#చెప్పలేదుకదా?
(యూట్యూబ్ లో జ్యోతిషం వీడియోలపై సెటైర్)
ఏవండీ.... ఏవండోయ్ గట్టిగా
పిలిచింది సుబ్బలక్ష్మి.
ఏమిటోయ్? ఎందుకిలా అరుస్తూ పిలుస్తున్నావు అడిగాడు సుబ్బారావు.
ఓ విషయం చెప్పడం మరిచా,మీరు ఇందాకా బజారు కెడుతూ సెల్ మరిచి పోయారు, మీరు వచ్చే లోపు
ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ వారుట
ఓ నాలుగు సార్లు ఫోన్ చేసారు.
సుబ్బారావు గారున్నారా? అనడిగారు.లేరండీ బయటి వెళ్ళారు అన్నా, ఫర్వాలేదు ఆయనది #మేషరాశేనా# అనడిగారు అంది సుబ్బలక్ష్మి.
కొంపదీసి నాది #మేషరాశి# అని చెప్పలేదు కదా? ఆందోళన గా అడిగాడు సుబ్బారావు.
లేదండీ ఆ రాశులు,కుప్పలు నాకు తెలియవని చెప్పేశా!
అయినా, ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్
వాళ్ళకి మీదే రాశి అయితే ఏమిటండీ? అడిగింది సుబ్బలక్ష్మి.
మంచి పని చేశావు,ఇన్ కం టాక్స్ డిపార్ట్మెంట్ వారు కూడా,యూట్యూబ్ జాతకాలు
ఫాలో ఔతూ,ధనయోగం, ఉన్నరాశుల వారిని గుర్తించి ఐటీ
దాడులు చేస్తారుట.
అందుకే నాది #మేషరాశా? అని అడిగారు.
#మేషరాశి# వారికి త్వరలో గజకేసరీ యోగం పట్టి కుబేరులు
ఔతారుట.
ఎట్టి పరిస్థితుల్లోనూ నాదే కాదు,
నీ రాశి కూడా చెప్పకు,మీ రాశి
వారికి కూడా కుబేరయోగం ఉందిట.
జాగ్రత్త అంటూ భార్యను హెచ్చరించాడు సుబ్బారావు.
హమ్మ యూట్యూబోయ్!
****
No comments:
Post a Comment