Friday, October 27, 2023

****మహాత్ములు సందర్భం వచ్చినప్పుడు

 మహాత్ములు సందర్భం వచ్చినప్పుడు తమ ఆత్మీయులకు మానవ జీవిత రహస్యాలను, విజయ మార్గాలను ఉపదేశిస్తారు. అవి ఇతిహాసాల్లో విశిష్టతను సంతరించుకుంటాయి. వాటిలో ఒకటైన 

శ్రీమద్ భగవద్గీత నేడు ప్రపంచ ప్రజలందరికీ దిక్సూచి లాగా ఉపయోగపడుతున్నది. భారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేయగా, శ్రీమద్ రామాయణంలో శ్రీరాముడు భరతుడికి గీతోపదేశం గావిస్తాడు. బహుశా ఇదే గీతలన్నింటికీ మొదటి రాత అయి ఉంటుంది.

శ్రీ శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళే సమయంలో భరతుడు అయోధ్యలో లేడు. మేనమామగారి ఇంటికి వెళ్ళి వచ్చి, విషయం తెలిసి, తల్లిపై మండిపడ్డాడు. ఎలాగైనా అన్నగారిని తిరిగి తెస్తానని, బయలుదేరి వెళ్ళి అరణ్యంలో శ్రీరాముడి సన్నిధికి చేరాడు. భరతుడు తమ తండ్రిగారి మరణవార్తను చెప్పగానే రాముడు దీనంగా
విలపించాడు. దేవుడైనా సరే మానవజన్మ ఎత్తితే ఇవి. తప్పవు! 

మందాకిని నదిలో అందరూ పుణ్యస్నానాలు చేశారు. రాముడు తర్పణం విడిచి, రేగుపండ్లు, గారపిండి ముద్దలను దర్భలపై ఉంచి తండ్రిని స్మరించాడు. భరతుడు దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఈ కష్టాలన్నింటికీ కారకురాలైన తన తల్లి కైకను దూషించాడు. శ్రీరాముడు భరతుడిని ఓదార్చాడు. 'తమ్ముడూ, తల్లిని ఎవరూ దూషించకూడదు. తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాలి. వారి ఆజ్ఞ ప్రకారం నేను పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి, నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలి. అన్ని లోకాలకూ నన్నే అధిపతిని గావించినా నేను మాత్రం తల్లిదండ్రుల ఆజ్ఞనే గౌరవిస్తాను' అని శ్రీరాముడు తన నిశ్చయాన్ని చెప్పాడు. భరతుడిని ఓదారుస్తూ

రామచంద్రుడు మానవుడి ఆయుష్షు గురించి చెప్పిన మాటలు శ్రీరామగీతగా ప్రఖ్యాతి చెందాయి.

'తమ్ముడూ భరతా! సర్వమూ దైవాధీనం. అజ్ఞానం వల్ల ..అన్నీ మనమే చేస్తున్నాం అనుకుంటాం! మనం సంపాదించే ధనం నశించిపోతుంది. గొప్పతనం అంతా ఆశాశ్వతం. కుమారుడు, స్నేహితుడు, భార్య... ఈ సంబంధాలు అన్నీ తెగిపోతాయి. ఎంత గొప్పవారికైనా తుదకు మరణం తప్పదు. గడచిన రేయి ఎప్పటికీ తిరిగి రాదు. చెట్టుపై పండిన పండ్లు రాలి కింద పడిపోతాయి. సముద్రంలో కలిసిన నది వెనక్కి రాదు. రాళ్లతో గట్టిగా కట్టిన భవనం కూడా శిథిలం అవుతుంది. జీవులన్నీ వృద్ధాప్యం వచ్చి మృతి చెందుతాయి.

రేయింబవళ్లతోపాటు మన ఆయువూ అలా ముందుకు పోతూనే ఉంటుంది. మనం నడుస్తున్నా, కదలకుండా ఒక్కచోటే కూర్చున్నా అది మాత్రం ముందుకు కదులుతూ ఉంటుంది. మృత్యువు ఎప్పుడూ ఒక నీడలా మనల్ని సదా వెన్నంటే ఉంటుంది. మనం మరణించి, మరలా పుట్టడం అనేది ఒక యాత్ర. సూర్యోదయం
కాగానే అందరం సంతోషిస్తాం. కాని... మన జీవితంలో ఒకరోజు తగ్గిపోయింది అని మాత్రం ఎవరూ ఆలోచించరు. 

రుతువులు మారుతూ ఉంటే ఆనందిస్తారు. గానీ ఆయుష్షు ఆరిపోతున్నదని గుర్తించరు! ఒక సముద్రంలో ఒక కొయ్య ఇంకో కొయ్యతో కలిసి కొంత దూరం ప్రయాణించి వేరయిపోతాయి. భార్య, స్నేహితులు, సంపదలు కూడా అంతే! మరణించిన వారి కోసం ఏడ్చేవాళ్లు కూడా చావక తప్పదు. దారినపోయే బాటసారి వెంట 'నేనుకూడా మీ వెంటే వస్తా' అని అనుసరించి పోయినట్లుగా మనమూ మన తాతలను అనుసరించిపోవాలి. నాయనా భరతా! నువ్వు తిరిగి వెళ్ళి తండ్రిగారి ఆజ్ఞను అనుసరించి సింహాసనాన్ని స్వీకరించు' అని శ్రీరాముడు ఉద్బోధిస్తాడు...
.
.
'వినదగునెవ్వరు చెప్పిన.

నవవిధ భక్తి మార్గాలో శ్రవణం మొదటిది. 
శ్రవణం వల్ల ముక్తి లభించినవారిలో -పరీక్షిత్తు అగ్రగణ్యుడు. 

వినడం, అలకించడం. శ్రవణం చేయడం పర్యాయ పదాలే విషయం మీద ఆనాసక్తి, మనసు పెట్టకపోవడం, నిర్లక్ష్యం.. వీటివల్ల ఏదైనా విషయం చెవి నుంచి హృదయానికి చేరదు. అవకణ శూన్యం. కంఠశోష తప్ప కార్యాచరణ లేదు అంటారు..

వినేవాడు పరీక్షిత్తు లాంటి జిజ్ఞాసువు చెప్పేవారు శుకమహర్షి వంటి జ్ఞానగురువు, విషయం భాగవతం అయినప్పుడు మోక్షు సప్తాహంలో సిద్ధిస్తుంది.

జనక మహారాజు రాజర్షి, వైరాగ్యంలో మేటి. ఆయన జ్ఞానమార్గం
తెలుసుకోదలచి అష్టావక్రుణ్ని ఆశ్రయించాడు. 'మహర్షీ, ఎన్ని సంవత్సరాలలో నేను
జ్ఞాన సంపదను పొందగలను' అని ప్రశ్నించాడు. దానికి అష్టావక్రుడు 'రాజా! నీలో
-విజ్ఞానం పట్ల శ్రద్ధ ఉంటే, తెలుసుకోవాలనే తపన తపస్సులా మారితే నీవు వేటకు
వెళ్ళే సమయంలో గుర్రాన్ని అధిరోహించడానికి ఒక రికాబు మీద కాలు వేసి
పైకెక్కి అటుపక్క ఉన్నదానిపై కాలు వేసే సమయంలో నేను నీకు జ్ఞానవాహినిని
బోధించగలను' అంటాడు 

శ్రద్ధ భక్తి అనే విషయంపై ఆసక్తి, గురువు మీద
విశ్వాసం ఉంటే క్షణాల్లో జ్ఞానబోధ
అండగలదని దీని సారాంశం.
భోజ మహారాజు దగ్గరికి మూడు
బొమ్మలు తెచ్చి వీటిలో ఏ బొమ్మ
-విశిష్టమైందో చెప్పాలని కోరతారు.
మూడు బొమ్మలను పరీక్షింపదలచి
ఒక ఇనుప తీగ తెప్పించి మొదటి
-బొమ్మ చెవిలో దూర్చగా తీగ రెండో
చెవిలోంచి వచ్చింది. రెండో
బొమ్మలో చెవిలోంచి వెళ్ళిన తీగ
నోటిలోంచి వచ్చింది. మూడో
బొమ్మ చెవిలోనుంచి
హృదయంలోకి వెళ్ళింది. భోజరాజు.
మొదటి బొమ్మ ఈ చెవితో విని
రెండో చెవితో వదిలేసే వారికి
ప్రతీక, రెండో బొమ్మ చెవితో విని
నోటితో చిలక పలుకుల్లా పలికే
వారిలాంటిది, మూడో బొమ్మ చిన్న
విషయాన్ని మనసుకు చేర్చుకుని ఆచరించే ఉత్తముల వంటిది. కనుక మూడో
బొమ్మ విశిష్టమైంది అని తీర్పు చెప్పాడు.

కొంతమంది. ఎంతటి ప్రాధాన్యం కలిగిన విషయాన్నయినా తేలిగ్గా వదిలేస్తారు.
విన్న విషయం ఆచరణలో పెట్టరు. దాని వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు.
శ్రవణం, స్మరణం, నిధి, వ్యాస అనేవి నాలుగు సాధనా మార్గాలు, విన్నదాన్ని
మరుపు లేకుండా నిరంతరం స్మరించాలి. దాన్ని మధలో నిధిలాగా నిక్షిప్తం
గావించాలి. ధ్యాస ఉంచి అవసరమైనప్పుడు ఆచరణలో పెట్టాలి. అదే విజ్ఞానానికి
పార్థకత
కొంతమంది గ్రంథాలను చూసి వదిలేస్తారు. విషయాలను విని నదిలేస్తారు.. సత్యమార్గాన్ని తెలుసు కోవడం తప్ప అచరించరు. నిజమైన సాధకుడి లక్షణాలు -ఇవి కావని పెద్దలు పేర్కొంటారు. పుస్తకాలను హస్త భూషణాలుగా పరిగణించి ప్రయోజనంలేదు, ఉండదు. అలమరా నిండా గ్రంథాలు ఉంటే ఏం లాభం... వాటిని చదివి జీవితంలో అన్వయించుకోవాలి. భారత, భాగవత పురాణాలు వినడం వల్ల ప్రయోజనం -వాటిలోని విలువలను పాటించినప్పుడే తెలుసుకోవాలనే శ్రద్ధతో గురువును ప్రశ్నించు, నీలోని విద్యను ప్రకటించడానికి గురువును పరీక్షించ దానికి ప్రశ్నించకు- అని భగవద్గీత పరిప్రశ్నగా భోదిస్తుంది. 

భక్తి మార్గలేన్ని ఉన్నా- మనిషిలో ఉత్సాహం, ఉత్తేజం, స్ఫూర్తి కలిగేది మొదట చిన్నప్పుడే విని, దాన్ని ఆచరించి, ఆదర్శంగా నిలిచారు యుగపురుషులు, 
ఎంతటి పండితులు, జ్ఞానులు అయినా 
తమకు అంతా తెలుసని చెప్పరు. 

ఆ అహంకారం.. లేదా భ్రమ.. భ్రాంతి వారి మాటల్లో ధ్వనించదు. చేతల్లో కూడా స్ఫురించదు. తాము తెలుసుకున్నది స్వల్పమని.. తెలుసుకోవాల్సింది అనంతమని వారికి తెలుసు.

కనుకే వారిలో ఒదుగుదల.. వినయం.. సంయమనం.   ఇదే వారిని అనుక్షణం అప్రమత్తుల్ని చేసి వారు జ్ఞానాన్వేషణ మీదే దృష్టి పెట్టేలా చేస్తుంది.
మూర్ఖుడు అందుకు భిన్నం. తన మూర్ఖత్వం వల్ల పరిహాసాల పాలవుతుంటాడు. తనకంతా తెలుసనుకోవటమే అజ్ఞానం. అంతే కాదు. తనకు తెలిసిందే జ్ఞానమనుకునే అవివేకమే మూర్ఖత్వం.

మూర్ఖత్వమంటే వెర్రి పట్టుదల, దుస్సాహసం, అసంబద్ధత, అహేతుకత. బాధ్యాతారాహిత్యం, దురహంకారం, అజ్ఞానం, కుసంస్కారం. వీటి మూర్తీభవత్వమే .. మూర్ఖుడు. తనకు అంతా తెలుసని.. తనకు తెలిసిందే సరైనదన్న ఆలోచన చేస్తాడు. వాస్తవాన్ని చూసే శక్తి లేకపోవటం, ఒకవేళ చూడగలిగినా పాక్షికంగానే చూడటం, పెద్దలను గౌరవించకపోవటం, అవాకులు.. చవాకులు పేలటం, ఇతరులను అకారణంగా నిందించటం.. ఈ గుణాల కలబోతే మూర్ఖుడు.

   మూర్ఖుడు తానే సర్వజ్ఞుడనని అనుకుంటాడు. ప్రతిదీ తనకే తెలుసని ఇతరులకేమీ తెలియదన్నట్టుగా ప్రవర్తిస్తాడు. నిజానికి ఇదే అజ్ఞానం కదా! దీనివల్ల ఇతరులు చెప్పేదేది తను విననవసరం లేదని భావిస్తాడు. వారికి ఆ శక్తే లేదని అతడి ప్రగాఢ విశ్వాసం. జ్ఞానమనే అనంత ప్రవాహంలో కొత్త జ్ఞాన పాయలు వచ్చి చేరుతుంటాయి.

దానిలో తను ఒడిసి పట్టుకున్నదెంత.. దాన్ని అర్థం చేసుకున్నదెంతన్న ఎరుక ఆవగింజంతైనా లేనివాడే మూర్ఖుడు. ఒకరకంగా కూపస్థ మండూకమే! ఈ అజ్ఞానంతో పెద్దల.. జ్ఞానుల మాటలను ఆలకించడు. ఆలోచించడు. ఈ అజ్ఞానం అతడి కళ్లను ఎప్పుడూ మూసే ఉంచుతుంది. మూర్ఖత్వం ఉన్నచోట విచక్షణ, వివేచన ఉండదని, వాగ్వివాదం, అర్థరహితమైన ఆవేశం ఉంటుందన్న విషయాన్ని కొన్ని పౌరాణిక ఉదంతాలు స్పష్ట చేస్తాయి.

మూర్ఖుడికి రెండు అవలక్షణాలు. ఒకటి  తనకు తెలియకపోవటం.. రెండోది ఇతరులు చెప్పే మంచిని చూడలేకపోవటం. పైగా, వారిని సంస్కరించే క్రమంలో వివేచనాపరులకు నిందలు.. అవమానం... చీదరింపు.. చీత్కారం..  ఎదురవుతాయి. మనసుకు బాధ కలుగుతుంది. అందుకే భర్తృహరి.. సృష్టిలో లేనివి... అసాధ్యమైనవి ప్రయత్నించి సాధించవచ్చేమో కాని, ఎటువంటి ప్రయత్నం చేసినా మూర్ఖుడి మనసు మెప్పించలేమని.. మార్చలేమని... ఏనాడో సిద్ధాంతీకరిస్తూ హెచ్చరించాడు.

విలువైన సమయం వృథా అవుతుంది. ఈ శుష్కప్రయత్నం కన్నా అనేకమంది పామరులను పండితుల్ని చేయవచ్చు. అలాగే కొంచం తెలివితేటలు ఉన్నవాళ్ళకు .. ఎదుటివారు చెప్పేది వినే సంస్కారం ఉండి, ఆలోచించ గలిగే వారికి  చెప్పినా ఉపయోగముంటుంది. మన మాటలోని అంతరార్థాన్ని గ్రహించి తమను సరిదిద్దుకోగలరు. మన పట్ల కృతజ్ఞతా భావం ఉంటుంది.

మూర్ఖుడికి తన జ్ఞానం మీద అతివిశ్వాసం. దానివల్ల ఒక సమస్యను అన్ని కోణాలలో చూడలేడు. కొంతవరకే అర్థం చేసుకుని ప్రయత్నం  చేసి అద్భుతమైన పరిష్కారం కనుగొన్నానని సంతోషంతో గెంతులేస్తాడు. తాను గొప్ప మేధావినని మురిసిపోతాడు. దాని పర్యవసనాలు ఎలా ఉంటాయో ఊహించలేడు.

పిడివాదం మూర్ఖుడి జీవలక్షణం. తన ఆలోచన.. తెలివిడితనం/ తెలివి... మార్గం... అందరికన్నా మెరుగైనవన్న వైఖరి. దాన్నే తన మాటల్లో.. వాదనలో.. చేతల్లో చూపించే తత్వం. అందుకే వివేకవంతుడు అతడితో వాదనకే దిగడు. అసలు సాధ్యమైనంతవరకు మాట్లాడే యత్నమే చెయ్యడు.

మూర్ఖుడికి మంచి భావనలే రావు. సమయోచిత బుద్ధి.. ప్రవర్తన ఉండదు. అతడి ప్రవర్తన వింతగా. హాస్యాస్పదంగా ఉంటూ కొన్ని సందర్భాలలో నిర్ఘాంతులను చేస్తుంది. మరికొన్ని సమయాలలో అది ఊహించని విధంగా పరిణమించి ఎంతో విపత్తును.. నాశనాన్ని కలిగిస్తుంది. ఇంగిత జ్ఞానం మూర్ఖుడి దరిదాపుల్లో నివాసమే చేయదు.

మూర్ఖత్వం వ్యక్తి వికాసానికి పెద్ద అవరోధం. అది నాయకులకుంటే సమాజానికి చేటు. జాతినేతకు ఉంటే జాతికి ముప్పు. హిట్లర్‌.. ముస్సోలినీల మూర్ఖత్వానికి కొన్ని వర్గాలవారు ధన.. మాన.. ప్రాణాలు గడ్డిపరకల కన్నా ఎలా హీనమయ్యాయో చరిత్ర చెప్పనే చెప్పింది. మూర్ఖత్వాన్ని తప్పకుండా వీడాలి.

అదెలా సాధ్యమవుతుందంటే..?
తోటకూర నాడే అన్నట్టుగా పిల్లల్లో ఈ విపరీత లక్షణం గమనించిన పెద్దలు వెంటనే వారిని సంస్కరించే ప్రయత్నం చేయాలి. మంచి పుస్తకాలను చదివించాలి. మంచివారితో స్నేహం గరిపేటట్టు చూడాలి. అవసరమైతే గురువుల సహాయం తీసుకోవాలి. అప్పుడు అభిలషణీయమైన మార్పు చూస్తాం.
అపుడే వ్యక్తికి.. కుటుంబానికి.. సమాజానికి.. జాతికి  శ్రేయస్సు. 

మూర్ఖుడికి ఉచితానుచితాలు తెలియనే తెలియవు. సభామర్యాద తెలియదు. సంభాషణ తీరు ఉండదు. మాట్లాడే మాటలకు సందర్భశుద్ధి ఉండదు. తమ తప్పుల్ని.. పొరబాట్లను.. అనుచిత ప్రవర్తనను గుర్తెరగరు. ఒకవేళ తెలుసుకున్నా సరిదిద్దుకోరు. తమ పద్ధతిలోనే పయనిస్తారు. వివేకవంతులు తమ లోపాలను తెలుసుకున్న వెంటనే సరిదిద్దుంటారు. మార్పు వారి వ్యక్తిత్వంలో ఒక గొప్ప లక్షణం. ఇది వారిని మరింత వివేచనపరులుగా చేసే  మార్గం.

మూర్ఖత్వమంటే అసలు తెలియదని కాదు. తెలిసింది చాలా తక్కువ. అది కూడ అరకొరగానే. అదే గొప్పదన్న ఆలోచన. దానికే కన్ను, మిన్ను కానక ప్రవర్తిస్తుంటారు. వయోభేదం లేకుండా ఎవరినైనా ఏ మాటైనా అనగలరు. సంకోచం గాని.. వెరపు గాని ఉండదు. తన మాటల, వర్తన వల్ల ఎవరికైనా మనస్తాపం కలుగుతుందేమోనని యోచనే ఉండదు. తమకున్న మిడి మిడి జ్ఞానంతో, వివేచనపరులు ఈ పని చేయచ్చా... ఇలా మాట్లాడవచ్చో లేదో అని మీమాంసకు లోనైన సందర్భాలలో చొరవగా అన్నిచోట్లకు వెళ్ళగలరు .. ఏదైనా మాట్లాడగలరు.....
మీ....ఆదిత్యనారాయణ.....

No comments:

Post a Comment