జ్ఞానం నుండి పుడుతున్న ఊహలు వేరుగా ఎక్కడో లేవు, అవి అక్షరాలలో మాటలు, వాక్కులుగ సంభాషణలుగ వ్యక్త మౌతాయి
ఊహకి, అక్షరాలకు అవినాభావ సంబంధం ఉంది, అక్షరాల వలననే మనకు ఊహల ఉనికి అవగతమౌతుంది
మనలో జ్ఞానం ఉంది, అక్షరం ఉంది, ఊహ పుట్టినవెంటనే భావప్రకటనా సామర్థ్యంతో అక్షరాలు భాష రూపం పొంది వ్యక్తమౌతాయి
అక్షరం వలె సృష్టి క్రియారహస్యాలు అనంతాలు, అసంఖ్యాకాలు. అక్షరం అవతరించింది, నాదం అవతరించింది, వేదం అవతరించింది, బ్రహ్మమే అన్నిటికి మూలం
లోకంలోని పదిమంది సన్మార్గులలో ఒక్కడైనను దైవప్రీతి కలవాడుంటాడు, పదిమంది దైవప్రీతి గల వారిలో ఏ ఒక్కడైనా దైవాన్ని పొందాలనే కోరికతో ఉంటాడు, దైవాన్ని పొందాలనుకున్న పదిమందిలో ఏ ఒక్కడైనా దైవాజ్ఞ శిరసా వహిస్తాడు, అటువంటి వాడు ధన్యుడు
No comments:
Post a Comment