🌼 *దీపావళి బాణాసంచాను కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు*🌼
💫 బాణాసంచాను కాల్చే సమయంలోనూ మంటకు దూరంగానే ఉండేలా చూసుకోవాలి. ఫలితంగా మీ చర్మం కూడా దూరంగా ఉంటుంది. దాంతో నేరుగా తాకే మంట, వేడిమి ప్రభావం తగ్గుతుంది.
✨ వదులైన దుస్తులు కాకుండా బిగుతైనవే వేసుకోవాలి. వదులైన దుస్తులైతే అవి వేలాడుతుండటం వల్ల మంట అంటుకొని చర్మం కాలే ప్రమాదం ఉంటుంది.
🔥 బాణాసంచాను ఒక సమయంలో ఒక టపాకాయను మాత్రమే కాల్చాలి. ఒకేసారి రెండు మూడు కాల్చడం, పక్క పక్కనే పలురకాల బాణసంచా సామగ్రి పెట్టుకొని వరసగా కాలుస్తూ పోవడం వంటివి చేయకూడదు.
💥 కాలనప్పడు ఆ పదార్థంపై ఒంగి చూడటం మంచిది కాదు.
🗯️ ప్రమాదవశాత్తు చర్మం
కాలితే రగ్గు వంటివి కప్పవద్దు.గాయానికి తడి టవల్ను చుట్టి డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి.
💫 నీళ్ల బకెట్ను టపాసులు పేల్చే చోట దగ్గరగా, అందుబాటులో ఉంచుకోండి.
🌪️ గాయం అయిన వెంటనే కంగారు పడకుండా దానిపై నీళ్లు ధారగా పడేలా చూడాలి. మంట తగ్గేవరకు అలా కడిగి అప్పుడు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి.
⚡ గాయాన్ని కడగడానికి ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు.
💫 గాయాన్ని కడగడానికి ఐస్ వాటర్ ఉపయోగించడం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ గాయాన్ని రుద్దకూడదు.
💥 మరీ తీక్షణమైన వెలుగు, దాన్నుంచి వెలువడే వేడిమి, మంట... ఈ మూడింటి వల్ల సాధారణంగా కన్ను ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సల్ఫర్, గన్ పౌడర్ లాంటి రసాయనాల ప్రభావం వేళ్ల ద్వారా కంటికి తగలడం వల్ల కళ్ల మంటలు, నీళ్లుకారడం వంటి సమస్యలు రావచ్చు.
🔥 బాణాసంచా కాలసమయంలో నేరుగా, తదేకంగా చూడవద్దు.
🗯️ డైరెక్ట్ గా మంట కంటికి తగిలితే కార్నియా దెబ్బతింటే కంటికి శాశ్వత నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. పై జాగ్రత్తలు పాటించి దీపావళి పండుగ ను సురక్షితంగా జరుపుకుందాం.
No comments:
Post a Comment