Monday, January 1, 2024

 చూడు నాయనా

ప్రాణం పోసింది
పొద్దు పుచ్చుకోవడానికి కాదు ...

ప్రతి పొద్దు
పొద్దుపోవక మునుపే ...

పరమేశ్వర స్వరూపాన్ని 
ప్రతిష్టించుకోవడానికి మాత్రమే ...

నీవు ఎవరింట్లో పుట్టావు అన్నది అవసరం లేదు 

నీవు ఎక్కడ పుట్టావు అన్నది అవసరం లేదు 

నీ కులం 
నీ మతం  నీ గోత్రం నీ వర్ణం ఈ జాతి అవసరం లేదు

నీవు ఏమి తిని బ్రతుకుతున్నావు అవసరం లేదు 

నీవు ఎలాంటి బట్ట కట్టుకుంటున్నావు అవసరం లేదు 

నీవు ఎలాంటి నివాసంలో ఉంటున్నావు అవసరం లేదు

నీవు ఎన్ని తిన్నావు అవసరం లేదు 
ఎన్ని తాగావు అవసరం లేదు 
ఎంతమందితో కలిసావు అవసరం లేదు

నీ జీవితం ఎలా గడుస్తుంది అవసరం లేదు 

నీవు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నావు అవసరం లేదు 

నీ జీవితంలో సుఖాలు అనుభవించావా 
కష్టాలు అనుభవించావా అవసరం లేదు

నీ జీవితంలో నీవు ఎన్ని  తెలుసుకున్నావో అవసరం లేదు
సర్వ శాస్త్రాలు చదివినావా అవసరం లేదు
నీ జీవితంలో ఎంతో ఉన్నతమైన పదవులలో కూర్చున్నావా అవసరం లేదు

నీవు ఆరోగ్యంగా ఉన్నావా లేదా అవసరం లేదు 

నీవు అందంగా ఉన్నావా అవసరం లేదు 

నీవు లావుగా ఉన్నావా సన్నగా ఉన్నావా అవసరం లేదు

ఇవన్నీ అవసరం లేవు 

( మరి ఏది అవసరం )

చనిపోయే లోపు 
నీవెవరు తెలుసుకుంటే సరిపోతుంది. 
.
మిగతావన్ని ఎందుకు పనికిరావు అన్ని శుద్ధ దండగ
.
ఆ ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసినట్లే 
ఆ ఒక్కటి తెలియకుంటే ఏమీ తెలియనట్లే..

అంతటా కలడన్న దైవానికి కేవలం ఒక్క మూల స్థానం ఇవ్వడంలోనే నేను అల్పున్ని అయ్యాను,
నేను లేకుంటే వున్నదంతా దైవమన్న గురువాక్యమును మరచి,
నేను నేనంటూ నన్ను నిలుపుకుంటూ దైవమెక్కడని వెతుకుతూ,
నా అజ్ఞాన మూర్ఖత్వంలో నాకున్న రూప, నామ, క్రియలను లక్షణాలే  దైవానికి ఆపాదిస్తూ నేను సృష్టించిన దైవాన్నె మళ్ళీ తిరిగి నన్ను నిలబెడుతూ,
నా కోరికలు తీర్చు స్వామి అంటూ మొక్కుతూ, మొరలిడుతూ తపిస్తున్న నా అవివేకాన్ని, అజ్ఞానాన్ని ఏమని వర్ణించ సాధ్యమిల వేద, వాగ్మయ, శాస్త్ర, ఇతిహాస, పురాణాది గ్రంథములలోని మహావాక్యములతోనైనా వర్ణించ తరమే????

పుట్టుక కాదొక పెద్ద విషయం. 
--------------------------------------
పుట్టాక నాతో నేనేమి చేశానన్నది
    కదా ముఖ్యం. 

అప్రయత్నంగా లభించే జననం. 
   అనివార్యంగా వచ్చే మరణం. 
   మధ్యనసాగే మన పయనం..
   అదే మన  నిరంతర పరిణామం..

కావొచ్చునెమో అది బహుశా 
   బాహ్యనికో అంతరానికో..
   అనంత ఐశ్వర్యాల  సేకరణకో.. 
   ఆంతర్యపు కాంతుల సమీకరణకో.. 

   ఏది ఏమైనా.. ఎవరేది వెతుకుతారో
   వెతికేదే కదా.. దొరుకుతుంది !!.

యుగాలుగా,తరాలుగా అలవాటుగా ప్రచారంలోను, ఆచరణలోను, నమ్మకంలోను సజీవంగా ఉన్న భావాలను ప్రశ్నిస్తూ, వాస్తవిక దృక్పథాన్ని అలవాటు చేస్తూ, ఋషి జ్ఞానాన్ని , పురాణ గాథలను గురించి ఎలా "ఆలోచించాలో"ఎలా అర్థం చేసుకోవాలో మనకు ఒక మూడు వాక్యాలలో తేల్చి చెప్పేసారు గురుదేవులు. అలాగే మనిషి ఎలా బ్రతకాలో కూడా ఒక్క వాక్యంలో నిర్దేశించారు వారు.
 అవతారాల పేరుతో, కథలుగా ప్రచారం జరుగుతున్న దైవత్వం గురించి, సరైన అవగాహనతో ఆలోచిస్తే, మత్స్యం,కూర్మం, వరాహం అన్ని జీవులకు దైవత్వాన్ని ఆపాదించడం వెనుక "సృష్టిలో, జీవపరిణామ క్రమ వివరణ, అన్ని జీవులలో దైవత్వం ఇమిడి ఉంది" అనే విషయం స్పష్టం.
జీవులన్నింటిలో సమానంగా దైవత్వాన్ని దర్శించాలి అనే విషయం. ఆదిత్యయోగీ..స్పష్టమైనప్పుడు,మానవులందరిలోను, అదే దైవత్వం, దివ్యత ఉంటుంది అని మనం గ్రహించాలి.  అంతటి దివ్యతే మనిషిలో సూక్ష్మ రూపంలో కొలువై ఉన్నప్పుడు , మానవ జాతి సహజమైన మానవత్వం మనిషిలో  ఖచ్చితంగా ఉంది, ఆ మానవత్వం ఆధారంగానే, "మనుషులంతా ఒక్కటిగా" , అందరికోసం అందరూ  జీవించడం , అలాగే  మానవత్వాన్ని పెంచుకుంటూ, ధ్యాన సాధనతో దివ్యతను పొందే దిశగా సాధన చేద్దాం.

ధ్యాన సాధన, జ్ఞానార్జన లతో సాధన పరిపూర్ణం చేసుకునేందుకు అందరం "ప్రస్థాన సాధన ఆన్లైన్ కార్యక్రమంలో  పాల్గొని, మనతోపాటు, మన తోటి వారికి కూడా ఈ భాగ్యం కలిగేలా ప్రచారం చేద్దాం.

"ధ్యాన మనో ప్రస్థానంలో, ధ్యానం, సాధన విధాన, క్రియ, ప్రస్థానం సాధన ఫలితం. ప్రస్థానించవలసినది, మనసును, కనుక - ఆబ్జెక్ట్ మాత్రమే! మరి.. కర్త లేని క్రియకు, అవకాశం లేదు, పరోక్ష రీతిలోనైనా!.... ధ్యాన  మనో ప్రస్థానంలో, క్రియ వుంది. ఆబ్జెక్ట్ వుంది. ప్రస్థానం పేర క్రియా ఫలితమూ వుంది. మరి కర్త ప్రత్యక్షత,లేదు. నిత్య జీవితంలో, మనసు, క్రియ కాదు. శరీరంతో, క్రియను చేయించేది, మాత్రమే అని అవగాహన చేసుకుని ధ్యాన మనో ప్రస్థాన సాధనలో ముందుకెళ్ళాలి అని దివ్యతా మార్గాన్ని మానవాళికి చూపిస్తున్న మహోన్నత దివ్యతా స్ఫూర్తి ..

*పదార్థ  ధర్మం, ప్రకృతి సహజత. కనుక, స్థిర ధర్మాన్ని కలిగిన ఆత్మ, చలన గుణ మనసు సమీపత ఫలితం, ఆ రెండూ కాని, మరో ఏర్పాటు, తప్పనిసరి! అదే ఆత్మీకరణ మనసు*ఆదిత్యయోగీ*

      మమతలు,కలతలు,మనిషి జీవితంలో మామూలే! ఈ రెండూ, వెలుగు నీడల్లా, అతి సమీపంగానే వుంటాయి. అయితే, వీటి మధ్య నలిగి,కమిలి,మానసికంగా కుమిలిపోవడం మాత్రం కోరదగినది కాదు. అయినా,వీటికి అతీతంగా, బ్రతకడం,బ్రతకాలనుకోవడం, మామూలు మానవులకు సాధ్యం కాకపోవచ్చు. అయినా ప్రయత్నం. జీవిత ధర్మం!
   జీవిత మాధుర్యాన్ని గ్రోలుతూ, మనసును మత్తెక్కించుకోని వ్యక్తి జ్ఞాని కాగలడు. జీవిత సన్యాసమే ఆత్మ (?)విన్యాసమనుకోవడం పూర్తిగా 'జడ'లక్షణం.చైతన్య పదార్థ, కనీస లక్షణం కూడా కాదు. అని మనకు తెలియ పరచిన పూజ్య గురుదేవుల, చరణారవిందాల   కు మనఃపూర్వక  
ఆత్మ నమస్కారములు..

