0210. 1-2. 240223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నామస్మరణ*
➖➖➖✍️
*ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం ఈ నాల్గింటిని "అంతఃకరణ చతుష్టయం" అంటారు.*
*వీటిని విడివిడిగా చెప్పబడినా ఇవి, 'మనసు' అనే ఒకే పదం.*
*అంటే, మనసు పేరుతోనే ఇవన్నీ పనిచేస్తాయి.*
*మనసు చంచల స్వభావం కలది. మనసును నిశ్చలస్థితికి తేగలగాలి. అది తనంత తానుగా పని చేయలేదు. మనసుకు ఒక ఆధారం చూపించాలి.*
*దానితో కలిసిపోయే ఆధారం కన్నా, దానిని నిలువరించే ఆధారం కావాలి. ఆ ఆధారమే శాశ్వతమైన*
*"భగవన్నామ_స్మరణ!*
*నామస్మరణ మొదలు పెట్టినప్పుడు మనసు పారిపోతుంది.*
*లేపాలని, ఆపాలని చూస్తుంది. గోల చేస్తుంది.*
*నామస్మరణను వదలకుంటే మనసు తానే వచ్చి చేరుతుంది, నిలిచిపోతుంది. ఎలా అంటే...*
*ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది.*
*ఇంతలో నౌకను వదిలారు. నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది... దానితోనే కాకికూడా... *
*కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా... కాకి లేచింది. కానీ, వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏదీ దానికి కనపడలేదు.*
*కనుక, తిరిగి అదే ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది. ఇలా మరలా చేసి, చేసి చివరకు... "ఏ ఆధారం లేదు, కాబట్టి జెండా మాత్రమే ఆధారం" అని తెలుసుకొని కదలకుండా కూర్చుండిపోయింది.*
**దీనినే "నౌకాగ్రకాక న్యాయం" అంటారు.*
*అలానే మనసుకు కూడా "భగవన్నామ స్మరణ"నే ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుంటే అదే మన ధ్యేయ వస్తువైనపుడు... *
*పరమాత్మ తత్త్వాన్ని మనలో భాసింపజేస్తుంది.*✍️
. 🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment