Wednesday, November 8, 2023

కలికాలంలో…* *స్వర్ణయుగం!

 020223f0911.    100323-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కలికాలంలో…*

                  *స్వర్ణయుగం!*
                   ➖➖➖✍️


*కలియుగం…. మొదటి    పదివేల సంవత్సరాలను ‘యుగసంధి’ లేదా ‘స్వర్ణయుగం’ అంటారు!* 

*అంటే దానర్ధం?! ఈ సమయం, పూర్తి-కలియుగంగా మారడానికి పట్టే సమయం అని చెప్పొచ్చు!*

*ఈ మొదటి పదివేల సంవత్సరాలు మాత్రమే, లోకంలో ధర్మం భక్తి లాంటివి ఇంకా మిగిలి ఉంటాయి!*

*ఆ తరువాత వచ్చేది ఘోరకలి! (మహాఘోరంగా ఉంటుంది)*

*ఎవరయితే నిత్యం భక్తితో భగవంతుడి పాదాలు పట్టుకుంటారో….          వారు మాత్రమే, మళ్ళీ ఈ కలియుగంలో తిరిగి పుట్టకుండా రక్షించబడతారు!                      (ఒక్క ముక్కలో-పూర్తి సారాంశం ఇదే)*

*ఈ కలియుగ లక్షణం ప్రకారం, ఎక్కువ శాతం ప్రజలు క్రోధంతో, కోరికలతో, వ్యగ్రతతో తిరిగేవారు అయ్యుంటారు కాబట్టి వారి దృష్టి భగవంతుడి మీదకు లగ్నం కాకుండా ఉండి,      చివరికి అధికశాతం ప్రజలు అధోగతులపాలు అవుతారు.*

*ఇంకా, పరమ దుర్మార్గంగా ప్రవర్తించేవారు అయితే కల్పాంతం వరకూ కూడా  శూన్యంలో (స్పేస్ లో) పిశాచంలా తిరుగుతూ ఉంటారు.*

*కలియుగంలో రక్షించబడాలి అంటే చిత్తశుద్ధితో, భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించడం ఒక్కటే శరణ్యం!*

*భగవంతుడికి తరతమ బేధం అస్సలు ఉండదు!*

*ఎవరి అర్హతకి తగిన ఫలం వాళ్లకు అనుగ్రహిస్తాడు!*

*ఎవరి గుణాలకి తగ్గ ఫలం వాళ్లకు దక్కుతుంది అంతే!*

*భగవంతుడి నామం మనలను  సదా రక్షిస్తుంది, కానీ చేసిన కర్మలు అయితే అంత సులువుగా వదిలి పెట్టవుగదా !* 

*ఇక ఈ కలియుగంలో మనం చెయ్యగలిగిందల్లా,*
*బుద్దిని సాధన ద్వారా మార్చే ప్రయత్నం చేయడం! *
*భక్తితో ఈశ్వరుని పాదాలు పట్టుకోనే ప్రయత్నం చేయడం మాత్రమే! *

*చిత్తశుద్ధితో ఫలాపేక్ష లేని భక్తి మాత్రమే మనలను రక్షిస్తుంది.*✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment