Sunday, October 15, 2023

కథ-* ♥️ *అనుభూతి - ప్రతి క్షణం నా జీవితాన్ని మెరుగుపరుస్తున్న విమర్శకులందరికీ నేను* *కృతజ్ఞతతో ఉంటాను. జీవితంలో మెరుగయ్యే అవకాశం.

 ♥️ *కథ-* ♥️

 *అనుభూతి - ప్రతి క్షణం నా జీవితాన్ని మెరుగుపరుస్తున్న విమర్శకులందరికీ నేను* 
                    *కృతజ్ఞతతో ఉంటాను.* 



 *జీవితంలో మెరుగయ్యే అవకాశం* 


ఒక గ్రామంలో ఒక శిల్పి ఉండేవాడు, అతను చాలా అందమైన శిల్పాలను తయారు చేసేవాడు, ఈ పని ద్వారా మంచి జీవనోపాధి కూడా పొందేవాడు. 

కొంతకాలం తర్వాత, అతనికి ఒక కుమారుడు కలిగాడు, చిన్న వయస్సునుండే అ పిల్లవాడు శిల్పాలను తయారు చేయడం ప్రారంభించాడు. అతని విగ్రహాలు చాలా అందంగా కూడా ఉండేవి. 

కొడుకు సఫలతతో తండ్రి సంతోషించినా కొడుకు శిల్పాల్లో కొన్ని లోటుపాట్లను ఎత్తిచూపేవాడు. 

అతను కొడుకుతో, "నువ్వు బాగా చేసావు, కానీ వచ్చేసారి ఈ లోపాన్ని అధిగమించడానికి ప్రయత్నించు" అని చెప్పేవాడు.

దానికి కొడుకు కూడా అసంతృప్తి పడలేదు. తన తండ్రి సలహాను అనుసరించి తన విగ్రహాలను ఇంకా మెరుగుపరచడం కొనసాగించాడు. 

తత్ఫలితంగా, కొడుకు విగ్రహాలు తండ్రి కంటే మెరుగ్గా మారాయి. 

ప్రజలు కొడుకు చేసిన విగ్రహాలను ఎక్కువ ధరలకు కొనుగోలు చేయడం ప్రారంభించారు, తండ్రి విగ్రహాలకి మాత్రం పాత ధరకే అమ్మకాలు జరిగేవి.

తండ్రి తన కొడుకు విగ్రహాలలోని లోటుపాట్లను ఎత్తి చూపుతూనే ఉన్నాడు, కొడుకుకి ఇంక దాని గురించి అసంతృప్తి మొదలయింది. 

అయినా అతను ఆ లోపాలను అంగీకరించి, తండ్రి సూచనల ప్రకారం తన విగ్రహాలను మెరుగుపరుచుకున్నాడు కానీ వాటి మీద మనస్సు పెట్టేవాడు కాదు.


తండ్రి లోటుపాట్లను ఎత్తి చూపడంతో ఇంక ఆఖరికి కొడుకు సహనం సన్నగిల్లి, "నువ్వు అంత గొప్ప శిల్పివైతే నీ విగ్రహాలు తక్కువ ధరకు అమ్ముడవవు. ఇక నీ సలహా నాకు అవసరం లేదనుకుంటున్నాను. నా విగ్రహాలు పరిపూర్ణంగా ఉన్నాయి" అని అన్నాడు.

తండ్రి ఇది విన్న తరువాత, కొడుకుకు సలహాలు ఇవ్వడం మానేశాడు.

 కొన్ని నెలలు, ఆ కుర్రవాడు సంతోషంగా ఉన్నాడు, కానీ తన విగ్రహాలు ఒకప్పటిలాగా ఇప్పుడు ప్రశంసించబడట్లేదని, క్రమంగా అతని విగ్రహాల ధర కూడా పెరగడం ఆగిపోయిందని గమనించాడు.

మొదట్లో అతనికి ఏమీ అర్థం కాలేదు, కానీ తర్వాత తన తండ్రి వద్దకు వెళ్లి సహాయం చేయమని కోరాడు. 

అలాంటి రోజు వస్తుందని ముందే తెలుసునన్నట్లుగా తండ్రి చాలా ప్రశాంతంగా కొడుకు మాటలు విన్నాడు.

 కొడుకు కూడా ఇది గమనించి,"ఇలా జరుగుతుందని నీకు తెలుసా", అని అడిగాడు.
" అవును, నేనూ ఒకసారి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాను" అని తండ్రి బదులిచ్చాడు. 

దానికి కొడుకు, “అప్పుడే ఎందుకు చెప్పలేదు?” అని అడిగాడు.

దానికి తండ్రి ఇలా జవాబిచ్చాడు, "ఎందుకంటే నీకు అర్థంచేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి. 

నేను నీ అంత బాగా విగ్రహాలను తయారు చేయలేనని నాకు తెలుసు. 
విగ్రహాల గురించి నా సలహా తప్పు కావచ్చు, నా సలహా వల్లే నీ విగ్రహాలు మెరుగుపడ్డాయని కాదు. 

కానీ నేను నీ విగ్రహాలలోని లోపాలను నీకు చూపించినప్పుడు, నీవు చేసిన దానితో నీవు సంతృప్తి చెందలేదు, నిన్ను నీవు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించావు, ఆ ప్రయత్నమే నీ విగ్రహాలను మెరుగుపరిచి, నీ సఫలతకి దారితీసింది. 

నీవు నీ పనితో సంతృప్తి చెంది, ఇక అభివృద్ధికి అవకాశం లేదని అంగీకరించిన క్షణం, నీ ఎదుగుదల ఆగిపోయింది. 

ప్రజలు ఎల్లప్పుడూ నీ నుండి ఎక్కువ ఆశిస్తారు, అందుకే ఇప్పుడు నీ పనికి పెద్దగా ప్రశంసలు అందుకోలేకపోతున్నావు, దానికి ఎక్కువ డబ్బును కూడా పొందలేకపోతున్నావు."


కొడుకు కాసేపు మౌనంగా ఉండి, "అయితే ఇప్పుడు నేనేం చేయాలి?" అని అడిగాడు.

కొడుకు ప్రశ్నకు సమాధానంగా, తండ్రి ఒక అమూల్యమైన చిన్న సమాధానం ఇచ్చాడు, "సంతృప్తి చెందకుండా ఉండటం నేర్చుకో.  మెరుగుపడడానికి, ఇంకా మంచిగా మారడానికి ఎల్లప్పుడూ అవకాశం ఉందని నమ్ము.  
         
ఈ ఒక్క విషయం భవిష్యత్తులో పురోగతిని సాధించడానికి నీకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూ, ఎల్లప్పుడూ మంచి చేస్తుంది."


పరిపూర్ణత యొక్క భ్రమ, ఎటువంటి తప్పులు చేయకుండా ఉండటం సాధ్యమే అన్న ఆలోచన, ఒక అపోహ. 

సూచనలు, విమర్శలు రెండింటినీ సమానంగా వినడం ద్వారా మనం చేసే పనులు ప్రామాణికంగా ఉంటాయి. 
ప్రగతికి ఇదొక్కటే మార్గం.

                ♾️

 *కోపగించకుండా, విచారించకుండా విమర్శను గంభీరంగా పరిగణించండి. మిమ్మల్ని మీరు* *సరిదిద్దుకోవడానికి దాన్నిఉపయోగించండి, దానిని స్వాగతించండి. 🌼*

No comments:

Post a Comment