Tuesday, November 7, 2023

నామస్మరణ

 0210.        1-2.    240223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                *నామస్మరణ*
                ➖➖➖✍️


*ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం  ఈ నాల్గింటిని "అంతఃకరణ చతుష్టయం" అంటారు.*

*వీటిని  విడివిడిగా చెప్పబడినా ఇవి, 'మనసు' అనే ఒకే పదం.*

*అంటే, మనసు పేరుతోనే ఇవన్నీ పనిచేస్తాయి.*

*మనసు చంచల స్వభావం కలది. మనసును నిశ్చలస్థితికి తేగలగాలి. అది తనంత తానుగా పని చేయలేదు. మనసుకు ఒక ఆధారం చూపించాలి.*

*దానితో కలిసిపోయే ఆధారం కన్నా, దానిని నిలువరించే ఆధారం కావాలి.      ఆ ఆధారమే శాశ్వతమైన*    
*"భగవన్నామ_స్మరణ!*

*నామస్మరణ మొదలు పెట్టినప్పుడు మనసు పారిపోతుంది.*
*లేపాలని, ఆపాలని చూస్తుంది.            గోల చేస్తుంది.*

*నామస్మరణను వదలకుంటే మనసు తానే వచ్చి చేరుతుంది, నిలిచిపోతుంది.  ఎలా అంటే...*

*ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది.*

*ఇంతలో నౌకను వదిలారు.                        నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది... దానితోనే కాకికూడా... *
*కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా... కాకి లేచింది.  కానీ, వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏదీ దానికి కనపడలేదు.*
*కనుక, తిరిగి అదే ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది.     ఇలా మరలా చేసి, చేసి చివరకు... "ఏ ఆధారం లేదు, కాబట్టి జెండా మాత్రమే ఆధారం" అని తెలుసుకొని కదలకుండా కూర్చుండిపోయింది.*
**దీనినే "నౌకాగ్రకాక న్యాయం" అంటారు.*

*అలానే మనసుకు కూడా "భగవన్నామ స్మరణ"నే ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుంటే అదే మన ధ్యేయ వస్తువైనపుడు... *
*పరమాత్మ తత్త్వాన్ని మనలో భాసింపజేస్తుంది.*✍️

.                      🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment