,*త్రిపురా రహస్యము -62*
!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
*స్వామి దత్తాత్రేయ విరచిత ఆత్మ జ్ఞాన యోగము*
*జ్ఞానభేధాలు -మోక్షసాధనాలు - 2*
ఆ మాటలు విన్న పరశురాముడు ఆలోచించాడు. అతడికి మళ్ళీ సందేహం కలిగింది.
గురువుకు నమస్కరించి గురుదేవా ! సత్సంగము, ఈశ్వరానుగ్రహము, వైరాగ్యము, ఈ మూడూ మోక్షానికి కారణము అన్నారు. విటిలో ముఖ్యమైనది ఏది ? దాన్ని ఎలా పొందగలము ? అన్నాడు.
ద: నాయనా ! శ్రేయస్సుకు ముఖ్యమైన మొదటి కారణాన్ని గురించి వివరిస్తాను విను. ఆ పరాచితి, పరమేశ్వరియే తన స్వాతంత్రేచ్చవల్ల ఈ జగత్తును సృష్టించింది. ఆమెయే హిరణ్యగర్భుడనే పేరుతో ఈ శరీరాన్ని ధరించింది. జీవులయొక్క కర్మలను, వారి కోరికలను అనుసరించి వారికి చిత్రవిచిత్రమైన ఫలితాలు ఇవ్వగల కర్మలను సృష్టించింది.
ప్రతి మనిషీ మంచి, చెడూ కర్మలు చేస్తూనే ఉంటాడు. వీటి ఫలితంగా ఉత్తర జన్మలు ఎత్తుతుంటాడు. ఒక్కొక్కసారి కామ్యకర్మలే చేస్తాడు. వాటిలో ఏ లోపం జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వవు. పైగా ఒక్కొక్కసారి దుష్ఫలితాలు కూడా ఇస్తాయి. అందుకని సత్పురుషులనాశ్రయించి కర్మలు ఏ రకంగా చెయ్యాలో తెలుసుకుని ఆ రకంగానే వాటిని పూర్తి చెయ్యాలి.
సాధారణంగా సత్సంగం వల్లనే శ్రేయస్సు కలుగుతుంది. ఒక్కొక్కసారి గతంలో మనం చేసిన ఉత్కృష్టమైన తపస్సులాంటిది ఉంటే అనుకోకుండా శ్రేయస్సు కలుగుతుంది. వారికీ అల్పసాధనతోనే సంపూర్ణ జ్ఞానం సిద్దిస్తుంది.
పూర్వపుణ్యంవల్ల వాసనలు లేనివారికి మనస్సు నిర్మలంగా ఉండి జనకుని లాగా అతిస్వల్పకాలంలోనే మహత్తర జ్ఞానం కలుగుతుంది.
అధికవాననలున్నవాదికి జ్ఞానం కలిగినా దానివల్ల ఫలితముండదు.
జ్ఞానులలో కూడా స్థితి భేదాలున్నాయయ్యా !
త్రిమూర్తుల మనస్సులలో కర్మవాసనలు లేవు. అందుకే వారు స్వభావజ్ఞానులు, అయినప్పటికీ వారి స్వభావగుణ మహాత్య్వాలలో తేడా ఉంది.
పరశురామా నేను, దూర్వాసుడు, చంద్రుడు ఒక తల్లి బిడ్డలమే అయినా మాలో తేడా కనపడుతున్నది.
దుర్వాసుడు - కోపిష్టి
చంద్రుడు = కాముకుడు. దక్షుని కుమార్తిలందరిని వివాహం చేసుకున్నాడు.
ఇక నేను - _సర్వసంఘపరిత్వాగిని విరాగిని
అదే విధంగా వశిష్టుడు - కర్మిష్టి
సనకసనందనాదులు -_ సన్యాసులు
నారదుడు =. భక్తుడు
బృహస్పతి _ దేవగురువు
శుక్రాచార్యుడు - . రాక్షస గురువు
వ్యాసుడు - శాస్ర రచయిత
జనకుడు = రాజు
భరతుడు – త్యాగి
వీరందరూ జ్ఞానులే ఇంకా ఇలాంటివారెందరో ఉన్నారు. వారిలో అనేక తేడాలు కనిపిస్తాయి. రామా ! నీకొక పరమ రహస్యాన్ని చెబుతాను విను.
వాసనాత్రయమును గురించి గతంలో వివరించాను.
1. అపరాధము 2. కర్మ ౩. కామము. వీటిలో కర్మవాసన బలీయమైంది. దీనివల్ల మనస్సు అత్యంత మూఢమవుతుంది. మిగిలిన రెండు వాసనలు లేకపోయినా, కర్మవాసన ఒక్కటి ఉంటేచాలు. జ్ఞానం కలగదు. ఈ కర్మవాసనకొద్దిగా ఉన్నా చాలు. అజ్ఞానము పెరిగిపోతుంది. మిగిలిన రెందు వాసనలు ప్రతిబంధకాలవుతాయి. అపరాధ, కర్మవాసనలు లేనివారికి కామవాసనలు ప్రతిబంధకాలు కావు. అందుచేతనే కర్మవాసనలు ఏ మాత్రం లేనివారిని మేధావులు అంటారు. వారికీ విషయాన్ని ఒకసారి విన్నంత మాత్రం చేతనే, అప్పటికప్పుడే మననము, ధ్యానము కలుగుతాయి. ఆ వెంటనే ఆత్మదర్శన మవుతుంది.
జనకమహారాజు లాంటివారు ఈ కోవకు చెందినవారే. వీరు జీవన్ముక్తులు. వీరి విషయంలో కామక్రోధాలు ప్రతిబంధకాలు కావు. అందుకనే వారు వాటిని నిరోధించటానికి ప్రయత్నంకూడా చెయ్యరు.
అందుకనే జ్ఞానోదయమైన తరువాత కూడా వారిలో కామాదులు పుడుతూనే ఉంటాయి. కాని వాటివల్ల ఏ రకమైన మాలిన్యము వారికి అంటదు. వారిని 'ముక్తులు” అంటారు.
పరశురామా ! కర్మవాసనలతో బాగా మలినమై పోయినవారికి సాక్షాత్తూ పరమేశ్వరుడు వచ్చి ఉపదేశం చేసినా జ్ఞానం కలగదు.
అపరాధము, కర్మ తక్కువగా ఉండి కామవానన ఎక్కువగా ఉన్నవారు చాలా కాలం శవణమననాలు, ధ్యానము చేస్తే, అతికష్టం మీద జ్ఞానం కలుగుతుంది. వారు ఎక్కువగా సమాధిలోనే ఉంటారు. సమాధి అభ్యాసం వల్ల వాసనలు నశిస్తాయి. వీరి మనస్సు నశిస్తుంది వీరిని “నష్ట మానసులు” అంటారు. వీరు మధ్యములు.
యోగసాధన చేసేవారిలో కొందరు సోమరితనంతో తీవ్రసాధన చెయ్యరు. అప్పుడు మనస్సు నశించదు. వారిని “నసమననస్ములు” అంటారు. వీరే “'మందజ్ఞానులు” “కేవలజ్ఞానులు” వీరు ప్రారబ్బానికి లొంగిపోతారు. సుఖదుఃఖాలను అనుభవిస్తారు.
చనిపోయిన తరువాత మోక్షాన్ని పొందుతారు. నష్టమానసులు ప్రారబ్దాన్ని జయిస్తారు, వీరికి మనసుండదు కాబట్టి వీరి వాసనలు గొదె అడుగున ఉండే విత్తనాలలాగా తప్పలు అయిపోతాయి. అంతే గాని మొలకెత్తవు. జీవన్నుక్తులు ఉత్తమజ్ఞానులు.
వీరి దృష్టి ఆత్మానందం మీదనే ఉంటుంది. ఒక్కొక్కసారి బాహ్యప్రపంచం వైపు కూడా వీరు రావచ్చు. వీరు మేధావులు. ఏకకాలంలో అనేక పనులు, చెయ్యగలరు. అందుకే వీరిని “బహుమానసులు” అంటారు. వీరికి కూడా ప్రారబ్ద ఉండచ్చు. కాని అది మొలకెత్తగానే జ్ఞానాగ్నితో దాన్ని దగ్ధం చేస్తారు. కాబట్టి 'ప్రారబ్బకర్మ ఫలితాలు వారికి ఉండవు.
🪷⚛️✡️🕉️🪷
No comments:
Post a Comment