Monday, October 16, 2023

🤔 ఆలోచనలు 🫵*_ ➖➖➖➖➖➖✍️ *_-(యద్భావం తద్భవతి !)-

 _*🤔 ఆలోచనలు  🫵*_
➖➖➖➖➖➖✍️
*_-(యద్భావం తద్భవతి !)-_*
*_"మన ఆలోచనలు ఎలా ఉంటాయో, మనం అలానే అవుతాం" అని అన్నాడు ఒకస్వామీజీ తన శిష్యులతో.._* 

*_“ఒక ఆలోచన నాటితే దాని ఫలాన్ని తప్పక అందుకుంటారు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను వినండి...”_*

*_ఒక రాజు తన రాజ్యంలో ఏనుగుపై సంచరిస్తూ ఉన్నాడు. హఠాత్తుగా బజారులోని ఒక దుకాణం దగ్గర అయిపోయాడు. "ఎందుకో నాకు తెలియట్లేదు, కాని ఈ షాపు యజమానిని ఉరిశిక్ష వేయాలనిపిస్తోంది" అని తన మంత్రితో అన్నాడు రాజు._*

*_విన్న మంత్రి నిర్గాంత పోయాడు. 'ఎందుకని ?' అని రాజును అడిగేలోపే రాజు ముందుకు వెళ్లిపోయాడు._*

*_మరుసటి రోజు మంత్రి ఒక సాధారణ పౌరుని వలె ఆ గంధపు చెక్కల యజమానిని చూడటానికి దుకాణం దగ్గరికి వెళ్ళాడు. మాటలు కలిపి, 'వ్యాపారం ఎలా ఉంది ?' అని అడిగాడు గంధపు చెక్కలు అమ్మే దుకాణం యజమానిని మంత్రి._*

*_విచారంగా అన్నాడు, "వ్యాపారం ఏమీ సరిగా సాగడం లేదు. ఎవరూ గంధపు చెక్కలు కొనడానికి రావట్లేదు. అందరూ వచ్చి గంధపు చెక్కుల నాణ్యత చాలా బాగుంది అని మెచ్చుకునేవారే. గంధం చెక్కల రంగు, వాసన చూసి ఆనందించే వారే కానీ, కొనేవాళ్లు అసలు ఉండటం లేదు._*

*_అతనికి ఒకే ఒక్క ఆశ ఉండేది... ..’కనీసం ఆ దేశపు రాజు చనిపోతే, గంధపు చెక్కలు అతని దహనసంస్కారాలకి కొంటారు కదా’ అని._*

*_ఆ చుట్టుపక్కల ఎక్కడా గంధపు చెక్కల దుకాణాలు లేవు. కాబట్టి రాజు చనిపోయినప్పుడు తప్పనిసరిగా తన వద్దకే వచ్చి గంధపు చెక్కలు కొంటారు అని ధీమా ! గంధపు చెక్కలను ఆ సమయంలో అమ్మి ధనం సంపాదించవచ్చు అని అనుకున్నాడు._*

*_మంత్రికి ఇది విన్నాక రాజు అతని దుకాణం ముందు ఆగి ఇతనికి ఉరిశిక్ష వేయాలని ఎందుకు అనుకున్నాడో అర్థమైంది._*

*_ఆ దుకాణం యజమాని చెడు ఆలోచన ఆ దుకాణానికి దగ్గరగా వెళుతున్న రాజును తాకి ఉండవచ్చు. దాంతో రాజు కూడా అతనిని చంపాలి అనే దురాలోచన వచ్చి ఉండవచ్చు._*

*_మంత్రి ఒక్కక్షణం ఈ విషయమై ఆలోచించాడు. తను ఎవరో చెప్పకుండా, గంధపు చెక్కల యజమాని నుంచి కొన్ని గంధపు చెక్కలను కొన్నాడు. ఆ దుకాణం యజమాని ఎంతో సంతోషించాడు. గంధపు చెక్కలను చక్కగా ఒక పొట్లంలో చుట్టి మంత్రికి ఇచ్చాడు._*

*_మంత్రి రాజభవనానికి తిరిగి వచ్చి, నేరుగా రాజు సభ నడుపుతున్న సభా మందిరానికి వెళ్ళాడు. "గంధపు చెక్కల దుకాణపు యజమాని గంధపు చెక్కలను తమకు బహుమతిగా ఇచ్చాడు" అని మంత్రి  గంధపు చెక్కల పొట్లాన్ని రాజు చేతిలో ఉంచాడు._*

*_రాజు ఆశ్చర్యపోయాడు. గంధపుచెక్కల పొట్లాన్ని విప్పినప్పుడు రాజు చాలా ఆనందించాడు... అందులో నుంచి చక్కటి పరిమళం ఆయన ముక్కుపుటాలను తాకింది._*

*_రాజు ఆనందించిన వాడై కొన్ని బంగారు నాణాలను గంధపు చెక్కల యజమానికి బహుమతిగా పంపించాడు._*

*_అదే సమయంలో రాజు తన మనస్సులో అతనికి ఉరిశిక్ష వేయాలన్న ఆలోచన వచ్చినందుకు చాలా సిగ్గుపడ్డాడు._* 

*_అక్కడ రాజు పంపిన బంగారు నాణేలను తీసుకున్న గంధపు చెక్కల దుకాణపు యజమాని కూడా ఆశ్చర్యపోయినాడు ! రాజు యొక్క మంచి గుణగణాలను పొగడటం ప్రారంభించాడు, ఎందుకంటే రాజు పంపిన బంగారు నాణాల వల్ల తన పేదరికం నుంచి బయటపడ్డాడు ! కొంత సమయం తర్వాత అతను రాజు పట్ల తనకు కలిగిన చెడు ఆలోచనల గురించి పశ్చాత్తాప పడ్డాడు._*  
******************
*_మనం ఒక మనిషి పట్ల మంచి ఆలోచన కలిగి ఉంటే అది మనకు వెనక్కి మంచిని కలిగిస్తుంది. అదే మనం ఒక వ్యక్తి పట్ల చెడు ఆలోచనలు కలిగి ఉంటే మనకు మళ్ళీ ఏదో ఒక రూపంలో చెడు ప్రభావం తగులుతుంది._*
******************
*_"కర్మ అంటే ఏమిటి ?" అడిగాడు స్వామీజీ. చాలామంది "మన మాటలు, మన చేతలు, మన పనులు, ఇవే కర్మ అంటే" అని అన్నారు._* 

*_స్వామిజీ తన తలను అడ్డంగా ఊపారు కాదనునట్టుగా, "నీ ఆలోచనలే నీ కర్మ" అని ముగించారు.!!_*  ✍️
*_-(ఆంగ్ల రచనకు స్వేచ్ఛానుసరణ)-_*
*_🪷 రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*
🙏🇮🇳🎊🪴🦚🐍🔱⚜️

No comments:

Post a Comment