Friday, February 16, 2024

బంధమునకు మరియు మోక్షమునకు కారణము మనస్సే

 120224-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1024.
నేటి…

            *ఆచార్య సద్బోధన:*
                 ➖➖➖✍️

*”మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః” -*

అనగా "బంధమునకు మరియు మోక్షమునకు కారణము మనస్సే". 
```
ఆధ్యాత్మిక సాధనలో మనస్సు యొక్క ఉద్దేశ్యమే(అభిమతం) ప్రధానమైంది తప్ప బాహ్యమైన క్రియలు కావు. 

ఒక వ్యక్తి పవిత్ర బృందావన ధామములో నివసిస్తున్నా అతని మనస్సు బొంబాయిలో రసగుల్లాలు తినటం కోసం ఆలోచన చేస్తే అతను బొంబాయిలో ఉన్నట్టే లెక్క. 

దీనికి విరుద్ధంగా ఒకడు బొంబాయి నగర హడావిడి మధ్య నివసిస్తున్నా, బృందావనంలోని భగవంతునిపైనే మనస్సు నిమగ్నం చేస్తే, అతనికి 
ఆ బృందావనంలో నివసించే ఫలితం దక్కుతుంది. 

అనగా మన మానసిక స్థితిని బట్టే మన ఆత్మ ఉద్ధరణ స్థాయి ఉంటుంది తప్ప బాహ్యాచారాలు వలన కాదు అనేది స్పష్టమవుతుంది. 

ఈ విషయము చక్కగా గ్రహించి నడుచుకోవాలి!✍️```
          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment