వీర్ సావర్కర్
....
ఒక కొబ్బరికాయ పీచుతీయాలంటే కత్తికోసం వెదుకుతాం!
.
అదే గోళ్ళతో తీయమంటే!
వామ్మో! ఎంత కష్టం!
.
అట్లాంటిది ప్రతి రోజూ రెండు బస్తాల కొబ్బరికాయలు చేత్తో పీచుతీసి, గానుగలో వేసి ఎద్దుకు బదులుగా తాను గానుగాడి నూనె తీసి,ఒంటరిగా చీకటికొట్లో
27 సంవత్సరాలు మగ్గిమగ్గి ,
బొగ్గుతో గోడలమీద కవితలువ్రాసి, వ్రాసినదానిని కంఠస్తం చేసి తదనంతర జీవితంలో పుస్తకంగా అచ్చువేయడం మానవమాత్రుడికి సాధ్యమవుతుందా!
.
దానికి ఎంత ఓర్పు! కావాలి!
ఎంత మానసిక దృఢత్వం కావాలి!
.
అసలు అలాంటి మనిషి పుట్టాడా?
.
లేకేం ఉన్నాడు !
.
అలాంటి మనిషొకడు మన స్వాతంత్ర్య సమరయోధుడని ఎంతమందికి తెలుసు?
.
మన పాఠ్యపుస్తకాలు అసలు ఆయన గురించి చెప్పాయా!
.
అండమాన్ సెల్యులర్ జైలులో గాలి వెలుతురు దూరని గదిలో 27 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష ఏకబిగిన అనుభవించి జీవితంలోని యవ్వనాన్ని దేశంకోసం ధారపోసిన మహనీయుడు
" స్వాతంత్ర్య వీరసావర్కర్ "
ఒకరిద్దరివల్లనే మనకు స్వాతంత్ర్యం రాలేదు !
.
అది ఎంతోమంది త్యాగధనులు జీవితాన్ని తృణప్రాయంగా భావించి స్వాతంత్ర్య కదనరంగంలో కొదమసింగాల్లా దూకటం వలన వచ్చింది !
.
వారిలో సావర్కర్ అగ్రగణ్యులు !
.
వీరసావర్కర్ ఎంతోమంది వీరులలో స్ఫూర్తి రగిలించేవారు .ఆయన
చుట్టూ లండన్ లో ఎంతో మంది దేశభక్తులు గుమికూడేవారు ! వారికి గురుస్థానం ఈయనదే !
..
వారు ..భాయీపరమానంద్,వీరేంద్రనాధ్ చటోపాధ్యాయ, వి.వి.స్ అయ్యర్..,సర్దార్ సింగ్ రాణా ,మేడమ్ కామా !, బాపట్ , ఎమ్.పి.టి. ఆచార్య ,మదన్ లాల్ దింఘ్రా.......
.
ఇలా ఎంతోమందికి ఉపదేశగురువు ఆయన !
మన దురదృష్టం ఏమిటో కానీ ఇంతమంది,ఇంకా ఎంతోమంది అకళంక దేశభక్తుల త్యాగ ఫలం మన స్వాతంత్ర్యం అని మన పిల్లలకు తెలియకపోవడం !
.
వీరుల చరిత్ర మనం పిల్లలకు చెప్పక ఎవరో ఒకరిద్దరి వల్ల స్వాతంత్ర్యం వచ్చింది అనే అబద్ధాలు విరివిగా ప్రచారం చెయ్యడం ! వాటినే పిల్లలు నమ్మడం !
.
వీరసావర్కార్ ను చదవండి చదివించండి !!!
..
సావర్కర్ అంటే మొక్కవోని ఉక్కు సంకల్పం
సావర్కర్ అంటే స్ఫూర్తి
సావర్కర్ అంటే రగిలే నిప్పుకణం
సావర్కర్ అంటే సాహసం
సావర్కర్ అంటే తలవంచని వ్యక్తిత్వం
సావర్కర్ అంటే నిజాయతి
సావర్కర్ అంటే నీతి
సావర్కర్ అంటే ధైర్యవంతుల గుండె చప్పుడు...
25సంవత్సరాలు ఒంటరి జైలు జీవితం ఎంత కఠినమో అర్ధం అవుతుంది..
వీర్ సావర్కర్ లాంటి వారు లక్షల మంది జీవితాలను ధార పోయడంతో వచ్చిన స్వాతంత్ర్యాన్ని చాలా సుఖంగా అనుభవించేస్తున్నాం మనం....
భారత మాతకు జయము
ఇంతటి దేశభక్తుడి ఆస్తిని బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసింది.. స్వాతంత్య్రం తరువాత వచ్చిన భారతీయ ప్రభుత్వం ఆస్తిని ఆయనకు అప్పగించలేదు కూడా..
No comments:
Post a Comment