020223f0911. 100323-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కలికాలంలో…*
*స్వర్ణయుగం!*
➖➖➖✍️
*కలియుగం…. మొదటి పదివేల సంవత్సరాలను ‘యుగసంధి’ లేదా ‘స్వర్ణయుగం’ అంటారు!*
*అంటే దానర్ధం?! ఈ సమయం, పూర్తి-కలియుగంగా మారడానికి పట్టే సమయం అని చెప్పొచ్చు!*
*ఈ మొదటి పదివేల సంవత్సరాలు మాత్రమే, లోకంలో ధర్మం భక్తి లాంటివి ఇంకా మిగిలి ఉంటాయి!*
*ఆ తరువాత వచ్చేది ఘోరకలి! (మహాఘోరంగా ఉంటుంది)*
*ఎవరయితే నిత్యం భక్తితో భగవంతుడి పాదాలు పట్టుకుంటారో…. వారు మాత్రమే, మళ్ళీ ఈ కలియుగంలో తిరిగి పుట్టకుండా రక్షించబడతారు! (ఒక్క ముక్కలో-పూర్తి సారాంశం ఇదే)*
*ఈ కలియుగ లక్షణం ప్రకారం, ఎక్కువ శాతం ప్రజలు క్రోధంతో, కోరికలతో, వ్యగ్రతతో తిరిగేవారు అయ్యుంటారు కాబట్టి వారి దృష్టి భగవంతుడి మీదకు లగ్నం కాకుండా ఉండి, చివరికి అధికశాతం ప్రజలు అధోగతులపాలు అవుతారు.*
*ఇంకా, పరమ దుర్మార్గంగా ప్రవర్తించేవారు అయితే కల్పాంతం వరకూ కూడా శూన్యంలో (స్పేస్ లో) పిశాచంలా తిరుగుతూ ఉంటారు.*
*కలియుగంలో రక్షించబడాలి అంటే చిత్తశుద్ధితో, భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించడం ఒక్కటే శరణ్యం!*
*భగవంతుడికి తరతమ బేధం అస్సలు ఉండదు!*
*ఎవరి అర్హతకి తగిన ఫలం వాళ్లకు అనుగ్రహిస్తాడు!*
*ఎవరి గుణాలకి తగ్గ ఫలం వాళ్లకు దక్కుతుంది అంతే!*
*భగవంతుడి నామం మనలను సదా రక్షిస్తుంది, కానీ చేసిన కర్మలు అయితే అంత సులువుగా వదిలి పెట్టవుగదా !*
*ఇక ఈ కలియుగంలో మనం చెయ్యగలిగిందల్లా,*
*బుద్దిని సాధన ద్వారా మార్చే ప్రయత్నం చేయడం! *
*భక్తితో ఈశ్వరుని పాదాలు పట్టుకోనే ప్రయత్నం చేయడం మాత్రమే! *
*చిత్తశుద్ధితో ఫలాపేక్ష లేని భక్తి మాత్రమే మనలను రక్షిస్తుంది.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment