[4/10 12:23 PM] Ganga Swaroop Varanasi: *ముగింపు*
____________
దూరప్రాంతం నుండి వచ్చిన ఆత్మీయుడొకడు కొంతకాలం మనతో గడిపి, అతడు తిరుగుప్రయాణం అయ్యేటప్పుడు...
వీడ్కోలు పలికే సమయంలో మనలో
ఓ సన్నటి బాధ ఉంటుంది...
అలాంటి సమయాల్లో బాధ లేకుండా ఉండటానికి, గురువుగారు దానికో నివారణా మార్గం కనిపెట్టి మాకు చెప్పారు...
అది ఏమంటే-
భుజాన బ్యాగు తగిలించుకుని గడప వద్ద కనబడిన తొలిదృశ్యంలో ఉన్న ఆ ఆత్మీయుణ్ణి, తిరుగుప్రయాణమయ్యేటప్పుడు బ్యాగు తగిలించుకుని శెలవు తీసుకుని వెళ్లే చివరి దృశ్యంగా చూడడమే...
అలా ముగింపును ప్రారంభంలోనే చూడడం వలన ముగింపు అనేది అంత బాధాకరంగా ఉండదు అంటారు గురువుగారు.
"అతడు సద్గురువు" అని అతని చెంత చేరవద్దు.
"అతడు కపట గురువు" అని చేరు.
సద్గురువే అయితే ఇబ్బంది లేదు.
ఒకవేళ కపటగురువైతే, ఎలాగూ మనం ముందుగానే అతడు కపటి అనే భావంతోనే చెంత చేరాం కనుక అంతగా మనసు బాధించందు.
ఇలా అన్ని విషయాల్లోనూ వ్యతిరేకస్థితులకు సిద్ధంగా ఉంటే, ఆ తరువాత పరిస్థితులు ఎలా మారినా సరే మానసిక ఘర్షణ ఉండదు.
ఇది negative thinking గా కనిపించే positive thinking అన్నమాట.
* * *
మన జీవితమూ అంతే మరణమనేది క్రొత్తగా రాదు.
Already మనం పుట్టినప్పుడే మరణం మొదలయ్యింది...
సాంబ్రాణిపుల్ల కొద్దికొద్దిగా కాలుతూ ఉన్నట్టు...
ఈ జీవితం, ఈశరీరం కూడా కొద్దికొద్దిగా తరుగుతూ చివరికి శ్మశానంలో కాలి ముగుస్తుంది.
గురువుగారి శిష్యుడు కుమారస్వామి ఎవరో చనిపోయిన వార్తను గురువుగారికి చెప్పినప్పుడు,
మనం మాత్రం బ్రతికున్నామా కుమారస్వామీ....! అన్నారు.
Already మనం మరణించే ఉన్నాం అని తెలిసినప్పుడు, మరణభయం పోతుంది.
అందుకే ఉపనిషత్ ఋషులు మృత్యోర్మా అమృంతంగమయ....అని ప్రార్థించారు.
మృత్యువులో ఉన్న మమ్ము అమృతతత్త్వంలోకి తీసుకెళ్లు...అని.
రమణులు మరణించి జీవించారు కనుకనే
మరణసమయంలో కూడా సంపూర్ణ ఎఱుకతో "నేనెక్కడికి పోగలను?" అనని భక్తులకు అభయప్రదానం చేశారు.
మరణించేది ఎప్పుడూ మరణించే ఉంటుంది.
జీవించేది ఎప్పుడూ జీవించే ఉంటుంది.
అని తెలుసుకున్నారు కనుక ఆ మాట అనగలిగారు.
గతాన్ని స్మరించడం కంటే
భవిష్యత్తును ఊహించడం కంటే
ఈ రెంటితో కలుషితమైన వర్తమానంలో ఉండడం కంటే,
'ముగింపు'తో ఉండడం హాయి అయిన విషయం.
గురువుగారనేవారు-
ఈ ధ్యాన కేంద్రాలలో కూర్చొని సాధన చేయడం కంటే
శ్మశానంలో సమాధి అరుగులపై కాసేపు గడపడం మంచిది.
ఆ సమయం నీకు ఎన్నో జీవితసత్యాలను ప్రబోధిస్తుంది... అంటారు.
ధ్యానంలో ఎందుకంత ప్రశాంతత వస్తుంది?
ధ్యానం అనేది మనసుకు ముగింపు ప్రదేశం కనుక.
సద్గురుసన్నిధిలో ఎందుకంత ప్రశాంతత ఉంటుంది ?
సద్గురుసన్నిధి అనేది మన ఆధ్యాత్మికాన్వేషణకు ముగింపు ప్రదేశం కనుక.
* * *
ఏ వస్తువును చూసినా, ఏ వ్యక్తిని చూచినా వాని 'ముగింపు'ను(అశాశ్వతత్వాన్ని) కను.
అప్పుడు నీతో సహా అందరూ కదిలే శవాల్లా కనిపిస్తారు.
నిజానికి కూడా అందరూ కదిలే శవాలే.
అలా చూడగలిగేవాడు శివుడే అయి ఉంటాడు.
ఆ రుద్రునికి భూమి అంతా రుద్రభూమియే(శ్మశానమే) అవుతుంది.
శివుడు శ్మశానవాసి అంటే దాని అర్థం ఇదే.
"ముగింపు దేవుడు" శివుడు.
"ముగింపు జీవుడు" గురువు.
శివ నివాసం - శ్మశానం.
గురు నివాసం - సత్సంగం.
శ్మశానం, సత్సంగం రెండూ ముగింపు ప్రదేశాలు.
శివుడికి, గురువుకి తేడా లేదన్నది అందుకే.
* * *
రోజుకి ముగింపు - నిద్ర.
జీవితానికి ముగింపు - మరణం.
జీవికి(జన్మపరంపరకు) ముగింపు - జ్ఞానం.
* * *
సద్గురు సత్సంగం అంటే
అది శాస్త్రశోధనకు ముగింపు.
సద్గురు పాదలను స్పర్శించడం అంటే
అది ఆధ్యాత్మికాన్వేషణకు ముగింపు.
చదివి, మూసేవేయబడిన పుస్తకం - గురువు.
తీరం చేరి ఆగిపోయిన పడవ - గురువు.
* * *
"మనసొక మిథ్య" అనే UG పుస్తకానికి తన మిత్రుడైన టెర్రీ న్యూలండ్
ముందుమాట వ్రాస్తూ ఓ మాటంటారు-
"అంతా ముగిసిపోయిన మనిషి యూజీ" అని.
ఆహా యెంత గొప్ప భావప్రకటన!!!
యెంత గొప్ప పరిపక్వత!!!
యెంత గొప్ప మిత్రుడు!!!
అని అనిపించింది నాకు....
ఆ ఒక్క మాటతో మిగతా పుస్తకంలోని సారమంతా తెలిసిపోయినట్లైంది.
అంతా ముగిసిపోవడమే ముక్తి.
అలా సద్గురు సన్నిధిలో అంతా 'ముగిసిపోయిన మనుష్ గుమికూడుతారు.
* * *
ఒకసారి జ్ఞానప్రసూనాలు ప్రూఫ్ దిద్దుతుంటే
'రమణ సత్సంగం' అనేచోట 'మరణ సత్సంగం' అని ఉంది....
DTP వర్క్ చేసిన గుణభూషణ్-
"అయ్యో మీరు చూడకుంటే చాలా పొరపాటు అయి ఉండేది..."అన్నాడు.
నేనన్నాను...."పొరపాటు అయినా సరే మేం దానిని పొరపాటుగా తీసుకోము...
రమణానుభవం అంటే మరణానుభవమే....
నిజం చెప్పాలంటే రమణ సత్సంగం కంటే మరణ సత్సంగం పేరే సరియైనది..." అన్నాను.
అతను విచిత్రంగా చూశాడు నా వైపు.
బ్రతికి చచ్చేవాడు - అజ్ఞాని.
చచ్చి బ్రతుకువాడు - జ్ఞాని.
అని గురువుగారన్నారు.....
జీవించి ఉండగానే మరణానుభవం కలగడమే ఆధ్యాత్మిక ఏకైక లక్ష్యం.
ఆ మరణానుభవానికి UG గారు calamity "విపత్తు" అని పేరు పెట్టారు.
"క్రొత్తగా పుట్టాలి..." అంటారు
గురువుగారు
అంటే మరణించి క్రొత్తగా పుట్టాలా? అడుగుతాడు శిష్యుడు...
"కాదు...మారు మనస్సు పొందటం" అంటారు ....
ఆ మారు మనసు పొందటాన్నే మోక్షం అన్నారు.
మారుమనసు పొందడానికి మనసు పడే వేదనే calamity.
అనస్తీషియా ఇవ్వకుండా చేసే ఆపరేషన్ లాంటిదే UG చెప్పిన calamity....
శిశువును ప్రసవించేటప్పుడు తల్లి పడే ప్రసవ వేదన లాంటిదే calamity.....
రమణుడు తన 16 వ యేట మేడపై గదిలోన పొందిన మరణానుభవమే calamity....
ఆ calamity ఎలా సంభవిస్తుంది?
అది కలగాలంటే ఏం చేయాలి? అని మాత్రం ప్రశ్నించకండి....
"అది" సంభవిస్తుంది...అంతే.
* * *
యూజీ అంటే సమస్తం సర్వార్పణం.
వదలాల్సిందిగానీ, చేయాల్సిందిగానీ, మారాల్సిందిగానీ ఏమీ లేదంటూనే వంగిన మన నడుములపై ఘనమని అనాదిగా మోస్తున్న విలువైన మూటల్ని ఊడదీయించి ఒక్కో వజ్రాన్ని గులకరాయిగా చూపి పారేయిస్తాడు మనతోనే. ఊత కర్రల్ని తన్నేసి 'భయం లేదు, నిటారుగా నడువ'మంటాడు.
ఉన్న బరువును దించేవాడు యూజీ...
క్రొత్తగా బరువును చేర్చనివాడు యూజీ...
నీకు తెలిసినదాన్ని బద్దలు కొట్టేవాడే యూజీ...
కొత్తదానితో భర్తీ చేయడు యూజీ...
కొత్త చిట్కాలు...
దగ్గరి మార్గాలు...
క్రమశిక్షణలు కాదు...
కొత్త తగులాటంలోకి వెళ్ళకుండానే...
నీ నమ్మకాలు చెదిరి పోవడానికి...
నీకు నీవు ముక్కలు కావడానికి...
నీకు నీవు లేకపోవడానికి...
నీవు సిద్దంగా ఉన్నావా?
అప్పుడే యూజీ తత్త్వాన్ని టచ్ చేయి...
ఇది అన్ని ఇతర మార్గాలకు మించిన మార్గం కాదు...
ఇది పూర్తిగా మార్గాలకు బయట ఉంది...
యూజీ ప్రస్తుతస్థానంలో ప్రత్యామ్నాయాన్ని చూపడు...
కానీ మానవ విశ్వాసాల మూలాలలోకి వెళ్లి...
అతను విశ్లేషించే తీరును నీవు చూడగలిగితే... జీవితం గురించి నీవనుకొంటున్న మహోన్నత భావాలు...
బలవంతంగానైనా వదిలించుకునేందుకు ప్రయత్నిస్తావు...
ఇలా నీవు కొంత వరకు వెళ్ళగలిగితే...
నీ జీవితాన్ని ఏ ప్రయత్నం లేకుండానే...
సాధారణంగా ఎలా ఉండవచ్చునో...
తెలుసు కోవడానికి అవకాశం ఉంటుంది... ఎందుకంటే విలువలచట్రాన్ని ఎక్కువకాలం మోయలేవు...
కొత్త నమ్మకాల వైపు...
మతాల వైపు...
నిన్ను మళ్ళించడానికి యూజీ ఏమాత్రం ఆసక్తి చూపడు...
అపూర్వమైన దృష్టికోణాన్ని ఇస్తాడు...
నిన్ను సరైన వ్యక్తిగా తయారు చేయడానికి...
ఏమాత్రం ప్రయత్నించడు...
నిజానికి నీలో మార్పే అవసరం లేదంటాడు... మారాలని ఎడతెగని ప్రయత్నం చేయడం...
నీ విషాదం అంటాడు..
"మారటం" అంటే...
ఎవరో నమూనాగా...
నీవు ఉండాలనుకొంటున్నావు...
అని ఎగతాళి చేస్తాడు యూజీ...
_____________________
"ముగిసినమనిషి" నిట్టూర్పులు
_____________________
1. ఆలోచనే నీ శత్రువు.
2. ఏదీ తెలియని స్థితే నీ సహజ స్థితి.
3. నీ లోంచి నీ గతాన్ని తోసి పారేయ్.
4. భయపడకుండా
నిన్ను నీవు వదిలేసుకొని ఉండు.
5. ఫిర్యాదు ల్లేకుండా
స్వీయ ఆలంబనలో ఉండు.
6. వదిలేయ్, ఊరకే ఆగిపో.
వెతకడం ఆపు.
7. అవగాహన అంటే తప్పక అవగాహన
చేసుకోవాలన్న కాంక్ష లేకపోవడమే.
8. నువ్వు నువ్వుగా ఉండడం చాలా తేలిక.
అందుకు నీవేమీ చేయనవసరం లేదు.
ఏమీ ప్రయత్నించనవసరమూ లేదు.
కాని నీవున్నట్టు కాక మరోలా కావాలనుకోవడానికి
నీవు చాలా చేయాల్సి ఉంటుంది.
9. నీతో నీవు శాంతిగా ఉండాలని చేసే
ప్రతి యత్నమూ అప్పటికే అక్కడున్న శాంతిని
ధ్వంసం చేస్తోంది.
10. ఏకాకివై నిలవగల
ధైర్యం తెచ్చుకో.
11. ఓ ఆలోచన పుట్టిన ప్రతిసారీ
నీవు పుడుతున్నావు.
12. విషాదమెరుగని ఆనందం
అసహజం.
13. నీకు తెలియంది ఎప్పుడూ నీ అనుభవానికి రాదు.
దేన్నయినా అనుభవించాలంటే అది నీకు తెలిసి ఉండాలి.
14. తమ స్వంత దృష్టితో
అన్నింటినీ కొలవడమే 'మాయ' అంటే.
15. నీ పరిమితుల్ని తెలుసుకోవడమే వివేకం.
16. నీవు ఉన్నట్టుగా కాక
మరోలా ఉండాలనుకోవడం వల్లనే
నీవెప్పుడూ యాతన పడుతుంటావు.
17. ఇతర మార్గాలన్నింటినీ తిరస్కరించినప్పుడే
నీ స్వంత మార్గాన్ని కనుక్కోగలవు.
18. ఏమీ తెలియనప్పుడు చాలా మాట్లాడుతావు.
ఏ కాస్తయినా తెలిస్తే
అక్కడ మాట్లాడడానికేముంది?
19. ఓ సామాన్య వ్యక్తిగా ఉండడం
మహా కష్టతరమైన సంగతి.
20. అవగాహన అంటే
తప్పక అవగాహన చేసుకోవాలన్న కాంక్ష
లేకపోవడమే.
21. నువ్వు నువ్వుగా ఉండడం చాలా తేలిక.
అందుకు నీవేమీ చేయనవసరం లేదు.
ఏమీ ప్రయత్నించనవసరం లేదు.
కాని నీవున్నట్టు కాక మరోలా కావాలనుకోవడానికి
నీవు చాలా చేయాల్సి ఉంటుంది.
22. నీతో నీవు శాంతిగా ఉండాలని చేసే
ప్రతి యత్నమూ అప్పటికే అక్కడున్న శాంతిని
ధ్వంసం చేస్తోంది.
23. నీవు నీ సమాజపు ఆలోచనలే ఆలోచిస్తావు.
సమాజపు భావాల్నే భావిస్తావు.
సమాజపు అనుభవాల్నే అనుభవిస్తావు.
కొత్త అనుభవమేదీ లేదక్కడ.
24. ఏదో ఒకటి 'చేయడం' అనేదానికి
ముగింపు పలక్కుండా మీరింకేదో చేస్తున్నారు.
అదే వచ్చిన చిక్కంతా.
25. ప్రతి ఒక్కరినీ తన నమూనాలో ఇమడ్చాలని
బలవంతం పెట్టే మీ విలువల వ్యవస్థే
మానవకోటి దుఃఖానికి హేతువు.
26. ఆశే నిన్ను కొనసాగిస్తుంది.
27. నిజానికి గతంలో ఎవ్వరూ తాకని చోట
జీవితాన్ని నీవు స్పృశించాలి.
దాన్ని నీకెవ్వరూ బోధించలేరు.
28. సుఖానికై నీ అన్వేషణ
దుఃఖాన్నే కొనసాగిస్తుంది.
29. నీకు నీవు భరోసానిచ్చుకోవడం కోసం
ఓ లక్ష్యాన్ని కల్పించుకున్నావు.
30. నీకు భయం నుంచి ముక్తి పొందే భాగ్యమే అబ్బితే అప్పుడింక భగవంతుడే ఉండడు.
31. నిజమైన 'గురువు' అంటూ ఒకడుంటే
మిమ్మల్ని తన నుంచి ముక్తుణ్ణి చేస్తాడు.
32. మీరు వెతుకులాట ఆపరు.
ఎందుకంటే అట్లా ఆపడం
మీకు అంతమవుతుంది కాబట్టి.
33. మీరు వెతుకుతున్నారు. కనుకనే
మిమ్మల్ని మీరు పోగొట్టుకున్నారు.
34. జ్ఞానం అంటే అన్నింటినీ గుర్తించి
పేర్లు పెట్టడం మాత్రమే.
35. నేను చెబుతున్న దాన్నుంచి
మీరు తయారుచేస్తున్నదాన్ని
ఆపడానికి ప్రయత్నిస్తున్నాను.
36. అసలు మనసే ఓ మిథ్య.
ఆ మిథ్యా మనసు కనిపెట్టిందే
'ఆధ్యాత్మికత'.
37. ఏదైనా జరగాలంటే
ముందు అన్వేషణ ముగిసిపోవాలి.
38. ఎంత సన్నిహితుడని మీరనుకునే వ్యక్తినుంచయినా సరే, మీరు ఒక్క మాట కూడా వినలేరు. మీరు సదా వినేది మీ స్వంత అనువాదాల్నే.
39. దైనందిన విషయాల పట్ల, మీ చుట్టూ జరిగే వాటి పట్ల ఆసక్తి లేనందునే మీరు అతీతం, కాలరహితం, దైవం, సత్యం, వాస్తవత్వం, జ్ఞానోదయం మొదలైన వాటిని కల్పించుకొని వాటికోసం వెతుకుతున్నారు.
40. ఓ వ్యక్తిని తన సహజస్థితిలోకి ఏది తీసుకొస్తుందో, ఇంకొకర్ని అలా ఎందుకు తీసుకురాదో నాకు తెలీదు. బహుశా అది జీవకణాల్లోనే వ్రాసి ఉందేమో.
41. ఈ సంఘమో, ఈ సంస్కృతో - నీలో నింపిన ఉత్తేజాల మూలంగా - ఈ క్షణంనువ్వు చేస్తున్న దానికన్నా ఆసక్తికరమైందీ, ఇంకా అర్థవంతమైందీ, ప్రయోజనకరమైందీ, ఇంకేదో వుందనిపించి, అలజడి పడుతున్నావు.
42. తృప్తి నెరగకుండా ఆకలి తనకు తాను పూర్తిగా మండిపోవాలి. నీ దాహం అనేది అది తీరకుండానే తనకు తాను ఆవిరైపోవాలి.
43. ఓ ప్రశాంత మనోస్థితిని కల్పించడానికి ఆలోచనా బలప్రయోగంతో నీవు చేసే ప్రయత్నమేదైనా, అది హింసే.
44. అన్వేషణ కోసమై మీరు వెచ్చిస్తున్న శక్తి, మీరు జీవించడానికి అవసరమైన శక్తిని హరించివేస్తోంది.
45. సమస్త మానవాళి అనుభవాన్నీ నీలోంచి విసిరివేయగలిగితే తప్ప నీవు నీదైన విలక్షణత్వంలోకి రాలేవు. అప్పుడే నీవు నీవుగా ఉండగలవు.
46. అసలు నీ ప్రజ్ఞ ఏ మాత్రం లేకుండానే నిద్రలో నీ శరీరం ఎన్నిసార్లు అటూ ఇటూ సర్దుకుంటోంది? దేహం తన్ను తానే దిద్దుకుంటుంది.
47. ప్రశ్నించడం వివేకానికి గీటురాయి కాదు.
ప్రశ్నించడం ఆగిపోవడమే వివేకం.
48. మానవజాతి పోగు చేసుకున్న సమస్త విజ్ఞానం, అనుభవం, విషాదం అన్నీ నీలో ఉన్నాయి. నీలో ఓ పెద్ద భోగిమంట వేసుకోవాలి. అప్పుడే నీవో స్వతంత్ర వ్యక్తివవుతావు. వేరే మార్గమే లేదు.
49. నీ తల్లిదండ్రుల రతిక్రియ ఫలితంగానే నువ్వు జన్మించి, జీవిస్తున్నావు. అంతే. జీవితానికేదో పరమార్థం వుందని ఆశించకు.
50. నీవు ఎలా ఆలోచిస్తున్నావో, ఎలా భావిస్తున్నావో, ఎలా అనుభవిస్తున్నావో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అదే మార్గంలో ఆలోచిస్తున్నారు. అలానే భావిస్తున్నారు. అలానే అనుభవిస్తున్నారు.
51. దేన్నయినా మార్చడానికి చేయవలసింది ఏమీలేదు. అన్నీ వాటి స్వంత మార్గంలో అవే మారుతున్నాయి.
52. తప్పొప్పులు, మంచి చెడులనే ద్వంద్వ విభజనలో ఇరుక్కోనంత వరకు నీవు ఏ తప్పూ చేయవు. ఈ ద్వంద్వాలలో ఇరుక్కున్నంతకాలం నీవెల్లప్పుడూ తప్పు దారినే పట్టే ముప్పు ఉంది.
53. నన్ను ఆదర్శంగా తీసుకొమ్మనిగాని లేక నా అడుగుజాడల్ని అనుసరించమని గాని నేనెవ్వరికీ, ఎప్పటికీ సూచించను.
54. మనిషి మతాన్ని సృష్టించుకున్నాడు.
అది తనకు ఓ ముసుగునిస్తుంది కనుక.
55. కళాకారుడు కూడా ఇతర వృత్తి నిపుణుల్లానే ఓ నిపుణుడు. అతడు పనిముట్టును ఉపయోగించి, తన్ను తాను వ్యక్తం చేసుకుంటాడు. 'కళ' అనబడేదంతా ఇంద్రియాత్మక చలనమే.
56. వినయం అనేది ఓ కళగా సాధన చేసేది. అసలు వినయం అనేదేమీ లేదు. నీకు ఏదైనా 'తెలిసి' ఉన్నంతకాలం 'వినయం' అన్నది ఉండదు. ఆ తెలిసినది-వినయమూ ఒకేసారి కలసి ఉండలేవు.
57. ఎంతటి అసాధారణ అనుభవాలైనా సరే
ఇంద్రియ స్పందనల పరిధిలోనే ఉన్నాయి.
58. లోకంలోని కోట్ల జనాభాలో నీలాంటి వాడింకెక్కడా లేడు. ప్రతి వ్యక్తీ పరిణామ ప్రక్రియచే సృజింపబడిన అసాధారణ జీవే.
59. హిందూయిజం అనేది మతం కాదు;
అది వందలకొద్దీ దుకాణాలుండే బజారు లాంటిది.
60. అవతారపురుషులు అనబడేవారిని ఆదర్శంగా తీసుకొని అనుసరించడం వల్ల, విలక్షణ వ్యక్తుల్ని విరజిమ్మగల సృష్టి సామర్థ్యాన్ని నాశనం చేసుకున్నాం.
61. ఈ భూమ్మీద తక్కిన వాటి కన్నా మనమేమీ అధిక ప్రయోజనకారులమో లేక ప్రజ్ఞావంతులమో కాదు. ఇక్కడున్న చీమలకన్నా, మన చుట్టూ ముసిరే ఈగలకన్నా, మన రక్తం పీల్చే దోమలకన్నా వేరే ఏ గొప్ప ఉద్దేశంతోనో మనం సృష్టింపబడలేదు.
62. నీకు నీవు విధించుకున్న వైరాగ్యదీక్ష ద్వారా నీ ప్రజ్ఞని విస్తరించుకుని తద్వారా ఆనందంగా ఉండాలనుకుంటావు. ఆ అవకాశమే లేదు.
63. నీవో యంత్రానివైపోవాలి.
నీవు చేస్తున్న పనుల ముందుగానీ,
అవి జరుగుతున్నప్పుడు గానీ, జరిగాక కానీ
ఎన్నడూ ప్రశ్నించకుండా యాంత్రికంగా మసలుకోవాలి ఈ లోకంలో.
64. ఏదో ఒకటి తిరిగివ్వకుండా సమాజం నిన్ను పోషించదు.
అది, వాళ్ళు కోరేదే ఇవ్వాలి తప్ప నీవేమి ఇయ్యాల్సి ఉందో అది కాదు.
65. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనప్పుడే
జీవితం అర్థవంతమవుతుంది.
66. అస్తిత్వపు మర్మాలను అర్థం చేసుకోవాలనే బలీయమైన మర్మాలను అర్థం చేసుకోవాలనే బలీయమైన వాంఛ విధ్వంసకరం. ఆ రహస్యాల్ని అలానే వదిలేయ్.
67. శాశ్వతమైనదేదో ఉండి తీరాలని మనమపేక్షిస్తాం.
ఈ మతగురువులమ్మే చిల్లర సరుకంతా అదే.
వాళ్లు మీకు శాశ్వతానందాన్ని అమ్మజూపుతారు.
68. బతకడానికి అవసరమైన తెలివితేటలు,
భౌతికజీవుల నిర్మాణంలో సహజంగా ఉన్నాయి.
కొత్తగా నీవేమీ నేర్చుకోనవసరం లేదు.
69. ఆనందంగా ఉండే క్షణాలూ ఉంటాయి.
విచారంగా ఉండే క్షణాలూ ఉంటాయి.
కానీ శాశ్వతానంద స్థితిలో ఉండాలనే అపేక్ష,
దేహానికి శత్రువవుతుంది.
70. ఉన్న మాటేమిటంటే, మీకే సమస్యా లేకపోతే
మీరే ఓ సమస్యను సృష్టించుకుంటారు.
సమస్యే లేకపోతే అసలు జీవిస్తున్నట్లు మీకనిపించదు.
71. నిస్వార్థపరుడవడం కోసం
ఏదో చేస్తున్నంతకాలం
నీవో స్వార్థపరుడుగానే మిగిలిపోతావు.
72. ఓ సహజమానవుడుగా సమాజానికేమీ పనికిరాడు.
పైగా అందుకు విరుద్ధంగా అతడో ప్రమాదకారి అవుతాడు.
73. ఏదో తనకి తాను వ్యక్తమవ్వాలని యత్నిస్తోంది. కాని, సంస్కృతి దాన్ని అణిచేస్తోంది. ఆ సంస్కృతిని ఒకసారి బయటికి నెట్టగలిగితే, ఇంక తనను తాను తనదైన రీతిలో వ్యక్తపరుచుకుంటుంది.
74. ఆదర్శం సమస్తాన్నీ తప్పుదారి పట్టించింది.
పరిపూర్ణ వ్యక్తి అనబడేవాడు ఎక్కడా లేడు.
75. నీతిమంతుడనబడేవాడు ఉత్త భయస్తుడు, పిరికిపంద. అందుకే అతడు నైతికతను సాధన చేస్తూ, ఇతరులపై నీతి తీర్మానాలు చేస్తూ కూచుంటాడు.
76. సద్గుణు సాధనే లక్ష్యంగా ప్రాకులాడే తత్వం నించి ముక్తుడయ్యే భాగ్యశాలివైతే, దుర్గుణాలు కూడా దాంతోపాటే నీ వ్యవస్థ నుండి నిష్క్రమిస్తాయి.
77. నీవూ, నేనూ పోయినా జీవశక్తి కొనసాగుతుంది. ఆ దీపాలు ఆరిపోతాయి కాని, విద్యుచ్ఛక్తి కొనసాగుతూనే ఉంటుంది.
