Wednesday, October 11, 2023

కూతురంటే...

 కూతురంటే కూడికల,
తీసివెతల లెక్క కాదు
నీ వాకిట్లో పెరిగే 
*'తులసి మొక్క'...*

కూతురంటే 
దించేసుకొవలసిన 
బరువు కాదు...
నీ ఇంట్లో వెలసిన 
*'కల్పతరువు'...*

కూతురంటే 
భద్రంగా చూడవలసిన
గాజు బొమ్మ కాదు... 
నీ కడుపున పుట్టిన 
మరో *"అమ్మ"...*

కూతురంటే
కష్టాలకు,కన్నీళ్ళకు
వీలునామా కాదు ...
కల్మషం లేని 
'ప్రేమ' కు చిరునామా...

కళ్యాణమవగానే 
నిన్ను విడిచివెళ్ళినా...
పరిగెత్తుకొస్తుంది నీకు 
ఏ కష్టమెచ్చినా... 

తన ఇంటి పేరు
మార్చుకున్న
కడదాక వదులుకోదు
పుట్టింటి పైన ప్రేమను...

కొడుకులా
కాటి వరకు
తోడురాకపోయినా... 
అమ్మ అయి 
నీకు ప్రసాదించగలదు 
మరో జన్మ...

కూతురున్న 
ఏ ఇల్లు అయినా
అవుతుంది...
దేవతలు 
కొలువున్న కోవెల... 

కూతురిని కన్న 
ఏ తండ్రి అయినా
గర్వపడాలి యువరాణి ని
కన్న మహారాజు లా...

*Happy International Daughters Day💐*

No comments:

Post a Comment