Tuesday, October 17, 2023

అమృత ధ్యానం

 https://youtu.be/-gSrMIkiPY4


🌺 అమృతం గమయ 🌺

*అమృత ధ్యానం*

పరమేశ్వరా!  బ్రహ్మీ ముహూర్త కాలంలో అనాహత అంతర్వర్తి వై నన్ను అజ్ఞానాంధకార నిద్రనుండి లేపుము. అటువంటి మహా పవిత్ర సమయమున,  నా హృదయ పద్మములో, నా అంతరంగంలో నిన్నే, నిన్ను మాత్రమే స్మరించు నిర్మల బుద్ధిని నాకు ప్రసాదించుము.

పరంధామా !  కఠినమైన పర్వతాలవలె అశాశ్వతమైన  సుఖ దుఃఖాలు మాయ కల్పించినను, భయపెట్టినను, తుది శ్వాస వరకు త్రికరణ శుద్ధిగా మనో నిశ్చలతతో నీ ధ్యానం లోనే, నీ ప్రార్థనలోనే నిలువగల నిశ్చల  శక్తి సామర్థ్యాలను నాకు ప్రసాదింపుము.

పరమాత్మ ! అను నిత్యమూ సజ్జన, భక్తజన సాంగత్యంలో పాల్గొను భాగ్యాన్ని ప్రసాదించుము.  అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యాలను అనుగ్రహింపుము.

ఈశ్వరా ! ఐహికమైన, అశాశ్వత ఇంద్రియ భోగాలపైన, బలీయమైన బాహ్య వాంఛలపైన పరిపూర్ణమైన విరక్తిని నాలో కలిగించు. నీవు నా హృదయ పద్మంలో నిరంతరం అఖండంగా ప్రకాశిస్తూ సుస్థిరమై వెలుగొందుతున్న అనుభవ జ్ఞానాన్ని ప్రసాదించు. నీతో మమేకమగునట్టి పూర్ణ భావాన్ని కలిగించు.

ప్రేమైకమూర్తీ! దేహాభిమానాన్ని, స్వార్థాన్ని, ఐహిక విషయ బంధనాలని నా నుండి తొలగించు. నన్ను కరుణించి త్రికరణశుద్ధినిమ్ము. ప్రేమ, కరుణ, త్యాగం నా హృదయంలో నిరంతరం నిండి ఉండేలా నన్ననుగ్రహించు.

కరుణా సాగరా ! తెలిసి, తెలియక, ఏ ప్రాణికీ నా వలన హాని జరుగని విధంగా. నన్ను నడిపించు.  ఆత్మ స్తుతి, పర నిందలనెడి పాప కూపంలో పడకుండా నన్ను రక్షించు.  కీర్తి ప్రతిష్ఠల పై, ధన ధాన్య సంపాదనల పై , లౌకిక భోగాలపై నా చిత్తంలో దురాశ కలుగని రీతిగా నన్ను అనుగ్రహించు.

సర్వాంతర్యామీ ! ఈ దృశ్యమాన జగత్తునందు సర్వ నామ రూపాలన్నిటి యందు నీవు మాత్రమే సత్యమనే దివ్య అనుభవాన్ని అనుగ్రహించు. సర్వ ప్రాణులందు దయ, సాటి మానవులందు కారణ రహితమైన సహజ ప్రేమ నాకు అనుగ్రహించు. నాలో రాగ ద్వేష అసూయలు నిర్మూలన చేసి నన్ను కరుణించు.

పాహిమాం పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం రక్షమాం.

https://chat.whatsapp.com/Fq7tKBLchm68sU9uyQO6BJ
*Telugu Swadhyaya and Satsangs*👆

https://chat.whatsapp.com/BCoUmijlWWq9AUDjbxjqgp
*English Swadhyaya and Satsangs*👆

https://chat.whatsapp.com/HCp3Sc4fGjO5eFXYj6YYqQ
*Hindi Swadhyay and Satsangs*👆

Amritham Gamaya Telegram Telugu

https://t.me/+ZiFi4_FG_T9lZWE1

No comments:

Post a Comment