Tuesday, November 7, 2023

పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటారు.

 2809.   1-1.      270123-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀782.
నేటి…

           *ఆచార్య సద్బోధన:*
              ➖➖➖✍️

*పది విధాలైన పాపాలను సామాన్యంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు చేస్తూనే ఉంటారు.* 
*అవి శారీరక, వాచిక, మానసిక సంబంధం కలిగి ఉంటాయి.*
 
*A. శారీరకంగా చేసే పాపాలు మూడు.* 
*అవి:*
*1. అపాత్రదానం, 2. శాస్త్రం అంగీకరించని హింస చేయడం,      3. పరస్త్రీ లేదా పురుషుని వ్యామోహం కలగటం.*

*B.వాచికంగా (నోటిద్వారా) చేసే పాపాలు నాలుగు...*
*అవి:*
*1. పరుషంగా మాట్లాడడం, 2. అసత్యం పలకడం, 3. చాడీలు చెప్పడం, 4. వ్యర్థ ప్రలాపాలు చేయడం, సమాజం వినలేని భాషను ఉపయోగించడం.*

*C. మానసికంగా (మనస్సుద్వారా) చేసే పాపాలు మూడు..*
*అవి:*
*1. పర ద్రవ్యాన్ని తస్కరించాలనే దుర్బుద్ధి, 2. ఇతరులకు బాధ కలిగించే పనులు చేయడం,               3. వ్యర్థమైన అహంకారాన్ని కలిగి ఉండడం.*✍️
                     🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment