాలో, ఆ స్థలాన్ని మూడవ నేత్రపు స్థానం అని వర్ణిస్తారు. దీన్ని మూడవ నేత్రం అని ఎందుకు అంటారంటే, ఈ కన్ను ఉత్తేజితం అయితే వివిధ జగత్తులకు సంబంధించిన కొన్ని సంఘటనలని, దృశ్యాలని సంపూర్ణంగా చూడవచ్చు. రామానుజం విషయంలో అది ఒక్కొక్కసారి తెరుచుకుంటుంది. సమస్యని పరిష్కరించేటప్పుడు అతడి కళ్ళు మూడవ నేత్రం వైపు తిరిగేవి. సమీప భవిష్యత్తులో హార్డీ కానీ, పాశ్చత్య శాస్త్రజ్ఞులు కానీ ఈ ప్రక్రియని అర్థం చేసుకోలేకపోయారు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☘️ *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు(ఓషో)* 🌺
🌹 *Chapter -- 3* 🌹
🌹 *మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం* 🌹
🌸 *Part --2*🌸

🌳 *2వ సంఘటన:--* ఎడ్గర్ కైస్ (Edgar Cayce) 1945 లో మరణించాడు. దానికి 40 సంవత్సరాలకు ముందు, అంటే 1905 లో అతడు జబ్బుపడి, మూడు రోజులు అపస్మారక స్థితిలో ఉన్నాడు. వైద్యులు ఆశలు వదులుకున్నారు. కానీ కైస్ అపస్మారక స్థితిలో ఉండి కూడా అకస్మాత్తుగా అతడి శరీరం అపస్మారక స్థితిలో ఉంది, కానీ అతడు మాట్లాడుతున్నాడు . తను చెట్టు మీద నుంచి పడిపోయాననీ , వెన్నెముక దెబ్బంతిందనీ , అందుకే అపస్మారక స్థితిలో ఉన్నాననీ చెప్పాడు. తనకి ఆరుగంటల లోపు చికిత్స జరగకపోతే తన మెదడు దెబ్బతింటుందనీ , తను చనిపోతాననీ కూడా చెప్పాడు . అతను త్రాగడానికి ఒక ఔషధానికి సంబంధించిన మందు ఇవ్వాలనీ , అప్పుడు పన్నెండు గంటలలో తను కోలుకుంటానని చెప్పాడు .

🍁 ఆ మందు తెప్పించి కైస్ కి ఇచ్చారు. అతడు పన్నెండు గంటలలో కోలుకున్నాడు . అతడికి తెలివి వచ్చాక జరిగిన సంఘటన అతడికి చెప్పినప్పుడు , మందు గురించి తను అలా చెప్పినట్లు గుర్తురాలేదు. ఆ మందుల పేర్లు తెలియడం కానీ , వాటిని గుర్తించడం కానీ చేయలేకపోయాడు. అతను బాగు చేయడానికి వీలులేని జబ్బులకు మందులను సూచించడంలో నిపుణుడు అయ్యాడు ; అతడి జీవితకాలంలో అతను ముప్పైవేల మందికి జబ్బు నయం చేసాడు . అతడు ఏ ఔషధాన్ని సూచించినా అది సరిఅయిందే అయ్యేది ; ఏమినహాయింపు లేకుండా , అతను చెప్పిన మందు వాడిన ప్రతి రోగి బాగుపడ్డాడు . కానీ కైస్ దాన్ని గురించి వివరించలేకపోయేవాడు . 

🕉️ చికిత్స కోసం అతడు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అతడి కళ్ళు కనుబొమల మధ్యస్థానం వైపుకి , ఏవో లాగుతున్నట్లు తిరిగేవని మాత్రమే చెప్పేవాడు . అతడి కళ్ళు అక్కడ నిలిచేవి , మిగతావన్నీ అతను పూర్తిగా మరచిపోయేవాడు ; ఒక నిర్దిష్ట స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే పరిసరాలను మరచిపోయేవాడినని , ఆ స్థితికి వచ్చేవరకు చికిత్సా విధానం అతడికి తెలిసేది కాదని మాత్రమే గుర్తుండేది . అతడు అద్భుతమైన రోగచికిత్సలు సూచించేవాడు . 

🌼 ఈ రెండు చారిత్రాత్మక సంఘటనల గురించి ఎందుకు చెప్పానంటే కనుబొమల మధ్యస్థానంలో ప్రాపంచిక జీవితం ఆగిపోయి పరలోక జీవితం మొదలవుతుందని సూచించడానికే. ఆ ద్వారానికి ఇటువైపు ప్రపంచం వర్ధిల్లుతుంటే , అటువైపు తెలియని , మానవాతీతమైన అద్భుతమైన ప్రపంచం ఉంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☘️ *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣


*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు(ఓషో)* 🌺
🌹 *Chapter -- 3* 🌹
🌹 *మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం* 🌹
🌸 *Part --3*🌸

🌸 మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు మన కళ్ళు పైకి లాగబడి ఉంటాయి. అది మనం ఎంత గాఢంగా నిద్రపోతున్నాం అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. నిద్ర ఎంత గాఢంగా ఉంటే, కళ్ళు అంత పైకి ఉంటాయి; కళ్ళు ఎంత క్రిందికి ఉంటే, అంత కదలికలు ఉంటాయి. కను రెప్పల చాటున కళ్ళు ఎంత వేగంగా కదులుతుంటే అంత ఎక్కువ సంఘటనలతో కూడిన కల నీకు వస్తుందన్న మాట. ప్రయోగాల ద్వారా ఇప్పుడు ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. కంటి కదలికలు త్వరగా కదులుతున్న కలని సూచిస్తాయి. కళ్ళు క్రిందికి ఉంటే కళ్ళ కదలిక ఎక్కువ వేగంగా ఉంటుంది. కళ్ళు పైకి వెళ్తుంటే కళ్ళ కదలిక వేగం తగ్గుతుంది. కళ్ళ కదలికే లేనప్పుడు మంచి నిద్రలో ఉన్నట్లు. ఆ స్థితిలో కను బొమల మధ్య స్థానంలో కళ్ళు కదలకుండా నిలిచి ఉంటాయి. 

🍀 సమాధిలో, గాఢ ధ్యానంలో మనం ఏ స్థితికైతే చేరుకుంటామో గాఢ నిద్రలో కూడా అదే స్థితికి చేరుకుంటామని యోగా చెబుతుంది. గాఢమైన నిద్రలోనూ, సమాధి స్థితిలోనూ కళ్ళు నిలిచి ఉండేది ఒకే స్థానంలో. 

🌷 తిలకం, సింధూరపు గుర్తు తెలియని మానవాతీత ప్రపంచానికి సంకేతంగా కనిపెట్టబడింది. ఎక్కడంటే అక్కడ దాన్ని పెట్టకూడదు, నుదుటి పైన చేయిపెట్టి ఆ స్థానాన్ని కనుక్కున్న వ్యక్తి మాత్రమే, తిలకం ఎక్కడ పెట్టవలసిందీ చెప్పగలడు. తిలకం ఎక్కడంటే అక్కడ పెట్టడం వలన ప్రయోజనం లేదు, ఎందుకంటే అందరికీ ఆ స్థానం ఒకే చోట ఉండదు. 

🌿 మూడవ కన్ను అందరికీ ఒకే చోట ఉండదు; చాలా మందికి అది కను బొమల మధ్య పై భాగంలో ఎక్కడో ఉంటుంది.  గత జన్మలలో ఎవరైనా ఎక్కువ కాలం ధ్యానం చేసి ఉంటే, అతడికి సమాధి అనుభవం లభించి ఉంటే, అతడి మూడవ కన్ను కొద్దిగా క్రింద వుంటుంది. ధ్యానమే చేసి ఉండకపోతే ఆ స్థలం నుదుటి మీద పై భాగంలో ఉంటుంది. ఆ బిందువు ఉన్న స్థానాన్ని బట్టి గత జన్మలో నీ ధ్యాన స్థితిని నిర్ణయించ వచ్చు; గత జన్మలో సమాధి స్థితి అనుభవించావా లేదా అన్నది అది సూచిస్తుంది. అది తరచుగా జరిగి ఉంటే ఆ బిందువు క్రిందికి దిగి ఉంటుంది; నీ కళ్ళతో సమానమైన స్థాయిలో అది ఉంటుంది అది అంతకన్నా క్రిందకు వెళ్ళ లేదు. ఆ బిందువు నీ కళ్ళకి సమాంతరంగా ఉంటే, ఒక చిన్న సంఘటనతో ఎవరైనా సమాధిలోకి ప్రవేశించగలరు. నిజానికి, జరిగింది చాలా చిన్నది కావడంతో ప్రాముఖ్యత లేనిదానిగా కనిపిస్తుంది. స్పష్టమైన కారణం ఏమీ లేకుండానే ఎవరైనా సమాధిలోకి వెళ్తే మనం ఆశ్చర్యపోతాం. 

🌳 ఒక జైన సన్యాసిని  బావిలో నుంచి నీరు తోడుకుని కుండ తల పై పెట్టుకుని తిరిగి వస్తోంది. ఎలాగో ఆ కుండ పడిపోయింది, ఆ పడిపోవడంలో ఆమె సమాధి స్థితిలోకి వెళ్ళింది, ఆమెకి జ్ఞానోదయం అయింది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☘️ *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు(ఓషో)* 🌺
🌹 *Chapter -- 3* 🌹
🌹 *మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం* 🌹
🌸 *Part --4*🌸

🍁 లావోట్జూ తన జీవితంలో ఆకురాలే కాలంలో అతడు ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. ఆ చెట్టు నుంచి ఎండుటాకులు రాలుతున్నాయి. అవి చూస్తూ లావోట్జూ జ్ఞానోదయం పొందాడు .

🕉️ జ్ఞానోదయానికి , ఆకు రాలడానికి మధ్య సంబంధం లేదు , కానీ అలాంటివి జరుగుతాయి ఎందుకంటే , గతజన్మలలో చేసిన పని వలన , మీ ఆధ్యాత్మిక ప్రయాణం చాలావరకు పూర్తయింది . రెండు కళ్ళ మధ్య ఉండేలా మూడవ నేత్రపు బిందువు క్రిందికి జారింది . అప్పుడు ఎలాంటి చిన్న సంఘటన అయినా తక్కెడలోని ముల్లుని ఒరిగేటట్లు చేస్తుంది , చివరగా జరిగే చిన్న విషయం ఏదైనా ఆ కావచ్చు . 

🌼 సింధూరం లేదా గంధపు గుర్తు సరియైన స్థలంలో పెడితే , అది చాలా విషయాలను సూచిస్తుంది. మొదటగా , ఒక ప్రత్యేకమైన స్థలంలో తిలకు ధరించమని మీ గురువు చెబితే , అక్కడ నీకు ఏదో అనుభవం మొదలవుతుంది . దాన్ని గురించి నువ్వు ఆలోచించి ఉండకపోవచ్చు , కానీ నువ్వు కళ్ళు మూసుకుని కూర్చుంటే ఎవరైనా రెండు కళ్ళ మధ్య దగ్గరగా వేలు పెడితే ; ఎవరో నీ వైపు వేలు పెట్టి చూపిస్తున్నట్లు నీకు అనిపిస్తుంది . మూడవ నేత్రం గ్రహణశక్తి అదే . 

🌸 తిలకం నీ మూడవ నేత్రపు పరిమాణం అంత ఉండి సరియైన స్థలంలో పెడితే , నువ్వు ఆ స్థలాన్ని ఇరవైనాలుగు గంటలు గుర్తుంచుకుంటావు , మిగిలిన శరీరాన్ని మరచిపోతావు . దీనివలన తిలకం పట్ల ఎరుక పెరుగుతుంది మరియు శరీరం పట్ల ఎరుక తగ్గుతుంది . అప్పుడు తిలకం తప్ప శరీరం గురించి ఏ విధమైన గుర్తు లేని క్షణం వస్తుంది . అది జరిగినప్పుడు నీ మూడవనేత్రాన్ని తెరుచుకోగలవు. ఈ సాధనలో , నువ్వు పూర్తిగా నీ శరీరాన్ని మరచిపోయి , తిలకాన్ని మాత్రమే గుర్తుంచుకునే ప్రయోగంలో నీ చైతన్యం మొత్తం స్పటికంగా మారి , మూడవనేత్రంపై కేంద్రీకరిస్తుంది . మూడవ నేత్రాన్ని తెరిచే తాళంచెవి కేంద్రీకరించబడిన చైతన్యమే . 

☘️ ఒక భూతద్దం సహాయంతో సూర్యకిరణాలను ఒక కాగితపు ముక్క మీద కేంద్రీకరిస్తే , ఆ కాగితాన్ని మండించటానికి సరిపోయినంత వేడిని సృష్టిస్తావు . ఆ కిరణాలు కేంద్రీకరించినప్పుడు మంట ఉత్పత్తి అవుతుంది . శరీరమంతా చైతన్యం వ్యాపించి ఉన్నప్పుడు అది నీ జీవితాన్ని నిర్వహించడం అనే పని చేస్తూ ఉంటుంది . కానీ అది పూర్తిగా మూడవ నేత్రంపై కేంద్రీకరిస్తే , మూడవ నేత్రంతో చూడడానికి అడ్డంకిగా ఉన్నది తగలబడుతుంది , అప్పుడు నీకు అంతర్గత ఆకాశాన్ని చూడనిచ్చే తలుపు తెరుచుకుంటుంది .

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☘️ *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు(ఓషో)* 🌺
🌹 *Chapter -- 3* 🌹
🌹 *మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం* 🌹
🌸 *Part --5*🌸

🍀 మూడో నేత్రపు మరో దృక్పధం ఏమిటంటే అది *"సంకల్ప శక్తి కేంద్రం."* యోగాలో దాన్ని ఆజ్ఞా చక్రం అంటారు. అలా ఎందుకు అంటామంటే మన జీవితంలోని ఏ విద్యా విభాగాన్నైనా ఇదే నడిపిస్తుంది; మన జీవితంలోని క్రమశిక్షణ, సామరస్యత ఈ బిందువు నుంచే ఉదయిస్తుంది. 

🍁 జీవితంలోని మన కోరికలన్నీ సెక్స్ కేంద్రం దగ్గర పుడతాయి. సెక్స్ కేంద్రం ఉత్తేజితం కానంత వరకు, సెక్స్ సంబంధిత కోరిక ఉండదు. అయినప్పటికీ, ప్రతి శిశువుకీ సెక్స్ సామర్థ్యం, సెక్స్ సంబంధిత కోరికలు తీర్చుకోగల అవయవ నిర్మాణం ఉంటుంది. 

🌷 ప్రత్యుత్పత్తి వ్యవస్థ పని చేసేటంత కాలం వరకు సరిపోయేటన్ని బీజ కణాలతో స్త్రీలు పుడతారు అన్న విషయం వింతైన నిజం. తర్వాత ఒక్క బీజ కణం కూడా ఉత్పత్తి కాదు. ఆమె జీవితంలో మొదటి రోజు నుంచీ తనలో అంతర్నిహితంగా ఉన్న బీజ కణాల సంఖ్య ఆ స్త్రీ ఎంత మంది పిల్లలకి జన్మని ఇవ్వగలిగేది సూచిస్తుంది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత, ప్రతి నెలా అండాశయం నుంచి ఒక బీజ కణం విడుదల అవుతుంది. అది పురుషుడి వీర్యంలోని శుక్లాన్ని చేరి దానిలో కలిసిపోతే, గర్భధారణ జరుగుతుంది. గర్భస్థ పిండం ఎదుగుతున్నంత కాలం మరియు కొత్తగా పుట్టిన శిశువుకి కొన్ని నెలలు వచ్చేంత వరకు బీజకణాలు విడుదల కావు. 

🌼 సెక్స్ పట్ల కోరిక, సెక్స్ కేంద్రం ఉత్తేజితం అయ్యే వరకు పుట్టదు. ఈ కేంద్రం చురుకుగా లేనంత వరకు, శరీరంలో సెక్స్ సంబంధిత సరంజామా సిద్ధం అయినా పదమూడు, పధ్నాలుగు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ కేంద్రం చురుకుగా అవుతుంది. మనం దాన్ని చైతన్యవంతం చేయనప్పటికీ ప్రకృతి సిద్ధంగా అది చైతన్యవంతం అవుతుంది, సెక్స్ కేంద్రానికి చాలా దూరంగా, ఆలోచన మనస్సులో పుడుతుంది, కానీ ఆ ఆలోచన వెంటనే సెక్స్ కేంద్రాన్ని ఉత్తేజితం చేస్తుంది. కానీ సెక్స్ గురించిన ప్రతి భావం లేదా ఆలోచన వెంటనే సెక్స్ కేంద్రాన్ని తనవైపు ఆకర్షింపజేస్తుంది. 

🌸 కానీ సంకల్ప శక్తి కేంద్రం చైతన్యవంతం కాగానే, శరీరం అతడిని ఆజ్ఞాపించడం మానుతుంది; అలాంటి వ్యక్తి తన రక్తాన్ని ప్రవహించడం ఆగమంటే, అది అగుతుంది; గుండెను కొట్టుకోవడం మానమంటే, మానుతుంది. అతడు నాడిని కొట్టుకోవడం ఆగమని చెబితే, అది ఆగుతుంది. అలాంటి వ్యక్తి తన శరీరానికి, మనస్సుకి, ఇంద్రియాలకి యజమాని అవుతాడు. కానీ, మూడవ నేత్రపు చక్రం చైతన్యవంతం కాకుండా ఇది జరగదు. ఆ కేంద్రానికి నువ్వు ఎంత ఎక్కువ ఎరుక తెస్తే, అంత ఎక్కువగా నీకు నువ్వు యజమానివి అవుతావు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☘️ *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు(ఓషో)* 🌺
🌹 *Chapter -- 3* 🌹
🌹 *మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం* 🌹
🌸 *Part --6*🌸

🌿 మూడవ నేత్రపు చక్రం సున్నితత్వానికి మరియు గంధానికి మధ్య చాలా దగ్గరి సంబంధం వుంది. సరియైన స్థానంలో గంధాన్ని ఉపయోగిస్తే సున్నితత్వం పెరుగుతుంది. ఏదో ఒక పదార్థాన్ని ఉపయోగించకూడదు; నిజానికి, వేరే పదార్థాలు ఆ స్థలం యొక్క సున్నితత్వానికి హాని చేస్తాయి. 

🌳 ఉదాహరణకు, స్త్రీలు నుదుటి పై స్టిక్కర్లు పెట్టుకుంటారు, సంతలో దొరికే ఈ స్టిక్కర్లకు శాస్త్రీయ పునాది ఏమీ లేదు. వాటికి యోగాతో ఎలాంటి సంబంధం లేదు, ఇంకా అవి మూడవ నేత్రపు సున్నితత్వానికి హాని చేస్తాయి. ఆ బొట్టు, ఆ బిందువు యొక్క సున్నితత్వాన్ని పెంచుతుందా లేదా తగ్గిస్తుందా అన్నదే అసలైన ప్రశ్న. సున్నితత్వాన్ని పెంచితే, అది మంచిదే; అలా కాకపోతే, అవి హానికరం. ఈ ప్రపంచంలో చాలా చిన్న విషయం కూడా పెద్ద తేడాని కలిగిస్తుంది; ప్రతి దానికీ ఒక ప్రత్యేక ఫలితం ఉంటుంది. మూడవ నేత్రపు చక్రం సున్నితంగా అయి, చైతన్యవంతం అయితే అది నీలోని నిజాయితీని, యోగ్యతని పెంచుతుంది. నువ్వు సమగ్రంగా, సంపూర్ణత్వంగా తయారవడం మొదలు పెడతావు.   

🍀 గుండ్రంగా పెట్టుకునే బొట్టుకీ, పొడవుగా పెట్టుకునే తిలకానికీ ఉపయోగంలో కొద్ది తేడా ఉంది. ఈ బొట్టు స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. స్త్రీలలో, మూడవ నేత్రపు చక్రం చాలా బలహీనంగా ఉంటుంది, అది అలాగే ఉండాలి ఎందుకంటే స్త్రీల వ్యక్తిత్వం లొంగిపోవడానికి సృష్టించబడింది. లొంగి పోవడంలొనే ఆమె అందం ఉంది. ఆమె మూడవ నేత్రపు చక్రం శక్తివంతం అయితే, లొంగిపోవడం కష్టమవుతుంది. ఆమె మూడవ నేత్రపు చక్రం పురుషుడితో  పోలిస్తే చాలా బలహీనంగా వుంటుంది. అందుకే స్త్రీకి ఎప్పుడూ ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి సహాయం అవసరం వుంటుంది. 

🍁 ఒక్క భారత దేశంలోనే స్త్రీ యొక్క మూడవ నేత్రపు చక్రాన్ని చైతన్యవంతం చేసే ప్రయత్నం జరిగింది. ఆ చక్రం చైతన్యవంతం అయితే తప్ప, ఆధ్యాత్మిక జీవితంలో స్త్రీ ఎలాంటి ప్రగతి సాధించలేదు అన్న భావనతో అలా చేసారు. ఇచ్చా శక్తి లేకుండా ధ్యానాభ్యాసంలో పురోగతి సాధించ లేదు - దాన్ని ఆరోగ్యవంతం, శక్తివంతం చేయాలి. ఆమె ఆజ్ఞా చక్రాన్ని మరో విధంగా శక్తివంతం చేయవలసిన అవసరం ఉంది, మామూలు పద్ధతిలో, పురుషుడికి చేసినట్లే చేస్తే, అది ఆమెలోని స్త్రీ సహజ లక్షణాలను తగ్గిస్తుంది మరియు మగ లక్షణాలను పెంపొందిస్తుంది.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☘️ *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣


*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు(ఓషో)* 🌺
🌹 *Chapter -- 3* 🌹
🌹 *మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం* 🌹
🌸 *Part --7*🌸

🌿 ఒక స్త్రీ యొక్క నుదుటి పై సరియైన స్థానంలో బొట్టు పెడితే, ఆమె భర్తతో దానికి ఉన్న గాఢమైన సంబంధం వలన ఆమె అతడిని అనుసరిస్తుంది, కానీ మిగిలిన ప్రపంచానికి సంబంధించినంత వరకు ఆమె చాలా శక్తివంతంగా ఉంటుంది. 

🌳 ఒక స్త్రీ విధవరాలైతే బొట్టు తీసివేయడానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు మిగిలిన జీవితమంతా ఆమె మగవాడిలా బ్రతకాలి; ఎంత స్వతంత్రురాలైతే ఆమెకి అంత మంచిది. వేరొకరిని అనుసరించవలసిన పరిస్థితి కల్పించే హానికరమైనది ఎంత స్వల్పమైనదైనా దాన్ని మూసివేయాలి. ఈ బొట్టు ప్రయోగం చాలా గాఢమైనది. అది సరియైన స్థలంలో, సరియైన పదార్థంతో చేసినదై ఉండాలి మరియు దాన్ని సరిగ్గా పెట్టుకోవాలి, లేకపోతే, అది అర్థరహితం అవుతుంది. అది కేవలం అలంకరణ కోసం అయితే దానికి విలువ లేదు.

🍀 మూడవ నేత్రపు చక్రం గురించి ఉపయోగకరంగా ఉండే మరికొన్ని విషయాలు చెబుతాను. ఆజ్ఞా చక్రం నుంచి పైకి లాగబడిన రేఖ మెదడుని రెండుగా విభజిస్తుంది; కుడి మరియు ఎడమ. మెదడు ఆ రేఖ దగ్గర మొదలవుతుంది. మన మెదడులో సగం ఉపయోగించబడడం లేదని గమనించారు; మనలో చాలా తెలివిగలవారు మన మేధావులు - కూడా దాదాపుగా మెదడులో సగమే వాడతారు. మిగిలిన సగం ఉపయోగించబడకుండా, వృద్ధి చెందకుండా ఉంటుంది. శాస్త్రజ్ఞులు, మానసిక శాస్త్రవేత్తలు అలా ఎందుకు జరుగుతుందని చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ సగభాగం మెదడును శస్త్రచికిత్స ద్వారా తొలగించినా, ప్రతీదీ మామూలుగానే పని చేస్తూ ఉంటుంది; తన మెదడులో సగభాగం తొలగించబడిందని కూడా అతడికి తెలియదు. ప్రకృతి దేన్నీ అనవసరంగా సృష్టించదని శాస్త్రజ్ఞులకి తెలుసు. 

🍁 మూడవ నేత్రపు చక్రం చురుకైన తర్వాతే, ఈ మెదడులోని సగభాగం చైతన్యవంతం అవుతుందని యోగా చెబుతుంది. ఆ మెదడులో సగభాగం ఆజ్ఞాచక్రానికి క్రింద ఉన్న కేంద్రాలతో సంధింపడింది, రెండవ సగం ఆజ్ఞాచక్రపు పై కేంద్రాలతో సంధింపబడింది. మూడవ నేత్రపు చక్రం క్రింది కేంద్రాలు పని చేయటం మొదలు పెట్టినప్పుడు, మెదడు యొక్క ఎడమ భాగం ఉపయోగించ బడుతుంది. పై కేంద్రాలు పని చేయటం మొదలు పెట్టినప్పుడు మెదడు యొక్క కుడి భాగం చైతన్యవంతం అవుతుంది. రెండవ భాగపు క్రియాశీలత గురించిన అనుభవం లేనంత కాలం దాన్ని అర్థం చేసుకోలేము.

🌼 ఈ ప్రాపంచిక జీవితం అవతల ఏముందో తెలుసుకోవాలంటే, మూడవ నేత్రానికి సంధించబడి నిద్రాణ స్థితిలో అచేతనంగా ఉన్న మిగిలిన సగం మెదడుని నువ్వు చైతన్యవంతం చేయాలని ఇరవైవేల సంవత్సరాలుగా యోగా నొక్కి చెప్పింది. భౌతిక పదార్థానికి అవతల ఉన్న సంపూర్ణత్వం గురించి తెలుసుకోవాలంటే, మిగిలిన సగం మెదడుని చైతన్యవంతం చేయాలి; ఈ సగం మెదడుకి ద్వారం - మూడవ నేత్రపు చక్రం ఉన్న స్థలం - తిలకం పెట్టే స్థలం. ఆ బిందువు బయట నెలకొల్పబడిన ప్రదేశం, అంతర్గత కేంద్రం దీన్ని పోలి సరిసమానంగా, నుదుటి పై  ఒకటిన్నర అంగుళాల లోతులో ఉంటుంది. ఆ లోతైన బిందువు, ఆ కేంద్రం, భౌతిక పదార్థానికి ఆవల ఉండే అనుభవగ్రాహ్యం కాని అతీతమైన ప్రపంచానికి  తలుపులా పనిచేస్తుంది.

 🌸 భారత దేశంలో తిలకాన్ని కనుక్కున్నట్లు, టిబెట్ లో మూడవ నేత్రపు చక్రాన్ని చేరుకోవడానికి ఆ స్థలంలో శస్త్రచికిత్స చేసే పద్ధతులు కనిపెట్టారు.

🍁 ధ్యానం చేసే సమయంలో చెక్క చెప్పులు ధరించటం వలన శక్తి వ్యయం కాదు, చెక్క చెప్పులు ధరించకుండా ఉంటే నెలల తరబడి తీసుకునే ఫలితాలు, దీనివలన అతి తక్కువ వ్యవధిలో లభిస్తాయి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☘️ *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣


*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *నిగూఢ రహస్యాలు(ఓషో)* 🌺
🌹 *Chapter -- 3* 🌹
🌹 *మూడవ నేత్రపు నిగూఢ శాస్త్రం* 🌹
🌸 *Part --8*🌸

🌸 మామూలుగా, మనస్సు క్రింది వైపుకి ఆకర్షించబడుతుంది; నిజానికి అది సెక్స్ కేంద్రం వైపు ప్రవహిస్తుంది. మనం ఏం చేస్తున్నా - డబ్బు సంపాదిస్తున్నా, సంఘంలో మన అంతస్తు పెంచుకుంటున్నా ఏం చేస్తున్నా - సూక్ష్మంగా, సెక్స్ పట్ల మనకు ఉన్న కోరిక మనల్ని ముందుకు నడిపించే శక్తి. మనం డబ్బు సంపాదిస్తుంటే, సెక్స్ కొనగలం అనే ఆశతోనే. ఉన్నత స్థానాలు అధిరోహించాలనుకునేది కేవలం మన లైంగిక భాగస్వాములను ఎన్నుకుని పొందడానికి అవసరమైన అధికారం లభిస్తుందనే. అందుకే, గతంలో, ఒక రాజుకి ఉన్న రాణుల సంఖ్యని బట్టి అతడి కీర్తిని కొలిచేవారు. అది నిజమైన కొలత, ఎందుకంటే నీ అధికారానికి విలువ ఏమిటి? అధికారం, అంతస్తు, హోదా, డబ్బు - ఇవన్నీ తిరిగి తిరిగి, మూలాధారమైన సెక్స్ ప్రవృత్తిని తృప్తి పరచడానికే. 

🌼 నీ శక్తులన్నీ క్రిందికి, సెక్స్ కేంద్రం వైపు ప్రవహించినంత కాలం, నువ్వు ఆధ్యాత్మికంగా మానసిక శిక్షణా రాహిత్యంలో వుండే అవకాశం వుంటుంది. నీ శక్తిని ఉన్నత తలాల వైపు మళ్ళించాలని నువ్వు కోరుకుంటే, నీ సెక్స్ సంబంధిత శక్తిని వెనక్కి నడపాలి. ఆ ప్రవాహపు దిక్కు పూర్తిగా మారాలి. నీ గమనాన్ని వేరే మార్గంలోకి తిప్పాలి, పై దిక్కుపైనే నీ మనస్సుని అభిముఖం చేయాలి. కదలిక నిలువుగా పైకి ఉండాలి - ఇది చాలా గొప్ప ఆధ్యాత్మిక శిక్షణ. ప్రతి అడుగులో ప్రతిఘటనలు ఎదురవుతాయి మరియు త్యాగాలు చేయవలసిన అవసరాలు వుంటాయి. ఉన్నతమైన వాటిని పొందడం కోసం క్రింది స్థాయికి చెందిన వాటిని పోగొట్టుకోవాలి. ఈ వెల చెల్లించాలి. అంత వెల పెట్టి నువ్వు ఉన్నత స్థాయి శక్తులను పొందినప్పుడు, వాటిని నువ్వు ఎలా దుర్వినియోగం చేయగలవు? దుర్వినియోగం చేసే అవకాశమే లేదు ఎందుకంటే దుర్వినియోగం చేయగలిగిన వాడు లక్ష్యం చేరక ముందే చనిపోతాడు.

🌷 నీ ప్రియురాలిని మొట్ట మొదటిసారి కలిసినప్పుడు నీకు చాలా సంతోషం కలిగింది. నువ్వు ఈ రోజు దాన్ని గురించి ఆలోచిస్తే, అది చాలా గొప్ప సంఘటన, కానీ ఈ రోజు ఆమెని నిజంగా కలిస్తే, ఆ సంతోషం తగ్గి ఉంటుంది. తర్వాత ఇరవై నాలుగు గంటలలోనే మళ్ళీ నువ్వు దాన్ని ఎక్కువ చేస్తావు. జీవితంలో దుంఖం ఎంత ఎక్కువగా ఉంటుందంటే సంతోషాన్ని ఎక్కువగా చేయకపోతే బ్రతకడం కష్టమవుతుంది.

🌿 మూడవ నేత్రపు బిందువు గురించి మరికొన్ని విషయాలు నేను చెబుతాను. నీకు ఆతురత కలిగినప్పుడల్లా మూడవ కంటి పై ఒత్తిడి ఉన్నట్లు గమనించే ఉంటావు. దాని వల్ల నీ నుదురు కుంచించుకుని ముడతలు వస్తాయి; ఎక్కడైతే తిలకం పెడతామో అక్కడే నుదురు బిగుసుకుంటుంది. ఎప్పుడూ వ్యాకులతతో ఉండే వారు, ఎప్పుడూ ఆలోచనలతో, తలంపులతో ఉండేవారు తప్పనిసరిగా నుదుటి పై వారు అనుభవించే ఒత్తిడి ఆధారంగా ఆ బిందువు ఎక్కడ ఉన్నదీ చెప్పగలరు.

🌳 గత జన్మలలో మూడవ నేత్రం పై తీవ్ర కృషి చేసిన వారికి, పుట్టినప్పుడే, నుదుటి పై సరిగ్గా మూడవ నేత్రపు బిందువు పైనే ఒక రకమైన తిలకం వుంటుంది. ఆ నిర్దిష్ట స్థలం కొద్దిగా వాడినట్లు, ఇదివరలో తిలకం వున్న గుర్తులా వుంటుంది. నుదుటి పైన ఆ బిందువుని నీ వేలుతో తాకితే - గతజన్మలలో, తిలకం ఎక్కడ పెట్టబడిందో అక్కడ మాత్రమే అది కొద్దిగా ఉబ్బినట్లు వుంటుంది. తిలకం వెనుక మూడవ కన్ను దాగి వుంటుంది. 

🍀 నుదుటి నుండి మూడవ నేత్రపు చక్రం దాదాపు ఒకటిన్నర అంగుళాల లోపల వుంటుంది, ఉపరి తలానికి చాలా దగ్గరలో. నీ ముందు ఎవరైనా నడుస్తుంటే, దాదాపుగా అతడి మూడవ నేత్రపు బిందువుకి సమానంగా నువ్వు నీ కళ్ళు అతని తల వెనుక నిలిపితే, కొద్ది క్షణాలలోనే, ఆ వ్యక్తి అతని చుట్టూ చూడడానికి వెనక్కి తిరుగుతాడు. కొన్ని రోజులు నువ్వు ఈ ప్రయోగం చేస్తూ, అతడికి అదే సమయంలో నువ్వు సూచనలిస్తే, అతడు వాటిని పాటిస్తాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు: ఒక్క క్షణం కూడా కనురెప్ప కొట్టకుండా, అతడి తల వెనుక నీ దృష్టి సారిస్తే, అతడు వెనక్కి తిరిగి చూస్తాడు. అదే క్షణంలో, అతడిని ఏదో చేయమని మానసికంగా నువ్వు ఆజ్ఞాపించ వచ్చు. అతడిని నువ్వు ఎడమ ప్రక్కకి తిరగమని ఆదేశిస్తే, అతను ఇబ్బంది పడినా అలాగే చేస్తాడు. అతడు కుడి ప్రక్కకు తిరగాలని అనుకుంటూ ఉండి ఉండవచ్చు. నువ్వు ఈ ప్రయోగం కొంత కాలం చేస్తే, ఫలితాలను చూసి నువ్వు చాలా ఆశ్చర్యపడతావు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

☘️ *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.

👍 *VicTorY oF LiGhT*🎇

💚🔆 *Light Workers*----                                                     🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣




No comments:

Post a Comment