*పెళ్ళిల్లలో వింత పోకడలు*
1. *కేవలం ముఖ పరిచయం ఉన్న అందరిని వేల సంఖ్యలో పిలవడం* (పిలిచిన వారికి ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. Attend అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్ళమని కూడా గుర్తుండదు)
2. *ప్రొద్దున పెళ్లి అయితే, స్నానం కూడా చెయ్యని ,చెమట కంపు తో, అపరిశుభ్రంగా ఉన్న వ్యక్తులు, అర్థ రాత్రి వంట చేసి, దానికి విందు అని పేరు పెట్టి, ప్రొదున వడ్డించడం.......రాత్రి పెళ్లి అయితే సీన్ రివర్స్ అంతే* .
3. *ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం*.
(కాబోయే వధూవరులను, పెళ్లి కాకుండానే, ఒక చోట కూర్చోపెట్టి, ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించమనడం.)
4. *పెళ్లి కాకుండానే pre wed photo shoot అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు photos కి pose. ఇంకా ఆ photos(కొన్ని intimate వి) కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద TV screen పైన ప్రదర్శించడం.*
5.*పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో, ఇంకొ ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం.*
6. *Photoస్ natural (candid) గా, తీయకుండా photographer కోసమే పెళ్లి చేసుకున్నట్టు, వాడు చెప్పిన వింత భంగిమల్లో pose ఇచ్చి ఫోటోల పరమార్ధం లేకుండా పోయింది*.(photographer bill కూడా లక్షల రూపాయలు)
7. *పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి, జీవితంలో మళ్ళీ ఇంకో function కి వాడకుండా, డబ్బు వృధాచేయడం*.
8. *భోజనాల పేరుతో, సమయంతో నిమిత్తం లేకుండా, అల్పాహారం, chat, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల fruits, 5 రకాల desserts(ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు,ఆహుతులు, అన్ని తినే ప్రయత్నం చేయడం ఒక వింత*.(భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు)
9. *పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి, స్టేజి ఎక్కి, మొక్కుబడిగా అక్షింతలు, వధూవరుల నెత్తిన చల్లి, వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి,photos కి pose ఇవ్వడం*(ఆ photos జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు), *అనే ప్రక్రియ కూడా ఆక్షేపనీయం*.
10. *ఇక పెళ్లి జరిపించే పంతుళ్ళు కూడా రక రకాల packages తో, పెళ్లి వేడుకను ఒక వ్యాపార తంతుగా మార్చి , లక్షల రూపాయలు వసూలు చేయడం*.
11. *DJ MUSIC అనే పేరుతొ, చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో,అర్థం పర్థం లేని సినిమా పాటలు*.
12. *కర్ణ కఠోరంగా పాడే orchestra బృందం*(వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ maintain చేస్తారు).
13.*ఇంకా mehendi అని ,సంగీత్ అని, bachelor పార్టీ అని ,పనికిమాలిన events*.
14.*మద్యంతో కూడిన విందైతే, హాజరు 110%*(బందు మిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు).
15. *ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు*.
16.*తదనంతరం పెళ్ళికొడుకు ఇంటి వద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్*.
*పూజ పవిత్రత మంట కలుపుతూ, మాంసాహార వంటలతో, మళ్ళీ పెళ్లి నాటి ప్రహసనం repeat*.
17. *ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్*.(.ఇది కూడా లక్షల్లో).
18. *ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే పనికిమాలిన వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు*.
19.*అందుకని పగ తీర్చుకొనేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం*.
**పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు, తాహతు కి మించి, ఈ మధ్య విపరీతంగా పాటిస్తు, అప్పుల పాలవుతున్నారు*.
_*ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ, ఫంక్షన్ హాల్స్ వాళ్లని, caterers వాళ్లని, photographers ని, decoraters ని,కోటీశ్వరుల్ని చేయడం మాత్రం ఖాయం.*_
ఇంత జరుగుతున్నా marriage brokers కీ లేదా mediators కి మాత్రం కమిషన్ ఇవ్వరు.... వాళ్ళు మన కులస్తులే కదా హిందువులే కదా పెళ్లికోసం వాళ్ల పాత్ర కూడా ఉంది కదా అనే ఇంగిత జ్ఞానం మాత్రం లేదు
_*ఈపోస్ట్ చదివి ఒకరు మారిన సాంప్రదాయ పుణ్యం మనకు దక్కినట్టే*_
No comments:
Post a Comment