Sunday, December 17, 2023

ఉపవాసం వల్ల మీ శరీరానికి మాత్రమే కాదు.. మీ మనసుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

 ఉపవాసం వల్ల మీ శరీరానికి మాత్రమే కాదు.. మీ మనసుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని, మనసుని ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది.
అంతా తెలుసుకొని కార్తీక సోమవారం నాడు పగటి పూట అంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదం లాంటి బలిని తిన్న కారణంగా శునకానికి పూర్వ జన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు. అదే విషయాన్ని శునకానికి చెప్పాడు. దాంతో తనకెలాగైనా మళ్ళీ పుణ్యం లభించేలా అను గ్రహించమంది ఆ శునకం. ఎన్నెన్నో సోమవార వత్రాలను చేసి పుణ్యం సంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి ధార పోశాడు వెంటనే కర్కశ శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్వ శరీరంతో కైలాసానికి చేరింది. ఇది స్కంద పురాణం చెబుతున్న సోమవార వ్రత కథ. దీనిలో అంతర్గతంగా సందేశాలు ఉన్నాయి. జీవితంలో ఎవరూ చెడు తిరుగుళ్ళు తిరగకూడదని, అలాచేస్తే జీవితం చరమాంకంలోనైనా కష్టాలు తప్పవని, అలాగే మరుసటి జన్మలో శునకం లాగానో, మరొక నీచ జంతువు లాగానో జన్మించాల్సి వస్తుందనే హెచ్చరిక కనిపిస్తుంది. అలాగే పండితుడు సోమవార వ్రత పుణ్యఫలాన్ని దయార్ధ్ర హృదయంతో, పరోపకారబుద్ధితో ధారపోయటాన్ని మనుషులంతా ఆదర్శంగా తీసుకోవాలన్న ఓ సూచన కూడా ఇక్కడ గమనార్హం. పురాణ కథలలో ఇలా దైవభక్తి మాటున సామాజిక హితోక్తి కూడా ఇమిడి ఉంటుంది.
ఆరోగ్య పరంగానూ  ఉపవాసం ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు.. ఆరోగ్య పరంగానూ చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు మనలో ప్రతి ఒక్కరికీ వారానికి ఒక రోజు సెలవు అనేది కచ్చితంగా ఉంటుంది. అలాగే మన జీర్ణ వ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు విరామం ఇవ్వాలని డాక్టర్లు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల మన జీర్ణ వ్యవస్థను తిరిగి బలంగా మారేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారవుతాం.
✍️✍️

No comments:

Post a Comment