Friday, October 27, 2023

హార్ట్ ఫుల్ నెస్🌍కథతో, ఆవు పాలు ఇవ్వదు

 *365 రోజులు✈️ హార్ట్ ఫుల్ నెస్🌍కథతో*  

 ♥️ *కథ*- *55** ♥️ 

 *మెల్లగా కళ్ళు మూసుకోండి... దీర్ఘంగా ఊపిరి తీసుకోండి... ఇప్పుడు మన ఇంటికి పాలు ఎలా* *వస్తాయో ఆలోచించండి... నవ్వండి... చదువుతూ ఉండండి...* 

 *ఆవు పాలు ఇవ్వదు* 

ఒక చిన్న కథ ద్వారా 'జీవిత రహస్యాన్ని' తెలుసుకుందాం.
 ఒక రైతు తన పిల్లలకు చిన్నతనం నుండి ఒక విషయం చెప్పేవాడు," మీ అందరికీ 12 ఏళ్లు వచ్చినప్పుడు, నేను మీకొక జీవిత రహస్యం చెబుతాను."
ఇలా కొన్నేళ్లు గడిచిపోయాయి, పెద్ద కొడుకుకు 12 ఏళ్లు వచ్చిన తర్వాత, ఆ జీవిత రహస్యం ఏంటని కుతూహలంగా తండ్రిని అడిగాడు.

తండ్రి చాలా ఓపికగా, "నేను నీకు ఒక రహస్యాన్నివెల్లడిస్తాను, కానీ అది మీ సోదరులకు చెప్పకూడదు." అని చెప్పాడు.
అప్పుడు అతను ఆ రహస్యాన్ని చెప్పడం ప్రారంభించాడు: "ఆవు పాలు ఇవ్వదు", అని అన్నాడు.
ఇది విన్న కొడుకు చాలా ఆశ్చర్యపోయాడు, నమ్మలేనట్లు , "ఏం అంటున్నావ్?!", అని తండ్రిని అడిగాడు.
రైతు ఇలా చెప్పాడు,
 " అవును, నేను చెప్పింది నిజమే, ఆవు పాలు ఇవ్వదు, పాలు మనమే పితకాలి. దాని కోసం తెల్లవారుజామున 4:00 గంటలకు లేచి, పొలానికి వెళ్లి, పేడతో నిండిన కొర్రల్లో నడవాలి. ఆవు తోకను కట్టాలి, కాళ్ళను పట్టుకుని, బల్లపై కూర్చోని, బకెట్ కింద పెట్టి, పాలు పితకాలి. ఈ పనులన్నీ స్వయంగా మనమే చేయాలి, అప్పుడు పాలు మనకి లభిస్తాయి.

 ఇదే జీవిత రహస్యం.  ఆవు పాలు ఇవ్వదు.  దానికోసం మనం కష్టపడాలి."

ఈనాటి కాలంలో ఆవు తనంతట తానే పాలు ఇస్తుందని భావించేతరం వారు ఉన్నారు.  జీవితంలోని విషయాలన్నీ వాటంతట అవే, స్వతంత్రంగా జరిగిపోతాయని అనుకుంటారు. 
 “నాకేదైనా కావాలంటే అడుగుతాను అంతే .. అన్నీ దొరుకుతాయి” అన్నది వారి మనస్తత్వం. అంటే వారికి ఏది కావాలన్నా సులువుగా, తేలికగా దొరకడం అలవాటైపోయింది.. కానీ వాస్తవం అది కాదు.  జీవితం అనేది కోరుకోవడం కాదు, అడగడం కాదు, తీసుకోవడం కాదు. 
ఒక వ్యక్తి పొందే వస్తువులు అన్నీ అతని యొక్క ప్రయత్నఫలితమే .

జీవితంలో మనం పొందే ప్రతీ సంతోషం మన కృషి ఫలితమే. శ్రమ లేనితనం నిరాశను సృష్టిస్తుంది. కాబట్టి, మనం ఈ జీవిత రహస్యాన్ని చిన్నతనం నుండి మన పిల్లలతో పంచుకోవాలి. తద్వారా వారికి ప్రభుత్వం లేదా తల్లిదండ్రులు లేదా వారి అందమైన అమాయకపు ముఖాలు జీవితంలో తమకు కావాల్సినవన్నీ సాధించిపెడాతాయనే మనస్తత్వంతో వారు ఎదగరు.అంతా వారి కృషితోనే సాధ్యమవుతుంది అనే విషయం వారికి అర్ధమవ్వాలి.

గుర్తుంచుకో….
 ఆవు పాలు ఇవ్వదు. దానికి శ్రమ పడాలి...!"

                 ♾️

 *సంపూర్ణ విజయం కోసం, బలమైన ఉద్దేశ్యం, సరైన మార్గం, సరైన మార్గదర్శకత్వం అవసరం. 🌼* 

 *బాబూజీ* 


హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌

HFN Story team

No comments:

Post a Comment