78. ఏది నాకు సత్యమో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తెలియజేయడం అసాధ్యం. ఇక్కడున్న నిశ్చితత్వం మరొకరికి ప్రసరింప సాధ్యం కానిది. అందుచేత ఈ గురు వ్యాపారమంతా నిశ్చయంగా పనికిమాలిన చెత్తే.
79. నేను చెప్పదలచేదేమంటే, ఏదో ఒకటి నీకు నీవే కనుక్కోవాలి. కాని, నీవు కనుక్కున్నది సమాజానికి ఉపయోగపడుతుందనో, ప్రపంచాన్ని మార్చడానికి పనికివస్తుందనో పొరబడకు. సమాజంతో నీకు తీరిపోయింది. అంతే.
80. ఉన్నది ఒకే ఒక ఆలోచన. ఆ ఒక్క ఆలోచనకు ముడిపడే ఉన్నాయి. అదే 'నేను' అన్న ఆలోచన. దాని ఆధారంగా నీవు పొందే ఏ అనుభవమైనా భ్రమే.
81. నీ మనసు, నా మనసు అంటూ ఏమీ లేదు.
ఉన్నది కేవలం 'మనస్సు'.
మానవుడు తెలుసుకున్నదీ, భావించినదీ, అనభవించినదీ, తరతరాల నించి సంక్రమింపచేసుకున్నదంతా కలసి, సమస్తమూ అదే.
82. ఏ ఊహా లేకపోవడం
ఏ ఇచ్ఛా లేకపోవడం
ఏ ప్రయత్నమూ లేకపోవడం
ఏ దిశగా అయినా సరే, ఏ స్థాయిలోనైనా సరే,
ఏ పరిమాణంలోనయినా ఎలాంటి చలనమూ లేకపోవడం -
అదీ అసలు విషయం.
83. అలవోకగా ఉండటాన్ని ప్రయత్నంతో సాధించడమనేది యుద్ధంతో శాంతిని సాధించడం లాంటిదే.
84. సాధన ఆపడం నిజంగా ధైర్యం.
నీలోని సంప్రదాయానికి ముగింపు పలకడం నిజంగా ధైర్యం.
85. ఉన్న పరిస్థితి నుంచి తప్పించుకోచూడడమే
అసలు నీకు చిక్కుల్ని తెచ్చి పెడుతోంది.
86. నీవు దివ్యమని, పవిత్రమని భావించేది కూడా
ఆ చైతన్యంలో కల్మషమే.
87. జ్ఞానోదయం పొందిన వ్యక్తి
ధృవతారలా వెలుగుతూ ఉంటాడు.
అలాంటి వ్యక్తిని నీ కొలపాత్రల క్రింద దాచలేవు.
88. నీ మౌలిక అవసరాల్ని నిరాకరించుకోవడం
ఆధ్యాత్మిక లక్షణం కాదు.
కాని కూడు-గుడ్డ-కూడులను మించి ఆశించడం
మాత్రం మనోవైకల్యమే.
89. మనసు, శరీరాల మధ్య విభజన తొలగిపోవాలి.
నిజానికి విభజన లేదు.
ప్రతి జీవకణానికి తనదంటూ ఓ మనస్సు ఉంది.
90. జీవితమంతా ఓ గొప్ప సుదీర్ఘ స్వప్నం.
దీనికెక్కడా వాస్తవికత లేదు.
91. మీరు ఈ పోల్చడాలన్నీ ఆపితే అక్కడుండేది
మీ సహజస్థితే. అప్పుడింక మీరు ఎవర్నీ వినరు.
92. 'సహజస్థితి' అకారణం.
అది యాదృచ్ఛికంగా కలుగుతుంది. అంతే.
93. ఆలోచించడం మాని
జీవించడం మొదలుపెట్టు.
94. మానవుని సారవంతమైన
ఊహాకల్పిత వస్తువే
భగవంతుడు.
95. నీవు జీవించి ఉన్నప్పటి కంటే
మరణించిన తరువాతే
ప్రకృతికి ఎక్కువ ఉపయోగపడతావు.
96. ఈ ప్రపంచాన్ని కమ్మేసిన
ఆధ్యాత్మిక, మతకాలుష్యంతో పోలిస్తే
వాతావరణ కాలుష్యం చాలా తక్కువ హానికరం.
97. మీరు రక్షకుల నుండి రక్షింపబడాలి.
ముక్తిదాతల నుండి విముక్తులు కావాలి.
98. ఏమీ చేయకపోవడం అనేది
ఏమీ చేయడం కంటే భిన్నం కాదు.
99. మృత్యువే అమృతత్వాన్నీ
ఎరిగి ఉన్నదే ఎరుగని దాన్నీ
కాలమే కాలరాహిత్యాన్నీ
ఆలోచనే ఆలోచనారాహిత్యాన్నీ సృష్టిస్తాయి.
100. అసలు చూసేవానికి ఉనికి లేదు.
చూడబడే వస్తువే చూసేవాడిని సృష్టిస్తోంది.
ఇది భారతీయ తాత్త్వికాలోచన
మొత్తానికీ విరుద్ధం.
101. నా మాటలు నిరాశావాదివిగా వినిపించవచ్చు.
కాని ఓ నిరాశావాది నిజానికి వాస్తవవాది.
నిరాశావాదం ప్రపంచంలో జరుగుతున్న విషయాల్ని ఆరోగ్యకరమైన ధోరణిలో చూడడానికి సహాయపడుతుంది.
102. ఇప్పుడు నీవు చేస్తున్నదానికంటే ఎక్కువ ఆసక్తికరంగా, ఎక్కువ ప్రయోజనకరంగా, ఎక్కువ అర్థవంతంగా చేయదగ్గది మరేదో ఉంటుందని భావించినంతకాలం, నిన్ను నీవు విసుగుదల నుండి బయటపడేసుకునే మార్గమే లేదు.
103. పిల్లలకు వాళ్లెలా ప్రవర్తించాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా జీవించాలో నేర్పడానికి ప్రయత్నించే బదులు వాళ్లనుండి నేర్చుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
104. స్వార్థంతో ఉండు.
స్వార్థంలో నిలిచిపో.
అనేది నా సందేశం.
ఆత్మసాక్షాత్కారం పొందాలనుకోవడం స్వార్థం.
దాతృత్వం కూడా స్వార్థమే.
105. ప్రశ్నలన్నింటికీ సమాధానమొక్కటే.
'ప్రశ్నించడం మానండి'.
106. త్యజించడానికి మీ వద్ద ఏదో ఉందని అనుకున్నంత కాలం, మీరు దారి తప్పినట్లే.
107. బతికి ఉండడం ముఖ్యం. ఎలా జీవాంచాలి అన్నది కాదు. జీవించడం 'ఎలా' అన్న ప్రశ్నను మనం సృష్టించాం.
108. హింస పరిణామక్రమంలో ఒక అంతర్భాగం. జీవరాశి బతకడానికి హింస చాలా ముఖ్యం.
109. ఈ ప్రపంచంలో ప్రేమనేదే లేదు.
110. నేను నీకేదారీ చూపించడం లేదు, కారణం, దారనేదే లేదు కాబట్టి.
111. యాదృచ్ఛికంగా ఏదైనా జరగొచ్చు.
నీ అర్హతను బట్టి మాత్రం కాదు.
112. ఏమీ తెలియని స్థితే, నీ సహజస్థితి.
113. ఆధ్యాత్మికమని పిలవబడేది కూడా భౌతికమే.
114. బిగ్ బేంగ్ లాంటిది అసలు జరగలేదు.
సృష్టి ఒక స్థిరమైన స్థితి.
115. ఈ 'నేను' అనేది మనిషి చైతన్యం మొత్తానికి ఒక చిహ్నం.
116. వెతకడం ఎప్పుడూ తప్పుడు మార్గంలోనే నడుస్తుంది.
117. మీ దగ్గర ఇప్పటికే ఉన్న దాన్ని అడగడం హాస్యాస్పదం.
118. నీవు లేనప్పుడే అతీతం ఉంటుంది.
అసలు అనుభవంలోకి రానిదాన్ని అనుభవించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావ్?
119. ఉపనిషద్దార్శినికులు సాధన గురించి నైతికత గురించి ఎప్పుడూ మాట్లాడలేదు.
120. ఒక మోసగాడికి కూడా ఇది సంభవించగలదని
చెప్పేటంత దూరం నేనెందుకు వెడుతున్నానంటే
ఇది నా కొక్కడికే కాదు, ఎవరికైనా జరగొచ్చు అని నొక్కి చెప్పడానికి.
నైతిక విలువలతో దీనికి ఏ సంబంధం లేదు.
121. నాలో నీలో అక్కడ తోటలో ఉన్న నత్తలో
ఆ బయట ఉన్న వానపాములో పని చేస్తున్న
ఈ చైతన్యం(consciousness) ఒక్కటే.
122. నేను మానవాళి రక్షకుడిని కాను...
నేనీ మతవ్యాపారంలో లేను...
కేవలం దీన్ని (సహజస్థితిని) వర్ణించడంపైనే నాకాసక్తి.
మీ ఊహల్లో తప్ప ఉనికే లేని స్థితి కోసం
మీరు చాలా శక్తిని, కాలాన్ని వృధా చేసుకోవద్దని
మిమ్మల్ని నేను ఒప్పించగలననుకుంటాను.
* * *
[4/10 12:38 PM] Ganga Swaroop Varanasi:
No comments:
Post a Comment