260223j2145. 270223-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పంచాక్షరీ మత్రం విశిష్టత*
➖➖➖✍️
*భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం*
*వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం*
*పాశాంకుశాభయ వర ప్రద శూల పాణిం*
*వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం*
*సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము (తాడు), అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము...*
*ఓం నమః శివాయ...*
*శివ పంచాక్షరీ మంత్రం.. మానసిక ప్రశాంతతకు మూలం! ఓం ‘నమఃశివాయ’ మంత్రాన్ని వేదాలకు, తంత్రాలకు హృదయభాగంగా చెబుతారు. ‘రుద్రం’లో వేదాల మధ్యభాగంలో ‘నమఃశివాయ’ అనే మంత్రం లిఖితపూర్వకంగా లభించింది. ఆగమాలలో దీని అర్థాన్ని విస్తృతంగా వివరించారు.*
*ఓం నమఃశ్శివాయ.. *
*ఇదే పంచాక్షరీమహా మంత్రం.*
*ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం.*
*దీని ఉచ్ఛారణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు.*
*ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి.*
*ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు.*
*‘న, మ, శి, వ, య. మంత్రం’… ‘ఓం’ కారంతో ప్రారంభం అవుతుంది.*
*ఓం... మహాబీజాక్షరం.*
*దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి.*
*‘న’ అనేది భగవంతునిలోని కాంతిని తెలియచేస్తున్నా ఈ పంచాక్షరాలను పంచభూతాలు అని కూడా అంటారు.*
*న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు.*
*ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెలకుంటుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం వల్ల మనిషిలో ఉండే తమో, రజోగుణం పోయి ఆధ్యాత్మిక భావన పెరుగుతుందని కూడా ఆధ్యాత్మికవేత్తలు బోధిస్తున్నారు.*
*ఈ మంత్రం వెనుక ఎంతో పరమార్థం ఉంది. మానవ శరీరం పంచభూతాత్మకం. నమశ్శివాయ అనే అయిదు అక్షరాలను పలికినప్పుడు పంచ భూతాలతో నిండిన శరీరం శుభ్రమవుతుంది. ఒక్కో అక్షరం ఒక్కో భూతాన్ని శుభ్రం చేస్తుంది.*
* ‘న’ భూమికి సంబంధించిన భాగాలను,*
*‘మ’ నీటికి సంబంధించిన భాగాలను,*
*‘శి’ అగ్నికి సంబంధించిన భాగాలను,*
*‘వ’ గాలికి సంబంధించిన భాగాలను,*
*‘య’ ఆకాశానికి సంబంధించిన భాగాలను పరిశుభ్రం చేస్తాయి.*
*మనసు, శరీరం పరిశుభ్రంగా లేనంతవరకు మనిషిలో ఆధ్యాత్మిక భావన స్వచ్ఛంగా నిలబడదు.*
*అందువల్లే ఓం నమశ్శివాయ అనే పదాన్ని పదేపదే ఉచ్ఛరిస్తే, మానసిక ప్రశాంతత ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదని పౌరాణికులు చెబుతారు.*
*భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్ఛరించినా తగినంత ఫలం లభిస్తుంది.*
*శివభక్తుడైన సౌనందగణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆయనను సత్కరించి, వచ్చిన కారణమేంటని అడిగాడు.*
*తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు.*
*దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు.*
*వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి.. “ఓ జనులారా! ఇది ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రం. దీనిని ఉచ్ఛరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయ”ని తెలిపారు. ముని ని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట.*
*ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు. కానీ భక్తితో ఉచ్ఛరించినంతమాత్రానే వారికి కైలాసం లభించింది.*
*అర్థయుక్తంగా ఉచ్చరిస్తే …. ‘అధికస్య అధికం ఫలమ్’ అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది.*✍️
ఓం నమః శివాయ.
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment