*మనపై ఉన్న ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు*
👉🌱1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !
👉🌱2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !
👉🌱3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను
తగ్గించగలదని గుర్తించుకో !
👉 🌱4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !
👉🌱 5. కక్ష కన్నా క్షమ గొప్పది
క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !
👉🌱 6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !
👉 🌱7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!
👉🌱 8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి. రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో !
👉🌱9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !
👉🌱 10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో !
👉🌱11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో* *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!
👉🌱12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!
👍🌱13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !
👉 🌱14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో !
👉🌱 15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !
👉🌱16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !
👉🌱17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !
👉🌱18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో !
👉🌱 19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం చూడడం నేర్చుకో !
👉🌱 20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !
👍🌱21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!
👉🌱22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !
👉🌱23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !
👉🌱24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !
👉🌱25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.
👍🌱శ్వాస మీద ధ్యాస తో ధ్యానం చెయ్యి.
👉🌱 ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .
👉🌱 నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .
*ఇవి మానవ జీవితానికి కంప్లీట్ ఎగ్జామ్ పేపర్*
సేకరణ :✒️AVB సుబ్బారావు 🤝💐
No comments:
Post a Comment