మనిషి జీవితం, ద్వంద్వం. పరస్పర భిన్నత కలిగి జంటగా, సమీపతను కలిగిన దానినే 'ద్వంద్వం' అనాలి. 'మనిషి-మనసు', అలాటిదే! అయితే, ద్వంద్వ నిర్వహణ మనసుదే కావడంతో, 'మనిషి, మనసు' ద్వారా జరిగే దానికి, మనిషి నిమిత్త మాత్రమే! కేవలం, భౌతిక ద్వందాన్నేకాక, ఆధ్యాత్మిక ద్వైతాన్ని, వేదాంత ఏకతను, ప్రతిదానిలోనూ పరస్పర అనుకూల - వ్యతిరేకతలను నిర్వహించగలుగుతున్న 'ఇంద్రియ మనసు' మనిషి స్వాధీనమైతేనే, పరిస్థితి, ఉన్నతమైనదిగా వుంటుంది..

నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది. అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతయే అసలైన ప్రార్ధన. *

*మన జీవితం జీవితమని చెప్పడానికి అర్హత లేనిది నువ్వు మరణాన్ని దాటి ప్రయాణించినపుడే జీవితం మొదలవుతుంది. ధ్యానమంటే అదే. ద్యానందానికి వుపయోగపడే వుపకరణం, వ్యూహం, నిచ్చెన, మరణాన్ని దాటిన ఒక మెరుపు చాలు. అప్పుడు నువ్వు ఈ శరీరమొకటే మరణిస్తుందని నువ్వు కాదని తెలుసుకుంటావు. శరీరమే పుడుతుందని, నువ్వు కాదని గ్రహిస్తావు. నువ్వు పుట్టుకకు ముందు యిక్కడున్నావు. మరణానంతరం యిక్కడుంటావు. నువ్వు శాశ్వతత్వంలో భాగం. వ్యక్తి దీన్ని అనుభవానికి తెచ్చుకుంటే జీవితం ఆనందంతో నిండుతుంది.*ఆదిత్యయోగీ*

*అస్తిత్వం నిన్ను ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. అప్పుడు సహజంగా, తక్షణ స్పందనతో కృతజ్ఞత మొదలవుతుంది. ఆ కృతజ్ఞతని నేను ప్రార్ధన అంటాను. తక్కిన అన్ని ప్రార్ధనలూ మోసపూరితాలే. నిజమైన ప్రార్థన నువ్వు ఆనందాన్ని అనుభవానికి తెచ్చుకోవడం నించీ ఆరంభమవుతుంది. అప్పుడు నీలో కృతజ్ఞత మొదలవుతుంది. నువ్వు అస్తిత్వానికి తలవంచాలి. నువ్వు పొందిన వరాన్ని నువ్వు ఆశించలేదు. అడగలేదు. నిజానికి నీకా అర్హత కూడా లేదు. ఎవరికీ అర్హత లేదు. కానీ అస్తిత్వం వాటన్నిటీ అనురాగంతో యిస్తుంది...

అనుభవమే జ్ఞానం 

రేపటి కోసం కష్టపడుతున్నాం 
రేపటి కోసం దాచుకుంటున్నాం 
రేపటి కోసం ఖర్చుపెట్టుకుంటున్నాం. 
అన్ని రేపటి కోసం అయితే 
అసలు రేపు అంటూ నువ్వు ఉండకపోతే...?

సో మనం ఆత్మ స్వరూపులై ఈ భూమి పై ఉండవచ్చు. కానీ శరీరంలో ఉండలేము.అందుకే మనం ఏం చేసినా. ఈ శరీరంలో ఉన్నంతసేపు అందుకే ఏదో ఒకటి చేస్తూ ఉండండి.

 ఈ క్షణం విలువైంది అనేది తెలుసుకొండి.
ఈ భూలోకంలో మన పాత్ర ఏ క్షణం ముగిసిపోతుందో తెలియదు.అందుకే ప్రతి క్షణాన్ని అద్భుతంగా ఉన్నతంగా జీవించడానికి ప్రయత్నించండి.

రేపటి కోసం ఏదైనా దాచి పెట్టాలి అని మీరు అనుకుంటే మీ సంతోషాన్ని మీ ఆనందాన్ని కాదు.

మీరు చేసే చిన్న చిన్న సేవలనీ. విశ్వానికి అందించే ప్రేమని. ప్రతి ఒక్కరితో మనం ప్రవర్తించే విధానాన్ని.
అలాగే ప్రతి ఒక్కరికి మీరు అందించే జ్ఞానాన్ని. ఇవన్నీ మీరు లేకపోయినా అలాగే ఉండిపోతాయి.

సో మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిక్షణాన్ని ఒక పండుగలా చేసుకుంటూ ఆనందంగా ఉంటూ ప్రతి ఒక్క పనిని అద్భుతంగా చేస్తూ అందులోని నిమగ్నం అయి పోవాలి.ఇదే సత్యమార్గం అయిన విశ్వ కర్త యొక్క జీవితం.....*
.

No comments:

Post a Comment