Thursday, November 9, 2023

ప్రపంచంలో వీరు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు!!...

 *"శరణాగతి"*
ఆధ్యాత్మిక సాధనకు శరణాగతి చాలా ముఖ్యం!!.…
ఇది మనిషిలోని చింతలన్నింటినీ  ఏరిపారేసి మనస్సును, బుద్ధిని భగవంతుని యందు స్థిర పరుస్తుంది.
" ఓ భగవంతుడా!!... కష్టమెుచ్చినా సుఖమెుచ్చినా అంతా మీ ఇష్టం. 
ఈ శరీరం మీది, ఈ ప్రాణం మీది, ఈ జీవితం కూడా మీదే, నాపై సర్వాధికారాలు మీవే...
నేను నీ వాడను, నీవు నా వాడవు. 
నాకు నీవు తప్ప వేరే ఆధారం ఏదియూ లేదు. 
నేను మిమ్ములను తప్ప వేరే దేనినీ ఆశ్రయించను.
ఈ జీవితాన్ని మీకు అప్పగించు చున్నాను. 
"దీనిని మీ ఇష్టం వచ్చిన రీతిగా నడిపించుకొండి" అని భగవంతునికి మెురపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి. 
ఫలితం ఏదైనప్పటికీ భగవత్ప్రసాదంగా స్వీకరించాలి. 
"ఇదే నిజమైన శరణాగతి, ఇట్టివాడు భగవంతునకు అత్యంత ప్రియమైనవాడు"...
ప్రపంచంలో వీరు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు!!...

No comments:

Post a Comment