060323g1329. 110323-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀డబ్బు శాశ్వతం కాదు,
*డబ్బే జీవితమూ కాదు*
➖➖➖✍️
*ఒక జడ్జి తన వృత్తినుండి పదవీవిరమణ అయ్యాక తన భార్య నుండి తనలోని భావాలను ఇలా పంచుకుంటున్నారు…*
*”లక్ష్మీ! నేను లాయర్ గా ఉన్నప్పుడు కాని జడ్జి గా ఉన్నప్పుడు కాని ఈరోజు నేను చూసిన నా చివరి కేసు లాంటిది చూడనే లేదు” అని అన్నాడు.*
*“ఏంటా కేసు?” అని ఆమె అడగగా…*
*”ఒక తండ్రి తన కొడుకు తనకు నెలకు డబ్బులు ఇవ్వడం లేదని కేసు“ అన్నాడు.*
*కొడుకుని పిలిచి … “ఏంటయ్యా నీ తండ్రికి నెలకు సరిపడ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు?” అని అడిగాను.*
*”మా తండ్రిగారు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ పొందిన వ్యక్తి. నెలనెలా ఆయనకు పెన్షన్ వస్తున్నది. బాగానే డబ్బులు ఉన్న వ్యక్తి. నా పైన ఇలా ఎందుకు కేసు పెట్టాడో అర్థం కాలేదు” అన్నాడు.*
*ఆ తండ్రి “అవును డబ్బుకు నాకు లోటులేదు, కాని నా కొడుకు నెలకు 100 రూపాయలు కానివ్వండి స్వయంగా వచ్చి అందించేలా తీర్పు ఇవ్వమ”ని అడిగాడు.*
*తీర్పు చెప్పాక ఆ తండ్రిని కలిసాను “ఎందుకయ్యా ఇలా అడిగావు” అని*
*”మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. మీరు ఇచ్చే తీర్పు కారణంగా అయినా నెలకు ఒక్కసారి మా దగ్గరకు వచ్చి మాతో గడిపి వెళ్ళగలడని ఆశ, వాళ్ళ అమ్మకు వాడంటే ప్రాణం।” అని అన్నాడు.*
*ఇలా చెబుతూ ఆయన కళ్ళు తడిచాయి.*
*డబ్బే ప్రధానం అనుకుంటారు; అంత కంటే ఎక్కువగా మనల్ని ఎదురుచూసేవారుంటారు అని గుర్తించలేము.*
*నాకెందుకో అప్పటి కన్నవారికి నేడు ఉన్న తల్లితండ్రులకి చాలా తేడా కనిపిస్తుంది.*
*మా పిల్లలు డబ్బు సంపాదించకపోయినా పర్లేదు మా కళ్ళ ముందు ఉంటే చాలు సరిపడా సంపాదన చాలు అనుకునే వారు.*
*నేడు పిల్లలు అంటే వారు విధేశాలకు వెళ్ళిపోవాలి, లక్షలు సంపాధించాలి అని కోరుకుంటున్నారు.*
*అందుకే ప్రేమ ఆప్యాయతలు బంధాలు అనేవాటికి విలువ లేకుండా పోయింది .*
*ఎవరైనా ఇవన్నీ పిల్లల నుండి ఎదురుచూస్తుంటే పిచ్చివాళ్ళను చూసినట్టు చూస్తున్నారు*
*అనురాగం ఆప్యాయత అందని ద్రాక్ష పళ్ళు కాకూడదు కనిపెంచిన తల్లిదండ్రులకు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment