Wednesday, November 8, 2023

పూర్వజన్మలో ఎవరు?

 0302.  2-6.  070323-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *పూర్వజన్మలో ఎవరు?*
               ➖➖➖✍️

*శ్రీ కృష్ణుణ్ణి కన్నతల్లిదండ్రులూ పెంచిన నందయశోదలూ పూర్వజన్మలో ఎవరు ?*
*వాళ్ళ వృత్తాంతం మనము తెలుసుకుందాం..*


*శ్రీకృష్ణునికి జన్మనిచ్చినతల్లిదండ్రుల పెంచిన నంద యశోదల పూర్వజన్మ వృత్తాంతాలు సంస్కృత భాగవతం లోనూ పోతన భాగవతంలోనూ మరికొన్ని పురాణాలలోనూ ఉన్నాయి.*

*ముఖ్యంగా సంస్కృత ఆంధ్ర భాగవతాల్ని బట్టి తెల్పుతున్నాయి*

*కన్నతల్లిదండ్రులు  దేవకివసుదేవులు పెంచినతల్లిదండ్రులు యశోద నందుడు*

*దేవకీవసుదేవుల పూర్వజన్మవృత్తాంతాలు :*

*స్వయంగా శ్రీకృష్ణుడే దేవకీదేవికి  వివరించాడు.*

*”అమ్మా! స్వాయంభువ మన్వంతరంలో  పూర్వజన్మలో నీవు పృశ్నివి వసుదేవుడు పరమ పవిత్రుడు. దైవసుతుడు అనే ప్రజాపతి ప్రజాసృష్టికోసం బ్రహ్మ ఆదేశంతో తీవ్రతపస్సు చేశారు, నన్ను12 వేలదివ్యసంవత్సరాలు ఆరాధించారు.*

*నేను వరం కోరుకోండని మిమ్ము అడిగాను.*
*మీరు నావంటి పుత్రుణ్ణి కావాలని కోరారు॥*
*వరం అనుగ్రహించి వెళ్ళాను॥*

*పిదప నేను నీ గర్భంలో జన్మించాను.*
*పృశ్నిగర్భుడనే పేరొందాను.*
*తర్వాతియుగంలో 
*అదితికశ్యపులకు పుత్రుణ్ణి అయ్యాను.*

*అప్పుడు పొట్టిగా ఉన్నందున వామనుడనీ ఇంద్రుని తమ్ముణ్ణి కనుక ఉపేంద్రుడనీ పేరొందాను.*
*ఈ యుగంలో మూడవమారు మీగర్బంలో పుత్రుడుగా అవతరించాను ఇది సత్యం!*

*నా పూర్వజన్మల్ని మీకు గుర్తు చేయడానికే ఈ విష్ణురూపాన్ని చూపాను అని వసుదేవుడు పూర్వజన్మలో కశ్యపుడు ఇతనిభార్యలు అదితి, సురస, ఈ యిద్దరే దేవకిగా, రోహిణిగా, జన్మించారు.*

*ఆ జన్మలో కశ్యపుడు సముద్రుని హోమధేనువును తెచ్చాడు.*

*సముద్రుడు తిరిగి ఇమ్మని కోరితే కశ్యపుడు నిరాకరించాడు. కోపించిన సముద్రుడు కశ్యపుణ్ణి గోపాలకుడుగా జన్మింతువు గాక అని శపించాడు.*

*అందువల్ల వసుదేవుడు కంసుని గోసంపదకు పాలకుడయ్యాడు.*


*నందయశోదల వృతాంతం :*

*వసువులు అనే దేవతలలో ధర, ద్రోణుడు, అనేవారు దంపతులు బ్రహ్మదేవుడు వీరిని భూలోకంలో జన్మించండని ఆదేశించారు.*

*అందుకు వాళ్ళు … “దేవా ! విశ్వేశ్వరుడైన విష్ణుదేవుణ్ణి సేవించేభాగ్యం ప్రసాదిస్తే అట్లేజన్మిస్తాము!” అని ప్రార్థించారు.*

*బ్రహ్మదేవుడు ఆమోదించాడు.*

*ఆ ద్రోణుడే ఈ నందుడు, ఆ దర యే ఈ యశోద!*

*శ్రీహరికూడా బ్రహదేవునిమాట మన్నించి ఈ దంపతుల్ని తల్లిదండ్రులుగా అంగీకరించి ఎంతో భక్తిశ్రద్దలతో గౌరవించాడు.*

*భగవంతుడు కొడుకుగా పుట్టాలన్నా కొడుకుగా ఒకయింట పెరగాలన్నా ఆ దంపతులు తపస్సంపన్నులూ మహాభక్తులు అయి ఉండాలి. అట్టివాళ్లని భగవంతుడు ముందుగానే ఎంచుకొని వారికి పుత్రుడై పుట్టి  వాళ్లవద్ద పెరిగి వాళ్ల ఆశయాన్ని తన ఆశయాన్ని సఫలం చేస్తాడు, సఫలం చేసుకొంటాడు.*

*’జన్మాంతర పుణ్యసంస్కారం లేనివాళ్ల గర్భంలో   భగవంతుడు పుట్టడు! భగవంతునికి జన్మయిచ్చే యోగ్యత వాళ్ళకు ఉండి తీరాలి!’ అనే గొప్పసందేశం  ఇదియే!*

*శ్రీకృష్ణుని తల్లిదండ్రుల పూర్వజన్మ వృత్తాంతాల ద్వారా లోకానికి అందించబడింది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment