Saturday, November 11, 2023

వినాయకునికి ఇద్దరు భార్యలా ?...


🎻🌹🙏వినాయకునికి ఇద్దరు భార్యలా ?...

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿విఘ్నేశ్వరుడు బ్రహ్మచారి అని అందరికీ తెలుసు 
గజముఖుడైన వినాయకుని ఆవిర్భావం‌ 
శివ పురాణాలలో ఉంది 

🌸పార్వతీమాత పిండి బొమ్మకు ప్రాణం పోయడం 
శివుడు శిరస్సు ఖండించడం --
ఏనుగు తల అతికించడం --
ప్రమథగణాలకు ఆధిపత్యం  -- అనే ఈ కథ  భారతదేశం అంతటా బహుళ ప్రచారం పొందింది 

🌿తెలుగు కవి నన్నెచోడుడు 
" కుమార సంభవం " కావ్యంలో --
పార్వతీపరమేశ్వరుల లీలావినోదంగా
గజరూపంలో క్రీడించగా గజముఖుడు
జన్మించాడు అని చెప్పారు 

🌸విఘ్నేశ్వరుడు ఆకాశం నుండి
ఆవిర్భవించాడనేది వరహపురాణం చెబుతుంది 
దేవకామినులను కూడా తన అందంతో భ్రమింపజేయడం వలన శివుడు గణేశునికి ఏనుగు తలను కుండ లాంటి బొజ్జను కల్పించాడు అనేది మరొక కథ 

🌿కార్త్యవీర్యార్జునుని సంహరించిన అనంతరం పరవురామదేవుడు పార్వతీపతి దర్శనార్థం
కైలాసం వచ్చాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆది దంపతులను దర్శించడం వీలుపడదని గణాధిపతి నిరోధించాడు వారిరువురి మధ్య జరిగిన యుద్ధంలో ,

🌸వినాయకుని దంతం భగ్నమయింది 
నాటి నుండి ఏకదంతుడనే నామం స్థిర పడింది అని బ్రహ్మాండ పురాణం చెబుతుంది 

🌿మూషికాసుర సంహార సమయంలో
తన దంతాన్నే ఆయుధంగా ఉపయోగించడంతో
ఏకదంతునిగా మిగిలాడని దేవి భాగవతంలో ఉంది.

🌸ఏకదంతం ద్వంద్వాతీత స్థితిని
తెలుపుతుందని వేదాత భావన 

🌿ద్వాపరయుగం నాటికి
విఘ్నేశ్వరుని ఆరాధన స్థిరపడింది 

🌸శ్రీకృష్ణుని దివ్య చరిత్రల
శ్యమంతకమణి ఉపాఖ్యానం ఉంది 

🌿అవతార పురుషులు కూడా
విఘ్ననాయకుని అర్పించవలసిందే 

🌸గణపతి వ్యాస భగవానునికి రాయసకాడయ్యాడు 

🌿చేతిలో పక్షి ఈక. రాత పరికరం.
విదేశాలలో అటువంటి శిల్పాలున్నాయి 
దీనినిబట్టి విఘ్ననాయకుడు విద్యాదాతగా ప్రసిద్ధుడు

🌸సిద్ది బుద్ది అనే భార్యలను కలిగి ఉన్నాడని చెప్తారు 
అంటే లోక కళ్యాణ కారకులయిన ఆ దివ్యశక్తులు. వినాయకుని ఆధీనంలోనే ఉంటాయని చెప్పడం అంతర్యం అన్నమాట ..స్వస్తీ..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment