Tuesday, November 7, 2023

కాలం కాంచన తుల్యం…!’* *కాలం విలువ

 1212.      1-4.  150223-6.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 *‘కాలం కాంచన తుల్యం…!’*

                 *కాలం విలువ*
                ➖➖➖✍️

కాలం చాలా విలువైనది. *‘కాలం కాంచన తుల్యం!’* అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం. ఇంతకంటే మంచి పోలిక ఏముంది? 

వ్యక్తి తన జీవిత కాలంలో సమయ పాలన పాటించడం బట్టి, అతని జీవితం ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి వృత్తిలో చేసే పనిని తగు సమయానికి పూర్తి చేయగలగడం వలన అతని చేతి వృత్తికి విలువ ఎక్కువ ఉంటుంది. అదే వ్యక్తి తగు సమయానికి పనిని పూర్తి చేయలేకపోతే,  ఆ వ్యక్తి చేతివృత్తికి విలువ ఉండదు. ఎంత ప్రతిభ ఉన్నా, అవసరానికి ఉపయోగపడే విధంగా ప్రతిభ ప్రదర్శించలేకపోతే, ఆ ప్రతిభా పాటవాలు నిరర్ధకమే అంటారు. అంటే కాలంలో ఒక వ్యక్తి ప్రతిభ, మరొక వ్యక్తి అవసరం   లేక  ఒక వ్యవస్థాగత అవసరంపైన ఆధారపడి ఉంటుంది. అలా కాలంలో వ్యక్తి ప్రతిభకు గుర్తింపు, ఆ వ్యక్తి అవసరానికి తగ్గట్టుగా తన పనిని తాను పూర్తి చేయడంపైన ఆధారపడి ఉంటుంది. వ్యక్తి కానీ వ్యవస్థ కానీ సమాజంలో అవసరాలు తీర్చడానికి సేవలు అందించే ప్రక్రియను పాటిస్తూ, ఆ సేవలకు తగినంత రుసుమును వసూలు చేస్తూ ఉంటే, సేవలు సమయానికి ఉపయోగపడితే, సదరు వ్యవస్థపైన కానీ సదరు వ్యక్తి పైన కానీ సమాజంలో నమ్మకం ఏర్పడుతుంది. సదభిప్రాయం ఏర్పడితే, సదరు వ్యక్తి కానీ వ్యవస్థ కానీ ఆర్ధికంగా లాభాలు గడించగలరు. అంటే ఆర్ధిక పురోగతిని కాలం శాసించగలదు.

ఒక మోటారు సైకిల్ మెకానిక్, ఒక వ్యక్తి యొక్క మోటారు సైకిల్ రిపైరు చేయడానికి రెండురోజులు గడువు కోరితే, అతను ఖచ్చితంగా తను కోరిన గడువులోపులో మోటారు సైకిల్ రిపైరు చేయగలిగితే, సదరు మోటారు సైకిల్ యజమాని యొక్క మన్ననకు పాత్రుడు కాగలడు. 

కాలంలో ఒక వ్యక్తి ఇచ్చే కమిట్ మెంట్, మరొక వ్యక్తి మరొకరికి ఇచ్చే కమిట్ మెంట్ కు కారణం కాగలదు. రెండురోజుల గడువులో మోటారు సైకిల్ రిపైర్ చేయగలిగితే, అతని మాట నిలబడుతుంది. ఇంకా మోటారు సైకిల్ యజమాని మాట నిలబడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంటే, కాలమును బంగారంగా మార్చుకోవడమే…. భవిష్యత్తులో మాటకు విలువ పెరగడమే అవుతుంది.

వ్యక్తి జీవితములో కాలం కన్నా విలువైనది ఉండదు.

బాల్యం అంటే చిన్నప్పుడు 
యవ్వనం అంటే యుక్త వయసుకు వచ్చినవారు
వృద్దాప్యం అంటే ముసలివారు….
పై ఈ మూడు కాలాలు మనిషిపై చాలా ప్రభావంతమైనవి.

బాల్యంలో ఆటలు ఆడుకోవడం, క్రమశిక్షణతో చదువుకోవడం చాలా చాలా ప్రధాన విషయం. 
బాల్యంలో ఒక బాలుడు స్కూల్ కు వెళ్తూ చదువుకుంటూ, రోజూ కొంత సమయం ఆటలు ఆడుకోవడం… ఆరోగ్యవంతమైన బాల్యంగా చెబుతారు. ఆటల వలన శరీరానికి అలుపు ఉంటుంది. సమయానికి తినడం వలన, తిన్న తిండి శక్తిగా మారుతుంది. చదువుకోవడం వలన విషయ పరిజ్ఞానం పెరుగుతుంది. ఏదో ఒక విషయంపై పరిశోధనాత్మక చదువు సమాజంలో మంచి గుర్తింపును తీసుకువస్తుంది.
సామాన్యమైన చదువు ఒక ఉద్యోగిగా మారడానికి ఉపయోగపడుతుంది. అంటే బాల్యంలో ఆడే ఆటలు శరీర ఆరోగ్యంగా ఉండేలా, బాల్యంలో చదివే చదువులు వ్యక్తి వృత్తికి సాయపడేలా ఉంటాయి… 

ఇక్కడ ఎంత శ్రద్దపెట్టి చదువు చదివితే, అంత గుర్తింపు… ఎంత చక్కగా తిండి తిని, సరైన వ్యాయామం కానీ    ఆటలు కానీ అడితే, అంతటి ఆరోగ్యం అంటారు. 

కష్టపడి బాల్య కాలంలో చేసే సాధన యవ్వన కాలమును ప్రభావితం చేస్తుంది. 

అలాగే యవ్వనంలో కష్టపడి చేసే పని, వృద్దాప్యంపై ప్రభావం చూపుతుంది. ఇలా ఒక కాలంలో పడిన కష్టం యొక్క ఫలితం మరొక కాలంలో పడుతుంది. 

అందుకే ఏ సమయానికి ఏం చేయాలో తెలిసి ఉండాలి… అందుకు శ్రమించాలి అని అంటారు. కాలంలో కలిగే మార్పులు వ్యక్తి జీవితంపై పడుతూ ఉంటాయి… అయితే అంతకు ముందు ఆ వ్యక్తి చేసిన సాధన ఫలితం కాలంలో కలిగే కష్ట నష్టాలను ఎదుర్కోవడంలో ఉపయోగ పడుతుంది. 

ఒక వ్యక్తి వ్యాయామంతో కాయమును పెంచితే, ఆ కాయము కాలంలో వచ్చే అంటువ్యాధులతో పోరాడగలిగే శక్తిని కలిగి ఉంటుందని అంటారు. 

అలాగే ఒక వ్యక్తి బాగా కష్టపడి సంపాదిస్తే, కాలంలో కలిగే ఆర్ధిక మార్పులను ఎదుర్కోవడంలో ఆ ధనం ఉపయోగపడుతుంది. 

ఒక వ్యక్తి తనతోటివారికి సాయపడుతూ ఉంటే, కాలంలో ఎదురయ్యే కష్టాలలో తన తోటివారే తనకు అండగా నిలబడతారు అంటే ఒక వ్యక్తి చేసే సాధన ఏవిధంగా ఉంటే, అదే విధంగా కాలంలో సమాజం నుండి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటారు.

ఈ విధంగా కాలం వ్యక్తి జీవితముపై అనేక విధాలుగా ప్రభావం చూపగలదు… కాబట్టి *‘కాలం కాంచన తుల్యం’* అన్నారు. అంటే కాలం బంగారంతో సమానం… అందుకే కాలం చాలా విలువైనది… ఇది ఒక మాటగా ఉండవచ్చు. ఒక సేవగా ఉండవచ్చు. ఒక సాయంగా ఉండవచ్చు. డబ్బురూపంలో ఉండవచ్చు… ఎలాగైనా ఉండవచ్చు కానీ కాలం చాలా విలువైనది…✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

No comments:

Post a Comment