Wednesday, November 8, 2023

కాటర గామ కార్తికేయుడు

 I.II.2-9. 2607. 2-6. 070323-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


         *కాటర గామ కార్తికేయుడు*
                  ➖➖➖✍️
       

*శ్రీలంక  దక్షిణాగ్రాన వుండే అటవీ ప్రాతంలో కాటర గామ వున్నది.*

*ఇక్కడ మురుగన్  ( సుబ్రహ్మణ్యేశ్వర స్వామి)కొలువై వున్న  ప్రసిధ్ధమైన, అతి ప్రాచీనమైన ఆలయం.*

*సింహాళ భాషలో "కదిర్ కంబా" అంటే 
నల్లమద్ది చెట్ల అడవి అని అర్ధం.*

*ప్రాచీన కాలంలో కాటర గామ ప్రాంతమంతా దట్టమైన నల్లమద్ది చెట్ల అడవిగా వుండేది. *

*కోయవారు  ఎక్కువగా నివసించేవారు. వారంతా శివుని కుమారుడైన మురుగన్ ని తమ  ఇష్టదైవంగా పూజించేవారు.*

*ఒకనాడు ఆ అడవిలో   ఓ వేటగాడు వేటాడడానికి జంతువులను వెతుకుతూండగా  అక్కడ ఒకచోట మురుగన్ ఆలయం అతని కంటపడింది. అది ఆ వేటగాడి పూర్వజన్మ సుకృతం.*


*ఆ ఆలయంలోని స్వామియే కాటర గామ మురుగన్. ఆ వేటగానిని
మురుగన్ ఆకర్షించాడు. మురుగన్  ను దర్శించిన మరుక్షణమే ఆ వేటగాడు
పరమభక్తుడుగా మారాడు.* 

*జంతువులను వేటాడడం మానివేసి సదా  మురుగన్ నామమే జపిస్తూ, నిత్యమూ ఆ అడవిలో ప్రవహించే మాణిక్య గంగలో స్నానం చేసి, అడవి పూలతో మురుగన్ ని భక్తితో పూజించేవాడు.*

*మాణిక్య గంగానదీ జలంతో అభిషేకించేవాడు. ఇలా ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలో కాదు వరసగా 50 సంవత్సరాలు గడిచి పోయాయి. ఎక్కడకు వెళ్ళినా ఉదయం, సాయంకాలం పూజా సమయానికి ఆలయానికి చేరుకునే వాడు. ఆరోజుతో పూర్తిగా ఏభై సంవత్సరాలు పూర్తి అవుతాయి.*

*ఆనాడు  కూడా యధాప్రకారం పువ్వులు పళ్ళు, అభిషేకజలం  తీసుకుని ఆలయానికి బయలుదేరాడు. మార్గమధ్యలో గాండ్రిస్తూ  ఒక సింహం ఆ వేటగానికి కనపడినది. వేటగానికి సింహాన్ని చూస్తే భయం కలగలేదు. గతంలోఎన్నో సింహాలనివేటాడినవాడు. వేటగాడు ధైర్యంగా దానిముందు నిలబడ్డాడు.  మరియొక సమయంలో అయివుంటే ఆ సింహాన్ని వేటాడి వుండేవాడు . కాని ఇప్పుడు దైవారాధన కోసం ఆలయానికి వెడుతున్నందువలన తన పూజకు సింహం వలన భగ్నం రాకూడదని సింహాన్ని తప్పించుకొని ఒదిగి  ఒదిగి వెళ్ళసాగాడు.  కాని ఆ సింహం వేటగానిని వదలలేదు.  మీద పడి చంపడానికి అతని మీదకు దూకి అతని  భుజాలమీద తన ముందు కాళ్ళు పెట్టి బలంగా పట్టుకొంది. సింహం పట్టులో వేటగాడు గిజ గిజలాడాడు.*

*"నన్ను ఇప్పుడు వదలి వేయి. నేను మురుగన్ ని పూజించడానికి వెళ్ళాలి.  నన్ను వదలి వేయి" అని బ్రతిమాలాడు.*

*దానికి  సింహం " నిన్ను విడువను. నీవు మా సింహ జాతిని ఎన్నోసార్లు దారుణంగా వేటాడావు.   నిన్ను వదలను, యిప్పుడే నిన్ను చంపుతాను". అని అన్నది.*

*వేటగాడు సింహం తో  "నేను 50 సంవత్సరాలు గా నిత్యం సాయంకాలం మురుగన్ సన్నిధికి వెళ్ళి పూజించడం నియమం గా పెట్టుకున్నాను. ఇంతవరకూ ఎట్టి పరిస్థితులలో స్వామి పూజ మాన లేదు. ఈనాడు మురుగన్ పూజ 50 సంవత్సరాలు ముగిసే ఆఖరి రోజు.ఈ  నాడు నేను మురుగన్ ఆలయానికి తప్పక వెళ్ళి పూజించాలి. దయతో నీవు నన్ను వదలిపెట్టు. నేను  మురుగన్ మీద ప్రమాణం చేసి చెపుతున్నాను… నేను మురుగన్ పూజ చేసిన వెంటనే ఇక్కడికి వస్తాను. తిరిగిరాగానే నీ యిష్టం వచ్చినట్లు నన్ను చంపి తినవచ్చును.  నువ్వు యిప్పుడు మాత్రం నన్ను వదలి వేయి" అని వేడుకున్నాడు.*

*అది విన్న సింహం " నువ్వు యిలా చెప్పి తప్పించుకోవాలని అనుకోకు, నువ్వు మురుగన్ మీద ప్రమాణం చేసినందున నిన్ను యిప్పుడు వదలి వేస్తాను. నీవు చేసే పూజలేవో త్వరగా చేసి వచ్చేయ్యాలి. నువ్వు నన్ను మోసగించాలని చూసినా నీవు ఎక్కడ వున్నా వెదుకుతూ వచ్చి చంపేస్తాను. ఇప్పుడు నీవు వెళ్ళు. తిరిగి త్వరగా రా." అని వేటగానిని వదలివేసినది.*

*వేటగాడు  త్వరత్వరగా మురుగన్ ఆలయానికి వెళ్ళి, మురుగన్ కి  నీరు, పువ్వులు, పళ్లు సమర్పించి అభిషేకార్చనలతో భక్తితో కడసారిగా సేవించుకున్నాడు. కరుణామయుడైన మురుగన్ ను  50 సంవత్సరాలుగా పూజించే  మహద్భాగ్యాన్ని తనకి కలిగించాడని తృప్తిగా ఆనందం పొందాడు.  పారవశ్యంతో కనులు మూసుకుని ధ్యానంలో నిమగ్నమైనాడు.  ధ్యానంలో వున్న వేటగానికి సమయమే తెలియలేదు. ఆలయంలో మంగళ వాద్యాలు మ్రోగిన శబ్దానికి ధ్యానం భగ్నమై ఇహలోక స్పృహ కలిగింది. సింహానికి తాను యిచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది. వెంటనే లేచి సింహం వున్న చోటుకి వెళ్ళాడు.*

*"మురుగన్ సన్నిధిలో   ధ్యానంలో పడి సమయం గడవడమే తెలియలేదు. ఆలశ్యమైనందులకు నన్ను మన్నించు. నీవు యిప్పుడు నీ యిష్టమైనట్టు తినవచ్చును" . అని కనులు మూసుకుని చేతులు ముకుళించి,*
*మనసులో మురుగా, మురుగా" అని జపం చేయడం ఆరంభించాడు.*

*ఏ క్షణాన్నైనా సింహం తన మీద పడి  చంపుతుందని వేటగాడు ఎదురు చూశాడు. కాని అతను  ఎదురు చూసినట్టు ఏమీ జరగలేదు. సింహం వేటగాని భుజాల మీద తన ముందు కాళ్ళను పెట్టి,   వేటగాని భుజాలాను ముఖాన్ని తడిమింది. ఆ సింహం యొక్క ఆ స్పర్శ  అతనిని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళింది. ఆ స్పర్శ వేటగాడికి  తాను పునీతుడైనట్లు భావన కలిగింది. తన కనులు తెరిచి చూశాడు. తన కళ్ళెదట సింహం లేదు సింహం స్థానంలో సుబ్రహ్మణ్యస్వామి ఉన్నాడు.* 

*ఆ వేటగాడి సేవా నిరతిని కీర్తిస్తూ శైవ  నాయనార్ అరుణగిరినాథర్ తన గ్రంథంలో వివరించాడు*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment