Tuesday, November 7, 2023

నేటి జీవిత సత్యం…* *కోరికల చిట్టా

 3101.    2-6.    140223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నేటి జీవిత సత్యం…*

                 *కోరికల చిట్టా* 
                 ➖➖➖✍️
  

 *ఈ పుడమిపై పుట్టిన ప్రతి మనిషికీ అనుక్షణం అవసరాలెన్నో ఉంటాయి. బతుకు గడవాలంటే తిండి కావాలి. కట్టుకునేందుకు బట్టలు కావాలి. నివసించడానికి ఇల్లు కావాలి. ధన సంపాదనకు వృత్తులు, ఉద్యోగాలు కావాలి. ఆనందంగా ఉండటానికి ఇంకెన్నో కావాలి.* 

 *మనిషికి కోరికలు బలాలే కాదు, బలహీనతలు కూడా. మనిషి అవసరాలు ప్రాధాన్యాన్నిబట్టి మారుతుంటాయి. ఏది అత్యవసరమో దానికోసం మనిషి తహతహలాడు తుంటాడు. పరితపిస్తుంటాడు.* 

*మానవ ప్రయత్నంతో సాధ్యం కానప్పుడు దైవాన్ని ఆశ్రయించడం మానవ స్వభావం. ఇంటిలో ఉన్న దేవతలను ఆరాధించడమే కాకుండా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకోవడం, పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయడం, దానాలు చేయడం పరిపాటి. మనిషి దైవదర్శనం చేసుకొనే సమయంలో తన కోరికల చిట్టాను భగవంతుడికి నివేదించుకుంటాడు. అవన్నీ సమకూరిస్తే మళ్ళీ వచ్చి మొక్కులు తీర్చుకుంటానని, కానుకలు సమర్పించుకుంటానని మొక్కుకుంటాడు.* 

*కోరికలు న్యాయమైనవే కావాలన్న నిబంధన ఏమీ లేదు కనుక అన్యాయార్జితాలకోసం మొక్కుకునేవారూ కనిపిస్తారు. ఉదాహరణకు ఒక దొంగ తనకు దొంగతనంలో అపారంగా ధనం లభిస్తే, అందులో కొంత హుండీలో వేస్తానని వాగ్దానం చేస్తాడు. అక్రమార్జనలో పుష్కలంగా ధనం లభిస్తే భూరి విరాళం ఇస్తానని మరొక వ్యక్తి కోరుకుంటాడు. ఎవరి బాధలు వారివి. ఎవరి కోరికలు వారివి. ఏ కోరికనూ కోరని భక్తులూ ఉండవచ్చు. అలాంటి వారిది నిష్కామ భక్తి.*  

 *కోరికలు ఉండటం, లేకపోవడం వ్యక్తిగతాంశం. కోట్లకు పడగలెత్తిన కుబేరులకూ అపారంగా కోరికలు పుడుతూనే ఉండవచ్చు. పూటకు గతిలేని నిరుపేదకు ఏ కోరికలూ లేకపోవచ్చు. కోరికలు మనిషిని బంధిస్తాయని మహర్షుల వాక్కు. ఒక కోరిక మరో కోరికను పుట్టిస్తుంది. కోరికలు కడలి కెరటాల్లాంటివి. ఒక కెరటం తీరాన్ని తాకి నశించగానే, మరో కెరటం వస్తూనే ఉంటుంది. కెరటాలకు అంతం లేనట్లే కోరికలకూ అంతం లేదు.* 

 *మనిషిని సృష్టించిన భగవంతుడికి మనిషి మనసులో ఏముందో తెలియదా అని ప్రశ్నించేవాళ్లూ ఉంటారు. మనిషి స్వభావం దేవుణ్ని అడిగేట్టుగా చేస్తుంది. ప్రాథమికావసరాల కోసం కొందరు దేవుణ్ని ప్రార్థిస్తారు. అవి తీరగానే విలాసాలు కోరుకుంటారు. వాటికి అంతులేదు. ఎన్ని ఉన్నా, ఇంకా ఏవో కావాలనిపిస్తుంది. కోరికలను ఏదో ఒక దశలో నియంత్రించకపోతే అశాంతి మిగులుతుందనడంలో సందేహం లేదు.*

*పూర్వం యయాతి వంటి చక్రవర్తులు సైతం కోరికల అగ్నిజ్వాలలకు ప్రభావితులై, చివరిదశలో వాటిని వదిలేసిన కథలు పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి.* 

*ఎడతెగని కోరికలు జీవితాన్ని దుర్భరంగా మారుస్తాయి. సుఖంగా బతుకు గడవడానికి సరిపోయేంతటి కోరికలు అభిలషణీయాలేకానీ, గగనకుసుమాల వంటి అసాధ్యమైన కోరికలు వాంఛనీయాలు కావు.* 

 *కోరికల చిట్టాను దేవుడికి సమర్పించే ముందు వాటిని తీర్చుకోవడానికి మనిషి తన ప్రయత్నాన్ని ఎంత చిత్తశుద్ధితో ఆచరించాడో తెలుసుకోవాలి. ప్రయత్నించే మనిషికే దేవుడి సహాయం లభిస్తుందని నీతికారులంటారు. కనుక మనిషి భగవంతుడి ముందు కోరికల జాబితాను సమర్పించిన తరవాత, తాను ఆ కోరికల సాధనకు తగిన కృషి చేయాలనే విషయాన్ని మరువరాదు.*
✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖
ఇలాటి మంచి విషయాలకోసం…
*“భగవంతుని విషయాలు గ్రూప్“* లోచేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ మెసేజ్ పెట్టండి...944065 2774.
లింక్ పంపుతాము.🙏

No comments:

Post a Comment