*✨నలుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ నలుగురిలో మీరెక్కడ ఉన్నారో చూడండి.* 🌈
🕉️🌞🌎🏵️🌼🚩
*రోడ్డు మీద ఒక రాయి ఉంది. మొదటి వ్యక్తి రాయిని గుద్దుకున్నాయి. కాలు చిట్లింది. కాలుకి కట్టు కట్టుకున్నాడు. తెల్లారి మళ్ళీ వచ్చి మళ్ళీ తగిలించుకున్నాడు. ఇంట్లో వాళ్ళు అడిగారు కానీ మళ్ళీ మళ్ళీ కొట్టుకుంటూ కట్టు కట్టుకుంటూ ఉన్నాడు.*
*ఇలాంటి వారి స్వభావం ఏమిటంటే! చేసిన తప్పే చేస్తూ ఉంటారు. ఇది వారికి అర్థమే కాదు. ఇదేమి వాళ్ళ తప్పుకాదు. పుట్టి పెరిగిన వాతావరణం, స్వార్థం, బలీయమైన నేను అనే భావన. దీనివల్ల చుట్టూ ఉన్న పరిసరాలను గమనించ నివ్వడం లేదు. అవసరం రానివ్వడం లేదు. అందుకని ఎన్నిసార్లు చెప్పినా బుద్ది మందకొడి తనం వల్ల చేసిన తప్పే చేస్తారు. ఇదేమి కర్మ కాదు. తీవ్రమైన దేహ భావన, స్వార్థ పరత్వం. బుద్ది వికాసం ఉండదు.*
*పెంచే విధానం లో విశాల భావాలు నేర్పక పోవడం వలన జరిగిన అనర్థం. ఏనాడు మంచి పనులు చేయించక పోవడం, మంచి మాటలు చెప్పక పోవడం వలన జ్ఞానం పెరగలేదు. అందరి గొడవలు విని, నాకెందుకు నా గొడవలు నాకున్నాయి అనుకుని నీ గొడవలే నీకు అర్థం కానంతగా కుచించుకు పోయిన బుద్ది. చేసిన పొరపాట్లు చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు తిన్న చోటే మళ్లీమళ్లీ దెబ్బలు తింటూ ఉంటారు.*
*రెండో వ్యక్తి రాయిని గుద్దుకున్నాడు. కట్టు కట్టుకున్నాడు అక్కడ జాగ్రత్తగా ఉన్నాడు. తెల్లారి ఇక్కడ రాయి ఉందని గుర్తించి తప్పుకొని వెళ్ళాడు. కానీ మరోచోట దెబ్బతిన్నాడు. వీళ్లు చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేయరు రియల్లీ అవుతారు ఎవరైనా చెప్పిన వీళ్ళకి అర్థం అవుతుంది. కానీ కొత్త తప్పులు చేస్తూనే ఉంటారు వీళ్లు దెబ్బ తిన్న తర్వాత మాత్రమే అందరూ నుండి వెళ్తారు కొత్తదారి వెతుక్కుంటారు తప్ప స్వతంత్రత ఉండదు. వీళ్లకు కూడా బుద్ధి వికాసం లేదు జ్ఞానము లేదు కూడా స్వార్థపరాయణమే.*
*మూడో వ్యక్తి రోడ్డు మీద వెళుతుంటే ఎవరో రాయిని గుద్దుకున్నాడు. చూసి తెలుసుకొని జాగ్రత్త పడ్డాడు. వీళ్లకు కొద్దిగా జ్ఞానం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకు వచ్చిందంటే పక్కవారిని గమనిస్తున్నారు. వీరికి బుద్ధి కొద్దిగా వికాసం చెందింది. వీళ్ళు పక్కవారిని చూసి వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు చేయరు.*
*నాలుగో వ్యక్తి రోడ్డు మీదకి వస్తూనే "రోడ్డు మీదకి వెళ్తున్నాం. గుంటలు, గోతులు, రాళ్ళు, ముళ్ళు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని ముందు నుండే జాగ్రత్త పడ్డాడు. ఇలాంటి వారు జ్ఞానుల విభాగంలోకి వస్తారు. అన్ని పరిస్థితులు బాగా అర్థమవుతాయి. విచక్షణ జ్ఞానం బాగా high లో ఉంటుంది. ఇలా ఉండటానికి కారణం ఏమిటంటే! చిన్ననాటి నుండి మంచి పెంపకంలో, మంచి వాతావరణం లో, మంచి విధానంలో ఇతరులకు మేలు చేస్తూ, ఇతరులకు సహాయం చేస్తూ తాను తినే ఏ దేనినైనా షేర్ చేసుకుంటూ పెరిగినవారు. ఇదంతా వాళ్ళు పెరిగిన వాతావరణంలో సమకూరిన జ్ఞానం.*
*ఇక్కడ ఎవరికి సృష్టి అన్యాయం చేయలేదు ఇది వీళ్లు పుట్టిన దగ్గరనుంచి వీళ్ళు పెరిగిన వాతావరణం పెంపకం పెద్దవాళ్లు ఏర్పరచిన బుద్ధుల వల్ల వీరిని అలా తయారు చేసింది. స్వార్థం ఎక్కువ ఉంటే జ్ఞానం అంత తక్కువ ఉంటుంది మానసిక ఎదుగుదల తక్కువ ఉంటుంది. సాత్పరుడికి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది కాకపోతే అది కన్నింగ్ మోసకారితనం ఎక్కువ. మోసాన్ని కూడా ధర్మం అని నమ్మించే బ్రెయిన్. ఇదంతా అసలు జ్ఞానం కంటే అసలు బ్రెయిన్ కంటే ఇతరులను మోసం చేయడంలో అధిక తెలివి ఎక్కువ ఉంటది. ఇది తనని తాను నాశనం చేసుకునే జ్ఞానం, స్వార్థపూరిత జ్ఞానం. ఇది ఎప్పటికైనా వారికే హాని చేస్తుంది.*
*ఎవరి బుద్ధైనా వారు పెరిగిన వాతావరణం వారి తల్లిదండ్రులు పెంచిన విధానం మీద ఆధారపడి ఉంటుంది అంతేతప్ప సహజంగా వచ్చిన జ్ఞానం కాదు. సహస్రనామం ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ పెరిగిన వాతావరణం బట్టి బుద్ధి కుషించుకుపోతుంది కొన్నిచోట్ల విస్తరిస్తుంది. లాలస స్వార్థం తీవ్రమైన కోరికలు ఉన్నవారికి బుద్ధి వికాసం ఉండదు.*
శ్రీ...,✍️
🕉️🌞🌎🏵️🌼🚩
No comments:
Post a Comment