1. ప్రశాంతం - కొన్ని పూలు
ఆ దంపతులకు ఐదుమంది పిల్లలు. వాళ్ళు వేసవి సెలవుల్లో ఇంటి వెనుక పూలతోట వేద్దామని నిర్ణయించారు. ఆమె పిల్లల్ని తీసుకుని పూలమొక్కల కోసం నర్సరీకి వెళ్ళింది. పిల్లలు ఈ మొక్క అంటే కాదు ఆ మొక్క అంటూ గొడవ పడ్డారు. మొత్తానికి కొన్ని పూలతొట్లు తోపుడుబండిలో సర్దారు. నేనంటే నేను ఆ తోపుడుబండిని తోస్తానని పోట్లాడుకుని రెండుమూడు పూలకుండీలు పగలగొట్టారు.
తల్లి బాగా అలసిపోయింది. విసిగిపోయింది. మొత్తానికి యిల్లు చేరారు. ఆమె ఎంతో ఓపికున్న భర్తతో 'నేను జీవితంలో ఆశించింది కొంత ప్రశాంతత, కొన్ని అందమయిన పూలు' అని నిట్టూర్చింది.
అతను భార్యకేసి చూసి 'చూడు డియర్! అవి మనకు కేవలం అంతిమయాత్రలో మాత్రమే దొరుకుతాయి' అన్నాడు.
- అజ్ఞాతం
2. రెక్కల వరం
ఒక పక్షి వుండేది. దానికి బాగా ఎగరాలంటే ఎంతో ఇష్టం. ఒకరోజు ఎగురుదా మనుకుంది. ఎగరడానికి ప్రయ త్నించింది. కానీ అప్పుడే వర్షం మొదలయింది. పక్షి. గాలిలో వుండగానే వర్షపు చినుకులకు తడిసి రెక్కలలోని ఈకలు బరు వెక్కాయి. భారమనిపించాయి. అప్పుడది నేలమీద వాలడానికి ప్రయత్నం చేసింది, బరువెక్కి కిందపడి రెక్క విరగ్గొట్టుకుంది. దాంతో కాసేపు కదలలేకపోయింది.
మెల్లమెల్లగా కోలుకుంది. కొన్నాళ్ళకు రెక్కగాయం మానింది. మళ్ళీ ప్రతిరోజూ ప్రయత్నించింది. కానీ సరిగా ఎగర లేకపోయింది.
ఒకరోజు ఎగిరింది. అప్పుడు వీచిన గాలి దాన్ని ఆకాశంలోకి లేపింది. అప్పుడది విశాలంగా తన రెక్కల్ని చాచి మొదటిసారి ఆకాశంలో ఎగరినట్లు విహారం చేసింది. మెల్లమెల్లగా ప్రయత్నిస్తే అసాధ్యమేదీ వుండదు.
- 'షాడోస్ ఇన్ ద సన్' సినిమా నించి.
No comments:
Post a Comment