Tuesday, October 17, 2023

 ...శంకరాచార్యుల వారిలోని విశిష్టత... వేదం చెప్పిన సత్యానికి వేదమే ఇచ్చిన తర్కం ప్రకారం, ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేటట్లు వ్యాఖ్యానించి చెప్పడంలో ఉంది. ఇప్పటికి మీకు ధ్యానం, యోగం, అంతర్నేత్రం, సాధన వంటివి తెలియకపోయినప్పటికీ కళ్ళు మూసుకుని మీరెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించండి - ఒకే విషయం మీద ఏకాగ్రత కూడా అక్కర్లేదు. మీ జ్ఞాపకాల్నీ మీ ఆలోచనల్నీ మీ భయాల్నీ మీ కోరికల్నీ ఏమాత్రం నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. అలా నిర్నిబధ్ధం అయి ప్రవహిస్తున్న అనేకానేకమైన అంశాల మధ్య క్రమేణ ఒక అంతస్సూత్రం కనబడితే ఆ సూత్రం ఎక్కడ మొదలౌతుందో అక్కడ ఉన్నది మీరు!

అయితే, ఇక్కడ ఉన్న తిరకాసు ఏమిటంటే శంకరులు కాక ఇతరులు మీ జ్ఞాపకాల్నీ మీ ఆలోచనల్నీ మీ భయాల్నీ మీ కోరికల్నీ అంతస్సూత్రం ఎక్కడ మొదలౌతుందో అక్కడ ఉన్న మిమ్మల్నీ వేర్వేరు అంటున్నారు. ఒక్క శంకరుడే "బ్రహ్మ సత్యం జగన్మిథ్య!" అని బల్లగుద్ది చెప్తున్నాడు.
ఇక్కడ "సత్యం, మిధ్య" అనే పదాలను direct antonyms అనుకుని శంకర భగవత్పాదులు జగత్తు అనేది బ్రహ్మము కన్న భిన్నమైనది అని చెప్పినట్టు పొరపడుతున్నారు కొందరు. కానీ మిధ్య అనే పదానికి ఇక్కడ అసత్యం అనేది సరైన alternative కాదు. వేదం చెప్పిన సత్యాలను axiomic truths అంటారు. అంటే ఇతరమైన అంశాలను, సత్యమా ... అసత్యమా అని తేల్చుకోవడానికి వేదం చెప్పిన సత్యంతో పోల్చి చెప్పడమే తప్ప వేదం చెప్పిన ఏ సత్యాన్నీ ఇతరమైన అంశాలతో పోల్చి సత్యమా... అసత్యమా అని తేల్చి చెప్పటం కుదరదు - ఇది నేను చెప్తున్న కవరింగ్ స్టేట్మెంటు కాదు, వేదం చదివి అర్దం చేసుకుని తమ మాతృభాషలోనికి అనువదించుకుని పరిశోధనలు చేసిన అనేక దేశాల మేధావులు చెప్తున్న సార్వకాలిక సత్యం(axiomic truth).

అంటే, ఇక్కడ సత్యం యొక్క లక్షణాలలో ఉన్న స్వతంత్రతని తీసుకుంటే మిథ్య
 అనే పదానికి అస్వతంత్రత అనేది మాత్రమే సరైన synonum అవుతుంది. బ్రహ్మ వలెనే బ్రహ్మ నుంచి విడివడిన జగత్తుకి కూడా బ్రహ్మకు ఉన్న తక్కిన అన్ని లక్షణాలూ ఉంటాయి గానీ బ్రహ్మ మీద జగత్తు ఆధారపడి ఉన్నట్టు జగత్తు మీద బ్రహ్మ ఆధారపడి లేదు.

యూరోపియన్లలో అందరూ ప్లేటో, అరిస్టాటిల్, న్యూటన్ లాంటి దొంగలు లేరు.T S Eliot అనే కవి "The great philosophers of India make most of the great European philosophers look like school boys" అని తేల్చి చెప్పాడు. Arthur Schopen hauer అనే జర్మన్ వేదాంతి "One who has also received and assimilated the sacred primitive Indian wisdom, then he is the best of all prepared to hear what I have to say to him" అని కుండబద్దలు కొట్టి చెప్పాడు.ఇటీవలి Ralf Waldo Emerson, Henry David Thoreau, Frederick Henry Hedge వంటి మేధావుల వల్ల పరిచయం అయ్యి 19వ శతాబ్దపు ఆమెరికన్ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఒక వూపు వూపిన Transcendentalism శంకరుడి అద్వైతాన్ని వడకట్టి తీర్చి దిద్దినదే!

వేదం గానీ, ఉపనిషత్తులు గానీ శంకరుని అద్వైతం గానీ పొరపాటున సైతం మనుషులను "మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు" అని విడగొట్టలేదు.ఈనాటికీ హిందువులలో సైతం కొందరు మనుషుల్ని అలా విడగొట్టటం అవైదిక దర్శనాల ప్రభావమే - "తెలిసిన వారు, తెలియని వారు" అని వైదిక దర్శనం చేసిన విభజన చాలా న్యాయమైనది, కదూ!శంకరుల అద్వైతం మరొక నమ్మలేని విషయాన్ని చెప్తుంది - నీ సమస్యని పరిష్కరించుకోవడం కోసం నీ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసం నీ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఆచార్యులు సైతం సూచనలు ఇచ్చి ప్రోత్సహించడం వరకే సాధ్యం, నిన్ను లక్ష్యానికి చేర్చే సంకల్పం, దీక్ష, ప్రయత్నం, అనుభవం,ఆనందం అన్నీ నీ లోపలి నుంచే వస్తాయి.

ఐన్స్టీన్ అనే పాశ్చాత్యుడికి తెలిసినది మనకు తెలియనందుకు సిగ్గుపడాల్సిన పని లేదు - జగత్తునీ బ్రహ్మాన్నీ మాయ, లీల అనే రెండు ముసుగులు ఆవరించుకుని ఉండటమే. అందువలన అందరికీ వెంటనే సత్యం గోచరించటం లేదు. సృష్టిలోని తత్వాలను గురించి మనం తెలుసుకునేటప్పుడు ఒక కొత్త విషయం గోచరించినప్పుడు అది మాయ అనిపిస్తుంది, గోచరించిన విషయం గురించి ఒక కొత్త అర్ధం తెలిసినప్పుడు అది లీల అనిపిస్తుంది. సృష్టికర్తతో ముఖాముఖి అన్నట్టు కనిపిస్తున్న ఇవి రెండూ సర్వ జీవులకూ అనుభవంలోకి వస్తూనే ఉంటాయి. పిల్లల పెంపకంలోని తొలిదశలో తలిదండ్రులకూ పిల్లలకూ చాలా హుషారు అనిపించేది దాగుడుమూతలు, అవునా? మొదట తండ్రి తన ముఖాన్ని చేతుల్తో కప్పుకుని కొంతసేపు అలానే ఉండిపోయి ఒక్కసారి చేతుల్ని తీసి ఒకరినొకరు చూసుకున్నప్పుడు బిడ్డా నవ్వుతాడు, తండ్రీ నవ్వుతాడు - ఇద్దరు ఆటగాళ్లలో ఎవరి ఆనందం ఎక్కువ ఎవరి ఆనందం తక్కువ అని లెక్కలు చెప్పటం ఆటలో లీనమైన వాళ్ళకు గానీ ఆటను చూసే వాళ్ళకు గానీ సాధ్యమా,భావ్యమా,అవసరమా!

సృష్ట్యాది నుంచి ప్రతి జీవితోనూ సృష్టికర్త ఇలాగే ఆడుకుంటున్నాడు.ముందు వెనకల మాయాజాలమే తప్ప ఇది ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు ఏదో ఒకలా తెలుస్తున్న అతి మామూలు నిజం, అవునా? ఆది శంకరుల వారి అద్వైత సిద్ధాంతం ప్రకారం బ్రహ్మ, పరబ్రహ్మ, పరమాత్మ, సృష్టికర్త, శివుడు, విష్ణువు, గణేశుడు, పార్వతి వంటి పేర్లతో తను వర్ణించిన అన్ని దేవతా స్వరూపాల వెనుక ఉన్నది నైరూప్య నిర్గుణ నిష్కామ జ్ఞానభావమే తప్ప రామానుజ, మధ్వ, వల్లభ, కృష్ణ మతాల వారు చెప్తున్నట్టు రూపధారులైన విష్ణువు గానీ శివుడు గానీ పవిత్ర స్థలాలు గానీ ఆళ్వారులు గానీ కానే కాదు. శంకరుల వారి అద్వైతం సత్యమా రామానుజుల వారి ద్వైతం సత్యమా అనేది తెలియాలంటే ఇప్పటి సైన్సు నిరూపిస్తున్న "Consciousness shapes Universe" అనే చిన్న నిజం తెలుసుకుంటే చాలు.ఇప్పటికీ నేను బ్రహ్మ సత్యం జగన్మిథ్య గురించి చెప్పినది అర్ధం కాక శంకరుని అద్వైతం శాస్త్రీయం కాదని వాదించ దల్చుకున్న వాళ్ళు "we have been all wrong. What we have called matter is energy, whose vibration has been so lowered as to be perceptible to the senses. There is no matter." అని Einstein  చెప్తున్నాడు, వినండి!

ఆధునిక భౌతిక శాస్త్రంలోని ఏకీకృత క్షేత్ర సిద్ధాంతం పరిశీలిస్తున్న విద్యుదయస్కాంత శక్తిక్షేత్రం(electromagnetic radiation) అనేది అగోచరమైన అనంతాత్మ(Consciousness) యొక్క మానవ దేహపు ఇంద్రియాలు తెలుసుకోగలిగిన జ్ఞానరూపం,అంతే!Consciousness అనేది అత్యంత సూక్ష్మమైన పరమాణువులలోని ఎలెక్ట్రాన్,ప్రోటాన్ వంటి అత్యంత సూక్ష్మమైన వాటిలో కూడా ఉండటం వల్లనే quantum double slit experiment మొండి శిఖండి హేతువాద పండితులకి కూడా ఝలక్ ఇచ్చి వాళ్లచేత దేవుడు ఉన్నాడని ఒప్పుకునేలా మృదువర్లని చేసింది.ఒకసారి శంకరుల వారు ప్రతిపాదించిన అద్వైతం తలలో దూరితే ఆ క్షణం మొదలు ఇక ఆ మనిషికి భౌతికపరమైన సంపదలకు గానీ మనోగతమైన ఆనందాలకు గానీ కొరత అనేది ఉండదు, ఉండకూడదు.శంకరులు చెప్పిన ఒక సత్యంలోని సగమైన "బ్రహ్మసత్యం జగన్మిధ్య" అంటే ఏమిటో చెప్తూ మొదలుపెట్టిన విశ్లేషణని అదే సత్యంలోని సగమైన "జీవో బ్రహ్మైవ నాపరాః " అంటే ఏమిటో కూడా చెప్పాను , గాబట్టి దర్శనం గురించిన విశ్లేషణని ఇంతటితో ముగిస్తున్నాను.ఇంతకన్న సాగదీస్తే అది ద్వైతంలోకి జారుకునే ప్రమాదం ఉంది.


https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v

*Telugu Swadhyaya and Satsangs*👆

https://chat.whatsapp.com/BCoUmijlWWq9AUDjbxjqgp
*English Swadhyaya and Satsangs*👆

https://chat.whatsapp.com/HCp3Sc4fGjO5eFXYj6YYqQ
*Hindi Swadhyay and Satsangs*👆

Amritham Gamaya Telegram Telugu

https://t.me/+ZiFi4_FG_T9lZWE1

No comments:

Post a Comment