*భార్య ఉన్నంత వరకే భర్త ఆనందం. భార్య ఉన్నంత వరకే భర్త ఆరోగ్యం. భార్య ఉన్నంత వరకే భర్త ఐశ్వర్యం. భార్యఉన్నంత వరకే భర్తకు ఉన్నతాలోచనలు. కావున భార్య ఉన్నప్పుడు వాటి విలువలు పొగొట్టు కోకండి.*
*మీ భార్యను ఒక పసి పిల్లలా చూసుకోండి. నీ చివరి దశలో ఒక తల్లిలా చూసుకునేది తనే అన్న విషయం మరువకండి.*
*నువ్వెక్కడ జన్మించావో, నేనెక్కడ జన్మించానో, మనం ఎవరికి, జన్మనిచ్చామో అవి మనతో ఉండవు. పరిణయం నుండి చివరి ప్రయాణం వరకు నాకు నువ్వు నీకు నేనే ఒకరికొకరం ఆసరా. ఆఖరి రోజుల్లో భర్తకు భార్య విలువ, భార్యకు భర్త విలువ పూర్తిగా అర్ధం అవుతుంది. కాని వయసులో ఉన్నప్పుడే అర్ధం చేసుకుంటే ఆ బంధం ఇంకా మరింత గొప్పగా, సంతోషంగా ఉంటుంది కదా.*
*దేవుడు మనిషిలో ఉండలేడు. కావున భార్యనిచ్చాడు, తల్లిని ఇచ్చాడు. ఆ తల్లి సదా కొడుకుతో ఉండలేదు. అందుకే భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే ఆ బంధం శాశ్వతం అవుతుంది. భర్త మనసు అర్ధం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనను విడిచి ఉండలేడు. ఎవ్వరి పవిత్ర బంధానికి అయినా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం ఆనందంతో కలిసి ఉంటారు🙏.*
No comments:
Post a Comment