*శుభోదయం. ఓం నమౌవేంకటేశాయ *
-------------------
"నీతో ఉన్నవారు నిన్ను ఎందుకు కలిసామా అనేలా బ్రతకకూడదు.
నిన్ను విమర్శించిన వారు కూడా నిన్ను ఎందుకు వదులుకున్నామా అనేలా బ్రతకాలి."
--------------------------
🌹 *మంచి మాట* 🌼
---------------------------
"ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడాలి.
నిజాలు వినాలంటే వారితోనే మాట్లాడాలి."
*_నేటి మాట_*
*సత్పురుషుల సహవాసం - ఆది శంకరుల బోధ🙏*
నువ్వు ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు అన్నారు భగవత్పాదులు.
ఎవరైతే ఎదుటివారి మంచిని కోరతారో, స్వప్నంలో కూడా ఎదుటి వారికి చెడు తలపెట్టరో, ఎదుటి వానిలో మంచిని మాత్రమె చూస్తారో వారే సత్పురుషులు...
"నేయం సజ్జన సంగే చిత్తం" అన్నారు భగవత్పాదులు.
"గేయం గీతా నామ సహస్రం" భగవంతుని నామాన్ని జపించు.
ఆయన ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీతను పారాయణ చేయి.
మన జీవితంలో సమయం అమూల్యమైనది, సమయం పొతే తిరిగిరాదు.
సమయాన్ని వ్యర్ధం చేయకు, మానవ జన్మ అపురూపమైనది, ధర్మానుష్టానానికి అనువైన జన్మ.
దీనిని వ్యర్ధ పరచుకోకు అన్నారు భగవత్పాదులు...
వాక్కు భగవన్నామోచ్చారణకు ఉపయోగించు, నీకున్న సకల ఇంద్రియములను భగవత్సేవలో వినియోగించు, ఇహంలోనూ పరంలోనూ సుఖపడతావు.
"ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః" నీ మిత్రుడవైనా శత్రువువైనా నీవే. సన్మార్గములో వెళ్లావు అంటే నీకు నీవు మిత్రుడివి...
తప్పుదారిలో వెళ్ళావంటే నీకు నీవు శత్రువువి.
కాబట్టి ఎప్పుడూ నీకు నీవు శత్రువువి కావద్దు.
నీకు నీవు మిత్రుడివికా!!, సరియైన దారిలో వెళ్ళావంటే ఎన్నటికీ చ్యుతి అనేది రాదు.
ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది.
ఎప్పుడు తప్పటడుగులు వేశామో సకల అనర్ధాలు కలుగుతాయి.
తప్పుదారి అంటే అధర్మాన్ని ఆచరించడం.
ఇటువంటి ఉపదేశములను ఆదిశంకరుల వారు మనకు విశేషంగా చేశారు.
వాటిని మనం మననం చేయాలి, అదేవిధంగా ఆచరణ చేయాలి, ఈవిధమైన మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసిన ఆదిశంకరులు సదా స్మరణీయులు, వందనీయులు, పరమ ఆరాధనీయులు.
ఈ ధర్మప్రభోధం ఎల్లప్పుడూ జరగాలి అనే ఉద్దేశ్యంతో నాలుగు పీఠాలు స్థాపించారు...
ఇక్కడ ఉండే పీఠాధిపతులు దేశసంచారం చేస్తూ, లోకానికి ధర్మ ప్రబోధం చేస్తూ, అందరికీ ఆశీర్వాదం చేస్తూ శారదా చంద్ర మౌళీశ్వరులను ఆరాధించి తద్వారా లోకక్షేమాన్ని కోరుతూ ఉండాలి అని ఆజ్ఞాపించారు...
*_🌹శుభమస్తు🌹_*
No comments:
Post a Comment