Monday, November 6, 2023

ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు కలుగుతుంది? ఆధ్యాత్మికత మనల్ని పరస్పర వైరుధ్యాలలోనూ జీవించటానికి సహకరిస్తుంది అంటే ఏమిటో?

🔺 *పత్రీజీ సమాధానాలు* 🔺
🌹 *చాప్టర్ -- 5 :--- ఆధ్యాత్మిక శాస్త్రం* 🌹
🌷 *Part --2*🌷

 🍁 *ప్రశ్న :--- ఆధ్యాత్మిక చింతన ఎప్పుడు కలుగుతుంది?* 

 🌿 *పత్రీజీ :---* మనమంతా ఆత్మ పదార్థాలం అనే సత్యాన్ని మరిచిపోయినప్పుడు ఆధ్యాత్మికత నుంచి వైదొలగిపోతాం. మనల్ని భౌతిక శరీరంగా గుర్తిస్తూ *“నేను పురుషుడిని” , “నేను మహిళను”... 'నాకు నలభై సంవత్సరాలు'... 'నాకు యాభై సంవత్సరాలు’ ‘నా వెంట్రుకలు నెరిసాయి'... 'నేను చనిపోతున్నాను'...* ఈవిధమైన దేహపరమైన మూర్ఖపు మాటలు ఆధ్యాత్మికత కాదు. ఎప్పుడైతే ఆత్మ గురించి... ఆధ్యాత్మికతకు మూల కేంద్రమైన ఆత్మ గురించి ఆలోచించటం, మాట్లాడటం చేస్తామో అదే ఆధ్యాత్మిక చింతన.

🍁 *ప్రశ్న:---  ఆధ్యాత్మికత మనల్ని పరస్పర వైరుధ్యాలలోనూ జీవించటానికి సహకరిస్తుంది అంటే ఏమిటో దయచేసి వివరంగా చెప్పండి.*

🌴 *పత్రీజీ :---* అవును. గొప్ప వైరుధ్యాల మధ్య జీవిస్తాం. అయితే విరుద్ధమైనవన్నీ కూడా సత్యాలే, ఏక కాలంలో. మరణం ఉంది... మరణం అనేదే లేదు. ఎదుగుదల ఉంది... ఎదుగుదల అనేదే లేదు. దుఃఖం ఉంది... దుఃఖం అనేదే లేదు. అందరికీ మేలు చెయ్యాలి... ఎవ్వరికీ ఏ మేలూ చెయ్యలేం. ఎవ్వరికైనా మంచిని బోధించ వచ్చు... ఎవ్వరికీ ఏ మంచినీ బోధించలేం. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ పరస్పర విరుద్ధమైనవే. ఈ వైరుధ్యాలను అర్థం చేసుకున్నప్పుడే నిజమైన ఆధ్యాత్మికతను అర్థం చేసుకున్నట్లు లెక్క. ఈ వైరుధ్యాలు ఇంకా అర్థం కావటం లేదంటే మీరు ఇంకా ఆధ్యాత్మికతను సరిగ్గా అర్థం చేసుకోనట్లే !


No comments:

Post a Comment