*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 4* 🌹
🌹 *దైవ విగ్రహాల రూపాంతర పరిణామ శక్తి* 🌹
🌸 *Part --1*🌸
🌿 నీ శక్తిని నీ కను బొమ్మల మధ్య కేంద్రంలో కేంద్రీకరించి, వారు ఏం చేయాలని నువ్వు అనుకుంటున్నావో అది వారితో చెబితే, పదిసార్లకి తొమ్మిది సార్లు వారు దాన్ని చేస్తారు. నీ శక్తిని అలా కేంద్రీకరించకుండా చెబితే, పదిసార్లలో తొమ్మిది సార్లు వారు చేయరు. రెండు కను బొమల మధ్య శక్తిని కేంద్రీకరించి చెప్పిన ఏ భావమైనా, ఆలోచనైనా ఎంతో శక్తివంతంగా ఉంటుంది.
🍀 అదే విధంగా, మూడవ నేత్ర చక్రం శక్తినంతా ఒక వ్యక్తి ప్రతి రూపం పై కేంద్రీకరిస్తే, మట్టి బొమ్మ పైకి నీ ఆలోచనని నిర్దేశించి పంపితే, అది ఇక పై కేవలం మట్టిగా ఉండదు, కేంద్రీకరించిన నీ సంకల్పం వలన ఆ మట్టి ముద్ద శక్తివంతం అవుతుంది. దానిలోకి నువ్వు ఒక రోగాన్ని ఒక నిమిషం పాటు మానసికంగా చొప్పిస్తే, ఆ మట్టి బొమ్మ ఎవరి ప్రతి రూపమో వారికి ఆ జబ్బు వస్తుంది. ఆ వ్యక్తి నీ నుండి ఎంత దూరంలో ఉన్నా ఇబ్బంది లేదు, అతడు వ్యాధిగ్రస్తుడు అవుతాడు: బహుశా అతడు చనిపోవచ్చు.
🌼 నీ మనస్సుకీ, విశ్వపు మనస్సుకీ ఉన్న సంబంధమే విగ్రహారాధనకి ప్రధాన ఆధారం. కావలసినదంతా ఆ రెండింటికీ మధ్య వంతెన, ఆ వంతెనని నిర్మించవచ్చు. ఆ వంతెనని సృష్టించే ప్రయత్నమే ఆ విగ్రహం. ఒక విగ్రహ రూపంలా కంటికి కనిపించేది మాత్రమే వంతెన కాగలదు - ఎందుకంటే ఆకారం లేని దానితో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవడం నీకు సాధ్యం కాదు. చాలా పరిణితి చెందిన వారు విగ్రహాలను సృష్టించారు. మన చుట్టూ ఉన్న విశ్వ శక్తితో మనల్ని కలిపే వంతెన లాంటిది విగ్రహం.
🌸 విగ్రహాన్ని చూడవచ్చు కానీ భక్తిని చూడలేము అని నేను చెబుతున్నాను, కానీ మనం *'విగ్రహారాధన'* అనే మాటని సృష్టించాము, అది పూర్తిగా తప్పు. విగ్రహాన్ని రూపుమాపే విధానమే ఆరాధన. భక్తుడు ముందు విగ్రహాన్ని తయారుచేస్తాడు, తర్వాత దాన్ని కనుమరుగు చేస్తాడు. ప్రాపంచికంగా విగ్రహాన్ని తయారు చేస్తాడు, మరియు ఆధ్యాత్మికంగా దాన్ని నాశనం చేస్తాడు. అతడు దాన్ని మట్టితో చేస్తాడు, తరువాత దాన్ని అనంతమైన ఉనికిలో కరిగిపోయేలా చూస్తాడు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 4* 🌹
🌹 *దైవ విగ్రహాల రూపాంతర పరిణామ శక్తి* 🌹
🌸 *Part --2*🌸
🍁 ఒకరి ముఖంలోని అందం పట్ల ఎప్పుడైతే నువ్వు ఆకర్షించబడతావో, అది ఆ వ్యక్తి అందం వలన కాదు, అది నీలో అందం పట్ల ఉన్న ప్రతి రూపానికి అనుగుణంగా ఉండడం వల్లనే. అది నీలో అందపు ప్రకంపనలని ఉత్పత్తి చేస్తుంది, నీలోని దేన్నో అది అందంగా చేసిందని గ్రహించేలా చేస్తుంది. అలాగే, వికారంగా ఉన్న ముఖం నీలో ఏదో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అందంగా ఉన్న వ్యక్తి సమక్షంలో ఆనందం అనుభవించడానికి కారణం, ఆ అందం నీలో ప్రవహించి, నిన్ను కూడా మరింత అందంగా తయారు చేయడమే.
🍀 నువ్వు ఏం చూసినా అది నీలో దాని ప్రతిధ్వనిని సృష్టిస్తుంది; దీన్ని లోతుగా గమనిస్తే నువ్వు దేన్నైతే చూస్తున్నావో దానిలాగానే నువ్వు అవుతావు. ప్రేమ వస్తుంది మరియు పోతుంది కానీ కరుణ ఒకసారి వచ్చిందంటే, ఎప్పటికీ పోదు. ప్రేమలో, ఎదుటి వ్యక్తి నుండి ఏదో పొందాలన్న కోరిక సూక్ష్మంగా ఉంది. కరుణలో ఇవ్వడానికి ఎవరి దగ్గరా ఏమీ లేదు అన్న అవగాహన ఉంది.
🌼 ఏదైనా సజీవంగా మారగానే దానిలో ఆకారం మరియు నిరాకారం రెండూ ఉంటాయి - శరీరం ఓ ఆకారం, అందులో ఉన్న ప్రాణం నిరాకారం. ప్రాణానికి ఆకారం లేదు. ఎందుకంటే ప్రాణానికి రూపం కానీ, ఆకారం కానీ లేదు. జీవం ఎక్కడ ఉంటుందో, అక్కడ ఆకారపు, నిరాకారపు కలయిక ఉంటుంది. పదార్థానికి రూపం ఉంటుంది, చైతన్యానికి ఉండదు. విగ్రహం కేవలం ఒక రాయిలా ఉన్నంత వరకు, దానికి రూపం మరియు ఆకారం మాత్రమే ఉంటాయి - కానీ భక్తుడు దానికి ప్రాణ ప్రతిష్ట చేస్తే, అది సజీవమవుతుంది.
🌸 భక్తుడు విగ్రహంలో తన హృదయం కొట్టుకునేలా చేయగలిగిన వెంటనే, విగ్రహం సజీవం అవుతుంది; అప్పుడు ఒకేసారి, ఒక చివర ఆకారం, మరో చివరలో అది నిరాకారానికి ద్వారం అవుతుంది. ఈ ద్వారం గుండా పయనించడమే పూజించడం. ఆకారం నుండి నిరాకారానికి జరిగే ప్రయాణమే పూజ .
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 4* 🌹
🌹 *దైవ విగ్రహాల రూపాంతర పరిణామ శక్తి* 🌹
🌸 *Part --3*🌸
⚛️ పదార్థానికి అంతిమ ప్రమాణం విద్యుత్తు అని శాస్త్రం నమ్ముతుంది. ప్రాచ్య ప్రాజ్ఞులు పదార్థానికి అంతిమ ప్రమాణు విద్యుత్తు కాదని, ధ్వని అని నమ్ముతారు. ఆధునికి భౌతిక
శాస్త్రం విద్యుత్తు వల్లనే పదార్థం ఏర్పడుతుందని నమ్ముతుంది, ప్రాచ్యులు ధ్వనే ప్రాథమిక ప్రమాణం అని అంటారు. వాస్తవం ఏదైనా, విద్యుత్తుకి మరియు ధ్వనికి చాలా దగ్గర సంబంధం ఉందని అర్థం చేసుకోవాలి. శాస్త్రవేత్తల, ప్రాజ్ఞుల ప్రకటనలు రెండూ ఒకే సమయంలో నిజం అయ్యే అవకాశం ఉంది.
☘️ ఈ రోజు కాకపోతే, రేపు మూల పదార్థానికి సంబంధించిన అంతిమ సత్యం తెలుస్తుంది: దాని ఒక రూపం ధ్వని, రెండవ రూపం విద్యుత్తు. పదార్ధం ఏమిటి అన్నది ఇంకా కనిపెట్టాలి. మత సంబంధిత పరిధిలో వెతికితే, ప్రాజ్ఞుడు ధ్వనే అంతిమం అన్నది గ్రహిస్తాడు; ప్రాపంచిక పరిధిలో ఆలోచిస్తే శాస్త్రజ్ఞుడు విద్యుత్ వైపే మొగ్గుతాడు. గుర్తుంచుకోండి: జ్ఞాని తనలో వెతికాడు, పదార్థంలో కాదు; నీలో నీ ఉనికి యొక్క అంతిమ అనుభవం శబ్దం. నీ పట్ల నీకు ఎరుక ఉన్నంత సేపూ, శబ్దం పట్ల ఎరుక ఉంటుంది. నీ అంతరంగంలోకి లోతుగా వెళ్ళేకొద్దీ శబ్దం తగ్గుతూ వస్తుంది, తగ్గుతూ వస్తుంది, ఇంకా తగ్గుతూ వస్తుంది. చివరికి అంతా శూన్యం అయిపోతుంది. ఆ నిశ్శబ్దానికి తన స్వంత శబ్దం ఉంటుంది, అది శబ్దంలేని శబ్దం', అదే భారత దేశంలోని ఋషులు వర్ణించే *'అనాహతనాదం'*, మ్రోగించని శబ్దం. ఆ నాదమే అంతిమమైన ధ్వని: మానవ చైతన్యం నిరాకారంలోకి ప్రవేశించే ముందు పొందే చివరి అనుభవమే ఈ శబ్దం. ఈ అనుభవం వలన, భారత దేశంలోని ఋషులు శబ్దమే అంతిమ పదార్ధం అంటారు.
🌿 శాస్త్రజ్ఞుడు పదార్థాన్ని వేరువేరు, చిన్ని చిన్ని భాగాలుగా విభజిస్తాడు, ఆకారం లేకుండా మాయమయ్యేటప్పుడు అది ఎలక్ట్రానుగా కనిపిస్తుంది. అప్పుడు పదార్థం అంతా పూర్తిగా సమాప్తం అయిపోయినప్పుడు రూపరహిత స్థితి సంభవిస్తుంది, అతడికి మిగిలేది విద్యుత్తే.
🌳 ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటంటే, చైతన్యంలోని చిట్ట చివరి భాగం పదార్ధపు అతి చిన్న భాగం ముందు ఉంటుందా అని. పదార్థం కన్నా చైతన్యం చాలా సూక్ష్మమైనది అన్నది నిజం. కాబట్టి చైతన్యపు అంతిమ భాగం పదార్దం ముందు ఉంటుంది. అందుకే భారత దేశంలోని ఋషులు విద్యుత్తుకన్నా శబ్దం మరింత సూక్ష్మమైనదని అభిప్రాయపడ్డారు, విద్యుత్తు కంటే ముందే అది ఉంటుంది, అదే ప్రతి ఒక్కదాని అంతిమ ఉత్పత్తి స్థానం.
🍁 సంగీతం, ప్రార్థన, మంత్ర పఠనం అన్నీ శబ్ద ప్రయోగాలే. ప్రతి ధ్వని నీలో ఒక ప్రత్యేకమైన స్థితిని సృష్టిస్తుంది; అలా చేయని శబ్దమే లేదు. ధ్వని ఋణ విద్యుత్ కణాలతో ప్రయోగాలు చేసే శాస్త్రజ్ఞులు ఒక మొక్క ముందు ప్రత్యేకమైన సంగీత వాయిద్యాలను వాయిస్తే, మామూలుగా పుష్పించే దానికన్నా ఒక నెల ముందే పుష్పిస్తుందని తెలుసుకున్నారు. అలాగే ఆవుల ముందు ప్రత్యేకమైన వాయిద్య సంగీతం వినిపిస్తే ఎక్కువ పాలు ఇస్తాయని తెలుసుకున్నారు లేదా సరికాని సంగీతం వినిపిస్తే అసలు పాలే ఇవ్వకపోవచ్చు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
*Life Change Messages Every Day 6pm In Light Workers Group*
🌺 *నిగూఢ రహస్యాలు (ఓషో)* 🌺
🌹 *Chapter -- 4* 🌹
🌹 *దైవ విగ్రహాల రూపాంతర పరిణామ శక్తి* 🌹
🌸 *Part --4*🌸
🍀 ధ్వని నీలోకి చేరుకుని నీ చైతన్యాన్ని తాకుతుంది. ఒక ఖడ్గం నీ కంఠాన్ని నరకగలదు, కానీ ధ్వని అనే కత్తి నీ మనస్సునే నరక వచ్చు. శబ్దపు బ్లేడు చాలా పదునుగా ఉండి నీ మనస్సుని దాని నిమగ్నత నుండి విడదీస్తుంది. ధ్వని తరంగాలతో ప్రయోగాలు చేసారు, దానిలో ధ్యాని లేదా భక్తుడి యొక్క మనస్సును కత్తిరించటానికి ధ్వనిని ఉపయోగించడంతో, అతడు అనంతానికి పయనం మొదలు పెడతాడు.
🌼 *'దేవుడు లేడు"*, అని ఎవరైనా చెబితే, అతడు దాన్ని నిరూపించనక్కర లేదు. *“దేవుడు ఉన్నాడు"*, అని ఎవరు చెప్పినా నిరూపించవలసిందే. వ్యతిరేక వాంగ్మూలాన్ని మనస్సు నమ్ముతుంది, అభ్యుదయాత్మకమైన దేనితోనైనా పోవడానికి మనస్సు సంకోచిస్తుంది.
🌸 ఆలోచన పుట్టినప్పుడు దానికి 100 యూనిట్ల శక్తి ఉంటుందనీ, అది వేళ్ళకొసలు చేరుకునేటప్పటికి 1 యూనిట్ శక్తే మిగులుతుందని రుడాల్ఫ్ అంటాడు. ఆ ప్రసరణ ఆలోచనని కార్య రూపంలోకి మార్చేటప్పటికి 99 యూనిట్ల శక్తి ఖర్చు అవుతుంది. శరీరపు ఉపరి తలాన్ని చేరుకునేటప్పటికి ఆలోచనలు జీవరహితం అవుతాయి.
☘️ నీ ప్రియురాలి చేతిని నీ చేతిలోకి తీసుకుంటున్న ఆలోచన అనుభవంకన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఆ అనుభవం పొందుతున్నప్పుడు నువ్వు ఎదురు చూసినంత తృప్తి ఆ అనుభవం ఇవ్వలేదు అనుకుంటావు. ఏం జరిగింది? ఆలోచనకన్నా ఆలోచించినది జరిగినప్ప అది తక్కువ ఆనందం ఎందుకు ఇస్తుంది. ప్రేమించడం గురించి ఆలోచిస్తున్నప్పుడు, అతడు చాలా ఉప్పొంగిపోతాడు. ప్రేమించడం అయిన తర్వాత నిరుత్సాహంగా ఉంటాడు. అది అంత గొప్పగా లేదు అనుకుంటాడు. ఎందుకు? ఆ ఆలోచన కలిగినప్పుడు దానికి వంద యూనిట్ల శక్తి ఉంది. కానీ అది ఉపరితలం పైకి వచ్చేటప్పటికి దాని శక్తి ఒక యూనిట్ కి తగ్గిపోయింది. కొన్ని సార్లు శక్తి లేకుండా పోతుంది.
🌿 విగ్రహం సంపూర్ణమైన అంతర్గత మార్పుకోసం ఉద్దేశించబడిన ఒక మార్గం. దైవ విగ్రహం అన్నది కేవలం ఒక సాకు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌷 *నిగూఢ రహస్యాలు పుస్తకాలు* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాల్సిన వాళ్ళు *9032596493* no కి వాట్సప్ మెస్సేజ్ చేయగలరు.
👍 *VicTorY oF LiGhT*🎇
💚🔆 *Light Workers*---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
No comments:
Post a Comment