Saturday, December 16, 2023

****†

 అనగనగా ఒక చెట్టు, పచ్చని ఆకులతో, తెల్లటి పూలతో అందంగా ఉండేది.. దారిన పోయేవాళ్ళకు ఆ చెట్టు నీడనిచ్చేది, విశ్రాంతినిచ్చేది.. ఎంత వైరాగ్యం ఉన్నవాడికైన సరే నిండుగా ఉన్న ఆ చెట్టుని చూస్తే చాలు మళ్ళి జీవించాలనే ఆశ కలిగేది...   

అలా కొన్నాళ్ళు గడిచాక చెడుగాలులు వీయడంతో పూలు రాలిపోయాయి.. ఎండకు ఆకులు ఎండిపోయి కొమ్మనుండి వేరైపోయాయి... చెట్టు బోసిపోయింది.. అటుగా వెళ్తున్న వాళ్లందరు చెట్టును జాలి చూపులు చూశారు., ఇక దీని ఆయుష్షు ఐపోయిందని మాట్లాడుకున్నారు... 

అది విన్న ఆ చెట్టు మాత్రం నిరుత్సాహ పడలేదు., తనకు మళ్ళి గత వైభవం రాకపోతుందా! అనే నమ్మకంతో బతుకుతుంది.. 

కొన్నాళ్ళకి ఒక వర్షపు చుక్క ఆ చెట్టు వేరుపై పడింది.., అంతే చెట్టులో చలనం మొదలైంది.. కొన్ని లక్షల చినుకులు కలిసి ఆ చెట్టును తడిపేశాయి... కొన్ని రోజులకి ఆకులు చిగురించాయి , పూవ్వులు వికసించాయి.. మళ్ళి పది మందికి నీడనివ్వటం మొదలుపెట్టింది, వాళ్ళకు జీవతం మీద ఆశను కలిగేలా చేసింది... ఆ చెట్టు...! 

మనిషి జీవితము అంతే..., 

ఒక్కొక్కసారి కొన్ని 'అనర్ధాల' వల్ల నవ్వులు అనే పూలు మాయమౌతాయి.. 

కొన్ని అపార్ధాల వల్ల కావాల్సినవాళ్ళే ఎండిపోయిన ఆకులు లా వీడిపోతారు... 

అయిన సరే నిరుత్సాహ పడకూడదు.. ఏదో రోజు ఆ అనర్ధాలు, అపార్దాలు అనే అడ్డుతెరలు తొలగిపోతాయి..
నిజానికి మాయమయిన ప్రతి నవ్వూ ఏదో ఒకటి నేర్పే వెల్తుంది. నేర్చుకోవడం తెలియాలంతే...
ఈరోజు నీవేమైవున్నావో అది నీ మాయమైన నవ్వు ల సమాహారం.. నీ నేటి ఆత్మ స్థైర్యానికి సాక్షి...

 సమస్య లేని చోట
సమాధానం కోసం వెదక్కు !
సమాధానం లేని చోట
సమస్య సృష్టించకు !
సమస్య ఉన్న చోట
సంగతి జటిలం చేయకు !
సమాధానమున్న చోట
సమస్యను చూడకు !
సమస్యలేని జీవితం
అవనిలో అసలే ఉండదు !
సమాధానంలేని సమస్య
సాధారణంగా కనబడదు!..

ఏ నమ్మకంతో నువ్వు ఉదయాన్నే లేస్తావని అలారం పెట్టుకుంటున్నావో.. అదే నమ్మకంతో ఏదో ఒకరోజు నీ జీవితం నువ్వు కోరుకున్న విధంగా మారుతుంది అని గట్టిగా నమ్ము... 

అలా జరగాలంటే నీకు కావాల్సిందల్లా ఓర్పు, సహనం.. ఆదిత్యయోగీ..

గొంగలి పురుగు ఒక్క రాత్రిలోనే సీతాకోక చిలుకగా మారలేదు అన్న నిజం నువ్వు గ్రహించాలి... 

కాలం పెట్టిన సహన పరిక్షలో నువ్వే నెగ్గాలి..

ఎందుకంటే మంచి విషయాలు అంత తేలికగా పూర్తి కావు..  కాబట్టి నీ కర్తవ్యాన్ని పూర్తి చేసి, సహనానికి ఆశ్రయం ఇవ్వు... బద్ధకానికి కాదు..

గుర్తుంచుకో.,

నువ్వు త్వరగా లేచినంత మాత్రాన  సూర్యుడు ముందుగా ఉదయించడు., దానికి సమయం రావాలి.. మనకు సహనం ఉండాలి...

ధ్యానం... ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నతమైన పదం, ప్రక్రియ. ఏ సాధకుడైనా, ఏ రకమైన సాధన చేసినా అతడు చేసి తీరవలసిన సాధన ధ్యానం. క్రమ పరిణామంలో అంచెలంచెలుగా స్థాయి పెంచుకుంటూ చేరుకోవలసిన శిఖరం ధ్యానం. ఆ తరవాత ధ్యానం ద్వారా సాధనకు అతీతమైన సమాధి స్థితిలోకి వెళ్లిపోవడమే. మరి ఆ ధ్యానాన్ని ఎలా అందుకోవాలి, ఎలా సాధన చేయాలి, అసలు ధ్యానమంటే ఏమిటి? ఆధ్యాత్మికమార్గంలో సాధకులకు అందని ద్రాక్షలా ఊరిస్తూ, అందుకోక తప్పదని శాసిస్తుందది.

గురువు మంత్రోపదేశం చేస్తాడు. సాధనకు, గమ్యానికి మార్గం చూపిస్తాడు. గమనం మాత్రం మన బాధ్యతే. తండ్రి కుమారుణ్ని పట్టుమని కొన్ని అడుగులు మాత్రమే వేయిస్తాడు. మరిన్ని అడుగులు తోడుంటాడు. కింద పడతాడేమోనని నిఘా పెడతాడు. ఆ పై వదిలేస్తాడు. గురువూ అంతే. జపం చేయమంటాడు. ధ్యానం చేయమంటాడు. మరెన్నో యోగాలు, యాగాలు... సరే. అన్నీ ఒక క్రమపద్ధతిలో, కొన్ని క్రియలకు ప్రక్రియలకు లోబడి ఉంటాయి. మరి ధ్యానం మాటేమిటి? కొంత సంక్లిష్టమైన అంశం. అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నా ఆచరించటం అంత సులభమేమీ కాదు.. ఆదిత్యయోగీ..

కళ్లు మూసుకుని కుదురుగా కూర్చోవటం ధ్యానం కాదు. కేవలం ఆలోచనలను ఆపటమూ ధ్యానం కాదు. ధ్యానానికి కూర్చున్న ఆ క్షణాల్లో మన మనోస్థితి, దాని నిశ్చలస్థితి, ధ్యేయ వస్తువుపట్ల మక్కువ, ఆర్తి, దాన్ని కూడా అధిగమింపజేసే ధ్యాన నిమగ్నత... ముఖ్యం! అందుకు ఎంతో ప్రయత్నం, మరెంతో పరిశ్రమ కావాలి. ధ్యానం మాదిరి, ధ్యానమనేది మనకలవడే క్షణాల కోసమే ఈ వేదన, శోధన, మధన. యుగాలు, జన్మాంతరాల తపోసాధన ఆ క్షణాల కోసమే.

కానీ ఎలా? అందరూ ఊహిస్తున్నట్లు సాధకులు కూర్చునేది, కూర్చున్నంతసేపు చేసేది ధ్యానం కాదు. ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ- ఇవేమీ కాదు. అవన్నీ దానికై ప్రయత్నం, శోధన, ప్రసవ వేదన. మరి ఏది ధ్యానం? ఇది కాదు- మరేది? అది ఏదైనా అదెలా? మనం ధ్యానానికి ఏ పద్ధతిని ఎన్నుకున్నా మనసు సహకారం చాలా అవసరం. మనసును మచ్చిక చేసుకోవడం, మనసును నియంత్రించటం, తగిన స్థానంలో నియమించటం... పెళ్లి ఇష్టం లేదంటూ మంకుతనం చేస్తున్న ఆడపిల్లను గోముగా, సున్నితమైన లాలనలతో దారిలోకి తెచ్చుకున్నట్లు మనసును నొప్పించక, తానొవ్వక అన్నట్లు లొంగదీసుకోవాలి. లేదంటే బెడిసి కొడుతుంది. నొప్పింపక తప్పదు అనుకోవడానికి లేదుగానీ ఒప్పింపక మాత్రం తప్పదు. ఎందుకంటే ఆ ఆకతాయి మనసు శమించాలి. అందుకు  మళ్లీ మనసే కావాలి. మనసునే వాడుకోవాలి.

మనసును శ్వాసతో అనుసంధానం చేయాలి. ధ్యాన సమయంలో శ్వాస క్రియతో ఉచ్ఛ్వాస నిశ్వాసాల క్రమంలో శ్వాసవెంట నడుస్తున్న (మనం నడిపిస్తున్న) మనసు, నిశ్వాస యథాలాపంగా ఆగినచోట దాని చేయిపట్టుకుని నడుస్తున్న మనసు ఆగుతుంది. ఆగాలి. ఎంతసేపు?

సాధన, ముఖ్యంగా ధ్యానం పట్ల అవగాహన, పరిణతి మీద- అది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రత్యేక క్షణాన, నిశ్వాస ఆగిపోయిన ఆ నిర్గుణ, నిర్వికార క్షణాన... ఆ క్షణాన్ని క్షణాలుగా ఎక్కువసేపు ఆపగలిగే సాధన... మనం చేయవలసి ఉంది. సంకల్పాలు సద్దుమణిగి, మనసుతో పూర్తిగా విడివడిపోయిన ఆ క్షణం, లేదా అరక్షణం, లేదా క్షణలేశం, క్షణకణికం మనల్ని ధ్యానంలోకి నడిపిస్తుంది. అదే మనం ధ్యానం చేయాల్సిన అంశం. ఆ క్షణమే ధ్యాననిమగ్న సమయం. క్రమ పరిణతితో ధ్యానాన్ని కూడా విస్మరించిన, అధిగమించిన నిరామయ మహాశూన్యం. శూన్యం కూడా కాని అఖండ... అహం బ్రహ్మాస్మి స్థితి!..

ధ్యానం ఎంతో మేలు!
 రోజువారీ పనులతో విసుగెత్తిపోయినప్పుడు కొద్దిరోజులు ఎక్కడికైనా వెళ్లి విశ్రాంతి తీసుకుంటే కొత్త హుషారు పుట్టుకొస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత నెలకొంటుంది. అయితే యాత్రలతో లభించే ఇలాంటి ప్రయోజనాలు కొద్దిరోజులే ఉంటాయి. కానీ ధ్యానం, యోగాతో ఒనగూడే సానుకూల ప్రభావాలు చాలాకాలం వరకూ కొనసాగుతున్నట్టు తాజాగా బయటపడింది.
ధ్యానం, యోగా వంటి ఏకాగ్రతతో కూడిన పద్ధతులు శారీరకంగా, మానసికంగా ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి, నొప్పి వంటివి తగ్గటానికి తోడ్పడతాయి. అంతేకాదు.. శరీరంలో వాపు ప్రక్రియను తగ్గించటంతో పాటు రోగనిరోధకశక్తిని పెంపొందించటానికీ దోహదం చేస్తాయి. ఈ విషయంలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. రిసార్ట్‌లకు వెళ్లి కేవలం విశ్రాంతిగా గడిపిన వారిలోనూ.. ధ్యానం, యోగా పద్ధతులను పాటించినవారిలోనూ ఒత్తిడి, కుంగుబాటు గణనీయంగా తగ్గినట్టు బయటపడింది. విచిత్రమేంటంటే.. ధ్యానం, యోగా చేసినవారిలో ఈ సానుకూల ప్రభావాలు 10 నెలల తర్వాత కూడా కనబడుతుండటం. విశ్రాంతిగా గడిపినవారిలో ఇవి కొద్దికాలం పాటే కొనసాగాయి. అంతేకాదు యోగా, ధ్యానంతో రోగనిరోధకశక్తి సైతం మరింత ఎక్కువగా మెరుగుపడింది. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా జీవించటానికి తోడ్పడే సంక్లిష్ట జన్యు మార్పులనూ ఇవి ప్రోత్సహిస్తుండటం గమనార్హం. అందువల్ల విశ్రాంతి కోసం రిసార్ట్‌లకు, యాత్రలకు వెళ్లేవారు కాసేపు ధ్యానం, యోగా మీద కూడా దృష్టి పెట్టటం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. దీంతో దీర్ఘకాలం మానసిక, శారీరక ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు...
   
    మౌనమ్ 

మౌనం నిశ్శబ్దం మంత్రఘోష. మౌనం పదునైన ఆయుధం, మౌన మంటే పదాల ప్రతిబంథకాల్లేని నిశ్శబ్ద సంభాషణ అన్నాడు ఓ మహానుభావుడు. ''గొంతు మౌనంగా ఉన్నప్పుడు...మనసు మాట్లాడుతుంది. మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది. హృదయం మౌన ముద్రలో ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది'' అంటారు మెహర్‌ బాబా. మౌనం నోటిలో నాలుకతో పరిమితమైన వ్యవహారం కాదు. నోరు, మెదడు, మనసు, నమన్వయంతో పనిచేయాలి. పుస్తకం చదవడం మౌనం కాదు, అది రచయిత సృష్టితో మమేకమై మాట్లాడటం. టీ.వీ. చూస్తూ కూర్చోవడం మౌనం కాదు. అది కొన్ని పాత్రలతోనో, వార్తలతోనో చేసే సంభాషణ. కంప్యూటర్‌ ముందు కూర్చోవడం మౌనం కాదు, అది వేయి గొంతుకల కబుర్లతో సమానం. మౌనంలో మాటలుండవు ఆలోచనలుండవు, అదో తపన్సు.మాట ఒకానొక వ్యక్తీకరణ మార్గం మాత్రమే. కానీ ఇదొక్కటే వ్యక్తీకరణకాదు. మాటలు నేర్పే సంస్థలున్నట్లు మౌనాన్ని నేర్పే పాఠశాలలు ఎక్కడా లేకపోవచ్చు...అయితే ఒక్కమాట...మౌనాన్ని మించిన కమ్యూనికేషన్‌ లేదు. మౌనం అర్థ అంగీకారం మాత్రమే కాదు. ఒక్కోసారి పూర్తి అంగీకారం కూడా. మౌనం అంటే ఆలోచనలు, కలలు, కోరికలు, భ్రమలు ముసుగులో బుర్రలోని సామా నంతా పక్కనపెట్టి, నిన్ను నీవు స్పష్టంగా చూసుకోవడం. ఇది ఆత్మసాక్షాత్కారమే. గతంలో అర్థం లేకుండా మాట్లాడినందుకో, అనవసరంగా తూలనాడినం దుకో పశ్ఛాత్తాపపడే వారెంతో మందిని చూస్తుంటారు. కానీ మౌనం కారణంగా బాధపడ్డ సందర్భాలు చాలా అరుదు. మనుషులందరూ మాటలకు అలవాడి పడిపోయారు. మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. మాట్లాడాలి. ఏదో ఒకటి మాట్లాడాలి. మాట్లాడకపోతే, వారి మీద వారికే అనుమానమోచ్చేస్తుంది. మౌనంగా ఉన్నట్టు. కనీసం కలలు కూడా కనలేరు. అలాంటి కలలు రావు. కలల మనుషుల ఆలోచనల్ని ప్రతిబింబిస్తాయి. మనుషుల జీవితాన్ని ఎత్తి చూపుతాయి. మౌనంలోని అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించాలను కునేవారు. ముందుగా మాటల మత్తునుంచి బయట పడాలి ఇది ఏ ఒక్కరోజులో సాధ్యం కాదు. మనం మాటల్ని తగ్గించుకోవాలి. పొదుపుగా వాడాలి. అవసరం ఉన్నంత వరకే మాట్లాడాలి. మౌనాన్ని అనుభూతించడానికి సంపూర్ణ ఆరోగ్యం కావాలి. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. రోగాల మనసు మౌనంగా ఉండలేదు. బాధతో మూలుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉం చుకోవాలి. మంచి అలవాట్లు పెంచుకోవాలి. కృత్రిమ జీవన శైలిని పదిలిపెట్టాలి. మౌనం మానవ సంబంధాల మీద సానుకూల ప్రభావం చూపిస్తుంది. నోరు జారడం వల్ల వచ్చే ఇబ్బందులుండవు. మాటతూలడం వల్ల పుట్టికొచ్చే విపరీత పరిణామాలుండవు. ఉద్యోగ జీవితంలో, వ్యక్తి గత జీవితంలో మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు మౌనంలోనే సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే ...మౌనంగా ఉన్నప్పుడే మనం బాగా ఆలోచించగలం, మాటలకు, ఆలోచనలకు అస్సలు పొత్తు కుదరదు. నాణ్యమైన యంత్రం శబ్దం చేయదు. సాఫీగా తనపని తాను చేసుకు పోతుంది. నిండుకుండ తొణకదు. స్థిరంగా ఉంటుంది. సమర్థులు కూడా అంతే. మౌనంగా తమపని తాము చేసుకు పోతుంటారు. 'మౌనం' మనలోంచి పుటుకొచ్చే అపారశక్తిని వృధాగా పోనివ్వదు. ఎందుకంటే -వృధా ఆలోచనలుండవు. వృధా మాటలుండవు. ప్రతి ఆలోచనా లక్ష్యంవైపే, ప్రతిమాటా అర్థవంతమే. అప్పుడు సమూహాల్లో కూడా ఒంటరిగా ఉం డగలం. అవసరమైతే ఒంటరి సమూహం కాగలం. ఏకాం తానికి, జనసంద్రానికీ తేడా ఉండదు.ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా..మౌనాన్ని పాటించగల శక్తి వస్తుంది...

ఆత్మ నిర్భరత

స్వశక్తిమీద నమ్మకంతో, మనిషి తనకుతానే సమగ్రమైన స్వయం సమృద్ధి సాధించుకోగల వీలుంది. ఆత్మ నిర్భరతగా వ్యవహరించే ఆ శక్తిని వివేకానందుడు ‘ఆత్మశ్రద్ధ’ అన్నారు. ముక్కోటి దేవతలపై మనుషులు కనబరచే భక్తి శ్రద్ధలకన్నా మిన్నగా అది దేశవాసులందరిలో ప్రస్ఫుటం కావాలని ఆయన ఆకాంక్షించారు. దయనీయమైన పరిస్థితుల వలయంలో చిక్కుకున్నప్పటికీ- ఇతరుల సహాయం కోసం పడిగాపులు పడుతూ నిరీక్షించకుండా, ప్రతికూలతలన్నింటినీ ప్రావీణ్యాలుగా మార్చుకోనీయగలదా సంకల్పశక్తి. ఆత్మనిర్భరత అలవరచుకుని ముందుకు సాగితే, తమ భవితకు తామే నిర్మాతలు కాగలరని యువత తెలుసుకోవాలన్నది వివేకానందుల ఉద్బోధ.
ఆత్మ నిర్భరత ఉన్నప్పుడు ఆ వ్యక్తి తనకు తానే యజమాని. మరొకరికి బానిసగా అతడుండలేడు. ఆధునిక భావకవి ఒకరు, అర్థవంతమైన అతిచిన్న మాటల్లో హెచ్చరికలా వినిపించినట్లు, ‘ఎవరో వస్తారని... ఏదో చేస్తారని’ ఎదురుచూసి మోసపోకూడదనే దృఢమైన నిర్ణయంతో తన కార్యాచరణను అతడు రూపుదిద్దుకొంటాడు. మనిషికి అసాధ్యమనిపించే పనులన్నింటినీ ఆత్మనిర్భరత సుసాధ్యం చేస్తుందని, అతడికి చేయలేనిదంటూ ఉండదని దలైలామా ఎప్పుడూ అంటారు.
ఆత్మనిర్భరతతో ఆరోగ్యకరమైన పరిణామాలు జీవం ఉన్న ప్రతిచోటా కనిపిస్తాయి. గొంగళిపురుగు సీతాకోక చిలుకలా మారడం చూస్తే అది గమనించవచ్చు. ఆ ప్రాణి గూడులాంటిదొకటి తనచుట్టూ నిర్మించుకుని, సుషుప్తిలోకి జారుకుని అచేతనావస్థలోకి చేరుకున్నట్లు అనిపించినా- స్వయం నిర్భరత చెక్కుచెదర నందుకే కొద్ది కాలానికి రంగులమయమైన రెక్కలతో వెనక్కివచ్చి ఎగురుతుంది. కొత్త జీవితం ప్రారంభిస్తుంది.
ఆత్మ నిర్భరత మనుషులంద రిలో నిద్రాణమై ఉండే గొప్ప శక్తి. ప్రేరణ లభించినప్పుడు అది పెల్లుబుకుతుంది. హనుమంతుడి వంటి మహా శక్తిశాలికి కలిగిన అనుభవం ఆ విషయమే చెబు తుంది. సహచరులు నీకది సాధ్యమే అని ప్రోత్సహించగా, శతయోజనాల దూరంలో సముద్రం మధ్య ఉన్న లంకాద్వీపానికి లంఘించి చేరుకున్నాడు. సీతమ్మ జాడ తెలుసుకుని రామకార్యాన్ని విజయవంతంగా నిర్వహించాడు.
అనిశ్చిత మనస్కుడై అర్జునుడు స్వయం నిర్భరతను కోల్పోరాదని, కార్యోన్ముఖుడై ఉండాలనే- కృష్ణపరమాత్ముడు గీతోపదేశం చేశాడు.
గ్రామీణుల ఆర్థిక దైన్యానికి కారణం వారు స్వశక్తిని నమ్మకపోవడమేనన్నారు గాంధీజీ. ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించమని స్వరాజ్య సాధనకోసం పోరాటం చేసిన సమయంలో జాతికి ఆయన పిలుపిచ్చారు.
ద్వితీయ ప్రపంచ సంగ్రామం ముగిసిన అనంతరం జర్మన్లు, జపనీయులు తమ వ్యవస్థలన్నీ కుప్పకూలి ఉండటాన్ని చూశారు. స్వయం నిర్భరత పోగొట్టుకోని కారణంగా, వాటన్నింటినీ అచిరకాలంలో పునర్నిర్మించుకున్నారు.
ఆత్మ నిర్భరత అనేది ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేయిస్తుంది. వేదాంతి ఎమర్సన్‌- తన చేదు అనుభవాలు జీర్ణించుకోవడానికి ఆత్మనిర్భరతవంటి దివ్యౌషధం ఒక్కటి మనిషికి చాలంటారు. కోట్లాది సంవత్సరాలుగా, కంటికి కనిపించే సంకటాలనైనా, కనిపించని కరోనాలవంటి మహమ్మారులనైనా ఎదుర్కొంటూ అతడు ఇప్పటికీ ఈ మహీతలం మీద మనుగడ సాగిస్తున్నాడంటే- ఆత్మనిర్భరతను కాపాడుకోవడం వల్లనే. అది తనలో ఉన్నంత కాలం మనిషి అద్భుతాలు చేస్తూ జీవిస్తూనే ఉంటాడు!.. ఆదిత్యయోగీ..
.
"ఎంత కఠినమైన పరిస్థితులైనా ఉండనీ,రానీ భగవంతుడు,మరియు ఆయనను ఆశ్రయించియున్న ధర్మం వైపు నిలబడి ఉంటే" "పొందే ఆ అనుభూతియే వేరు".

"వారు ఎటువైపు ఉన్నారు అనేది తెలుసుకోవటం పెద్ద కష్టమేమి కాదు".

"మనలో ఉండే తత్త్వజ్ఞాన రూప దీపం ఇచ్చే వివేకం తెలియజేస్తుంది"...
.

దేవుణ్ణి వెదికే ,,పూజించే,,, ఆరాధిస్తున్న వాడే దేవుడు 
..................

బయటి దేవుణ్ణి సృష్టించు కుంటున్నంత కాలం 
ఏ మనిషీ ఆధ్యాత్మిక ,,,నిర్వాణ పరిధులను తాకలేడు.
కానీ అసలు సిసలైన ఆధ్యాత్మికత నువ్వే భగవంతుడు
అని చెబుతుంది...చాలా మతాలు దీన్ని అంగీకరించడానికి 
ససేమిరా ఒప్పుకోవు..ఈ సత్యాన్ని ఒప్పుకోనంత కాలం 
అంతర్గత శాంతి అనేది మృగతృష్ణ లాంటిదే..

ఆగి ఉన్న నీళ్ళు ఏ రాయిని కూడా కదల్చ లేవు ..అదే
నీళ్ళు వంద కిలోమీటర్ల స్పీడ్ తో ప్రవహిస్తే 
పెద్ద పెద్ద కొండలనే నేలమట్టం చేస్తాయి..

తేడా అంతా వేగంలోనే వుంది...
మన చైతన్య,, శక్తి,, జ్ఞాన ,,,జాగృతి స్థాయిలు
పెరిగినప్పుడు ఏదైనాసరే,,, ఇలా అంటే 
అలా జరిగిపోతుంది...మన నోటి ప్రతి వాక్కు శాసించే 
శాసనం అవుతుంది....కనుసైగతో  అయిపోతుంది..

ఇలాంటి తాత్వికులను మనం భగవంతుళ్లని చేసి
ఆరాధిస్తూ,,,,పూజిస్తూ,,,,టెంకాయలు కొడుతూ
కూర్చున్నాం...కానీ అదే శక్తి,, చైతన్యం,,,మనలో కూడా
నిద్రాణంగా వుంది అని మాత్రం తెలుసుకునే సాధనాప్రయత్నం మాత్రం చెయ్యం..

నేను జాగింగ్ వెళ్ళినప్పుడు బిట్టూ ( కుక్క ) ఒక డేగ గుడ్లు పెట్టిన స్థలాన్ని కనుక్కుని అక్కడ వెళ్ళి ఆగింది..ఆ డేగ  భయపడి తాను పెట్టిన గుడ్ల మీద నుండి పారిపోయింది ..రెండు మూడు రోజులు చూసాను..అది మళ్లీ గుడ్ల మీదికి రాలేదు...నేను ఆ గుడ్లను తీసుకుని 
కోడి కింద పెట్టాను....అది పొదిగి పిల్లలను చేసింది...ఇప్పుడు ఆ డేగ  పిల్లలు ఆ కోడి పిల్లలతో పాటు
పెరిగాయి....అయితే వాటి సహజ గుణం అయిన ఎగరడం 
మర్చి పోయాయి..ఇప్పుడు ఆ డేగ పిల్లలు భూమ్మీద పొడుచుకుని పొడుచుకుని గింజలు తింటున్నాయి ..అయితే ఎగరడం ఆన్న దాని సహజ నైజం 
దాని మూలాల్లో ఎప్పటికీ దాగే వుంటుంది...సామాజికంగా ,,,పుట్టిన,, పెరిగిన ,,,జీవించిన వాతావరణం నుండి మనస్సు నిర్మాణం అవుతుంది..దాని నుండే నమ్మకాలు పుడతాయి...ఆ నమ్మకాలు ఎలా వుంటాయో అలా ఆ నమ్మకాలలోకి  మన శక్తి వెళ్ళి జీవిస్తూ వుంటుంది..అదే మన తల రాత అవుతూ వుంటుంది ..

ఎప్పుడు ఆ డేగ పిల్లలు తమ శక్తిని ( ఎగిరే ) గ్రహిస్తాయో అప్పుడు అవి ఆ కోడి తత్వాన్ని విచిపెడతాయి...

మనిషీ అంతే ఈ శరీర మూలాల్లోకి వచ్చి,, ఈ స్తూలమైన బూమ్మీద,,, స్తూల అనుభవాలను పొందుతున్నాడు...ఎప్పుడైతే అతని ధ్యాస ఈ స్తూల ప్రపంచం నుండి ఆత్మ వైపు మళ్ళిందో అప్పుడు తాను  శరీర తత్వాన్ని వదిలి  భగవత్ తత్వం లోకి  వెళ్ళిపోతాడు ...

కాబ్బాటీ జీవేడే దేవుడూ.....🙏🙏🙏🙏.....*
.

No comments:

Post a Comment