Thursday, January 25, 2024

రవీంద్రనాథ్ ఠాగూర్* *అద్భుతమైన కవిత

 *రవీంద్రనాథ్ ఠాగూర్*
*అద్భుతమైన కవిత*

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

‼️"నేనిక లేనని తెలిశాక  విషాదాశ్రులను 
వర్షిస్తాయి నీ కళ్ళు..
కానీ  మిత్రమా! అదంతా నా కంట పడదు!
ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 

‼️నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 
నా పార్ధివదేహం 
ఎలా చూడగలదు?
అందుకే... అవేవో ఇప్పుడే పంప రాదా!

‼️నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ అప్పుడు
కానీ అవి నా చెవిన పడవు..
అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !

‼️నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !
కానీ నాకా సంగతి తెలీదు..
అదేదో ఇపుడే క్షమించేయలేవా?!

‼️నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది?
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !

‼️నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!

‼️సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక! 
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?

ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు, బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను, హాయిగా నీతో మెలుగుతాను!"

🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*ఇది విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*
                   
*ఈరోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో? మాట్లాడతాడో లేదో?*    
  
*ఏది శాశ్వతం?*
*ఎవరు నిశ్చలం?*

*ఇంకా ముఖ్యమైన విషయం ఒకటుంది*
*తల్లిదండ్రులు బతికుండగా వారితో ఎక్కువ గడపలేని సంతానం ఆ తరువాత భోరున ఏడవటం ప్రతీ కుటుంబంలోనూ మనం గమనించవచ్చు! అదేదో ముందే గడిపితే బాగుంటుంది కదా అని విశ్వకవి ఈ కవిత ద్వారా మానవాళికి దారిచూపించాడు!*


🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Wednesday, January 24, 2024

ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి?✍️* *ఒక శిలకు ప్రాణం పోయడం అనేది సంగతమైన విషయమేనా?* *ప్రాణం పోసిన తరువాత ఆ శిలలో దివ్య శక్తులు వస్తాయా?

 *📡ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటి?✍️*

*ఒక శిలకు ప్రాణం పోయడం అనేది సంగతమైన విషయమేనా?*

*ప్రాణం పోసిన తరువాత ఆ శిలలో దివ్య శక్తులు వస్తాయా?*

*ఒకొక్క ప్రశ్నకు సమాధానం వెదుక్కుంటూ వెళదాము.  మొదట ఈ ప్రాణ ప్రతిష్ట ప్రక్రియ ఏమిటో చూద్దాము.  ఏదైనా ఆలయంలో  మనం ఒక విగ్రహాన్ని ప్రతిష్ట చేసే సమయంలో ప్రాణ ప్రతిష్ట చేయడానికి ఆగమాలను అనుసరిస్తారు.  ఆగమాల ప్రకారం ఈ కార్యక్రమం జరుగుతుంది.  ఈ కార్యక్రమాలలో ఉపయోగించే విధానాలు.. మంత్ర యంత్ర తంత్రాలు.  ముందుగా ఈ మంత్ర, యంత్ర తంత్రాల గురించి తెలుసుకుందాం.  మంత్రం ఇది సౌండ్ ఎనర్జీకి సంబంధించినది.  మంత్రం ద్వారా ఆ విగ్రహంలో మరియు ఆ ప్రాంగణంలో సౌండ్ ఎనర్జీని ప్రవేశ పెట్టడం జరుగుతుంది.  యంత్రం ఇది ఎనర్జీని తీసుకుని ఎనర్జీని ఇచ్చే ప్రక్రియ. దీనికోసం అనేక లోహాలను, మణులను,  వివిధ వస్తువులను వాడతారు.  ఇది ఒక బ్యాటరీలాంటిది అనుకుంటే మంత్రాల ద్వారా బ్యాటరీ చార్జ్ చేయబడుతుంది.  అది అక్కడకు వచ్చినవారికి దానిలోని శక్తిని విడుదల చేస్తుంది.  ఇక మూడవదైన తంత్రం.  తన్ అంటే శరీరం... శరీరంనుండి ప్రాణ శక్తిని పైన చెప్పిన రెండు విధాల ద్వారా ఆ విగ్రహంలో ప్రవేశపెడతారు.*  *అక్కడ జరిగే హోమాలు, హోమం చేసేవారు, యజమానులు వీరినుండి ప్రాణ శక్తి ఆ విగ్రహానికి చేరుతుంది.  అందుకే ఈ ప్రక్రియ జరిపేవారు, జరిపించేవారు అత్యంత నిష్టతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.  ఉదాహరణకు మోడీగారిని తీసుకుంటే ఆయన 11రోజులు దీక్షలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.* *అంతే కాకుండా ఆయన అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి అక్కడి శక్తిని తనలోకి తీసుకుని ప్రాణ ప్రతిష్టకు వస్తున్నారు.  ఆయన దర్శించిన స్థలాలలో కొన్ని శ్రీరామచంద్రుడు తిరిగిన స్ధలాలు, ప్రతిష్టచేసిన స్ధలాలు.  ఈ ప్రాణ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరినుండి విగ్రహానికి ప్రాణశక్తి బదలీ అవుతుంది.  ఆ విగ్రహం వారినుండి ఇది కోరుకుంటుంది.  ఈ కార్యక్రమం తరువాత ప్రాణ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.*   

*ప్రాణ ప్రతిష్ట జరిగిన తరువాత ఆ విగ్రహాన్ని దర్శించినవారినుండి కొంత యనర్జీనితీసుకుని కొంత ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది.  అందుకే మన దేవాలయాలకు అంత ప్రాధాన్యత.  ఆ శిలలో ఉన్న అణువులు. ఆ శిల క్రింద ఏర్పరచిన లోహాలు, మణులు, యంత్రాలు, వాటిలో నింపిన సౌండ్ ఎనర్జీ ఇవన్నీ కలసి ఆ శిలను దర్శించినవారిలో చాలా మార్పులు తీసుకువస్తాయి.  ఇటువంటి శక్తి ప్రకృతిలో కూడా ఉంటుంది.  ఆ ప్రదేశాలను దర్శించినప్పుడు కూడా ఇటువంటి మార్పులు దర్శించినవారిలో వస్తాయి.*

*మరొక ఉదాహరణ చూద్దాం.  కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నించిన కొందరు పరిశోధకులు, కొందరు పర్వతారోహకుల అనుభవాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి.  వారి గోళ్ళుపెరగడం, జుట్టుపెరగడం,  త్వరగా ముసలి తనం రావడానికి ఇవి గుర్తులు.  అలాటి ప్రదేశాలకు వెళ్లాలంటే సాధనచేసి వెళ్ళడం మంచిది.  కైలాష్ ను దర్శించినవారిలో కూడా అనేక ఆధ్యాత్మిక మార్పులను మనం గమనించవచ్చు.*

పుర వర్ణనలు కావ్యాలు, త్రయాలు

 *పుర వర్ణనలు కావ్యాలు** 


1. అయోధ్య పుర వర్ణన నిర్వచనోత్తర రామాయణం 

2. కైలాస వర్ణన బసవపురాణం 

3. శ్రీశైల వర్ణన పండితారాధ్య చరిత్ర


4. కుసుమపుర వర్ణన దశకుమార చరిత్ర 

5. గోదావరి వర్ణన మార్కండేయ పురాణం 

6. భద్రావతి నది వర్ణన జెమిని భారతం 

7. సువర్ణముఖి నది వర్ణన, గంగానది వర్ణన - శ్రీకాళహస్తి మహత్యం 

8. బైమీనది వర్ణన, తుంగభద్ర నది వర్ణన  పాండురంగ మహత్యం 

9. యమునా నది వర్ణన రాజశేఖర చరిత్ర 

10. శుక్తిమతి నది వర్ణన- వసు చరిత్ర
11. బోయపల్లె వర్ణన వాల్మీకి చరిత్ర
12. చంద్ర ప్రస్తపుర వర్ణన విజయ విలాసం
13. తంజాపుపురవర్ణన రఘునాథ నాయకాభ్యుదయం (ద్విపద )
14. తంజాపుర వర్ణన మన్నారు దాస విలాస ప్రబంధం


*త్రయాలు*


1. *కవిత్రయం* : నన్నయ, తిక్కన, ఎర్రన


2. *శైవ కవిత్రయం* :మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమన, నన్నెచోడుడు

3. *పండిత త్రయం* : మల్లికార్జున పండితుడు, శివలెంక మంచన, శ్రీపతి పండితుడు
4. *శతక కవిత్రయం :* మల్లికార్జున పండితుడు, యధావాక్కుల అన్నమయ్య, పాల్కురికి సోమన

5.  *పురాణ త్రయం:* పాల్కురికి సోమన, మారన,పోతన 

6. శ్రీ *శ్రీ దృష్టిలో కవితా త్రయం* : తిక్కన, వేమన,గురజాడ

7. *నవ్య కవిత్రయం* : కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం, పంతులు చిన్నయ్య సూరి


8. *కన్నడ కవిత్రయం* : పంప, పొన్న, రన్న

9.  *ముని త్రయం( తెలుగు):* నన్నయ ,అధర్వనాచార్యులు, అహోబిల పండితుడు

10. *ముని త్రయం (సంస్కృతం):* పాణిని,కాత్యాయనుడు ( వర రుచి, పతాంజలి)

11. *పద కవిత్రయం* : తాళ్లపాక అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య 


12. *వ్యాస కవిత్రయం :* సామినేని ముద్దు నరసింహనాయుడు, జియ్యరు సూరి, పరవస్తు వెంకట రంగాచార్యులు 


 *13. కవి రాజ త్రయం* :
నన్నెచోడుడు, శ్రీకృష్ణదేవరాయలు, రఘునాథ నాయకుడు

14. *సంగీత త్రయం* : త్యాగరాజు, శ్యామశాస్త్రి,
 ముత్తుస్వామి

15. *సుభాషిత త్రయం :* ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన,
 ఎలకూచి బాల సరస్వతి

ఆ గుడిలో దేవుడు లేడు - రవీంద్రనాథ్ ఠాగూర్

 ఆ గుడిలో దేవుడు లేడు
- రవీంద్రనాథ్ ఠాగూర్

'ఆ గుడిలో దేవుడు లేడు' సాధువు ప్రకటించాడు 
రాజు కోపంతో మండిపడ్డాడు. 
'దేవుడు లేడా ? ఏమంటున్నావు, నాస్తికునిలాగా మాట్లాడుతున్నావా?'
రత్నఖచిత సింహాసనం మీద ధగధగ మెరిసే బంగారు విగ్రహం కనిపిస్తున్నా, కళ్ళముందు ఏమీ లేదంటావా?

ఏమీలేదనడం లేదు. రాజరికపు అహంకారం నిండిపోయిందక్కడ 
రాజా, నిన్ను నీవే ప్రతిష్టించుకున్నావక్కడ, ఈ లోకపు దేవుణ్ణి కాదు. 
సాధువు సమాధానమిచ్చాడు

రాజు భృకుటి ముడిచాడు, 'ఆకాశాన్ని తాకే మహా హర్మ్యం పైన 
ఇరవై లక్షల బంగారు నాణేలను వెదజల్లాను 
పూజలు అన్నీ చేసి దేవుడికి అర్పించాను 
అయినా మహా ఆలయంలో దేవుడు లేడని 
అంటావా, ఎంత ధైర్యం నీకు?'

సాధువు ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు 
‘ఇదే సంవత్సరం ఇరవై లక్షల మంది జనం నీ రాజ్యంలో కరువు వాతబడ్డారు 
గూడులేక, తిండి లేక నిరుపేద జనం 
సహాయం కోసం నిన్ను శరణు కోరుకుంటే 
నువ్వు వాళ్ళని తరిమివేశావు 
దిక్కులేని జనం 
అడవులలో, గుహలలో, వీధులలో చెట్లకింద,
శిథిలమైన దేవాలయాల్లో తలదాచుకున్నారు 
అదే సంవత్సరం నువ్వు ఇరవై లక్షల బంగారు నాణేలు వెచ్చించి 
నువ్వు నీ గుడిని నిర్మించావు’

ఆ రోజే దేవుడు ప్రకటించాడు 
'నా శాశ్వత నివాసం
వినీలాకాశపు నక్షత్రాలతో నిత్యం ప్రకాశిస్తుంది 
సత్యం, శాంతి, కరుణ, ప్రేమ 
విలువలే నా నివాసానికి పునాదులు 
దిక్కులేని దీనులకు గూడు కల్పించలేని 
పరమ లోభి నాకు గుడి కట్టించగలడా?

'ఆ రోజే దేవుడు నీ గుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు 
వీధులలో, చెట్ల కింద తలదాచుకున్న 
పేదలలో కలిసిపోయాడు 
ఇప్పుడు నీ గుడి
మహాసముద్రాలలో తేలే నురగలాంటిది 
అహంకారం, ధన మదం నిండిన గాలి బుడగ  నీ గుడి’

రాజు ఆగ్రహంతో కేకలు పెట్టాడు 
‘పనికిమాలిన మూర్ఖుడా 
నా రాజ్యం నుండి వెంటనే వెళ్ళిపో, నిన్ను బహిష్కరిస్తున్నాను’

సాధువు ప్రశాంతంగా సమాధానమిచ్చాడు 
'దేవుడినే వెళ్ళగొట్టిన నీ రాజ్యం నుండి 
భక్తుడిని కూడా తరిమివేయి'

(123 సంవత్సరాల క్రితం, ఆగస్టు 1900 లో కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన 'దీనో దాన్' ( దీనులకు దానం) కవిత నుంచి. మెయిన్ స్ట్రీమ్ పత్రిక 2020 ఆగస్టు 8 నాటి సంచికలో ఈ కవితనీ, సందీప్త దాస్ గుప్తా ఆంగ్లానువాదాన్నీ ప్రచురించింది)

తెలుగు అనువాదం: ఎస్ కె

వయసు రావడం కాదు పోవడమే అనే సత్యాన్ని గుర్తించండి

 *వయసు రావడం కాదు పోవడమే అనే సత్యాన్ని గుర్తించండి* 

ప్రతి ఏడాదీ పుట్టినరోజున సంబరపడి, వేడుక జరుపుకోవడం మనిషికి అలవాటు. పుట్టిన రోజున దీపాలు ఆర్పేవాళ్లు కొందరైతే, దీపాలు వెలిగించేవాళ్లు కొందరు! 

దీపాలు ఆర్పేవారు క్రమంగా ఆయువు ఆరిపోతోందని, ఈ సత్యాన్ని గ్రహించాల్సిందిగా హెచ్చరిక చేస్తున్నారనిపిస్తుంది. 

దీపాలు వెలి గించేవారు ఇకనైనా మేల్కొని శేష జీవితాన్ని సార్థకం చేసుకొమ్మని ప్రబోధిస్తున్నట్లు అనిపిస్తుంది.

మనిషి జనన మరణాలు అతడి అధీనంలో ఉండవు. పుట్టిన ఏ వ్యక్తి లేదా ప్రాణి అయినా ఎంతకాలం బతుకుతారో, ఎప్పుడు తనువు చాలిస్తారో ఎవరికీ తెలియదు. 

నూరేళ్లు బతుకుతారని ఆశించినవారు అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడిపోవడం, చావునోట్లో తలపెట్టినవారు బతికి నూరేళ్లు జీవించడం లోకంలో అందరూ చూస్తున్నదే. 

ఆరోగ్యంగా ఉన్నవాడు చావడనే నమ్మకం లేదు. రోగగ్రస్తుడు బతికినా ఆశ్చర్యం లేదు. కనుక మరణం ఎవరికీ అంతుపట్టని బ్రహ్మపదార్థం. 

ఎవరికీ అందనంత ఎత్తులో ఆకాశంలో విహరిస్తాయి పక్షులు. అయినా వాటికీ మరణం తప్పదు. 

ఉన్నచోటు సురక్షితమా అరక్షితమా అనే విచక్షణ మరణానికి ఉండదు. ఎన్నో భోగాలను అనుభవిస్తూ సింహాసనంపై కూర్చొన్న రాజుకు కూడా అకాల మృత్యువు సంభవించవచ్చు. 

ఏ రక్షణా లేని పూరి గుడిసెల్లో ఎన్నో అపాయాల మధ్యన నివసించే నిరుపేదలు దీర్ఘకాలం బతకవచ్చు. మరణానికి ఏదీ ప్రతిబంధకం కాదు.

వివేకవంతుడైన మనిషి తనకు ఎప్పటికైనా మరణం తప్పదనే సత్యాన్ని జీర్ణించుకోవాలి. 

బతికినంతకాలం మంచిపనులు చేసి, ఇతరులకు తోడ్పడాలి. భగవంతుడు ఇచ్చిన మానవజన్మను సార్థకం చేసుకోవడానికి కృషి చేయాలి. 

చచ్చిన తరవాతా అందరూ స్మరించే విధంగా కీర్తిని నిలుపుకోవాలి. 

వయసు రావడం కాదు, క్రమంగా తగ్గిపోవడమే అనే వాస్తవాన్ని గ్రహించి, ఆదర్శమయమైన జీవితాన్ని గడపాలి. 

అప్పుడే మనిషి పుట్టినందుకు సార్థకత!

శతమానం భవతి*— *త్రిశతమానం భవతి

 *శతమానం భవతి*— *త్రిశతమానం భవతి*

మనిషి జీవితంలో రెండే వాస్తవాలు- ఒకటి పుట్టుక, రెండు మరణం. మరణాన్ని జయించాలన్నది మనిషి చిరకాల వాంఛ.

మహాభారతంలోని ఉదంకోపాఖ్యానం, క్షీరసాగర మథనం, సర్పయాగం- మనిషి కోరికను ప్రతిఫలించే ఘట్టాలు. మరణం అంటూ లేని స్థితిని- అమరత్వమని, తిరిగి పుట్టుక లేని స్థితిని మోక్షమనీ చెబుతారు.
*‘తనువే నిత్యముగా ఒనర్పుము... అది లేదా... చచ్చి జన్మింపకుండ ఉపాయంబు ఘటింపుము’"* అని శ్రీకాళహస్తీశ్వర శతకంలో ధూర్జటి వెలిబుచ్చింది- ఆస్తికులందరి కోరిక.

రావణాసురుడు, హిరణ్యకశిపుడు వంటి దానవులు ఆరాటపడింది- అమరత్వం కోసం.

*శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతిం చెదన్‌’* అని పోతన వంటి కవులు తపించింది- మోక్ష స్థితికోసం.

రాక్షస గురువు శుక్రాచార్యుడు సాధించిన *‘మృతసంజీవని విద్య’* అమరత్వ సాధనలో తొలి విజయం. అయితే, ఆ విద్య- మరణించినవారిని అదే స్థితిలో తిరిగి బతికించడానికే తప్ప వృద్ధాప్యాన్ని, మరణాన్ని నివారించడానికి పనికిరాలేదు. పైగా యుగాలు గడిచేకొద్దీ మనిషి ఆయుర్దాయం తరిగిపోతూ వచ్చింది.

శ్రీ కృష్ణుడు 125 ఏళ్లు జీవించాడని హరివంశం విష్ణుపురాణం భాగవతం స్పష్టం చేశాయి. అది ఆయన నడి వయస్సు. ధర్మ రాజుకు 80వ ఏట పట్టాభిషేకం జరిగిందని పరిశోధకులు తేల్చారు. ఆ పై 36 ఏళ్లు ఆయన పరిపాలన సాగించాడు.

భీష్మపితామహుడు తన 170వ ఏట దేహ త్యాగం చేశాడని భారతం చెబుతోంది. ఆయనది స్వచ్ఛంద మరణం. అవి ద్వాపరయుగం నాటి ఆయుర్దాయాలు. ఈ ‘కలియుగమందు మానవులు- అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు’ అంది భాగవతం. అల్పతరమంటే ఓ నూరేళ్లని దాని లెక్క- అదైనా, పద్ధతిగా జీవిస్తే. ‘ఎవడు బతికేడు యాభైలు మూడు’ అని శ్రీశ్రీ అన్నది అందుకే!

పద్ధతిగా జీవించడమంటే- ‘ధర్మబద్ధంగా...’ అని అర్థం. ‘తపమునను, బ్రహ్మచర్య వ్రతమున, హిత మితాశనమున(మితభోజనం), రసాయన అభ్యాసమునను(ఔషధ విజ్ఞానం వల్ల) పెరుగును ఆయువు’ అంది భారతంలోని ఆనుశాసనిక పర్వం.*‘యుక్తాహార విహారస్య...’* శ్లోకంలో గీతాచార్యుడు చెప్పిందీ అదే. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే మాటను వందలసార్లు అంటూ ఉంటాం, వింటూ ఉంటాం.

కాని దాని తాత్పర్యం తలకెక్కాలంటే మాత్రం మనిషికి అరవై ఏళ్లు పడుతోంది. ఆ సత్యాన్ని పాతికేళ్లకే ఒంటపట్టించుకొన్నవాడు నిశ్చయంగా శతాయువు అవుతాడని ఆయుర్వేదం హామీ ఇస్తోంది. *‘చరమధాతు రక్ష(శుక్ల ధాతువు సంరక్షణ) సమ్మతినొనరించు సజ్జనుండు వర్షశతము బ్రతుకు!’* అని హితవు చెబుతోంది చారుచర్య. ఈ అన్నింటినీ కలిపి ఆలోచిస్తే ఆ వందేళ్లు సైతం పూర్తిగా ఎందుకు బతకలేకపోతున్నామో- మనకే తెలిసిపోతుంది. 

బతుకు నావను రేవులోని వ్యసనాల మోకుకు ముడిపెట్టి, నూరేళ్ల ఆయుర్దాయపు ఆవలి తీరానికి చేరుకోవాలని ఎంత ఆరాటపడితే మాత్రం... ఏం ప్రయోజనం?

Thursday, January 18, 2024

ప్రియ పుష్పాలు

 🍁  *ప్రియ పుష్పాలు*   🍁

✍️ మురళీ మోహన్

🙏పూజకు సిద్ధమై పోయారా?మరి పూజకు పూలు తెచ్చారా,తేలేదా? మరైతే పదండి మీ తోటకి పూలు తెద్దాం.అన్నట్టు విష్ణువుకి  ఇష్టమైన పూలేంటో తెలుసా!
 ఇవిగో.....👇

*అహింస  ప్రథమం  పుష్పం  పుష్పం  ఇంద్రియ  నిగ్రహః* 
*సర్వ భూత  దయా పుష్పం  క్షమా  పుష్పం  విశేషతః* 
*జ్ఞాన  పుష్పం  తప: పుష్పం      శాంతి  పుష్పం  తథైవ  చ*  
*సత్యం  అష్ట విధం  పుష్పో: విష్ణో హో  ప్రీతి కరం  భవేత్ !!*

*1.అహింసా పుష్పం:*
ఏ ప్రాణికీ మానసికంగా బాధ కలిగించకుండా ఉండటమేదేవునికి సమర్పించే ప్రధమ పుష్పం.

 *2.ఇంద్రియ నిగ్రహం:*
చేతులు, కాళ్లు మొదలైన కర్మేంద్రియాలు లను అదుపులో ఉంచుకోవడమే దేవుని అందించాల్సిన రెండో పుష్పం.

 *3.దయ:*
కష్టాల్లో, బాధలో ఉన్న వారిబాధను తొలగించడానికి చేసేదే దయ.ఇది దేవునికి అర్పించే మూడో పుష్పం.

 *4.క్షమ:*
ఎవరైనా మనకి అపకారం చేసినా,ఓర్పుతో సహించడమే క్షమ.ఇది దేవునికి సమర్పించే నాలుగవ పుష్పం.

 *5.ధ్యానం:*
ఇష్ట దైవాన్ని నిరంతరం మనసులో తలచుకుంటూ ఆయన మీదే మనసు లగ్నం చేయడం.ఇది దేవుని అందించే ఐదో పుష్పం.

 *6.తపస్సు:*
మానసిక ( మనస్సు),వాచిక (మాట),కాయక( శరీరం)లకు నియమాలు ఉండం తపస్సు.ఇది దేవునికిచ్చే ఆరవ పుష్పం.

 *7.జ్ఞానం:*
పరమాత్మ గురించి సరైన తెలివితో ఉండడమే జ్ఞానం.ఇది దేవుని అర్చించాల్సిన ఏడవ పుష్పం.

 *8.సత్యం:*
ఇతరుల కు బాధ కలుగకుండా నిజాన్ని చెప్పడమే సత్యం.ఇది దేవునికి అలంకరించాల్సిన ఎనిమిదవ పుష్పం.
  
అవి చాలా అరుదైన పుష్పాలు,అవి మా తోటలో *అన్ని లేవే* అంటున్నారా!మరేం పర్లేదు,ఇవాళే మొక్కలు నాటండి.🌱🌾🌴
త్వరలోనే మిగతా పూలు పూయించండి. మీరంతా  పూజ వచ్చే  వాటితోనే చేస్తారని ఆశిస్తూ    👍

Wednesday, January 17, 2024

సూర్య నమస్కారాలు,12 రకాల ఆసనాల ప్రయోజనంలు

 🌞☀️🌞☀️🌞☀️🌞☀️🌞
*🌺🚩సూర్య నమస్కారాలు🚩🌺*
*✍️HDC*
*🌞సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా🌺*... 

*🌺అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి🌺*.

*🚩ఆసనానికో ప్రయోజనం🚩* :-

*"సూర్య నమస్కారం" అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! 🚩వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి🥀. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం*...

*🚩ఒకటి, 🚩పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి*.

*🚩రెండు, 🚩పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి*.

*🚩మూడు, 🚩పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి*.

*🚩నాలుగు, 🚩తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి*.

*🚩ఐదు, 🚩ఎనిమిది : గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.*

*🚩ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.*

*🚩ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది*.

*🌞మరెన్నో లాభాలు :-*

*🚩సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు*... 
*మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు*. 

*🚩"సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.*

*🚩ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి*.

*🚩1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-*

*🔥సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి*.

*🚩2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-*

*🔥కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు*.

*🚩3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-*

*🔥శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి*.

*🚩4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-*

*🔥ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి*.

*🚩5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-*

*🔥కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి*.

*🚩6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-*

*🔥ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి*.

*🚩7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-*

*🔥శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి*.

*🚩8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-*

*🔥ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి*.

*🚩9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-*

*🔥నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి*

*🚩10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-*

*🔥మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి*.

*🚩11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-*

*🔥రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి*.

*🚩12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః)* :-

*🔥నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి*.

*✍️హిందూ ధర్మచక్రం*
🕉️🌞🕉️🌞🕉️🌞🕉️🌞🕉️
 _♨️ఆ ఐదుగురు ధనవంతుల సంపద డబుల్.. 200 ఏళ్లయినా పేదరికం అలానే❗_*
❈──────🎀─────❈
_➤ప్రపంచంలో అత్యంత ధనవంతులైన తొలి ఐదుగురి నికర సంపద 2020 తర్వాత రెండింతలకు పైగా పెరిగినట్లు ఆక్స్ఫామ్ నివేదిక (Oxfam report) వెల్లడించింది. అదే సమయంలో 500 కోట్ల మంది ఆదాయాలు పడిపోయాయని తెలిపింది._

*_➤నివేదికలోని వివరాల ప్రకారం.. గత మూడేళ్లలో 148 టాప్ కంపెనీలు 1.8 లక్షల కోట్ల డాలర్ల లాభాలను ఆర్జించాయి. ఏటా సగటున 52 శాతం వృద్ధి నమోదైంది. మరోవైపు లక్షలాది మంది ఉద్యోగుల వేతనాలు తగ్గడం గమనార్హం._*

_➤ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అంతరాలను వివరిస్తూ  ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum)' సదస్సుకు ముందు ఆక్స్ఫామ్ సోమవారం 'ఇనీక్వాలిటీ ఇంక్.,' పేరిట నివేదికను విడుదల చేసింది._

*✍🏻నివేదికలోకి కీలకాంశాలివే..*
━━━━━━━━━━━━━━━━
_➨ప్రపంచంలోని 96 ప్రధాన కంపెనీలు ఆర్జిస్తున్న ప్రతి 100 డాలర్ల లాభంలో 82 డాలర్లు సంపన్న వాటాదారులకే చెందుతున్నాయి._

*_➨ప్రపంచంలోని బిలియనీర్లు 2020తో పోలిస్తే 3.3 ట్రిలియన్ డాలర్ల అదనపు సంపదను పోగేసుకున్నారు._*

_➨తొలి 10 అతిపెద్ద కంపెనీల్లో ఏడింటిలో ఒక బిలియనీర్ సీఈఓ లేదా ప్రధాన వాటాదారుడిగా ఉన్నారు._

*_➨ఐదు మంది కుబేరులు ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, జెఫ్ బెజోస్, లారీ ఎలిసన్, మార్క్ జుకర్బర్గ్ సంపద గత మూడేళ్లలో 464 బిలియన్ డాలర్లు పెరిగింది._*

_➨ప్రపంచంలోని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడానికి  మరో రెండు శతాబ్దాలు పడుతుంది. తొలి ట్రిలియనీర్ మాత్రం వచ్చే దశాబ్దంలో అవతరించే అవకాశం ఉంది._

*_➨‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD)' సభ్యదేశాల్లో కార్పొరేట్ పన్ను 1980లో 48 శాతం ఉండగా.. తాజాగా అది 23.1 శాతానికి తగ్గింది._*

_➨ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 మిలియన్ల మంది శ్రామికులు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే స్థాయి వేతనాన్ని పొందలేకపోతున్నారు. ఫలితంగా వీరంతా దాదాపు లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు_

*_➨ప్రపంచ జనాభాలో ఆస్ట్రేలియాతో పాటు ఉత్తరాది దేశాల వాటా 21 శాతమే అయినప్పటికీ.. సంపద మాత్రం 69 శాతం వీటి దగ్గరే ఉంది. ప్రపంచ బిలియనీర్ల సంపదలో 74 శాతం ఈ దేశాలకు చెందినవారిదే._*

_➨ప్రపంచంలోని ఐదుగురు అత్యంత ధనవంతులు రోజుకు 1 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తే వారి సంపద పూర్తిగా కరిగిపోవడానికి 496 ఏళ్లు పడుతుంది._

*_➨ప్రపంచవ్యాప్తంగా మహిళల కంటే పురుషుల దగ్గర 105 ట్రిలియన్ డాలర్ల అధిక సంపద ఉంది. ఈ తేడా అమెరికా ఆర్థిక వ్యవస్థ కంటే నాలుగింతలు అధికం._*

_➨ప్రపంచంలో 43 శాతం 'ఫైనాన్షియల్ అసెట్స్' తొలి 1 శాతం మంది ధనవంతుల వద్దే ఉంది._

_వాకింగ్ చేసినా చేయకపోయినా ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి!!_

 🚶‍♀🚶‍♂ *_వాకింగ్ చేసినా చేయకపోయినా ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి!!_* 🏃‍♀🏃‍♂

         _మీకు హిపోక్రాట్స్ తెలుసా? ఆయ‌న ఇప్ప‌టి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవ‌త్స‌రానికి చెందిన వాడు. అప్ప‌ట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయ‌న్ను ఫాద‌ర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అస‌లు విష‌యం ఏంటో తెలుసా..? ఏమీ లేదండీ.. స‌ద‌రు హిపోక్రాట్స్ అనే ఆయ‌న వాకింగ్ గురించి ఓ కొటేష‌న్ చెప్పారు. అదేమిటంటే.. వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్‌.. అని ఆయ‌న అన్నారు. అవును, మీరు విన్న‌ది నిజమే. ఈ క్రమంలోనే ప్ర‌తి రోజూ క‌నీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయ‌న చెప్పారు. మ‌రి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!_

*_1. వాకింగ్_* రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

*_2. నిత్యం_* వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన ప‌లు నాడులు కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే కాళ్ల‌తో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.

*_3. నిత్యం_* ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.

*_4. వాకింగ్_* చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది. దీంతో అదే ఆక్సిజ‌న్ ర‌క్తంలో చేరి అది ఊపిరితిత్తుల‌కు అందుతుంది. ఈ క్ర‌మంలో స‌ద‌రు ఆక్సిజ‌న్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష‌, వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపుతుంది. అలాగే ఇత‌ర ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.

*_5. డ‌యాబెటిస్_* ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌. 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.

*_6. నిత్యం_* క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కం పోతుంది. విరేచ‌నం రోజూ సాఫీగా అవుతుంది.

*_7. నిత్యం_* 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.

*_8. నిత్యం_* వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.

*_9. బ్యాక్ పెయిన్‌తో_* స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

*_10. నిత్యం_* వాకింగ్ చేయడం వ‌ల్ల ఎప్పుడూ డిప్రెష‌న్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వ‌స్తార‌ట‌. వారు హ్యాపీగా ఉంటార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. క‌నుక నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

Friday, January 12, 2024

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*అందరికీ శుభోదయం!*
      ➖➖➖➖✍️

*మనకు ప్రతిరోజు శుభకరంగా అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా...? ప్రతిక్షణం నేను గెలుస్తున్నాను, నా కార్యక్రమాలు అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతున్నాయి, అని ఒకటికి పది సార్లు మనం మనసులో అనుకోవడం ద్వారా ఈ రోజే కాదు ప్రతి రోజు కూడా మనం సూపర్ సక్సెస్ కావచ్చు, కావాలంటే ప్రయత్నం చేయండి, "సాధనమున పనులు సమకూరు ధరలోన", అలానే *యద్భావంతద్భవతి", మీ భావం ఎలా ఉంటే ఫలితం కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుంది.... నేను గెలుస్తున్నాను అంటే గెలుస్తారు సందేహిస్తే ఖచ్చితంగా ఓడిపోతారు....*
 *మీ ఇష్ట దైవం ఆశీస్సులు మీకు ప్రతిక్షణం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...* *సర్వే జనాః సుఖినోభవంతు...*
*లోకాః సమస్తాః సుఖినో భవంతు!....!*

 _VSB TV SURESH_ 9502209222

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*అందరికీ శుభోదయం!*
      ➖➖➖➖✍️
*మనలో చాలామంది  నేనేంటో నీకు తెలుసా...? నా గురించి నీకు తెలుసా...? నా బ్యాక్ గ్రౌండ్ నీకు తెలుసా...? నేను తలచుకొంటే నిన్ను ఏమైనా చేయగలను... అంటూ ఉంటారు... కానీ నేనేంటో అంటే వాళ్ళు ఏదో ఊహించేసుకుంటున్నారని, నా బ్యాక్ గ్రౌండ్ అంటారుగా వాడు చేస్తే కనీసం నాలుగైదు గంటలు భరించలేని బ్యాగ్రౌండ్ (బిందువులు, అభిమానులు,భజన బ్యాచ్ తదితరులు)అది వాడు ఆలోచించడు, ఈ సృష్టిలో మహామహులే పుట్టి మట్టిలో కలిసి పోయారు... మనమెంత... మనం చస్తే బాగా చచ్చాడు రా... అన్నట్టు ఉండకూడదు, అయ్యో చనిపోయాడా చాలా మంచివాడు అని గౌరవించేలా ఉండాలి, అలా బ్రతికే దమ్ము మనలో ఎంతమందికి ఉంది...? మనల్ని సృష్టించిన ఆ దేవుడే మనపై చాలా ప్రేమతో ఉంటాడు,ఎదుటివాడి నోటి దగ్గర అన్నం లాక్కోవడం కాదు, పెట్టడం తెలిసిన వాడికి మాత్రమే మానవతా విలువలు ఉన్నట్టు లెక్క... అదే మనలో ఎంతమందికి ఉంది...?*

  *ఈరోజు మీరు చేసే ప్రతీ పనిలో విజయం సాధించాలి అని, మీ ఇష్ట దైవం ఆశీస్సులు మీకు ప్రతిక్షణం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...సర్వే జనాః సుఖినోభవంతు...*
*లోకాః సమస్తాః సుఖినో భవంతు!....!*

 _VSB TV SURESH_ 9502209222

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Monday, January 8, 2024

అందుకే ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే మనం ఎవరో తెలుసుకుందాం.....

 👉ఒక్కసారి మనసుపెట్టి ఇది చదవండి.
         అసలు ఎవరి కొరకు ఎవరు సంపాదిస్తున్నారు?
ఎవరి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు?
ఎవరి కొరకు ఎవరు చస్తున్నారు?
         ఒక వ్యక్తి బాగా డబ్బు సంపాదించి కూడబెట్టి సంతానం మగ పిల్లలు లేకపోవడంతో ఆడబిడ్డలు ఉంటే ఇల్లరికం తెచ్చుకుంటే ఆ ఆస్తి అంతా ఎవరు అనుభవిస్తారు?
         కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని బంగారం కొనుక్కొని బంగారం ఒంటినిండా పెట్టుకొని పెళ్లికి వెళ్లి వచ్చేటప్పుడు ఏ దొంగో ఎత్తుకొని వెళ్తే నీకు దక్కింది ఏమిటి?
         తేనెటీగలు ఎంతో కష్టపడి తేనెను పోగుచేస్తాయి, అది ఎవరో దొంగిలిస్తారు.
         ఒక వ్యక్తి ఎంతో కష్టపడి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అ జ్ఞానం తన సంతానానికి దక్కుతుందన్న గ్యారెంటీ లేదు. దానికి ఎవరు అర్హులో వారే ఆ జ్ఞానాన్ని పొందుతారు. అలాగే ఎవరు ఎలా సంపాదించినా, ఎవరికి దక్కాలో అది వారికే దక్కుతుంది. తాను అనుభవించొచ్చు అనుభవించకపోవచ్చు 
ఎవరికి ప్రాప్తం ఉందో వారే అనుభవిస్తారు.
         ఒక బడా వ్యాపారవేత్త, ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఒకామెను. కొంతకాలం తర్వాత ముచ్చటపడి తన భార్యకు 100 కోట్ల ఆస్తిని బదిలి చేసిన తర్వాత అంతలోనే అకస్మాత్తుగా చనిపోయాడు. 
         తన భర్త కింద పనిచేస్తున్న యువకుడిని పెళ్లి చేసుకుంది ఈమె ఎంతో ఇష్టపడి.
        అ యువకుడు ఇన్నాళ్లు నేను నా బాస్ కింద పని చేస్తున్నానని అనుకున్నాను, కానీ నా బాసే నాకోసం పనిచేసి ఇంత సంపద కూడబెట్టాడా?  అని అనుకున్నాడు. 
         చూశారా??? ఈ చిన్న చిన్న విషయాలు ఎంతో నేర్పిస్తుంది అర్థం చేసుకుంటే...
         కావున మిత్రులారా! ఎంత సంపాదించామన్న దానికన్నా ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా, సంతృప్తిగా జీవించాం' అన్నది ముఖ్యం.
         ఎంత ఖరీదైన సెల్ ఫోన్ లోనైనా, 75% యాప్స్ వృధా. ఖరీదైన కారులో కూడా, 75% వేగం ఉపయోగం లేనిది.
ఖరీదైన, విలాసవంతమైన భవనంలో కూడా 75% వృధాగా, ఖాళీగా ఉంటుంది.
         ప్రతి వ్యక్తిలో 75% TALENT నిరుపయోగంగా ఉంటుంది. మిగిలిన 25% ప్రతిభను సమర్థవంతంగా వాడడం ముఖ్యం. మీ బట్టల్లో 75% చాలా తక్కువగా ఉపయోగిస్తారు.
         అలాగే మన సంపాదనలో 75% తరవాతి తరాలకోసం వాడ్తాం. 
         కనుక ఉన్న దాంతో తృప్తిగా ఉండడం నేర్చుకుందా. మనది అద్భుతమైన జీవితం. సదాలోచనతో ఆనందించుదాం. శాంతితో జీవించుదాం. మళ్లీ మానవ జన్మ వస్తుందన్న గ్యారెంటీ లేదు. వచ్చినా ఇంత ఆరోగ్యంగా అన్ని అవయవాలతో ఇంత చురుగ్గా ఉంటామన్న గ్యారంటీ లేదు.
         అందుకే ఇక్కడే ఇప్పుడే ఈ జన్మలోనే మనం ఎవరో తెలుసుకుందాం. ఆ జ్ఞానంతో ధ్యానంతో తెలివితో తేటతెల్లంగా జీవితాన్ని పరమాద్భుతంగా  కొనసాగించుదాం మిత్రులారా! 
🏵️Dr Vivek Jilla🏵️
*💝💝సృష్టిలో మానవజన్మ ఎంతో క్లిష్టమైనది.* *అతడు పుట్టడంతోనే అతనిలో* *మమేకమై ఉన్నవి పదకొండు ఇంద్రియాలు.* *అవి లేకుంటే అతడు మనుగడ సాగించలేడు._*

💝 *పదకొండులో..._*
💕 *అయిదు జ్ఞానేంద్రియాలు,_*
💕 *అయిదు కర్మేంద్రియాలు, మనసు ఉన్నాయి._*
💓 *1. శ్రోత్రం (చెవి),_*
💓 *2.త్వక్‌ (చర్మం),_*
💓 *3. చక్షుషీ (కన్నులు),_*
💓 *4. జిహ్వా (నాలుక),_*
💓 *5. నాసికా (ముక్కు) అనేవి_*  *జ్ఞానేంద్రియాలైతే.._*
💕 *1. పాయు (మలద్వారం),_*
💕 *2. ఉపస్థ (మూత్రద్వారం),_*
💕 *3. హస్త (చేతులు),_*
💕 *4. పాద (కాళ్లు),_*
💕 *5. వాక్‌ (మాట)*
💖 *~అనేవి కర్మేంద్రియాలు.  ఈ పదింటికి చివర మనసు._*
🛑 *ఇదీ ఇంద్రియ సమూహం._*
♦️ *ఈ పదకొండు ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి._*
💝 *ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య._*
❤️ *ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు._*
💞 *1. మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.*
💞 *2. చర్మం పనికిరాని స్పర్శను కోరుతుంది.*
💞 *3. కళ్లు అశ్లీలాన్ని చూస్తాయి._*
💞 *4. నాలుక అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది._*
💞 *5. ముక్కు దుర్గంధాలనే స్వీకరిస్తుంది.*
💞 *6. మల, మూత్ర ద్వారాలు పనిచేయకుండా పోతాయి._*
💞 *7. కాళ్లూ, చేతులూ హింసను ఆచరిస్తాయి._*
💞 *8.మాట అదుపు తప్పుతుంది. ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే >_*
🛑 *9.మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు._*
♦️ *అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే.*
❤️ *మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి._*
💝 *అందుకే వాల్మీకి - ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు.*
💝 *చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం._*
💖 *ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానంలేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే._*
💖 *అది ఎవరిమీదనైనా పడవచ్చు. నిప్పును తాకితే కాలుతుందని తెలిసిన జ్ఞాని, నిప్పును తాకడానికి సాహసించడు._*
💖 *ఆ విషయం తెలియని బాలుడు నిప్పును తాకి చేతులు కాల్చుకుంటాడు. కనుక ఏ పనిచేసే సమయంలో అయినా ఆ పనికి సంబంధించిన జ్ఞానం అవసరం._*
💖 *లేకుంటే ఇంద్రియాలు మనిషిని పక్కదారి పట్టిస్తాయి._*
💖 *ఇంద్రియాలు అదుపులో ఉన్నంతవరకు మనిషి ఉజ్జ్వలంగా వెలిగిపోతాడు._*
💝 *ఇంద్రియాల్లో ఏ ఒక్కటి అదుపుతప్పినా, అన్ని ఇంద్రియాలూ క్రమంగా పట్టుతప్పిపోతాయి._*
💕 *పర్యవసానంగా మనిషిలోని ప్రజ్ఞ నశించిపోతుంది._*
💕 *ప్రకృష్టమైన (విశిష్టమైన) జ్ఞానమే ప్రజ్ఞ. అంటే అన్నింటినీ చక్కగా గుర్తించే గుణం._*
❤️ *అది ఉన్నంతకాలం మనిషి మెదడు అనే యంత్రం పనిచేస్తుంది.*
💕 *మెదడును చక్కగా ఉంచుకోవడానికి ’పరిశుద్ధమైన ఆహారాన్ని మాత్రమే ప్రతినిత్యం స్వీకరించాలి. అలా స్వచ్ఛమైన ఆహారాన్ని తినడంవల్ల ఇంద్రియాలన్నీ పటిష్ఠంగా ఉంటాయి. అవి దృఢంగా ఉన్నప్పుడే మెదడు బాగా పనిచేస్తుంది. జ్ఞాపకశక్తి వర్ధిల్లుతుంది’.*
💝 *ఇంద్రియాల వెనక ఉన్న ఇంతటి సాంద్రమైన విషయాన్ని మనిషి ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.*

Tuesday, January 2, 2024

****మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺 🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹 🌺 Chapter -- 20 🌺 🌹 ఆత్మ సంయమనం

 🔺 మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺
🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹
🌺 Chapter -- 20 🌺
🌹 ఆత్మ సంయమనం 🌹

◆ టెలిపతీ - యోగదృష్టి సాధించాలంటే శాంత స్వభావం , ప్రశాంతమైన మనస్సూ ఉండి తీరాలి లేకపోతే మొదటి తరగతిని కూడా దాటలేం .

◆ మీకు ఆశ్చర్యం కలుగుతూ ఉండవచ్చు - మేము రేడియో గురించీ , ఎలక్ట్రానిక్స్ , ఎలక్ట్రిసిటీల గురించి ఎప్పుడూ ఎందుకు వ్రాస్తూ వుంటామని ? దీనికి సమాధానం - మెదడులో , శరీరంలో విద్యుత్తు తయారవుతూ ఉంటుంది కాబట్టి . మెదడూ , శరీరంలోని అన్ని కండరాలూ క్రమపద్ధతిలో విద్యుత్తును ప్రసారం చేస్తూనే ఉంటాయి . మన శరీరానికి సంబంధించిన రేడియో ప్రోగ్రామ్ లాగా దీన్ని అనుకోవచ్చు . మన శరీరం పనిచేసే పద్ధతి గురించి గానీ , యోగదృష్టి , సైకోమెట్రీ , టెలీపతీ లాంటి విద్యల్ని రేడియో , ఎలక్ట్రానిక్ విజ్ఞానంతో పోల్చి అధ్యయనం చేస్తే సులువుగా అర్ధమవుతాయి . ఈ విద్యల గురించి అవగాహన మీకు సులువుగా ఏర్పడాలన్నదే మా ఆకాంక్ష . అందువల్ల మిమ్మల్ని మేము కోరేది ఏమిటంటే - ఈ రేడియో , ఎలక్ట్రానిక్స్ , విద్యుత్తుల విషయాల జ్ఞానాన్ని జాగ్రత్తగా అర్ధం చేసుకోమని . ఎంత ఎక్కువగా రేడియో , ఎలక్ట్రానిక్స్ విషయాలను అధ్యయనం చేస్తే అంత సులువుగా మీ మీ సాధనల్లో మీరు అభివృద్ధిని సాధించగలుగుతారు .

◆ మనం ఆలోచించినప్పుడల్లా మన మెదడులో విద్యుత్తు తయారవుతుంది . బలమైన ప్రేరణ ఏదీ లేకుండా , ప్రశాంతంగా మన ఆలోచన సాగినప్పుడు పుట్టే విద్యుత్తు ఒకే విధమైన అనుకంపనా వేగంతో తరంగాల్లో హెచ్చు తగ్గులు లేకుండా సాఫీగా సాగుతూ ఉంటుంది . ఎప్పుడైనా ఓ శిఖర కెరటం ' ఎత్తు ఎక్కువైతే ఆ అలజడి కారణం మరేదో ఆలోచన సాఫీగా సాగే మన ఆలోచనలను భగ్నం చేస్తోందని అర్ధం చేసుకోవాలి . కాబట్టి , మనం మన మెదళ్ళలో సాగే రకరకాల సంకల్పాలూ , భయాందోళనలూ మన ఏకాగ్రతను భగ్నం చేస్తాయని అర్ధం చేసుకోవాలి . కాబట్టి , మనం మన ఆలోచనాసరళిలోకి “ భయమూ - నిరాశ " లను ఏ మాత్రం రానీయకూడదు . 

◆ఈ జన్మనుంచి ఇంకో జన్మలోనికి మనం ఒక్క పైసా డబ్బుల్ని కూడా తీసుకెళ్ళలేం; కానీ , మనం నేర్చుకున్న విద్యల , అనుభవాలసారం మాత్రం మనతో బాటు వస్తుంది .ఈ జ్ఞానమే మనకు ఇంకో జన్మ ఎలా ఉండాలో నిర్ణయింపబడే విధానానికి దోహదకారి  అవుతుంది . కాబట్టి , ఏ జ్ఞానాన్ని మనం మనతోబాటుపట్టుకుని తీసుకెళ్ళగలుగుతామో ఆ జ్ఞానాన్నే ఇప్పుడు సంపాదించుకునే ప్రయత్నాన్ని చేద్దాం.

◆ ప్రశాంతతను పొందడానికి అత్యంత సులభపతి - " ఒకే విధమైన పద్ధతి క్రమంతో శ్వాసక్రియను జరపడం ” . చాలామంది , దురదృష్టవశాత్తూ , గాలిని లోపలికి బలంగా లాక్కుంటూ , బయటికి ఊదుతూ శ్వాసక్రియను జరుపుతూంటారు . మెదడుకు ప్రాణవాయువు అందే అవకాశాన్ని ఇవ్వకుండా రొప్పుతూ ఉంటారు . సృష్టిలో గాలి చాలా తక్కువగా ఉన్నట్లు అనుకుంటారేమో గాలిని వేగంగా మింగుతూ బలంగా కక్కుతూ ఉంటారు . వాళ్ళు పీల్చే గాలి బాగా వేడిగా ఉన్నట్లు ఇలా అది లోపలికి వెళ్ళగానే అలా దాన్ని బయటకు తరిమేయాలని బెంగపెట్టుకుంటున్నట్లు  , ఆ పనిని చేస్తూ మళ్ళీ ఇంకో గుటకచేసేందుకు సిద్ధపడుతూంటారు .

◆  మనం గాలిని నెమ్మదిగా గాఢంగా తీసుకోవడం నేర్చుకోవాలి . ఊపిరితిత్తుల్లో ఉన్న పాత గాలిని పూర్తిగా బయటకు పంపించెయ్యాలి . పై పైనే గాలి తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తుల్లో పాడయిపోయిన గాలి మిగిలిపోయే ఉంటుంది . ఊపిరితిత్తుల్లో గాలి ఎంత తిరుగుతుందో అంత బాగా మన మెదడు పనిచేస్తూ ఉంటుంది . మన జీవితం ఆక్సీజన్ మీదే ఆధారపడి ఉంది . ముఖ్యంగా మన మెదడుకి చాలా ఆక్సిజన్ కావాలి . మెదడుకు ఆక్సిజన్ తగ్గిపోతే నునకు అలసిపోయినట్లు అనిపిస్తుంది . నిద్రపోవాలనిపిస్తుంది . మన పనుల వేగం తగ్గిపోతుంది , ఆఖరికి ఆలోచించడం కూడా కష్టమవుతుంది . కొన్నిసార్లు తీవ్రమైన తలనొప్పి ప్రారంభం కావచ్చు . అప్పుడు మనం బయటికి వెళ్లి కాస్త మంచి గాలిని పీల్చుకుంటే ఆ తలనొప్పి తగ్గిపోయి , మెదడుకు తగినంత ఆక్సిజన్ తప్పక అందాల్సిందేనని మనకు ఋజువవుతుంది .

◆ క్రమపద్ధతిలో శ్వాస తీసుకుంటే కలతపడ్డ మనస్సు కుదుటపడుతుంది . మీకు ఎవరిమీదయినా పిచ్చికోపం వచ్చేసి వాళ్ళని ' చావగొడదా మన్నంత ఉద్రేకంతో ఉన్నారనుకోండి . అట్లాంటప్పుడు అందుకు బదులుగా గాఢంగా ఓ సారి శ్వాస తీసుకోండి - ఎంత గాఢంగా తీసుకుంటే అంత మంచిది - తీసుకుని కొన్ని సెకండ్ల వరకూ ఆ శ్వాసను బిగబట్టి అటు తరువాత నెమ్మదిగా ఆ గాలిని నిశ్వసించండి . ఈ విధంగా గాఢంగా ఊపిరి తీసుకుంటూ , కాసేపు లోపల నిలిపి ఉంచుతూ , నెమ్మదిగా వదిలి పెట్టేపనిని కొన్నిసార్లు మీరు చేస్తే మీరు ఎప్పుడూ ఊహించనంత త్వరలోనే ప్రశాంతతను పొందుతారు .

◆ వేగంగా గాలిని తీసుకోవడం , వేగంగా గాలిని వదిలిపెట్టడం మానండి . నిదానంగా ఊపిరితీసుకుంటూ ప్రాణశక్తి మీలోకి వస్తున్నట్లు ఊహించండి . నిజంగా జరిగేది యిదే. ఇప్పుడు మేం చెప్పబోయే ఈ పద్ధతిని అభ్యసించి చూడండి . మీరొమ్మును వీలయినంత లోపలికి తీసుకుని మీ ఊపిరితిత్తులలోని గాలిని మొత్తం బయటికి తరిమేసే ప్రయత్నం చెయ్యండి . గాలి కోసం మీ నాలుక బయటకు వచ్చి వ్రేలాడుతున్నా సరే - ఇంకా ఇంకా కొంత గాలిని బయటకు పంపించేందుకు ప్రయత్నించండి . తరువాత , సుమారు పది సెకండ్ల సమయంలో మీ ఊపిరితిత్తులను గాలితో పూర్తిగా నింపుకోండి . మీరొమ్మును పూర్తిగా వ్యాకోచింపజేయండి . వీలయినంత అధిక మొత్తంలో మీ ఊపిరితిత్తులు నిండాలి . నిండాక , ఇంకొంచెం గాలిని లోపలికి త్రోసేందుకు ప్రయత్నించండి . లోపలికి తీసుకున్న గాలిని నెమ్మదిగా - సుమారు ఏడుసెకండ్ల సమయాన్ని తీసుకుని - బయటకు పంపించండి . గాలి పూర్తిగా వెళ్ళిపోవాలి . మీ కండరాలని లోపలికి కుంచింపజేసి మొత్తం గాలిని బయటకు తోసెయ్యాలి . ఈ విధంగా అరడజను సార్లు చేస్తే చాలా మంచిది.మీ ఆందోళనలూ , నిరాశా నిస్పృహలూ అన్నీ ఎగిరిపోయి స్వస్థత చేకూరుతుంది . ప్రశాంతత నెలకొంటుంది .

◆ మీరు ఏదయినా ఇంటర్వ్యూకు వెళ్ళాలనుకోండి . మీరు ఉద్విగ్నంగా ఉండొచ్చు . ఈ ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించడం మీకెంతో ఆవశ్యం కావచ్చు . ఒక పని చెయ్యండి . కొన్నిసార్లు గాఢంగా శ్వాస తీసుకుని వదిలి పెట్టండి నెమ్మదిగా. పరుగెత్తుతున్న మీ ' పల్స్ ' ( నాడి కొట్టుకోవడం ) వేగం తగ్గడం మీరు గమనించవచ్చు . క్షణాల్లో మీకు ప్రశాంతత ఏర్పడుతుంది . మీ ఆత్మవిశ్వాసం ఉప్పొంగుతుంది. విచారం,ఆందోళనా మాయమవుతాయి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు మీ ప్రశాంతతకూ , ఆత్మవిశ్వాసానికి ముగ్ధులవక తప్పదు . ప్రయత్నించి చూడండి ! 

◆ ఎప్పుడూ విసుక్కుంటూ ఉండేవాళ్ళలో , కోపం తెచ్చుకుంటూ ఉండేవాళ్ళలో  జీర్ణరసాలు ఎక్కువగా స్రవించి వాటి సాంద్రత మరింత ఎక్కువై ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి . ఈ జీర్ణరసాలు నిజానికి ఆమ్లాలు (Acids). ఈ ఆమ్లాల శక్తి పెరిగేసరికి జీర్ణకోశపు రక్షణ పొరలను ఇవి కరిగించేస్తాయి . జీర్ణకోశంలో “ అల్సర్లు వస్తాయి . బాధా , నిరాశా కూడా కలుగుతాయి . ' ఇర్రిటేషన్లు ' ఎక్కువగా ఉన్నవాళ్ళకే ఈ ' కడుపులో పుళ్ళు వస్తాయని డాక్టర్లు చెప్తున్నప్పుడు మీరు వినే వుంటారు . 

◆ స్త్రీలకు , ప్రత్యేకించి ఋతుక్రమం ఆగిపోతున్న సమయాల్లో , మానసిక తరంగాల నిర్మాణ , ప్రసార ప్రక్రియల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. శరీరంలోని కొన్ని గ్రంధుల్లోంచి స్రవించే రసాయనాలు పూర్తిగా ఆగిపోవడంగానీ , దారి మళ్ళీపు ద్వారా గానీ , కొన్ని శారీరక మార్పులతో బాటు మానసిక ప్రవృత్తిలో కూడా మార్పు చోటుచేసుకోవచ్చు . ఇంకొకళ్ళు మాటలను విని తమ జీవితంలో ఘోరమైన మార్పు జరుగబోతూ ఉందని కొందరు “ గోరంతని కొండంత ” గా ఊహించి తీవ్రంగా ఆలోచించి , ఆలోచించి నిజం చేసుకుని జీవితాన్ని తమ చేతుల్తో తామే పాడు చేసుకుంటారు . సరియైన అవగాహన ఉంటే ఏ ఉపద్రవాలూ జరుగవు .
 " హిస్టరెక్టమీ ” ఆపరేషను చేయించుకున్న కొందరు స్త్రీల పరిస్థితి ఇంకా దురదృష్టకరంగా ఉంటుంది .స్ర్తీలకు బలవంతంగా ఋతుక్రమాన్ని పాడు చేసే ఓ పద్దతే ఈ ఆపరేషను . స్త్రీలకు ఏదో జబ్బో మరో బలవంతమైన కారణమో ఉంటే తప్ప ఈ శస్త్రచికిత్స చెయ్యరనుకోండి . కానీ , జరిగే ఫలితం ఇంకోరకంగా పరిణమిస్తుంది . ఆ స్త్రీ మెదడులో ఓ తుఫాను రేగుతుంది . కొంతమందికి మనఃస్థిమితం కూడా తప్పవచ్చు . తగిన పద్దతిలో వైద్యమూ , తగినంత సానుభూతీ వుంటేనే అలాంటి దీనురాళ్ళకు స్వస్థత చేకూరుతుంది . 

◆ ఈ శరీరపు యంత్రం నుంచి విద్యుత్తు ఒకే స్థాయిలో స్థిరంగా తయారవుతున్నప్పుడు మనం శాంతంగా , ప్రశాంతంగా ఉంటాము . చింతల , కోపతాపాల వల్ల ఈ విద్యుత్తులో తేడాలు ఏర్పడినా , మన ప్రశాంతత తాత్కాలికంగా దెబ్బతిన్నా , మళ్ళీ ఈ విద్యుత్తు సరిగ్గా పునరుద్ధరింపబడుతుందనీ , మనకు స్వస్థత కలుగుతుందనీ మనం గ్రహించాలి.

◆ ఎంత నేర్చుకుంటే అంత జ్ఞానాన్ని మీతో బాటు ఇంకో జన్మలోకి తీసుకెళ్ళవచ్చు. సంపాదించుకుంటే దుఃఖపూరితమైన ఈ భూమి మీదకు రావాల్సిన జన్మల సంఖ్యను అంత గణనీయంగా తగ్గించుకోవచ్చు .

◆ మా సలహా ఏమిటంటే సుఖంగా పడుకుని రిలాక్స్ కండి . పడుకుని ఇబ్బంది లేకుండా ఏ కండరాల్లోనూ టెన్షను లేకుండా సర్దుకోండి . తేలికగా చేతులు కట్టుకుని గాఢంగా క్రమపద్ధతిలో శ్వాసక్రియను నిర్వహించండి . శ్వాసతో బాటు తాదాత్మ్యం చెందే విధంగా “ శాంతి .... శాంతి .... శాంతి ” అని మనస్సులో అనుకుంటూ ఉండండి . ఈ విధంగా అభ్యసించడాన్ని సాగిస్తూ ఉంటే నిజంగానే దైవికంగా మీ మీదకు శాంతి ప్రసరించడాన్ని మీరు గమనించవచ్చు . మళ్ళీ , అసంబద్ధమైన ఆలోచనలు అపశృతీ ఎప్పుడూ మీ ఆలోచనలలో దొర్లకుండా చూసుకోండి .

◆ మీ ఆలోచనలు ఎప్పుడూ శాంతిమీదా , ప్రశాంతత మీదా , సుఖం మీదా మాత్రమే పరిభ్రమిస్తూ ఉండాలి . శాంతి కోసం ఆలోచన చేస్తే శాంతే మీకు లభిస్తుంది . సుఖం గురించి మీరు ఆలోచిస్తే సుఖం మీకు లభిస్తుంది . ఈ పాఠాన్ని ముగించే ముందు ఓ మాటని మేము మీకు చెప్పదలచాం . అందరూ తమకున్న ఇరవైనాలుగ్గంటల సమయంలో కేవలం ఓ పదినిమిషాల సమయాన్ని ఈ శాంతిసాధన కోసం కేటాయించుకోగలిగితే, ఈ భూమ్మీద డాక్టర్లు అందరూ నిరుద్యోగులైపోతారు ! వాళ్ళు నయం చెయ్యడానికి భూమి మీద జబ్బులేవీ ఉండవు కనుక !

◆ మరణం లేని మీరు.                  సే::మాధవ కొల్లి.                 

Monday, January 1, 2024

****_నేటి మాట_* *సత్పురుషుల సహవాసం - ఆది శంకరుల బోధ🙏*

 *శుభోదయం. ఓం నమౌవేంకటేశాయ *
 -------------------        
"నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనేలా బ్రతకకూడదు.
నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి."
       --------------------------
🌹 *మంచి మాట* 🌼
      ---------------------------
"ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడాలి.
నిజాలు వినాలంటే వారితోనే మాట్లాడాలి."



               *_నేటి మాట_*

*సత్పురుషుల సహవాసం - ఆది శంకరుల బోధ🙏*

నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు అన్నారు భగవత్పాదులు. 
ఎవరైతే ఎదుటివారి మంచిని కోరతారో, స్వప్నంలో కూడా ఎదుటి వారికి చెడు తలపెట్టరో, ఎదుటి వానిలో మంచిని మాత్రమె చూస్తారో వారే సత్పురుషులు...

"నేయం సజ్జన సంగే చిత్తం" అన్నారు భగవత్పాదులు.
"గేయం గీతా నామ సహస్రం" భగవంతుని నామాన్ని జపించు. 
ఆయన ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీతను పారాయణ చేయి. 
మన జీవితంలో సమయం అమూల్యమైనది, సమయం పొతే తిరిగిరాదు. 
సమయాన్ని వ్యర్ధం చేయకు, మానవ జన్మ అపురూపమైనది, ధర్మానుష్టానానికి అనువైన జన్మ. 
దీనిని వ్యర్ధ పరచుకోకు అన్నారు భగవత్పాదులు...

వాక్కు భగవన్నామోచ్చారణకు ఉపయోగించు, నీకున్న సకల ఇంద్రియములను భగవత్సేవలో వినియోగించు, ఇహంలోనూ పరంలోనూ సుఖపడతావు.

"ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః" నీ మిత్రుడవైనా శత్రువువైనా నీవే. సన్మార్గములో వెళ్లావు అంటే నీకు నీవు మిత్రుడివి...
తప్పుదారిలో వెళ్ళావంటే నీకు నీవు శత్రువువి. 
కాబట్టి ఎప్పుడూ నీకు నీవు శత్రువువి కావద్దు. 
నీకు నీవు మిత్రుడివికా!!, సరియైన దారిలో వెళ్ళావంటే ఎన్నటికీ చ్యుతి అనేది రాదు.
ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది. 
ఎప్పుడు తప్పటడుగులు వేశామో సకల అనర్ధాలు కలుగుతాయి. 
తప్పుదారి అంటే అధర్మాన్ని ఆచరించడం. 
ఇటువంటి ఉపదేశములను ఆదిశంకరుల వారు మనకు విశేషంగా చేశారు. 
వాటిని మనం మననం చేయాలి, అదేవిధంగా ఆచరణ చేయాలి, ఈవిధమైన మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసిన ఆదిశంకరులు సదా స్మరణీయులు, వందనీయులు, పరమ ఆరాధనీయులు. 

ఈ ధర్మప్రభోధం ఎల్లప్పుడూ జరగాలి అనే ఉద్దేశ్యంతో నాలుగు పీఠాలు స్థాపించారు...

ఇక్కడ ఉండే పీఠాధిపతులు దేశసంచారం చేస్తూ, లోకానికి ధర్మ ప్రబోధం చేస్తూ, అందరికీ ఆశీర్వాదం చేస్తూ శారదా చంద్ర మౌళీశ్వరులను ఆరాధించి తద్వారా లోకక్షేమాన్ని కోరుతూ ఉండాలి అని ఆజ్ఞాపించారు...

                *_🌹శుభమస్తు🌹_*

శాంతి మంత్రం

 *శాంతి మంత్రం*

*ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహవీర్యం కరవావహై!తేజస్వినా వధీతమస్తు మావిద్విషావహై ఓం శాంతి  శాంతి శాంతిహి !!*

*తా:- సర్వ జీవులు రక్షింప బడు గాక.  సర్వ జీవులు పోషింప బడు గాక. అందరూ కలిసి గొప్ప శక్తి తో కూడి పని చేయాలి.*

*(సమాజ ఉద్ధరణ కోసం)  మన మేధస్సు వృద్ది చెందు గాక. మన మధ్య విద్వేషాలు రాకుండు గాక. ఆత్మా ( వ్యక్తిగత ) శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.*

*భూగోళంలో ఒక్క హిందూ ధర్మం మాత్రమే సర్వ ప్రాణి హితాన్ని సర్వ మానవాళి సుఖ సంతోషాలకోసం దైవ ప్రార్ధన చేస్తుంది. ఇటువంటి శాంతి మంత్ర పారాయణ మానవులలో హిందూ ధర్మం మాత్రమే నిశ్చయంగా నిర్వర్తిస్తుంది. ఇది మానవజాతి గర్వించదగిన ధర్మం అని గుర్తించాలి.*

****మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺 🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹 🌺 Chapter -- 21 🌺 🌹 టెలీపతి 🌹

 🔺 మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺
🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹
🌺 Chapter -- 21 🌺
🌹 టెలీపతి 🌹

◆ మీ శిరస్సులో “ హలో ” ( ఆరా లేక దివ్య ప్రకాశం ) కనిపించే ప్రదేశం దగ్గర్లోనే ' టెలీపతీ'కి సంబంధించిన తరంగాల్ని గ్రహించగలిగే ప్రదేశం ఉంటుంది.

◆ మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకు ఎన్నో " స్పందనలు  అనుభవంలోకి వస్తాయి . ఈ స్పందనలు ' అన్నీ ఇతరుల మస్తిష్కాల్లోంచి విడుదలై ప్రసారమవుతున్న రేడియో తరంగాల వంటి తరంగాల వంటివేనని మీరు అర్ధం చేసుకోవాలి . ఈ తరంగాల్ని మన టెలిపతిక్ గ్రాహకాలు గ్రహించగలుగుతాయి . వాటికోసం ఎదురు చూస్తున్న మెదడు సంకేతాలను అవి అందించగలగుతాయి. చాలామందికి ముందుగా జరుగబోయే విషయాల గురించిన జ్ఞానం ఉంటుంది . ఏదో జరుగబోయేట్టూ , అందుకు తగిన విధంగా తాము ఏ చర్య తీసుకోవాలో కూడా  చాలామందికి చాలా సమయాల్లో ముందుగానే తెలుస్తూ ఉంటుంది . ఈ  జ్ఞానాన్ని గురించి అంతగా తెలియని వాళ్ళు దీన్ని ఓ “ అనుభూతి ” గానే అనుకున్నా , నిజానికి ఇది మన అచేతన మస్తిష్కం , మరి ఇంకొకళ్ళ అచేతన మస్తిష్కం మధ్య జరిగే మానసిక రేడియో ప్రసారాల ఫలితమేననీ - అచేతనంగా చేసే “ టెలీపతీ " యేననీ మనం గ్రహించాలి.

◆ సహజ అవబోధన " ( intuition ) కూడా ఇలాంటిదే . స్త్రీలకు పురుషులకన్నా ఎక్కువ సహజ అవబోధన ఉంటుంది . తమ అతివాగుడును అదుపుచేసుకోగలిగితే పురుషుల కన్నా స్త్రీలకే ఈ “ సహజ అవబోధన " ఎక్కువగా సిద్ధిస్తుంది . ' టెలీపతీ శక్తి సాధారణ మానవుడికన్నా స్త్రీకే ఎక్కువగా ఉంటుంది . స్త్రీల మెదళ్ళు పురుషుల మెదళ్ళ కన్నా చిన్నవిగా ఉంటాయని చెప్తూంటారు . కానీ , ఇవేవీ నిజమైన అభ్యంతరాలు ప్రతిబంధకాలూ కావు . మెదడు పరిమాణాల గురించీ , తెలివి గురించీ రెండింటి మధ్య సంబంధం గురించీ పనికిరాని చెత్త విషయాలు వ్రాయబడ్డాయి . ఆమాటలన్నీ సత్యాలయితే , మానవులకంటే ఏనుగులకే ఎక్కువ తెలివితేటలు ఉండాలి ! ఓ స్త్రీ మెదడు లోపలికి వచ్చే తరంగాలతో సులభంగా అనుసంధానం చెంది ప్రతిస్పందిస్తుంది . రేడియో పరిజ్ఞానంతో ఈ మాటని చెప్పాలంటే , పురుషుడి మెదడుకంటే బాగా - " ట్యూన్" చెయ్యడానికి వీలయిన రేడియోనే ఈ స్త్రీ మెదడు .ఓ స్త్రీ మెదడు చాలా సులభంగా ' ట్యూన్ ' అవుతుంది .

◆ కవలపిల్లలు ఎంతో దూరంలో విడివిడిగా ఉన్నా , ఇద్దరి మధ్యా మానసికంగా ఓ బలమైన సంబంధం ఏర్పడి ఉందని మనకు తెలుస్తోంది . ఈ కవలల్లో ఒకడు ఉత్తర అమెరికాలోనూ , ఇంకొకడు దక్షిణ అమెరికాలోనూ ఉన్నా ఇద్దరికీ ఒకే విధమైన అనుభవాలు కలుగుతున్నట్టూ ఇద్దరికీ రెండోవాడు ఏం చేస్తున్నాడో స్పష్టంగా తెలిసిపోతున్నట్లు వచ్చే అనేక వార్తలని మనం ఎన్నోసార్లు వార్తాపత్రికల్లో చదివే ఉంటాం . ఈ చోద్యాలకి కారణం ఏమిటంటే ఈ కవలలు ఇద్దరూ ఒకే జీవకణంనుంచీ , ఒకే అండం నుంచి ఉద్భవించిన వాళ్ళు కాబట్టి , ఇద్దరి మెదళ్ళు చక్కగా ట్యూన్ చేయబడ్డ ఓ జత రేడియో - ప్రసార , గ్రాహక - యంత్రాల్లాంటివి కాబట్టి . ఈ శక్తి ఉన్నట్లు ఆ కవలలకి తెలియకపోయినా ఇద్దరిమీదా ఇది పనిచేస్తూనే ఉంటుంది.

◆ " విశ్వాసమూ ” , “ అభ్యాసమూ ” ఈ రెండింటి ఆచరణ ద్వారా మీరు టెలీపతి శక్తిని సాధించవచ్చు . కానీ , మీకు ఎంత విశ్వాసం ఉన్నా ఎంత గొప్పగా సాధన చేసినా ఈ శక్తికి ప్రశాంతత్త్వమనే మీ స్నేహితుడు తోడుగా ఉండకపోతే సాధించడం అసాధ్యం ! 

◆ సాధన - 1:- ఒకటి రెండు రోజులపాటు మీకు మీరే చెప్పుకుంటూ ఉండండి ' ఫలానా రోజు ' , ' ఫలానా సమయం ' నుంచి బయట నుంచి వచ్చే సంకేతాలను మీ మెదడు గ్రహించే శక్తిని పొందగలదనీ , మొదట్లో సామాన్యమైన స్పందనలనూ , తరువాత తరువాత స్పష్టమైన టెలీపతిక్ సంకేతాలనూ మీ మెదడు గ్రహించి అర్ధం చేసుకోగలదనీ -- ఈ మాటను మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండండి . అనేక మార్లు పునశ్చరణ చేస్తూ ఉండండి . విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుందని చెప్పుకోండి.

◆  ముందుగా నిర్ణయించుకున్న రోజున సాయంత్రం అయితే మరీ మంచిది . మీరు మీ గదిలోకి వెళ్ళిపోండి . దీపాలకాంతి తక్కువగా ఉండేట్టు చూసుకోండి . మీ గదిలో ఉష్ణోగ్రత సరయిన స్థాయిలో ఉండేట్టు చూసుకోండి . మీరు స్వస్థులుగా ఉండడం ముఖ్యం . మీకు అత్యంత సుఖప్రదంగా ఉండే స్థితిలోకి వాలిపోయి సర్దుకోండి . మీకు అత్యంత ప్రియులైన వ్యక్తి ఫోటోను మీ చేత్తో పట్టుకోండి . మీ వెనుక తగినంత వెలుతురును ఈ ఫోటో మీదకు ప్రసరింపజేయగల ఏ దీపమైనా ఉండాలి . కొన్నిమార్లు గాఢంగా శ్వాస తీసుకోండి . బయటి ఆలోచనలను అన్నింటినీ బహిష్కరించండి . మీ చేతిలో ఉన్న ఫోటోలోని వ్యక్తిని గురించి ఆలోచించండి . ఫోటోను చూడండి . ఆ వ్యక్తి మీ ఎదురుగా సాక్షాత్కరించినట్లు , మీ ఎదురుగా నిలబడి ఉన్నట్లు ఊహించండి . ఈ వ్యక్తి మీకు ఏం చెప్తున్నాడు ? మీ జవాబు ఏమిటి ? మీ ఆలోచనలను కట్టుదిట్టం చేసుకోండి . “ నాతో మాట్లాడు - నాతో మాట్లాడు ” అని మీరు ఇష్టమైతే అనుకోవచ్చు . అలా అనుకుని జవాబుకోసం నిరీక్షించాలి . తగినంత ప్రశాంతత మీలో నెలకొని ఉంటే , మీ విశ్వాసం సుస్థిరమై ఉంటే , మీ మెదడులో కొన్ని ప్రకంపనలను మీరు గుర్తించగలరు . మొదట్లో ఈ చిన్ని కదలికలను ఓ ఊహగా మీరు కొట్టిపారేయవచ్చు - కానీ ఇది " ఊహ " కాదనీ , సత్యమేనని గ్రహించండి . దీన్ని ఊహగా మీరు కొట్టిపడేస్తే టెలీపతీ శక్తిని కూడా కొట్టిపడేసినట్లే , దాన్ని పరిత్యజించినట్లే లెక్క.

◆ టెలీపతి శక్తిని సాధించడానికి చాలా సులభమైన మార్గం ఏమిటంటే , మీకు బాగా తెలిసిన వ్యక్తితో , అత్యంత ఆత్మీయుడైన వ్యక్తితో కలిసి పనిచేయడం , మీరిద్దరూ కలిసి ఓసారి ఈ టెలీపతీ గురించి మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలి - ' ఫలానా రోజు ' , ' ఫలానా సాయంత్రం ' , ' ఫలానా సమయానికి ' ఇద్దరూ స్థిమితంగా కూచుని టెలీపతీ ద్వారా సంభాషణ చెయ్యడానికి సంసిద్ధులై ఉంటామనీ , ప్రయత్నిస్తామనీ , అదే సమయానికి , సరిగ్గా మీరు మీ మీ గదుల్లోకి వెళ్ళిపోయి ఉండాలి . మీ ఇద్దరి మధ్యా ఎంత దూరం ఉన్నా పర్వాలేదు . దూరం సమస్యే కాదు . మీ ఇద్దరి మధ్యా ఓ ఖండాంతర దూరం ఉండొచ్చు . మీ ఇద్దరిలో ఎవరు ఆలోచనలను “ ప్రసారం " చెయ్యాలో - ఎవరు వాటిని ' గ్రహించాల్సి ఉంటుందో స్పష్టంగా నిర్ణయించుకోవాలి.

◆ ముందు పది నిమిషాల పాటు మీరు మీ ఆలోచనలను “ ప్రసారం " చేస్తే మీ స్నేహితుడు ఆ పదినిముషాల్లో వాటిని గ్రహించేట్టూ , ఆ తరువాత పదినిముషాల పాటు మీ స్నేహితుడు తన “ ప్రసారాలని ” పంపిస్తూంటే ఆ పదినిముషాల సమయంలో మీరు ఆ ప్రసారాలను “ అందుకుని ” అర్ధం చేసుకోగలిగేట్టూ ముందుగా నిర్ణయించి ఏర్పరచుకోవాలి . ఖచ్చితమైన సమయపాలనతో దీన్ని నిర్వర్తించాలి . ఇలాంటి సాధన మీ ఇద్దరూ కలిసి ప్రారంభించగానే మొదటి రెండు మూడుసార్లు మీకు ఏ ఫలితాలు కలుగకపోవచ్చు . కానీ , సాధన వల్ల త్వరలోనే ఈ శక్తిని మీరు సాధించగలుగుతారు.అనేకసార్లు ఒకే పనినిచేస్తూ పోతే చివరికి , ఆ పని సక్రమంగా జరిగి తీరుతుంది .

◆ మీ స్నేహితుడికి ఓ ఆలోచనను పంపగలిగి , అతడి వద్ద నుంచి వస్తున్న ఓ ఆలోచనను మీరు గ్రహించగలిగితే 
“ టెలీపతిక్ ” గా మీరు అందరి ఆలోచనలనూ గ్రహింపగల స్థితికి ఎదుగుతున్నట్లేనని గ్రహించండి . అయితే , ఒక్క విషయం . ఇంకొకళ్ళు ఆలోచనలను గమనించగలిగే స్థితి మీలో ఏ దుర్బుద్దీ లేకుండా ఉన్నప్పుడే సిద్ధిస్తుంది .

◆ ఇంకొకళ్ళకు హాని కలిగించే ఉద్దేశ్యంతో మీరు టెలీపతీనీ , యోగదృష్టినీ , సైకోమెట్రినీ ఉపయోగించలేరు- ఉపయోగించలేరు - ఉపయోగించలేరు . అదే విధంగా మీకు కూడా వీటి ద్వారా ఎవ్వరూ హాని కలిగించలేరు . దుర్బుద్ధి ఉన్నవాళ్ళకి ' టెలీపతీ , విద్య అబ్బితే తాము తెలుసుకున్న రహస్యాన్ని అందరికో , కొంతమందికో చెప్పేస్తామని బెదిరించి ( black - mail చేసి ) మనుష్యుల చిన్న తప్పులను తమ లాభం కోసం వినియోగించే అవకాశం వీళ్ళకు ఉందని మీరు అనుకుంటారేమో - ఇలాంటివి జరిగే అవకాశమే లేదు . అసంభవం . ఒకే సమయంలో , ఒకే ప్రదేశంలో వెలుతురూ , చీకటి కలిసి ఉండలేవు . టెలీపతీని మీరు దుర్మార్గానికి వినియోగించలేరు . ఇది వేదాంతంలో ఓకఠినమైన శాసనం. కాబట్టి మీరు దిగులు పడకండి . మీ ఆలోచనలను ఎవ్వరూ మీకు హాని కలిగించేందుకు గ్రహించలేరు .

◆ ఎంతోమందికి మీ ఆలోచనలను దురుద్దేశ్యంతో తెలుసుకోవాలని కోరిక ఉండవచ్చు . కానీ , వాళ్లు ఆ ఉద్దేశ్యం వల్లనే మీ ఆలోచనలను గ్రహించలేరు . చాలామందికి తమ ఆలోచనలను ఎవరైనా తెలుసుకుంటారేమోనన్న భయం ఉంటుంది . కాబట్టి , ఆ భయాన్ని తొలగించేందుకే ఈ మాటను చెబుతున్నాం . నిర్మలమైన మనస్సు ఉన్నవాళ్ళకే మీ ఆలోచనలను గ్రహించగల శక్తి ఉంటుంది . మీ ' ఆరా'లో వాళ్ళకు మీ బలహీనతలు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి . ప్రవిత్రులకి దుష్టసంకల్పాలు కలగనే కలుగవు . దుశ్చింతులకు ఈ శక్తి సిద్ధించనే సిద్ధించదు .

◆ సాధన -- 2:- మీరు టెలీపతీని మీ స్నేహితుడితో కలిసి అభ్యసించండి . ఏ స్నేహితుడి సహకారమూ మీకు లభించకపోతే , పూర్తిగా రిలాక్స్ అయివచ్చే ఆలోచనలను స్వీకరించే ప్రయత్నాన్ని చెయ్యండి . మొదట్లో మీ తలనిండా జోరీగ చప్పుడు చేసే విధంగా పరస్పర ఆవిరుద్దాలైన ఆలోచనలు రావచ్చు . జనం మధ్యలోకి మీరు వెళ్ళి నుంచుంటే మనకు వినిపించే కలగాపులగంగా కలిసిపోయే మాటల్లాంటివి మీ ఆలోచనల్లోకి రావచ్చు . లేక ఉత్తి చప్పుడు భయంకరంగా వినిపించవచ్చు . అందరూ గట్టిగా గొంతులు చించుకునేలా మాట్లాడు ఉన్నట్టు మీకు అనిపించవచ్చు . కొంత సాధన చేస్తే ఈ మాటల్లోంచి ఏ ఒక్కరి మాటలనో మీరు వినవచ్చు . టెలీపతీలో ఇలాంటి సాధన కూడా చెయ్యొచ్చు . కాబట్టి ఈ పద్ధతుల్లో అభ్యాసం చెయ్యండి . అభ్యాసం చేస్తూ విశ్వాసాన్ని కలిగి ఉండండి . తరువాత మీరు ప్రశాంతంగా ఉండడంతో బాటు , ఎవర్నీ హింసించాలనుకునే దుర్భుద్దిని కూడా మీలోకి రానివ్వకుండా ఉన్నట్టయితే , మీరు 
" టెలీపతీ " ని సిద్దించుకోగలుగుతారు .

◆ సాధనతో మీరు యోగదృష్టిని సాధించవచ్చు . చరిత్రలో ఏ సమయానికైనా మీరు వెళ్ళి సాక్షాత్తుగా , మీ కళ్ళలో మీరే నేరుగా చరిత్రమ దర్శించవచ్చు . చరిత్ర పుస్తకాలలో పేరు చదువుకున్న అంశాలు కొన్ని ఈ సాక్షాద్దర్శనం వల్ల  'అబద్దాలని తేలవచ్చు . చరిత్ర పుస్తకాలు ఏ కాలంలో వ్రాస్తారో అప్పటి రాజనీతికి అనుగుణంగానే ఈ చిత్రీకరణలు ' జరుగుతాయి . యదార్ధంలో కల్పన కలిసిపోతూ ఉంటుంది . హిట్లర్ యొక్క జర్మనీ సోపియట్ రష్యాల చరిత్రల్ని ఇలాగే మీరు యదార్థంగా గ్రహించవచ్చు.

◆ సైకోమెట్రీని " వ్రేళ్ళతో దర్శించే విద్య " గా మనం చెప్పుకోవచ్చు .  సైకోమెట్రీ ' అనే మాటకు మా అర్ధం ఏమిటంటే - ఒక వస్తువును తీసి చేత్తో పుట్టుకుని , ఆ వస్తువు ఎలా పుట్టిందో , ఏయే మార్పులు దానికి సంభవించాయో ఎవరెవరి వద్ద ఆ వస్తువు ఉండేదో , ఆ వ్యక్తుల మనోగతాలేమిటో స్పష్టంగా చూసి ' గ్రహించగలిగే విద్య - అని . ఒక్కోసారి ఓ వస్తువును మీరు పట్టుకుంటే " అది సంతోషంగా ఉన్న చోటులోంచి వచ్చిందా ? " లేకపోతే " దుర్భరమైన ప్రదేశం నుంచి వచ్చిందా ? ” మీకు చూచాయగా తెలియవచ్చు . ఇవి మాత్రం నిజమైన సైకోమెట్రీకి ఉదాహరణలే.

◆ రహస్య జ్ఞాన విద్యల్లో కుడిచేతిని “ ఇహానికి " ఉపయోగించే చెయ్యిగా భావిస్తారు . ఎడమ చెయ్యిని ఆధ్యాత్మికతకూ , “పరానికి సంబంధించినదిగా భావిస్తారు . మీరు మామూలుగా కుడిచేతి వాటం ఉన్నవాళ్ళయితే , మీరు మీ " ఆధ్యాతక " - ఎడం చేతిని వాడడం ద్వారా గొప్ప ఫలితాలను పొందగలుగుతారు . మీరు మామూలుగా ఎండంచేతి వాటం ఉన్నవాళ్ళయితే , సైకోమెట్రీకోసం మీ కుడి చేతనే " ఆధ్యాత్మక" హస్తంగా గుర్తించవలసి వస్తుంది . సాధారణంగా కుడిచేతికన్నా ఎడం చేతిని సైకోమెట్రీకోసం వాడినప్పుడు చక్కటి ఫలితాలు కనిపిస్తాయి . 

◆ మీరు మీ “ యోచన చేసే గది " ( ధ్యానమందిరం ) లో ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మీ చేతుల్ని శుభ్రంగా కడుక్కుని బాగా తుడుచుకుని , పొడిగా ఉంచుకోవాలి . ఆ విధంగా శుభ్రం చేసుకోకపోతే మీ చేతులకు అనేక అనుభూతులు అంటుకునివుండి మీ సాధనకు ప్రతిబంధకాలు కావచ్చు .

◆ ఉత్తరం ఉన్న ఓ కవరును చింపకుండానే ఆ ఉత్తరంలో మొత్తం మీద ఏ విషయం ప్రాముఖ్యంగా వ్రాయబడి ఉంటుందో గ్రహించడాన్ని కూడా సైకోమెట్రీ ద్వారా సాధించవచ్చు . మీకు తెలియని భాషలో ఉన్న ఉత్తరం మీద మీ ఎడం చేతి వ్రేళ్ళను నడిపించి మీరు ఆ ఉత్తరంలో వ్రాయబడ్డ విషయాన్ని గ్రహించవచ్చు . సైకోమెట్రీ ద్వారా ఇలాంటివి సుసాధ్యాలు . కానీ , ఇంకొకళ్ళకు నిరూపించేందుకు మాత్రం ఇలాంటివి చేసి చూపించే ప్రయత్నాలను చేయకండి .

◆ టెలీపతీని నిరూపించమని మిమ్మల్ని ఎవరైనా అడిగితే వాళ్ళతో మీకు " ఉత్సాహం లేదు ” అని చెప్నేయమని మా సలహా . మీకు తెలిపిన విద్యల్ని మీరు ఎవ్వరికీ నిరూపించి చూపించనక్కర్లేదని మీకూ తెలుసుకదా . 

◆ మీకు ఎన్ని విద్యలు వచ్చినా ఇంకొకళ్ళకు చూపించకపోవడమే మంచిదని మా అభిప్రాయం . ఎంత సాధారణంగా మీరు కనిపిస్తే ఎంత సహజంగా మీరు ఇంకొకళ్ళకి కనిపిస్తూంటే అంత ఎక్కువ ఆధ్యాత్మిక అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు . ఈ విద్యలను నిరూపించే ప్రయత్నాన్ని ఒక వంక చేస్తూ ఉంటే మరోవైపు నుంచి నమ్మని వాళ్ళ నుంచి వచ్చే బలమైన అలలు మిమ్మల్ని ముంచెత్తుతూంటాయి . గొప్ప హానిని మీకు కలిగిస్తాయి.

◆ మరణం లేని మీరు.                  సే::మాధవ కొల్లి.             

చెట్టు చితికిపోతున్నది...

 *చెట్టు చితికిపోతున్నది...*

చెట్టు ఒకప్పుడు
మునిపుంగవులను తల్లై లాలపోసింది...

ఆ తరువాత 
గుడిసెల నీడలో 
గుమ్మమై నిలిచింది...

ఆ తరువాత 
మట్టి గోడల మిద్దెకు
మెడై మెరిసింది...

ఆ తరువాత 
కర్మగారాల కబేళాలకు
నిలువెత్తు దేహాన్ని ముక్కలు చేసుకుంది...

ఆ తరువాత
సిమెంట్ మేడల దేహాలకు
తన అవయవాలను కిటికీలుగా 
ఆరేసుకుని 
ఆధునిక యుగపు సమాధికింద 
తన ఊపిరిని విడిచి వల్లకాటికి వలస వెళుతున్నది చెట్టు...

సెల్పీల కొమ్మలకు 
మొక్కలు వాడిపోయాయి
చెట్ల జాడ ఆన్లైన్ మైదానంలో 
చూడాలేమో ముందు ముందు....


*అభిరామ్ 9704153642*

ముసలితనం వెనుక...*

 *ముసలితనం వెనుక...*

ముసలితనం వెనుక
వెలకట్టలేని విలువైన బాల్యం కరిగిపోయి దాక్కుంది...

ముసలితనం వెనుక
ఆకతాయి ఆటల అల్లరితనం అరిగిపోయిన 
జాడతడి ఉంది...

ముసలితనం వెనుక
యవ్వనపు యవనిక సరసాల చేల
చేష్టల చిలిపి తనపు పొగరుంది...

ముసలితనం వెనుక
మనసు పనులు పొందిన 
అనుభావాల పుట్టుక పరిణతి 
దాగి ఉంది...

ముసలితనం వెనుక
ఆత్మీయతల అనుభూతి
ఆందోళనల సమ్మేళన కొండ దాగుంది...

ముసలితనం వెనుక
ఉరుకుల పరుగు ఆశల ఆశయాల ప్రవాహ మలుపుల నది దాగుంది...

ముసలితనం వెనుక
సహన సమారస్య సంతృప్తి సహృదయ 
స్నేహ సముద్రం దాగుంది...

ముసలితనం వెనుక
కాలం చేసిన గారడి
వయసు పడిన ఒరవడి 
బ్రతుకుతోట తడి 
శిథిలావస్థ గుడిలా దాగుంది...

ముసలి తనమని చిన్నచూపేలా...
మనిషి మజిలీకే అది చివరి కళా...
ఆ కళను గౌరవించిన మనిషే భళా...


*అభిరామ్ 9704153642*

★★★★★★★★★★★★
*మీకు పుట్టినరోజు మరియు పెళ్ళిరోజు...లేదా సందర్భం ఏదైనా* *కవిత  లేదా వ్యాసం, పాట  వ్యకిగతంగా కావాలంటే కింది నా* *నెంబర్ను సంప్రదించగలరు...*

                     *అభిరామ్ 9704153642*
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

కొంతమంది…* *నేటి యువత!* ➖➖➖✍️ *పుట్టుకతో వృద్ధులా?*

 *కొంతమంది…*

               *నేటి యువత!*
                 ➖➖➖✍️
           *పుట్టుకతో వృద్ధులా?*

*అప్పుడప్పుడు నాకు వీధుల్లో నడుం వంగిపోయిన ముసలమ్మ, ముసలయ్యలు కర్ర పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్లడం కన్పిస్తుంది.* 

*నడుం వంగిపోవడం వల్ల వాళ్ల విజన్ కేవలం వాళ్లు నిలుచున్న చోటి నుండి రెండు మూడు అడుగులు మాత్రమే కన్పిస్తుంది. దూరంగా చూడాలంటే నడవడం ఆపేసి తల పైకెత్తి చూడాలి.*

*అలాగే నాకు అప్పుడప్పుడూ 20-30 ఏళ్లు కూడా నిండకుండానే కాస్త దూరం నడవడానికి ఆపసోపాలు పడే యువతరం కూడా కన్పిస్తూ ఉంటారు. అడుగులు వేసే కొద్దీ వాళ్ల మొహంలో రకరకాల హావభావాలు మారుతూ ఉంటాయి. అబ్బ, అయ్య అనుకునేలా మూతి ముప్ఫై వంకర్లు తిరుగుతూ ఉంటుంది, ఆయాసం కూడా వస్తూ ఉంటుంది.*

*ఈ రెండు దృశ్యాలకూ మధ్య నాకు పొంతన కుదరదు. అసలు ఎప్పుడూ ఫోన్లు చేతిలో పెట్టుకుని గేమ్స్ ఆడుకుంటూ, ఛాటింగ్ చేసుకుంటూ తమకి   ఓ శరీరం ఉందనీ, దానికి అప్పుడప్పుడు పని చెప్పాలని, ఒళ్లొంచాలనీ కూడా మర్చిపోయి... అదేమంటే "మేము యూత్" అని ఫోజులు కొట్టే యువతని ఏమనాలో కూడా అర్థం కాదు. సరిగ్గా నాలుగడుగులు కూడా వెయ్యలేరు. గంటసేపు ఓచోట స్థిరంగా కూర్చుని పనిచెయ్యలేరు. నిముషానికి పది distractions. కోరుకున్నవన్నీ కొంటున్నా, ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నా బోర్.. బోర్ అంటూ చికాకు మొహం పెట్టేస్తారు. అది చూడలేక చావాలి. వీళ్ల కన్నా రేపో ఎల్లుండో చావు దగ్గరపడుతున్నా ఓపికగా తమ పనులు తాము చేసుకుంటున్న పెద్ద వాళ్లు వంద రెట్లు నయం.* 

*అసలు కొన్నిసార్లు అన్పిస్తుంది.. ఇలాంటి సత్తువ లేని యువతరం రేపు 40, 50, 60 ఏళ్లు వచ్చేసరికి ఎలా ఉంటారో ఊహకు కూడా అందదు!*

*తిండి లేదా అంటే కడుపు నిండా తింటారు. బిర్యానీలూ, పేస్ట్రీలూ, పిట్జాలూ, చికెన్ లెగ్ పీస్‌లూ, పానీపూరీలూ.. కన్పించిందల్లా తినేస్తూనే ఉంటారు. కానీ ఓపిక ఉండదు. శరీరంలోనే కాదు, మనస్సులోనూ బద్ధకం, నిస్సత్తువ. ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ జీవితం అనుకునే బాపతు. మాటల్లో ఎనర్జీ ఉండదు, చూపులన్నీ జీవం కోల్పోయి కనీసం లూబ్రికేషన్ కూడా లేకుండా ఎండిపోయి ఇవ్వాళో రేపో టపా కట్టేటట్లుంటాయి.*

*బాడీ లాంగ్వేజ్‌లో డైనమిజం ఉండదు.*

*ఇది కాదు లైఫ్! చెమటలు దిగగారేలా కష్టపడండి.. ఏమీ అవ్వదు! కలర్ తగ్గిపోతామనీ, టాన్ అయిపోతామనీ.. ఒళ్లునొప్పులు వస్తాయనీ భయపడిపోయే సుకుమారపు జీవితం వదిలిపెట్టండి. సమ్మర్‌లో గాలి ఆడక తప్పించి ఈ మధ్య కాలంలో ఇంటెన్షనల్‌గా కష్టపడి ఎంతమంది మీ చెమటని మీరు కళ్లారా చూశారు? ఒళ్లంతా చెమటలు దిగగారేటప్పుడు శరీరం, మనస్సూ ఫీలయ్యే ఓ లయబద్ధమైన హార్మోనీ ఎంతమంది ఈ మధ్య కాలంలో చవిచూశారు?*

*తిండి తినడం... ఫేస్‌బుక్, వాట్సప్‌లో కబుర్లు చెప్పుకోవడం, నిద్రపోవడం మాత్రమే కాదు. ఇవన్నీ లేనప్పుడు శరీరానికి ఉన్న ఫిజికల్ యాక్టివిటీని గుర్తు తెచ్చుకుని.. ఫోన్ పక్కన పడేసి కాస్త కష్టపడండి. లేదంటే.. 80 ఏళ్లకు కాదు, 35-40 ఏళ్లకు వంగబడి, స్పాండి‌లైటిస్‌తో తల అటూ ఇటూ తిప్పలేక, ఓ పదినిముషాలు నిలబడితే lower back కలుక్కుమంటూ, కాస్త నడిస్తే మోకాళ్లు, మజిల్ పెయిన్స్ వస్తూ ఎందుకూ పనికిరాకుండా మిగిలిపోతారు! ఇదా క్వాలిటీ లైఫ్? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి.*✍️

****మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺 🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹 🌺 Chapter -- 22 🌺 🌹 సమదృష్టి 🌹

 🔺 మరణం లేని మీరు (లోబ్ సాంగ్ రాంపా) 🔺
🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹
🌺 Chapter -- 22 🌺
🌹 సమదృష్టి 🌹

◆ విద్యుత్ ప్రసారం మన శరీరంలో నిరంతరం జరుగుతూ ఉంటుంది. నాడుల (nerves) గుండా అవి ప్రసరిస్తూ అన్ని కండరాలనూ పని చేయిస్తాయి.

◆ అవయవం పాడైపోయిన ఓ రోగికి ఆ అవయవాన్ని తొలగించే సమయంలో సర్జన్లు ముఖ్యమైన నరాల చివర్లలో రెండు “ ఎలక్రోడ్ ” ( విద్యుత్ ప్రసారం కానివ్వగల లోహపు పదార్ధాలు ) లను అమరుస్తారు . ఆ చెయ్యో , కాలో బాగుంటే ఈ నరాల గుండా వచ్చే సంకేతాలే ఆ శరీరపు అంగాన్ని పనిచేయించి ఉండేవి . పాడైపోయిన అంగాన్ని సర్జన్లు తొలగించిన తరువాత , ఆ పుండు మానిన తరువాత ఓ కృతిమాంగాన్ని ఏర్పాటుచేస్తారు . ఈ   కృత్రిమాంగం చివర్లో ఉన్న ఎలెక్ట్రోడులకు శరీరంలో అమర్చబడిన రెండు ఎలెక్ట్రోలూ కలిసి విద్యుత్ వలయం పూర్తవుతుంది . ఆ వ్యక్తి మెదడు నుంచి వచ్చే సంకేతాలు - బహుశా ఆ వ్యక్తి చేతి వ్రేళ్ళను కదిలించేందుకు ఉద్దేశించబడింది కావచ్చు ఈ ఎలక్రోడ్ల గుండా క్రొత్తగా అమర్చబడిన కృత్రిమాంగానికి అందుతాయి . అక్కడ వున్న ఎలక్ట్రానిక్ పరికరంలో ఈ సంకేతాలు చాలా తీవ్రతతో అభివృద్ధి చెంది ఈ కృత్రిమాంగంలోని అనేక ' రిలే'లను కదిలించి , చిన్న చిన్న మోటార్లను చలింపజేసి ఈ క్రొత్త చేతి వేళ్ళను పనిచేయించగలుగుతాయి! ఈ కృతిమాంగాన్ని ఉపయోగించి వ్రాతపనిని కూడా సులభంగా చెయ్యగలమని తెలుస్తోంది .

◆ విపరీతంగా భయపడ్డ ఓ జంతువును మనమందరం ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటాం .ఇంకేదో పెద్ద జంతువు ఈ చిన్న జంతువును తరుముకొస్తూ ఉండవచ్చు . ఈ చిన్న జంతువు తన భయం పూర్తిగా తగ్గేవరకు తిండి తినదు . మరెవరైనా దాన్ని బలవంతం చేసి తిండిని తినిపించినా ఆ జంతువుకు ఆ తిండి జీర్ణం కాదు . మామూలుగా ఆ జంతువు కడుపులో తయారయ్యే జీర్ణరసాలేవీ ఆ జంతువు భయంతో వణుకుతున్నంతవరకు తయారుకావు . అన్ని జీర్ణరసాలూ లోపల్లోపనే ఇంకిపోతాయి . తిండి తినే స్వభావం భయపడ్డ జంతువుకు అసహజం . 

◆ చాలా తీవ్రంగా ఉద్రేకం చెంది ఉన్నవాళ్ళకూ , బాగా దిగులుతో క్రుంగిపోయి ఉన్నవాళ్ళకూ ఎవరూ బ్రతిమాలి గానీ , బలవంత పెట్టి గానీ తిండి పెట్టకూడదు . అటువంటి వాళ్ళ మేలు కోరే వాళ్ళే వాళ్ళని బ్రతిమాలుతారనే విషయం నిజమే గాని ఆ భోజనం మాత్రం వాళ్ళకు ఎటువంటి మేలూ చెయ్యదనే సత్యాన్ని మనం గ్రహించాలి. దుఃఖం, ఉద్వేగం మానవ శరీరంలో జరిగే రసాయనిక చర్యల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి.

◆ కష్టాల్లో సుఖాల్లో ఒకే సమానత్వాన్ని మనలో ఏర్పరచుకోగలగాలి . ఎక్కువ ఉద్రేకాన్ని మనం తెచ్చుకోకూడదు . అనవసరంగా క్రుంగిపోకూడదు . ఒకే పద్ధతిలో మన స్వభావం ఉండడాన్ని సాధన చెయ్యాలి .

◆ ఓ మనిషి పరధ్యానంతో ఉన్నా , అతని మొదడు నుంచి వచ్చే విద్యుత్తులో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నా , అట్లాంటి వాడు సూక్ష్మశరీరయానాన్ని చైతన్యంతో చెయ్యలేడు . టెలీపతీని గానీ , యోగదృష్టిని గానీ , సైకోమెట్రీని గానీ , ఏ విద్యను గానీ సాధించలేడు , ఏ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేడు .

◆ పరిపూర్ణమైన మానసిక ఆరోగ్యం ఉన్న వాళ్ళకే సిద్ధులు లభిస్తాయి . మెదళ్ళలోంచి వస్తున్న విద్యుత్ తరంగాలు ఒకే స్థాయిలో వీలయినంత సరళంగా ఉంటేనే , వస్తున్న సంకేతాలను ' గ్రహించగలిగే శక్తిని మన మెదడు పొందగలుగుతుంది . భావగ్రహణ లేదా భావ ప్రసారణ చెయ్యాలంటే మన మనస్సులు చాలా ప్రశాంతంగా ఉండాలి . మన మనస్సులు తెరచి ఉంచబడాలి . మన మెదళ్ళలో అల్లకల్లోలపు విద్యుత్ప్రసారాలు జరుగుతూ ఉంటే , మన దీనస్థితిని గురించే మన ఆలోచనలు సాగుతూ ఉన్నప్పుడు , ఇంకొకరి ఆలోచనలు ఏవీ మనలోకి రాలేవు . కాబట్టి , మనం ఎలాంటి సంకేతాలునూ అందుకోలేం . నరాల జబ్బుల్తో బాధపడే వాడెవడూ యోగదృష్టిని సాధించలేడు . ఉన్మాది ఎప్పటికీ ఇంకొకళ్ళ ఆలోచనలను అందుకుని గ్రహించలేడు !

◆ విశ్వమంతా చైతన్యంతో నిండి ఉంది.జీవం అంతా ప్రకంపనే. మృత్యువులో కూడా ప్రకంపనలే ఉంటాయి.  మృత్యువు వల్ల నశిస్తున్న కణాలన్నీ నిరంతరం అనేక సమ్మినణాలుగా రూపాంతరం చెందుతూనే ఉన్నాయి.

◆ మన మనస్సుకు పనిచేసే అవకాశాన్ని కలిగిస్తే మనం దేన్ని కోరుకుంటామో దాన్నే మనకు ఆ మనస్సు అందిస్తుంది. “ అచేతనమనస్సు ” లో అనంతమైన శక్తులు ఉన్నాయి . అచేతనపు మనస్సును అందుకునే విధానం మాత్రం చాలా మందికి నేర్పింపబడలేదు. మనం చైతన్యంలో పదో వంతు భాగాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నాం . అచేతనపు మనస్సును కూడా మన స్వాధీనంలోకి మనం తెచ్చుకోగలిగితే ప్రాచీన ప్రవక్తల్లా మనమూ ఎన్నో అద్భుతాల్ని సాధించవచ్చు . 

◆ మొట్టమొదటగా మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించుకోండి . మీ కోరిక ఏమిటో మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి . మీకు ఏంకావాలో అడిగి తీరాలి . మీ కోరిక స్వరూపం మీకు కనిపించి తీరాలి . మీకు ఏం కావాలి ? బోలెడు డబ్బుకావాలని అడిగితే కుదరదు . ఓ కొత్తకారో , కొత్త మొగుడో పెళ్ళామోకావాలని అడిగితే కుదరదు . మీ కోరిక ఏమిటో స్పష్టంగా నిర్ణయించి అడగాలి . మీ ఆలోచనలలో మీకోరిక స్వరూపం మీకు స్పష్టంగా కనిపించి తీరాలి - ఆ స్వరూపాన్ని పారిపోకుండా స్థిరంగా మీ లక్ష్యంగా ఉంచుకోండి . మీరు వివేకవంతులైతే మాత్రం , డబ్బునూ , ఐహికవస్తువులనూ అభిలషించరు - ఓ గాంధీలాగానో , ఓ బుద్ధుడిలాగానో , ఓ క్రీస్తులాగానో , ఓ సెయింట్ పీటర్ లాగానే మరో ఇంకెవరయినా సన్యాసి లాగానో ఉండాలని మాత్రం కోరుకుంటారు . మీ వెంట తీసుకువెళ్ళగలిగిన , ఇంకో జన్మలో , కూడా మిమ్మల్ని అనుసరించే సచ్చీలతా , జ్ఞాన సంపదా , పుణ్యాలకోసమే మీ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు . 

◆ మీకు ఏం కావాలో మీరు పూర్తిగా నిశ్చయించుకున్న తరువాత మీరు రెండో అంకంలోకి వస్తారు . మేము ఇదివరకు మీకు చెప్పినట్లుగా - మీరు ఇస్తేనే పుచ్చుకోగలరు. మీరేం ఇస్తారు ? కొంత డబ్బుకావాలని మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే ( ఆ డబ్బు ఎంతో మీరు ఖచ్చితంగా చెప్పాలి ) అందులోంచి ఓ ' టిత్ , (tithe) ను అంటే పదవవంతు డబ్బును , ఇచ్చేందుకు మీరు సిద్ధమేనా ? మీలాంటి మంచి స్థితిలో లేని అభాగ్యుల కోసం మీరు సహాయం చెయ్యడానికి ఒప్పుకుంటున్నారా ? - సరే , నాకు ఓ లక్ష వస్తే , పదివేలు ఇస్తాను లెండి ” అని చెప్పడం నిరర్ధకం . లక్ష మీ చేతిలో వచ్చి పడకముందే మీరు కష్టాల్లో వున్నవాళ్ళను ఆదుకుంటూ ఉండడాన్ని ప్రారంభించి ఉండాలి . సంతోషంతో సహాయాన్ని ఇతరులకు మీరు అందించగలుగుతున్నారంటే “ ఇచ్చి - పుచ్చుకో ” అనే సూక్తి అర్ధాన్ని సంపూర్ణంగా అనుభవిస్తున్నట్లే లెక్క.

◆ మీ కోరిక యొక్క లక్ష్యం నిర్దిష్టంగా , స్పష్టంగా ఉండి తీరాలి . ఇక మూడో అంకం గురించి తెలుసుకుందాం . మీకు - ఆ క్రొత్తకారో , క్రొత్త మొగుడో , క్రొత్త పెళ్ళామో ఎప్పుడు కావాలి ? ఎప్పుడో భవిష్యత్తులో కావాలి " అని చెప్పుకోవడం కూడా నిష్పలం - నిరర్ధకం . అదే విధంగా “  వెంటనే కావాలి ! ఇప్పుడే కావాలి ! ” అని చెప్పుకోవడం కూడా అవివేకమే ఎందుకంటే ప్రకృతి ధర్మాన్ని మీరు ఉల్లంఘించకూడదు గనుక . ఏ దేవుడికీ ఓ బంగారు ఇటుకను , నిరీక్షిస్తున్న మీ దోసిలిలోకి పడేలా ఇప్పుడే పడేయడం కుదిరేపని కాదు కాబట్టి . ఒకవేళ పడినా మీ చేతుల్తో దాన్ని పట్టుకోవడం కుదిరే పని కాదు . మీ పాదాల
మీద ఆ బరువు పడి కాళ్ళు చితికిపోవచ్చు బహుశా !
 ఇది సంభవమే ! మీరు నిర్ణయించుకునే కాల పరిమితి కూడా హేతుబద్ధంగానే భౌతిక ధర్మాలకు అణుగుణంగా  ఉండి తీరాలి . కాబట్టి ఫలానా సంవత్సరం , ఫలానా నెలలో మీకు ద్రవ్యం లభిస్తుందని అనుకోవడం సబబుగా ఉంటుంది . మరో ఐదు నిమిషాల్లో ఓ సంపద మీ చేతిలోకి వస్తుందని ఊహించడం ప్రకృతి ధర్మాలకే విరుద్ధం - మీ ఆలోచనాశక్తి కూడా నిరర్ధకంగా క్షీణిస్తుంది.

◆  మీ ధ్యేయాన్ని సాధించేందుకు మీరేం చేయబోతున్నారు ? ఓ ఉదాహరణకోసం - మీకో కారు కావాలని కోరుకుంటున్నారు అనుకోండి . సరే , ఇంతకూ మీకు కారు డ్రైవింగ్ వచ్చా ? రాకపోతే మీరు కారును కోరుకోవడంలో ఏమయినా అర్థం ఉందా ? కాబట్టి మీకు కారు కావాలని దృఢమైన కోరిక ఉంటే ముందు కారు నడపడం నేర్చుకోండి . తరువాత మీకు ఎలాంటి కారు కావాలో ఓ నిర్ణయాన్ని తీసుకోవచ్చు . 

◆ అలాగే పెళ్ళికోసం మీరు తహ తహలాడుతుంటే ముందుగా మీరు ఎందుకోసం పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారో మీ అర్హతలేమిటో , ఇచ్చి పుచ్చుకునే స్వభావం మీకుందో లేదో అర్థం చేసుకోండి.  సంసారంలో తగిన భాగస్వాములుగా మీరు ఉండగలరో లేదో తెలుసుకోండి . మీ వంతు పాత్రనూ , మీవంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తించగలరో లేదో గ్రహించుకోండి . ఇంకొకరిని మీరు భాగస్వామిగా చేసుకోవాలంటే వాళ్ళకు మీరు తగిన భాగస్వామిగా ఉండాలి కదా . “ పెళ్ళి ” అంటే మీరు ఏమీ ఇవ్వకుండా , అంతా లాక్కునే వ్యవస్థకాదు . పెళ్ళాడిన తరువాత మీరు ఓ వ్యక్తిగా ఉండలేరు. ఇద్దరి సంతోషాలూ , ఇద్దరి కష్టాలూ , ఇద్దరి సమస్యలూ మీవే అవుతాయి . శారీరకంగా , మానసికంగా , ఆధ్యాత్మికంగా మీరు సరయిన స్థితిలో ఉంటేనే ఇంకొకళ్ళకి మీరు చక్కటి భాగస్వాములు కాగలరు . సహజీవనం సాగించగలరు .

◆ గోటి మాట కన్నా చేతి వ్రాత చాలా గొప్పది . ఈ రెండూ ఒక్కచోట్లో కలిసి ఉంటే ఎదురులేని జంటగా ఇవి ఏర్పడి ఉంటాయి . మీకు ఏం కావాలో వ్రాయండి . ఎంత క్లుప్తంగా వ్రాస్తే అంత మంచిది . ఎంత స్పష్టంగా వ్రాస్తే అంత మంచిది . మీకేం కావాలో మీకు తెలుసు కనుక ఆ కోరిక ఏమిటో స్పష్టంగా వ్రాయండి . మీకు ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలా ? ఈ విషయంలో మీకు మార్గదర్శి ఎవరు ? ఆ వ్యక్తి గుణగణాల గురించి వ్రాయండి . మీకు డబ్బు కావాలా ? మీకు ఎంత కావాలో వ్రాయండి . వ్రాతపూర్వకంగా మీరు ఇంకొకళ్ళకు సహాయం చెయ్యగలమనీ పదోవంతు దానం చేస్తామని వ్రాయండి . ఇదంతా స్పష్టంగా వ్రాసిన తరువాత చివర్లో ' ' నేను యిస్తాను ; తీసుకోవడం నాకు ప్రాప్తించవచ్చు ” . అనే మాటను వ్రాయండి . ఆ డబ్బును సంపాదించేందుకు ఏ పనులు చెయ్యదలచుకున్నారో కూడా చివరలో వ్రాయండి . 

◆ ఉత్తినే కూర్చుంటే మీకు ఏదీ రాదని గ్రహించండి. తీసుకున్న ప్రతి వస్తువుకూ తగిన మూల్యాన్ని ఏదో ఒక రూపంలో మనం చెల్లించాల్సి వుంటుందని మరిచిపోకండి . 
" ఉచితంగా ఏదీ మనకు లభించదు ” అని తెలుసుకోండి . అనాయాచితంగా మీకో వంద డాలర్ల డబ్బు ప్రాప్తించిందనుకోండి . ఆ వంద డాలర్లకు సరిపోయే పనిని తప్పక చేయవలసి ఉంటుంది . ఇంకొకళ్ళ సహాయాన్ని మీరు కోరాలనుకునే ముందే ఇంకొకళ్ళకు మీరు సహాయాన్ని చేసి తీరాలి.

◆ ఇదంతా మీరు వ్రాసి ఉంచుకున్నారని మేము భావిస్తున్నాం . ఈ మాటలన్నింటినీ మీలో మీరే రోజుకు మూడుసార్లు బిగ్గరగా చదివివినండి . మీ గదిలో ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు గట్టిగా ఈ విషయాలను మీలో మీరే చదివితే మీకు ఎంతో శక్తి వస్తుంది . మీ పడకగదిలోంచి మీరు బయటకు వచ్చే ముందు ఒకసారి చదవండి . మధ్యాహ్నం లంచ్ చేస్తున్నప్పుడు ఓసారి చదవండి . రాత్రి మీరు పడుకోబోయే ముందు మూడోసారి
 దాన్ని చదివిపడుకోండి . ముమ్మార్లు మీ నిశ్చయాల్ని ఓ మంత్రంలాగా మీరు కావాల్సిన కారో , డబ్బులో మీ వద్దకు వస్తున్నట్లు ఊహించండి . ఆ డబ్బో , వస్తువో మీ వద్దకు వచ్చేసినట్లు ఊహించండి . ఎంత తీవ్రంగా స్పష్టంగా మీరు ఊహించగలిగితే అంత త్వరగా మీ కోరికలు సిద్ధిస్తాయి . ఇది పనిచేస్తే బావుణ్ణు . అది నాకు లభిస్తే బావుణ్ణు - రాదేమోనని నా అనుమానం ” – ఈ పద్ధతిలో మీ ఆలోచనలు సాగితే మీ మంత్రాన్ని ఈ మాటలు బలం లేకుండా చేసేస్తాయి. అందువల్ల ఎప్పుడూ మీ ఆలోచనలు సవ్యంగానే సాగాలి . ఎలాంటి అనుమానాలూ మీకు రాకూడదు . మీ ఆలోచనలు ఎప్పుడూ నిర్మాణాత్మ కంగానే సాగుతూండాలి . ఇలా కొంతకాలం చేసేసరికి మీ అంతరంగంలోకి , మీ అచేతనపు మనస్సులోకి ఈ కోరిక బాగా నాటుకుంటుంది . 

◆ మీ చేతనత్వపు మనస్సుకన్నా మీ అచేతన చైతన్యం 9 రెట్లు తెలివైనది. మీ అచేతన మనస్సుకు ఉత్సాహం కలిగించగలిగారంటే మీకు దాన్నుంచి సహాయం రావడం ప్రారంభమవుతుంది . మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సహాయమే మీకు లభించి తీరుతుంది . వ్యక్తి కొంత డబ్బును కష్టపడి సంపాదించిన తరువాత మరీ కష్టపడకుండానే మరింత డబ్బులు సులభంగా అతని వద్దకు వచ్చి చేరుతాయిని చాలాసార్లు నిరూపించబడి ఉంది . డబ్బులు ఎక్కువైన కొద్దీ మరింత డబ్బులు అక్కడికి - అయస్కాంతం దగ్గరికి ఇనుములాగా - ఆకర్షింపబడుతూ ఉంటుంది !

◆ మరణం లేని మీరు                సే::మాధవ కొల్లి.               

మనిషే దేముడు మనిషే - రాక్షసుడు. మనలోని దైవాన్ని మేలుకొలపటమే ఆధ్యాత్మికత .

 🪷🌹🪷
 మన ఆలోచన అత్యున్నతంగా ఉంటే అది మనలను అత్యున్నత మైన దానితో అనుసంధానం చేస్తుంది.

మనల్ని బాధపెట్టే విషయాలను పక్కన పెట్టేసి సంతోష పెట్టే విషయాలను పదే పదే తలుచుకోండి...                                                 అప్పుడే తెలియని శక్తి మనలో నిండి మనం సంతోషంగా ఉండగలం...

ప్రతి రోజు మన పనులు, మాటలు, చేష్టలు గమనించుకుంటూ ఉంటే.మనం చేసే పొరపాట్లు అర్ధమవుతూ ఉంటాయి. మన వలన పొరపాటు లేక తప్పు జరిగింది అని తెలియగానే దానిని సరి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే మనిషి తప్పులలోకి వెళ్లకుండా వుండే అవకాశం వుంది. ఒకవేళ పొరపాటున చేసినా సరిదిద్దికునే అవకాశం వుంది.

 ఇదే విధముగా మనతో వ్యవహరించే మనుషులను గమనించి - వారి ద్వారా మనకు కలిగిన ఇబ్బందులను మనం ఇతరులకు కలిగించకుండా - ఇతరులు మనకు చేసిన మేలును మరువకుండా తిరిగి ఆ మేలును,మంచిని మన చుట్టూ ఉన్న వారికి అందిస్తూ ఉంటే - అది ఆధ్యాత్మిక సాధనే అవుతుంది.

 అసలు మన లోపలే తప్పు - ఒప్పులు చెప్పే బుద్ది అనే జ్ఞానం వుంది. కొంచెం లోపల గమనించుకుంటే చాలు.                     
                                           మనిషే దేముడు మనిషే - రాక్షసుడు. మనలోని దైవాన్ని మేలుకొలపటమే ఆధ్యాత్మికత .           సే::మాధవ కొల్లి.                  
 🌠🙏🪐ఓం నమః శివాయ 🪐🙏🌠

ఒకసారి ఒక వ్యక్తికి దారిలో ఒక స్వామీజీ కలిశారు. 
అయితే ఆ వ్యక్తికి  అతను మహిమగల స్వామీజీ అని తెలియదు. 

అ స్వామీజీ ఆ వ్యక్తిని తాగడానికి నీళ్ళు అడిగారు. 
ఒక క్షణం గడిచిందంటే ఆ నీళ్లు ఆ వ్యక్తి తాగేవాడే,
కానీ దాహం అని అడిగినందుకు అతను ఆ స్వామీజీకి నీళ్లు ఇచ్చి దాహం తీర్చాడు. 

నీళ్లు తాగిన తర్వాత ఆ స్వామీజీ ఆ వ్యక్తితో, నేను ఇతరుల నుండి ఏది స్వీకరించిన  తరువాత  నేను ఇతరులకు ఏదైనా ఉపకారం చేయంది విడిచిపెట్టను 

కనుక   

నీవు తాగడానికి సిద్ధంగా ఉంచుకున్న నీళ్ళిచ్చి 
నా దప్పిక తీర్చావు. కావున నీ తలరాత మారడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని, ఆ స్వామీజీ తన జోలేనుండి ఆ వ్యక్తికి  ఒక డైరీ ఇచ్చారు. 

నీకు ఒక ఐదు నిమిషాలు సమయం ఇస్తున్నాను 
ఇందులో నీకు ఏమి కావాలో రాసుకో అదే జరిగి తీరుతుంది

కానీ గుర్తుంచుకో.
 
నీకు సమయం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే....
ఆ వ్యక్తి  ఆ డైరీ తీసుకుని ఓపెన్ చేసాడు. 

మొదటి పేజీలోనిది చదివాడు... 
అందులో తన పక్కింటాయనకు "లాటరీ రాబోతోంది అతడు కోటీశ్వరుడు కాబోతున్నాడు
అది చదివి ఆ వ్యక్తి అతనికి లాటరీ తగలకూడదు, వాడు గొప్పవాడు కాకూడదు, అని రాశాడు. 

తర్వాత పేజీ చదివాడు...
తన స్నేహితుడికి ఇంటర్వ్యూలో పాసైయ్యి మంచి ఉద్యోగం రాబోతోంది " అది చదివి 
అతడు ఫెయిల్ అయ్యిపోవాలి, అతనికి ఉద్యోగం రాకూడదు, అని రాశాడు.

తర్వాత పేజీలో 
తన స్నేహితురాలకి భర్తకి కోర్టులో నడుస్తున్న విడాకుల కేసు కోర్టు కొట్టివేసి ఇరువురికీ ఒకటి చేస్తుంది" అని చదివి వెంటనే 
అలా జరగకూడదు, వారు విడిపోవాలని రాసాడు,

మరో పేజీలో తను పనిచేస్తున్న కార్యాలయంలో అధికారులు, తన సహచరులు, సంతోషంగా ఆనందంగా ఉంటారు అని చదివి అలా ఉండకూడదు అని వ్రాశాడు.

ఈ విధంగా ప్రతి పేజీనీ చదువుతూ....
ఏదో వొకటి రాస్తూ...
 
చివరికి...! 
ఖాళీగా ఉన్న తన పేజీలో తనకు కావలసింది రాయలని అనుకోగా.

ఈలోపే  ఆ స్వామీజీ ఆ వ్యక్తి చేతినుండి  డైరీని తీసుకుని, నీకు ఇచ్చిన ఐదు నిమిషాల సమయం పూర్తి అయ్యింది. 

ఇప్పుడు నీవు ఏమి రాయకూడదు. 
నీవు నీ పూర్తి సమయాన్ని ఇతరుల వ్యక్తిగత విషయాలలోనూ, ఇతరులను చింతన చేయడంలోనే, 
నీ సమయం అంతా వృధా చేసుకున్నావు. 
నీ జీవితాన్ని నీకు నచ్చిన విధంగా మార్చుకునే అద్భుతమైన అవకాశం నీకిచ్చినా... 
స్వయంగా నువ్వే నీ జీవితాన్ని కష్టంలోకి నెట్టుకుని, కష్టాలు అనుభవిస్తూ బాధపడుతూ ఉంటున్నావు అలాగే 

నీ కష్టాలు స్వయంగా దేవుడే దిగివచ్చిన దూరం చేయలేడు అని డైరీ తీసుకున్నాడు ఆ స్వామీజీ

ఆ వ్యక్తి  చాలా పశ్చాతాప పడ్డాడు. 
వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నానని కుమిలి కుమిలి ఏడుస్తూ. జీవితాన్ని కొనసాగిస్తున్నాడు

ఈ కథ యొక్క అర్థం ఏమిటంటే 

భగవంతుడు మనందరినీ సంతోషంగా ఉంచేందుకు ఎన్నో అద్భుతమైన అవకాశాలను
తానే స్వయంగా గానీ...
శ్రేయోభిలాషులు, 
ఇరుగుపొరుగువారు,
బాటసారుల రూపంలో గాని మనకు పంపిస్తాడు. 

కానీ 

మీరు వ్యర్థముగా ఆలోచిస్తూ ఇతరులకు చెడు చేస్తూ మీ సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నారు 

ఎవరైతే ఇతరులకు సదా సుఖాన్ని ఇస్తూ ఉంటారో వారి పైన సదా భగవంతుని కృప నిండి ఉంటుంది.

ఈ సంగమ యుగంలో భగవంతుడు కలం మనచేతికి ఇచ్చి  మీ భాగ్యరేఖను మీరే రాసుకోండి అని 
ఎన్నో అద్భుతమైన అవకాశాలను ఇస్తున్నారు. 

కానీ 

మీరు  పర చింతన చేస్తూ! సమయము  వృధా చేసుకుంటున్నాము.  
మీ అదృష్టాన్ని మీరే వంచన చేసుకుంటున్నారు 

అనేది అక్షర సత్యం.

       🌹🙏🌺శివాయ గురవే నమః 🌺🙏🌹
.

_మౌనమే నీ భాష....

 *_మౌనమే నీ భాష.._*
+++++++++++++++++
మౌనమే బోధన..
ఆ మౌనమే సాధన..
అదే భాష..
అదే గుండె ఘోష..
మనిషై పుట్టి జ్ఞానమార్జించి.. మదమాత్సర్య
రాగద్వేషాలను నిర్జించి
ఐహిక భోగాలను విసర్జించి
మహర్షిగా అవతరించి..
రమణుడు
రమణ మహర్షి
అయ్యాడు..
జగతిని ఉద్దరించాడు!

*_ఆ మౌనం_*
*_అర్థం చేసుకుంటే_* 
*_అదే జ్ఞానం.._*
*_ఉపనిషత్తులను మించి.._*
*_వేదాలను గ్రహించి_*
తాను నిగ్రహించి..
భక్తులను అనుగ్రహించిన
రమణుడి మౌనంలోనే
*గీతసారం..*
ఆ మౌనం వీడి మాటాడితే
అదప్పుడు *సకల వేదసారం!*

*_సమాధి..ముక్తికి పునాది.._*
*_అయితే మరణించాక_* 
*_శవమై చేరేది కాదు.._*
*_ఉన్నప్పుడే ప్రకృతి_* 
*_నీ వశమై_*
*సాధించే అలౌకిక పథం..*
దేవుని చేరేందుకు 
అదే రమణుడి విధం..
అదే సౌధం..!

*అరుణాచలం..*
ఏంటో అంత అనుబంధం
ఆ పేరు వినగానే అల్లరి కుర్రాడు వెంకట్రామన్ లో
ఓ కదలిక..
అప్పుడే మొదలై అంతర్మథనం..
ఆధ్యాత్మికతకు దొరికింది
సరికొత్త మూలధనం..
*_మౌనమే అయింది మానధనం..!_*

నమ్మని చలం కూడా 
నచ్చిన వైనం..
ఆ మొండిఘటం మైదానం
ఒకనాటికి అయింది 
రమణస్థానం..
ఆ భిన్నధృవాల..
విభిన్న దృక్పథాల
బంధానికి నిజస్థానం..!
అలా ఏదో ఒక దశలో
మారి ఉంటుందేమో
పెంకి మనిషి ప్రస్థానం!!

*నేను ఎవరు..*
*_ఈ ప్రశ్న రమణుడిదే.._*
*_సమాధానమూ ఆయనదే.._*
ఎన్నో సందేహాలకు ఆయన దేహమే జవాబు..
ఎన్నెన్నో సాధించినా 
ఆయన నిత్య గరీబు.. 
కాని..తిరుగులేని 
*ఆధ్యాత్మిక నవాబు!!*

🙏🙏🙏🙏🙏🙏🙏
భగవానుడి జయంతి 
(30.12.1879)
సందర్భంగా 
కోటి నమస్సులతో..

*_ఎలిశెట్టి సురేష్ కుమార్_*
     9948546286

****మరణం లేని మీరు* (లోబ్ సాంగ్ రాంపా).Chapter -- 23 & 24 🌺 🌹 ఊహాశక్తి 🌹 🌹 కర్మ సిద్ధాంతం 🌹

 🔺 *మరణం లేని మీరు* (లోబ్ సాంగ్ రాంపా) 🔺
🔹(అనువాదం:- P.G.రామ్మోహన్) 🔹
🌺 Chapter -- 23 & 24 🌺
🌹 ఊహాశక్తి 🌹
🌹 కర్మ సిద్ధాంతం 🌹

◆ ఇచ్చాశక్తి (Will power) కి , ఊహ(Imagination) కూ యుద్ధం జరిగితే చివరికి ఊహే గెలుస్తుంది. 

◆ ఊహాశక్తి యొక్క సహకారం లేకపోతే ఇచ్చాశక్తితో తాము ఏమీ సాధించలేరు.

◆ ఇచ్చాశక్తికంటే ఊహాశక్తే గొప్పది . ఊహాశక్తి కన్నా గొప్ప శక్తి ఏదీ లేదు . 

◆ మీ ఊహాశక్తిమీద ఓ పట్టును మీరు సంపాదించుకోగలిగితే మీకేం కావాలన్నా సంపాదించుకోగలుగుతారు. ఈ ఊహాశక్తి మనం శాసిస్తే పనిచేయదు. ఊహాశక్తి ఫలానా విధంగా పనిచేయాలని మీరు నిర్దేశించాలంటే వీలుపడదు.

◆ విల్ పవర్ ' (ఇచ్చాశక్తి ) ను ఉపయోగించి , మీ ఊహలను మీరు నియంత్రించలేరు . అలాంటి ప్రయత్నాన్ని మీరు చేస్తే నరాల జబ్బుల్తో మీరు బాధపడాల్సి వస్తుంది . మీ ఆలోచనలను మీరే నడిపించాలని గుర్తు పెట్టుకోండి . మీ ఊహలను మీరే అదుపుచేసుకోవాలి . ఇష్టం వచ్చినట్లు మీ ఊహలని ఉరకలెత్తిస్తే మీకు అపజయం తప్పదు . మీ ఊహాశక్తిని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఇదివరకు “ దాదాపు అసంభవా " లని అనుకున్న పనులన్నిటినీ సులభంగా నిర్వర్తించగలరు . కాబట్టి ముందుగా " అసంభవం ” అనేది ఏదీ లేదని నమ్మండి .

◆ ఈ జన్మలో " చెడిపోయిన విత్తనాలు " అనే చెడుపనులను మీరు నాటితే , పై జన్మలోనో , అదీ కాకపోతే మూడవ జన్మలోనో చెడిన భవిష్యత్తును " పంట లాగా పొందుతారు . ఒక వేళ ఈ జన్మలో కొంత మంచిని నాటితే - మంచినీ , దయనూ , జాలినీ , సానుభూతిని అర్హులైన వారి పట్ల చూపిస్తే - కాలం గడిచాక మీ వంతు వచ్చి దురదృష్టం మిమ్మల్ని ఆవరించి మీరు బాధపడుతున్నప్పుడు ఎప్పుడో , ఎక్కడో , ఎవరో మీపట్ల అలాంటి దయనే అలాంటి సానుభూతినే అలాంటి సహాయన్నే చూపిస్తారు , అందిస్తారు .

◆ కొంత మంది మహనీయులు (వీరిని అవతారపురుషులు  అంటూ ఉంటాం).కొన్ని కార్యాలను సాధించడానికి భూమిమీద జన్మనెత్తుతూ ఉంటారు.ఈ అవతారపురుషులు తరచుగా దరిద్రంలోనే జన్మిస్తూ మానవులకు జాలీ, దయా, సానుభూతి లాంటి ఉత్తమ 
గుణాలను నేర్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు  అవతారపురుషులను దుఃఖం ఏమాత్రం బాధించదనీ దుఃఖానికి వీరు అతీతులనీ " అందరూ అనుకునేలా భూమిమీద జీవితాన్ని గడుపుతారు . “ బాధలు వీరిని బాధించవనే మాట నిజానికి సత్యదూరం . అత్యంత సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు కాబట్టి దుఃఖాలు వీరినే ఎక్కువగా బాధిస్తాయి . 

◆ ఓ అవతార పురుషుడి జన్మ బలవంతం మీద జన్మించే జన్మ కాదు , విధిగా ఎత్తాల్సిన జన్మకాదు , కర్మానుసారం ఎత్తాల్సిన జన్మ కాదు . మూర్తీభవించిన ఆత్మగా స్వేచ్ఛగా జన్మించిన జన్మ అది . కొన్ని పరిస్థితులలో జన్మించాల్సిన అవసరం కూడా ఉండదు - ఇంకొకరి శరీరాన్ని ఈ అవతార పురుషుడు ఆక్రమించగల సమర్థుడై ( ability to walk - in ) ఉంటాడు . మేము మత విశ్వాసాలనే కాలిమీద పుండ్ల మీద తొక్కి ఎవర్నీ బాధించదలచడం లేదు . కానీ , మళ్ళీ ఒక్కసారి పరిశుద్ధ గ్రంధాన్ని ( బైబిల్ ) జాగ్రత్తగా పరిశీలిస్తే రక్షకుడు ( జీసస్ ) ఓ మనిషిగా జోసెఫ్ మేరీలకు జన్మించినా , కాలాంతరంలో , జీసస్ పెద్దవాడయిన తరువాత నిర్జనారణ్యంలో క్రీస్తు ఆత్మ - రక్షకుడి ఆత్మ - క్రిందకు దిగి వచ్చి , జీసస్ శరీరం నిండా నిండిందని మనం గ్రహించవచ్చు . ఇంకోరకంగా చెప్పాలంటే వేరొక ఆత్మవచ్చి తనను ఆహ్వానిస్తున్న జోసెఫ్ మేరీల కుమారుడైన జీసస్ శరీరాన్ని ఆవహించిందని మనం తెలుసుకోవచ్చు . 

◆  మీ ఆలోచన ఎలా ఉంటుందో , మీరూ అలాగే ఉంటారు . పవిత్రమైన ఆలోచనలను మీరు చేస్తూ ఉంటే మీరూ పవిత్రులే అవుతారు . కామం గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే మీరూ కాముకులే అయిపోయి మలినులౌతారు , అంతేకాక , మీరు భూమి మీదకు మళ్ళీ మళ్ళీ తిరిగివస్తూ ఉండవలసి వస్తుంది - మీలో కోరికలు " మంచి ఆలోచనల వల్లా , నిర్మలత్వం వల్లా నశించిపోయే వరకూ ఈ జన్మల పరంపర నుంచి మీరు తప్పించుకోలేరు.

◆ అందరికి కర్మసిద్దాతం వర్తిస్తుంది.ఒక్క "అవతార పురుషుడు " తప్ప ! ఈ మహనీయుడిని కర్మ బంధించదు. అవతారపురుషుడికి కర్మ సిద్ధాంతం వర్తించదు .

◆ సత్కర్మ చేయడానికి మంచి మార్గం ఏమిటంటే - ఎవరు మనకోసం ఏం చేస్తే మనకు సంతోషం కలుగుతుందో అలాంటి వాటినే మనం ఇతరుల సంతోషం కోసం చేస్తూండడం ".

◆ ఆధ్యాత్మ సాధన కోసం వచ్చిన అనేక మహనీయులు శారీరక రుగ్మతను ఒకదాన్ని పట్టుకునే ఈ భూమ్మీద నివసించగలుగుతున్నారు. ఓ వ్యక్తి మీ సహాయాన్ని ఆర్జిస్తే మీరు అతడిని  కసిరికొడితే మీకన్నా ఎంతో గొప్ప ఆధ్యాత్మికత ఉన్న ఓ మహానుభావుడికి మీరు తీరని క్షోభను కలిగిస్తూ ఉన్నారని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి .

◆ స్థూలశరీరంలో ఏర్పడే ఓ రుగ్మత “ నిజానికి ఆ వ్యక్తి ఆధ్యాత్మిక అభివృ ద్ధి కోసం నిర్దేశింపబడిన ఓ రహస్య విద్యగా , సాధారణంగా స్వీకరించగలిగిన ప్రకంపనాల వేగం గల తరంగాలకన్నా ఎక్కువ ప్రకంపనాల వేగం ఉన్న తరంగాలను స్వీకరించి గ్రహించగలిగిన సిద్ధిని సాధించేందుకు ఉపయోగపడే ఓ సాధన ” మని మీరు ఏ మాత్రం సంశయం లేకుండా గ్రహించాలి . కాబట్టి - రోగులమీద కాస్త సానుభూతిని మీరు చూపించాలి . సరేనా ? ఓ రోగిష్టిని మీరు ఎప్పుడూ కసురుకోకండి . అతడి ముందు మీ ఓర్పును ఎప్పుడూ పోగొట్టుకోకండి . మీకు అర్థం కాని ఎన్నో సమస్యలను ఆ రోగి సహిస్తూ ఉన్నాడని ఎప్పుడూ మరువకండి . ఇలా మీరు ప్రవర్తించాలని చెప్పే మాటలలో మీ స్వార్ధానికి ఉపయోగపడే అంశం ఒకటి ఉంది ! ఆ రోగిష్టి మనిషి ఆధ్యాత్మికంగా మీకన్నా ఎన్నోరెట్లు ఉన్నతిని పొంది ఉండవచ్చు . అలాంటి మహనీయుడికి మీరు చేసే సహాయం మీకే సహాయకారి కావచ్చు .

◆ మరణం లేని మీరు.                  సే::మాధవ కొల్లి.               

Words To Avoid & Adopt In "2024".....

🌹 *TODAY'S THOUGHT*🌹
      ( 1 January 2024)

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

Words To Avoid & Adopt In "2024".....

The Most Selfish
One Letter Word
"I" - Avoid It.

The Most Satisfying
Two Letter Word
"WE" - Use It.

The Most Poisonous
Three Letter Word
"EGO"- Kill It.

The Most Use
Four Letter Word
"LOVE"- Value It.

The Most Pleasing
Five Letter Word
"SMILE"- Keep It.

The Fasted Speading
Six Letter Word
"RUMOUR"- Ignore It

The Hard Working
Seven Letter Word
"SUCCESS"- Achieve It.

The Most Enviable
Eight Letter Word
"JEALOUSY"-Distance It.

The Most Powerful
Nine Letter Word
"KNOWLEDGE"-Acquire It.

The Most Divine
Ten Letter Word
"FRIENDSHIP"- Maintain It.

You Will Get Lots Of Fun In Life.
"Trust It".

🙏 *Have A Gr8 2024*🙏

🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍃

ధర్మాచరణపరులు ప్రతి నిత్యమూ పాటించవలసిన కొన్ని విషయాలు

*ధర్మాచరణపరులు ప్రతి  నిత్యమూ పాటించవలసిన కొన్ని విషయాలు*

*అవి*

*ప్రతిరోజూ కనీసం ఒక్క తులసిదళం అయినా తినండి.*

*మీ ఇష్ట దైవాన్ని స్మరిస్తూ వారానికి* 
 *ఒక్కరికైనా అన్న దానం చేయండి.*

*ఎల్లపుడూ శుభాన్నీ , మంచిమాటలనీ పలకండి.దైవ నామస్మరణ చెయండి. శుభాన్ని పలుకుతూ ఉంటే  శుభం కలుగుతుంది. అశుభమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఆ అశుభాలు  వదలవు. ఎప్పుడైనా అశుభం పొరపాటున పలికితే, వెంటనే కాసేపు దైవ నామ స్మరణ చెయ్యండి.*

*ప్రతిరోజూ ఒక మంచి పుస్తకాన్ని కొద్ది పేజీలైనా చదవండి.   అలా చేస్తేనే  ధర్మాచరణ చేస్తున్నట్టు.*
   
*కనీసం రోజుకు ఒక్క పేజీ అయినా ఆధ్యాత్మిక పుస్తకాలు చదవండి. అలాచేస్తే  గ్రహాలు అనుకూలిస్తాయి.*

*ప్రతి రోజూ భగవద్గీత లోని ఏదో ఒక అధ్యాయాన్ని తప్పనిసరిగా చదవండి*

*గురూపదేశం పొందిన వారు ప్రతిరోజూ ఒక్క మాల అయినా మంత్రం జపం చెయ్యండి . కష్ట సమయంలో ఆ మంత్ర దేవత  రక్షిస్తుంది.*

*కోపాన్నీ మరియు అసూయనూ వదిలేసి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి.*

*అనుకూలించినంత వరకూ వ్రతాలూ, దానాలు చేస్తూ ఉండండి.*

*అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోండి*

*సవాళ్ళను ధైర్యం తో స్వీకరించండి*

*మీకు మీరు జవాబుదారీతనం తో అనునిత్యం వ్యవహరించండి*

*ప్రతి రోజూ ధ్యానం చేయండి*

*కష్టాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు* 
*కష్టమనుకోకుండా అనుభవిస్తే దాని గడువు ముగియ గానే   అది వెళ్ళిపోతుంది*

*సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండండి వ్యర్థ సంభాషణలతో అమూల్యమైన కాలాన్నీ శక్తినీ వృధా చేయకండి*
 చూడు నాయనా

ప్రాణం పోసింది
పొద్దు పుచ్చుకోవడానికి కాదు ...

ప్రతి పొద్దు
పొద్దుపోవక మునుపే ...

పరమేశ్వర స్వరూపాన్ని 
ప్రతిష్టించుకోవడానికి మాత్రమే ...

నీవు ఎవరింట్లో పుట్టావు అన్నది అవసరం లేదు 

నీవు ఎక్కడ పుట్టావు అన్నది అవసరం లేదు 

నీ కులం 
నీ మతం  నీ గోత్రం నీ వర్ణం ఈ జాతి అవసరం లేదు

నీవు ఏమి తిని బ్రతుకుతున్నావు అవసరం లేదు 

నీవు ఎలాంటి బట్ట కట్టుకుంటున్నావు అవసరం లేదు 

నీవు ఎలాంటి నివాసంలో ఉంటున్నావు అవసరం లేదు

నీవు ఎన్ని తిన్నావు అవసరం లేదు 
ఎన్ని తాగావు అవసరం లేదు 
ఎంతమందితో కలిసావు అవసరం లేదు

నీ జీవితం ఎలా గడుస్తుంది అవసరం లేదు 

నీవు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నావు అవసరం లేదు 

నీ జీవితంలో సుఖాలు అనుభవించావా 
కష్టాలు అనుభవించావా అవసరం లేదు

నీ జీవితంలో నీవు ఎన్ని  తెలుసుకున్నావో అవసరం లేదు
సర్వ శాస్త్రాలు చదివినావా అవసరం లేదు
నీ జీవితంలో ఎంతో ఉన్నతమైన పదవులలో కూర్చున్నావా అవసరం లేదు

నీవు ఆరోగ్యంగా ఉన్నావా లేదా అవసరం లేదు 

నీవు అందంగా ఉన్నావా అవసరం లేదు 

నీవు లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా అవసరం లేదు

ఇవన్నీ అవసరం లేవు 

( మరి ఏది అవసరం )

చనిపోయే లోపు 
నీవెవరు తెలుసుకుంటే సరిపోతుంది. 
.
మిగతావన్ని ఎందుకు పనికిరావు అన్ని శుద్ధ దండగ
.
ఆ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్లే 
ఆ ఒక్కటి తెలియకుంటే ఏమీ తెలియనట్లే..

అంతటా కలడన్న దైవానికి కేవలం ఒక్క మూల స్థానం ఇవ్వడంలోనే నేను అల్పున్ని అయ్యాను,
నేను లేకుంటే వున్నదంతా దైవమన్న గురువాక్యమును మరచి,
నేను నేనంటూ నన్ను నిలుపుకుంటూ దైవమెక్కడని వెతుకుతూ,
నా అజ్ఞాన మూర్ఖత్వంలో నాకున్న రూప, నామ, క్రియలను లక్షణాలే  దైవానికి ఆపాదిస్తూ నేను సృష్టించిన దైవాన్నె మళ్ళీ తిరిగి నన్ను నిలబెడుతూ,
నా కోరికలు తీర్చు స్వామి అంటూ మొక్కుతూ, మొరలిడుతూ తపిస్తున్న నా అవివేకాన్ని, అజ్ఞానాన్ని ఏమని వర్ణించ సాధ్యమిల వేద, వాగ్మయ, శాస్త్ర, ఇతిహాస, పురాణాది గ్రంథములలోని మహావాక్యములతోనైనా వర్ణించ తరమే????

పుట్టుక కాదొక పెద్ద విషయం. 
--------------------------------------
పుట్టాక నాతో నేనేమి చేశానన్నది
    కదా ముఖ్యం. 

అప్రయత్నంగా లభించే జననం. 
   అనివార్యంగా వచ్చే మరణం. 
   మధ్యనసాగే మన పయనం..
   అదే మన  నిరంతర పరిణామం..

కావొచ్చునెమో అది బహుశా 
   బాహ్యనికో అంతరానికో..
   అనంత ఐశ్వర్యాల  సేకరణకో.. 
   ఆంతర్యపు కాంతుల సమీకరణకో.. 

   ఏది ఏమైనా.. ఎవరేది వెతుకుతారో
   వెతికేదే కదా.. దొరుకుతుంది !!.

యుగాలుగా,తరాలుగా అలవాటుగా ప్రచారంలోను, ఆచరణలోను, నమ్మకంలోను సజీవంగా ఉన్న భావాలను ప్రశ్నిస్తూ, వాస్తవిక దృక్పథాన్ని అలవాటు చేస్తూ, ఋషి జ్ఞానాన్ని , పురాణ గాథలను గురించి ఎలా "ఆలోచించాలో"ఎలా అర్థం చేసుకోవాలో మనకు ఒక మూడు వాక్యాలలో తేల్చి చెప్పేసారు గురుదేవులు. అలాగే మనిషి ఎలా బ్రతకాలో కూడా ఒక్క వాక్యంలో నిర్దేశించారు వారు.
 అవతారాల పేరుతో, కథలుగా ప్రచారం జరుగుతున్న దైవత్వం గురించి, సరైన అవగాహనతో ఆలోచిస్తే, మత్స్యం,కూర్మం, వరాహం అన్ని జీవులకు దైవత్వాన్ని ఆపాదించడం వెనుక "సృష్టిలో, జీవపరిణామ క్రమ వివరణ, అన్ని జీవులలో దైవత్వం ఇమిడి ఉంది" అనే విషయం స్పష్టం.
జీవులన్నింటిలో సమానంగా దైవత్వాన్ని దర్శించాలి అనే విషయం. ఆదిత్యయోగీ..స్పష్టమైనప్పుడు,మానవులందరిలోను, అదే దైవత్వం, దివ్యత ఉంటుంది అని మనం గ్రహించాలి.  అంతటి దివ్యతే మనిషిలో సూక్ష్మ రూపంలో కొలువై ఉన్నప్పుడు , మానవ జాతి సహజమైన మానవత్వం మనిషిలో  ఖచ్చితంగా ఉంది, ఆ మానవత్వం ఆధారంగానే, "మనుషులంతా ఒక్కటిగా" , అందరికోసం అందరూ  జీవించడం , అలాగే  మానవత్వాన్ని పెంచుకుంటూ, ధ్యాన సాధనతో దివ్యతను పొందే దిశగా సాధన చేద్దాం.

ధ్యాన సాధన, జ్ఞానార్జన లతో సాధన పరిపూర్ణం చేసుకునేందుకు అందరం "ప్రస్థాన సాధన ఆన్లైన్ కార్యక్రమంలో  పాల్గొని, మనతోపాటు, మన తోటి వారికి కూడా ఈ భాగ్యం కలిగేలా ప్రచారం చేద్దాం.

"ధ్యాన మనో ప్రస్థానంలో, ధ్యానం, సాధన విధాన, క్రియ, ప్రస్థానం సాధన ఫలితం. ప్రస్థానించవలసినది, మనసును, కనుక - ఆబ్జెక్ట్ మాత్రమే! మరి.. కర్త లేని క్రియకు, అవకాశం లేదు, పరోక్ష రీతిలోనైనా!.... ధ్యాన  మనో ప్రస్థానంలో, క్రియ వుంది. ఆబ్జెక్ట్ వుంది. ప్రస్థానం పేర క్రియా ఫలితమూ వుంది. మరి కర్త ప్రత్యక్షత,లేదు. నిత్య జీవితంలో, మనసు, క్రియ కాదు. శరీరంతో, క్రియను చేయించేది, మాత్రమే అని అవగాహన చేసుకుని ధ్యాన మనో ప్రస్థాన సాధనలో ముందుకెళ్ళాలి అని దివ్యతా మార్గాన్ని మానవాళికి చూపిస్తున్న మహోన్నత దివ్యతా స్ఫూర్తి ..

*పదార్థ  ధర్మం, ప్రకృతి సహజత. కనుక, స్థిర ధర్మాన్ని కలిగిన ఆత్మ, చలన గుణ మనసు సమీపత ఫలితం, ఆ రెండూ కాని, మరో ఏర్పాటు, తప్పనిసరి! అదే ఆత్మీకరణ మనసు*ఆదిత్యయోగీ*

      మమతలు,కలతలు,మనిషి జీవితంలో మామూలే! ఈ రెండూ, వెలుగు నీడల్లా, అతి సమీపంగానే వుంటాయి. అయితే, వీటి మధ్య నలిగి,కమిలి,మానసికంగా కుమిలిపోవడం మాత్రం కోరదగినది కాదు. అయినా,వీటికి అతీతంగా, బ్రతకడం,బ్రతకాలనుకోవడం, మామూలు మానవులకు సాధ్యం కాకపోవచ్చు. అయినా ప్రయత్నం. జీవిత ధర్మం!
   జీవిత మాధుర్యాన్ని గ్రోలుతూ, మనసును మత్తెక్కించుకోని వ్యక్తి జ్ఞాని కాగలడు. జీవిత సన్యాసమే ఆత్మ (?)విన్యాసమనుకోవడం పూర్తిగా 'జడ'లక్షణం.చైతన్య పదార్థ, కనీస లక్షణం కూడా కాదు. అని మనకు తెలియ పరచిన పూజ్య గురుదేవుల, చరణారవిందాల   కు మనఃపూర్వక  
ఆత్మ నమస్కారములు..

మనిషి జీవితం, ద్వంద్వం. పరస్పర భిన్నత కలిగి జంటగా, సమీపతను కలిగిన దానినే 'ద్వంద్వం' అనాలి. 'మనిషి-మనసు', అలాటిదే! అయితే, ద్వంద్వ నిర్వహణ మనసుదే కావడంతో, 'మనిషి, మనసు' ద్వారా జరిగే దానికి, మనిషి నిమిత్త మాత్రమే! కేవలం, భౌతిక ద్వందాన్నేకాక, ఆధ్యాత్మిక ద్వైతాన్ని, వేదాంత ఏకతను, ప్రతిదానిలోనూ పరస్పర అనుకూల - వ్యతిరేకతలను నిర్వహించగలుగుతున్న 'ఇంద్రియ మనసు' మనిషి స్వాధీనమైతేనే, పరిస్థితి, ఉన్నతమైనదిగా వుంటుంది..

నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది. అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతయే అసలైన ప్రార్ధన. *

*మన జీవితం జీవితమని చెప్పడానికి అర్హత లేనిది నువ్వు మరణాన్ని దాటి ప్రయాణించినపుడే జీవితం మొదలవుతుంది. ధ్యానమంటే అదే. ద్యానందానికి వుపయోగపడే వుపకరణం, వ్యూహం, నిచ్చెన, మరణాన్ని దాటిన ఒక మెరుపు చాలు. అప్పుడు నువ్వు ఈ శరీరమొకటే మరణిస్తుందని నువ్వు కాదని తెలుసుకుంటావు. శరీరమే పుడుతుందని, నువ్వు కాదని గ్రహిస్తావు. నువ్వు పుట్టుకకు ముందు యిక్కడున్నావు. మరణానంతరం యిక్కడుంటావు. నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది.*ఆదిత్యయోగీ*

*అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతని నేను ప్రార్ధన అంటాను. తక్కిన అన్ని ప్రార్ధనలూ మోసపూరితాలే. నిజమైన ప్రార్థన నువ్వు ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవడం నించీ ఆరంభమవుతుంది. అప్పుడు నీలో కృతజ్ఞత మొదలవుతుంది. నువ్వు అస్తిత్వానికి తలవంచాలి. నువ్వు పొందిన వరాన్ని నువ్వు ఆశించలేదు. అడగలేదు. నిజానికి నీకా అర్హత కూడా లేదు. ఎవరికీ అర్హత లేదు. కానీ అస్తిత్వం వాటన్నిటీ అనురాగంతో యిస్తుంది...

అనుభవమే జ్ఞానం 

రేపటి కోసం కష్టపడుతున్నాం 
రేపటి కోసం దాచుకుంటున్నాం 
రేపటి కోసం ఖర్చుపెట్టుకుంటున్నాం. 
అన్ని రేపటి కోసం అయితే 
అసలు రేపు అంటూ నువ్వు ఉండకపోతే...?

సో మనం ఆత్మ స్వరూపులై ఈ భూమి పై ఉండవచ్చు. కానీ శరీరంలో ఉండలేము.అందుకే మనం ఏం చేసినా. ఈ శరీరంలో ఉన్నంతసేపు అందుకే ఏదో ఒకటి చేస్తూ ఉండండి.

 ఈ క్షణం విలువైంది అనేది తెలుసుకొండి.
ఈ భూలోకంలో మన పాత్ర ఏ క్షణం ముగిసిపోతుందో తెలియదు.అందుకే ప్రతి క్షణాన్ని అద్భుతంగా ఉన్నతంగా జీవించడానికి ప్రయత్నించండి.

రేపటి కోసం ఏదైనా దాచి పెట్టాలి అని మీరు అనుకుంటే మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని కాదు.

మీరు చేసే చిన్న చిన్న సేవలనీ. విశ్వానికి అందించే ప్రేమని. ప్రతి ఒక్కరితో మనం ప్రవర్తించే విధానాన్ని.
అలాగే ప్రతి ఒక్కరికి మీరు అందించే జ్ఞానాన్ని. ఇవన్నీ మీరు లేకపోయినా అలాగే ఉండిపోతాయి.

సో మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిక్షణాన్ని ఒక పండుగలా చేసుకుంటూ ఆనందంగా ఉంటూ ప్రతి ఒక్క పనిని అద్భుతంగా చేస్తూ అందులోని నిమగ్నం అయి పోవాలి.ఇదే సత్యమార్గం అయిన విశ్వ కర్త యొక్క జీవితం.....*
.