220223k2143. 230223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
విచిత్ర బంధాలు
➖➖➖✍️
*విపర్యయ వ్యామోహాలు __!!*
*కంటికి రెప్పల్లా బిడ్డల్ని కాపాడుకోవడం చివరగా వారు అంటించే అగ్నిలో కాలి బూడిదై పోవడం..!*
*ఆస్తిపాస్తు లంటూ క్షణం తీరిక లేకుండా శ్రమించి సంపదను ప్రోగుచేయడం *
*ఆ ఆస్తుల కారణంగానే ఆత్మీయు లనుకున్నవారు మరణించినా మేము ముఖం చూడము" అని దూరంగా పారిపోవడం !!*
*ఎవరు విషయంలో నైనా ఇవి మామూలే!*
*ఎన్నడైనా ఇవి వాడిపోయే పూలే..!*
*ఎన్ని ఉన్నా ఎందరున్నా ఏవీ ఎవరూ కూడా తోడు రారు! అనే వివేకం మనిషికి రావడం లేదు.*
*పైగా నీడలన్నీ నిజాలుగా గోచరిస్తాయి !!*
*మరణంతో ముగిసిపోయే బాంధవ్యాలను పెనవేసుకొని మనిషి మురిసి పోతున్నాడు *
*కేవలం అవసరాలను మాత్రమే తీర్చి అసంతృప్తిని మిగిల్చిపోయే ధనాన్ని _ ప్రోగు చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు !!*
*చేసే ఉద్యోగంలో సమస్యల ఉద్వేగం తప్ప సుఖశాంతులు లేవని తెలుస్తున్నా హోదాను మననం చేసుకుంటూ .. మరిగిపోతూ ఉంటాడు.*
*"తొండ పరుగు కంచె వరకే" అన్నట్లు _ ఈ అప్రస్తుత, అసందర్భ ప్రవర్తన లన్నీ _తుదిశ్వాస వరకే !!*
*తెర పడిందా !*
*మళ్ళీ నాటకం మొదలుకొస్తుంది..!*
*కాకపోతే _ప్రదేశము ‘కాలము, రంగస్థలము’ మారుతుంటాయి అంతే!*
*ఇదంతా ‘మాయాకార్యము’. మాయలో ఉన్నంతవరకు ఈ వేదనలు తప్పవు *
*మాయను దూరం చేసి… మహిమను సమీపించన వారికే బాధలు తీరుతాయి; బరువులు తగ్గుతాయి*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
No comments:
Post a Comment