Monday, October 16, 2023

హితోక్తులు

 *హితోక్తులు*
                  ➖➖➖✍️

**నీవు కావలన్నది సాధించుకోవాలంటే నీలో ఉన్న శక్తిని నీవు విశ్వసించాలి.*

**నిజమైన సంతోషం కోసం బయట ఎక్కడ ఉంది  అని వెతకకు, అది నీ అంతరంగంలోనే  అంతర్యామి అయిన  అంతరాత్మలోనే ఉంటుంది.*

**సంతోషానిచ్చేది సంపదలు, అంతస్తులు లేదా వైభవం కాదు, ప్రశాంతమైన మనసు వృత్తి మాత్రమే.*

**నిరంతరము నిన్ను ఎవరో కనిపెట్టి చూస్తున్నారన్న సృహతో నీవు ప్రవర్తించు.*

**మన సమస్యలకు, మన దుఃఖాలకు, మన బాధలకు పరిష్కారాలు మన దగ్గరే ఉంటాయి, కాని ఎవరో పరిష్కరించాలని అనుకుంటాము.*

**సంతోషం అనేది ఎంతో మధురమైనది కాని ఆ మాధుర్యం పొందాలంటే ఎంతో వేదన పడాలి.*

**విజయం సాధించడంలో ఎవరూ నిన్ను మోసము చేయలేరు - నిన్ను నీవు మోసం చేసుకుంటే తప్ప.*

**నీలో ఉన్న శక్తిని నీవు తెలుసుకున్నపుడే గమ్యం చేరగలము, ముందు నీ గురించి నీవే పరిశోధిoచుకో.*

**నిన్ను నీవు విమర్శించుకో , నిన్ను నీవు పురికొల్పుకో , నిన్ను నీవే పరీక్షించుకో , దీని వలన నీవు సదా జాగ్రత్తతో సురక్షితంగా ఉంటావు , కాలము సుఖంగా గడుస్తుంది.*

**నీ శత్రువులు నీలోనే ఉన్నారు, నిజానికి వేరే శత్రువులు ఎవరు లేరు, తప్పుతోవ త్రొక్కే నీ మనసే నీ శత్రువు అని తెలుసుకో.*

**నిన్ను నీవు మోసగించుకున్నంతగా , ఇంకొకరెవరూ నిన్ను మోసగించరు.*

**దేనినైనా ఆశించబోయే ముందు అందుకు కావలసిన అర్హతను సంపాదించుకో – తనను తాను జయించుకోగల వ్యక్తి అన్నింటిని జయించగలడు.*

**దీపము తానూ వెలుగుతూ ఉంటేనే మరో దీపాన్ని వెలిగించ గలదు.*

**నీమీద నీకు నమ్మకం పెరుగుతున్నప్పుడు, నీ సమర్ధత కూడా పెరుగతుంది.*

**అనుభవం నుంచి ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.*✍️

No comments:

Post a Comment