Wednesday, November 8, 2023

భాగవత కథ… *వ్యోమాసుర కథ!*

 0202.   2-9. 040323-6. 
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*భాగవత కథ…

               *వ్యోమాసుర కథ!*
                  ➖➖➖✍️

 *పూర్వం మహాపుణ్యక్షేత్రమయిన కాశీనగరాన్ని భీమరథుడు అనే రాజు పరిపాలించే వాడు.*

 *అతడు గొప్ప విష్ణు భక్తుడు. ఎంతో దానశీలి, ధర్మజ్ఞుడు. *

        *వానప్రస్థాశ్రమంపై మనసు కలిగి, తన కుమారులలో యోగ్యుడైన కుమారుడికి రాజ్యభారమును అప్పగించి మలయ పర్వత ప్రాంత అరణ్యాలకు వెళ్లి, అక్కడ ఒక ఆశ్రమమం నిర్మించుకుని  తపస్సును కొనసాగిస్తున్నాడు.*

        *ఒక రోజు బ్రహ్మమానస పుత్రుడు పరమ పూజ్యుడు అయిన ‘పులస్త్య మహర్షి’ తన శిష్యవర్గముతో భీమరథుడి ఆశ్రమానికి వచ్చాడు.*

 *త్రిలోకపూజ్యుడైన పులస్త్యుడిని చూడగానే రాజు నమస్కరించాడు. కానీ నారాయణుడి ధ్యానంలో వుండి, వచ్చిన వారికి అతిథి సత్కారం చెయ్యలేదు.*

        *ధర్మము తప్పినందుకు పులస్యుడికి కోపం వచ్చింది. వెంటనే మహర్షి...*
*“రాజా! ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించడం సంప్రదాయం. దానికి విరుద్దంగా సత్కరించక పోవడం అనేది అసురలక్షణం. నీవు నీ విధిని మరచావు కాబట్టి నీవు రాక్షసుడివి కమ్ము”! అని శపించాడు.*

        *అప్పటికి తేరుకున్న భీమరథుడు పశ్చాత్తాపముతో శరణువేడాడు.* 

*కరుణించిన పులస్త్యుడు...*
*“నీదుష్కర్మకు ఫలితం అనుభవించక తప్పదు. కానీ నీవు అఖండ విష్ణుభక్తుడవు కావున నీకు ద్వాపర యుగములో శ్రీకృష్ణపరమాత్మ అనుగ్రహము కలుగును. భగవంతుడు భక్తుల కెన్నడు అపజయము కలిగించడు కదా!” అని ఆశీర్వదించాడు.*

*అలా ఆ భీమరథుడే వ్యోమాసురుడుగా జన్మించాడు.*

        *గోకులంలో ఒక రోజు కృష్ణుడు గోపాలురతో కలిసి ఆడుకుంటున్నాడు. కొందఱు గోవులుగా మరికొందఱు మేకలుగా కొందఱు చోరులుగా మరియు కొందఱు పసుల కాపరులుగా విడిపోయి ఆడుకునే సమయంలో కంసప్రేరితుడైన వ్యోమాసురుడు చోరుల గుంపులో చేరి గోవులుగా మేకలుగా గోపాలురుగా నటిస్తున్న బాలురను ఎత్తుకొని పోయి ఒక బిలములో దాచి బిలద్వారము మూసేసాడు.*

*పరమాత్మ అది గ్రహించి రక్కసుని రెండుకాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై విసిరికొట్టాడు.*

*వ్యోమాసురుని మృతదేహం నుండి ఒక తేజస్సు వచ్చి పరమాత్మలో కలిసిపోయింది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment