మీరు ఒక పుణ్యకార్యాచరణ కొరకు పీఠల మీద కూర్చోవడం అనేది ఒక మాట ఉంటుంది. కూర్చున్న తరువాత, మీరు ఏవరితో మాట్లాడుతారో, మీరు అప్పటి వరకు చేసిన పుణ్యకార్యాచరణ ఫలం వారి ఖాతాలో పడిపోతుంది. ఒక్క గురువుగారైతేనే మినాహాయింపు. పూజ చేస్తూ, మీరు అదే పనిగా సెల్ ఫోన్ పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నారనుకోండీ... మీరు చేసిన పూజ ఎక్కడెక్కడ ఎంత భాగం చేశారో... ఆ ఫలితం వాళ్ళ ఖాతాలో వేసేస్తారు. మీరు పూజ చేసి లేసేటప్పటికి మీకు సున్నా. ఏమీ ఉండదు. మౌనంగా ఉండాలి. అందుకే పూజాగృహంలోకి వెళ్ళి, మళ్ళీ పూజా గృహంలోంచి బయటికొచ్చే పర్యంతమూ మాట్లాడకూడదు.
No comments:
Post a Comment