అనావృష్టి... ఒకప్పుడు...
అతివృష్టి.... ఇప్పుడు...
ఆర్యా , అందరూ ఆలోచించాలి... సుమారు 30 సంవత్సరాల క్రితం వరకు లేదా ఒక జనరేషన్ క్రితం వరకు దీపావళి రోజు సాయంత్రానికి చాలా కుటుంబాల్లో పిల్లల ముఖాల్లో ఒక ఆత్రుత...మా నాన్న.... దీపావళి మందులు తెస్తాడా?
తెస్తే ఎన్ని తెస్తాడు?
ఒక రకమైన టెన్షన్ తో కూడిన ఆలోచన..... అంతలో ఊర్లో మొదలవుతున్న సంబరాలు....ఊర్లో ఎక్కడో పెద్దపెద్ద అవుట్లు పేలుస్తున్న శబ్దం వినపడటం....ఏదో ఒక తెలియని బాధ...అంతలోనే సంతోషం.....
ఈలోపు పక్కింట్లోనో...నాలుగైదు ఇళ్ల తర్వాతో....పిల్లలు బయటికి వచ్చి బాంబులు కాల్చడం ద్వారా పండగ మొదలుపెడతారు.
మన ఇంట్లో కాసేపటికి నాన్న వస్తాడు.
కోరుకున్నట్టు టపాసులు తెస్తే... పట్టలేని సంతోషం... దీపాలతో పాటు పిల్లల ముఖాలు కూడా వెలిగిపోయేవి... మన ఇంట్లో కూడా బాంబుల మోత ప్రారంభమయ్యేది.
మగ పిల్లలు వీధుల వెంట దివిటీలు త్రిప్పుతూ, కాకర పువ్వొత్తులు వెలిగించి, అమ్మా అక్కాచెల్లెళ్ళు కిస్తూ, నాన్నలతో కలిసి బాంబులు రాకెట్లు కాలుస్తూ ఆనందంగా తల్లిదండ్రుల వెంటే ఉండే వాళ్లు... పండగ చేసుకుంటూ...
కట్ చేస్తే......
ఇప్పుడు తల్లిదండ్రులుపిల్లల కోసం రకరకాల టపాసులు తీసుకొస్తున్నారు. వందలు కాదు వేలు ఖర్చు పెడుతున్నారు, కానీ..
ప్రస్తుత జీవన శైలి ఫలితంగా పిల్లలకు పండుగల పై అవగాహన,
ఆసక్తి రెండు లేవు...
తల్లిదండ్రులే పిల్లలను బతిమిలాడుతున్నారు వచ్చి టపాలు కాల్చమని...
ఫోను పక్కన పెట్టి... టీవీ ఆపేసి పండుగలో పాలుపంచుకోమని... కానీ పిల్లలు మాత్రం ఫోను ప్రపంచంలో నుంచి బయటికి రావటం కష్టంగా మారింది...
సారాంశం ఏంటంటే....
ఒకప్పుడు పండగలు ఉన్నాయి....కానీ డబ్బులు లేవు.
ఇప్పుడు డబ్బులు ఉన్నాయి...
కానీ పండగలన్నీ వాట్స్ ఆప్ లు, ఫేస్ బుక్ లు, ఇన్ట్సాగ్రామ్ లు, టీవి ల లోనే వుందనిపిస్తుందన్న బాధ..
No comments:
Post a Comment