మానవ జన్మ
ఆత్మ మనుషుల శరీరంలో చేరే విషయం గురించి మాట్లాడటానికి ముందు.. ప్రతి ఒక్కరూ ఒక విషయం తెలుసుకోవాలి. మనషుల ఆత్మ ఎప్పటికీ మరణించదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం మోక్షానికి చేరుతుంది అంతే. మంచి పనులు చేసినప్పుడే.. ఆత్మ మోక్షానికి చేరుతుంది. అంటే.. ఆత్మ ఒక జాతి నుంచి మరొక జాతికి మారుతూ ఉంటుంది.
మరణం తర్వాత మనకు జీవితం ఉంటుందా
జంతువులు, పక్షులు, క్రిమీ కీటకాలు, మొక్కలు.. ఇలా ఒక్కో జీవితాన్ని అనుభవిస్తూ.. మంచి పనులు చేసిన దాన్ని బట్టి.. ఆత్మ మనుషుల శరీరం పొందగలుగుతుంది. అంటే.. ఎంత ఎక్కువ మంచి పనులు చేస్తే.. అంత త్వరగా.. గొప్ప జన్మ అయిన మనిషి జన్మ ఎత్తుతుందన్నమాట. అందుకే.. మనిషి జన్మ పొందడం పూర్వ జన్మ సుకృతం అని మన పెద్ద వాళ్లు చెబుతూ ఉంటారు.
మరణం తర్వాత యమలోకానికి వెళ్లడానికి 47 రోజుల భయంకర ప్రయాణం.!!
మనిషి జన్మ పొందడానికి మన ఆత్మ ప్రయాణించే విధానం గురించి వింటే ఆశ్చర్యపోతారు. మనిషి పుట్టుక పొందాలంటే.. ఆత్మ 8 కోట్ల 40 లక్షల జాతులు దాటుకుని రావాలని.. పురాణాలు, భగవత్ గీత చెబుతోంది. మరి మనిషి జన్మ పొందడానికి ముందు ఆత్మ ఎన్ని కష్టాలు పడుతుందో తెలుసుకుందాం...
మనిషి జన్మ
భగవత్ గీత, మన పూర్వీకుల ప్రకారం మనం మనుషులం అంత తేలికగా.. మానవ శరీరాన్ని పొందలేము.
మనుషుల జీవితం, శరీరం గురించి రహస్యాలను.. శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు.
కృష్ణుడు చెప్పిన ప్రకారం మన ఆత్మ.. 8 కోట్ల 40 లక్షల జాతులు దాటుకుని.. మనుషుల శరీరానికి చేరుకుంటుందట.బొద్దింకలు, పాముల రూపంలో
కొన్నిసార్లు మనుషులు బొద్దింకలు, పాములు, సాలె పురుగు, చీమ, సముద్రపు జీవులు, మరికొన్ని మనం ఊహించని విధంగా కూడా జన్మించవచ్చట.
గత జన్మ
సాధారణంగా మనం కొన్ని ప్రాణులను అసహ్యంచుకుంటూ ఉంటాం. దానికి కారణం.. గత జన్మలో మనం ఆ జాతిలో పుట్టడం వల్ల ఈ జన్మలో వాటిని అసహ్యించుకుంటామని ఒక నమ్మకం ఉంది.
అయితే ఆ జన్మలో అనేక మంచి పనులు చేయడం వల్లనే మనం మానవ శరీరం పొందగలుగుతామట.
కాబట్టి మనం పొందిన గొప్ప మానవ జన్మను ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటే.. మళ్లీ జంతువుల జాతిలోనే పుడతామట.అలాగే ఆత్మకు.. మనిషి జీవితం అనేది.. చివరిగా లభించే జీవితం అని ఒక నమ్మకం ఉంది.
ఎన్నో నీచమైన జన్మల తర్వాత మనిషి జన్మ లభిస్తుంది.. కాబట్టి దాన్ని సార్థకం చేసుకోవాలని సామెత ఉంది. ఎన్నో రకాలుగా మనం జీవితం అనుభవించిన తర్వాత.. ఎంతో మందికి సహాయపడిన తర్వాత.. మనిషి జీవితం పొందగలుగుతాం..అయితే 8 కోట్ల 40 లక్షల జాతుల తర్వాత మనిషి జీవితం పొందుతామనే దానిపై ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు, కానీ.. ఈ భూమ్మీద మాత్రం 8.7 మిలియన్ల జాతులు ఉన్నాయని మాత్రం నిరూపించింది. దీన్ని బట్టి ఆత్మ ఈ జాతులను దాటిన తర్వాతే మనిషి జన్మ పొందుతుందని అంచనా వేస్తున్నారు.
అందులో 9 లక్షల జలచరాలు, 20 లక్షల మొక్కలు, 11 లక్షల క్రిమీకీటకాలు, 10 లక్షల పక్షులు, 30 లక్షల జంతువులు, 4 లక్షల మనుషుల జాతులు భూమ్మీద ఉన్నాయని వేద సిద్ధాంతం తెలుపుతోంది.
మనం చనిపోయిన తర్వాత శరీరం మరణిస్తుంది.. కానీ.. ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరానికి మారుతూనే ఉంటుందని మన పురాణాలు తెలుపుతున్నాయి. దీన్నిబట్టి కొత్త జన్మ పొందిన ప్రతిసారి.. గత జన్మ శరీరం మరణిస్తూ ఉంటుంది. కానీ.. ఆత్మ మాత్రం బతికే ఉంటుంది.🌹🌹 ప్రసాది మధు శేఖర్ అధ్యక్షులు సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం 🙏🙏
No comments:
Post a Comment