హరిఓం ,
ఆధ్యాత్మ నియమంలో మనం నివసించినప్పుడే ఇతరులను ఒప్పించగలము.
మన హృదయంలో విశ్వాసం, మనః పూర్వకత లేకపోతే ఏ ఒక్కరికీ సాయపడలేము.
మన మీద మనకు నమ్మకం లేకపోతే ఏ ఒక్కరికీ సాయపడలేము.
మన మీద మనకు నమ్మకం లేకపోతే మన మాటలు ఇతరులకు నమ్మకాన్ని కలిగించలేవు.
మన ప్రేమ యొక్క శక్తిని గూర్చి మాట్లాడదలచుకుంటే ప్రేమ ద్వారానే ప్రయత్నించాలి.
మన హృదయంలో ద్వేషం, కోపం, అసూయ ఉంటే మనం చెప్పేది ఇతరుల మీద చాలా తక్కువ ప్రభావం చూపిస్తుంది.
మన పనుల ద్వారా, మన సేవా విధానం ద్వారానే మనం నైతిక నియమాలను నేర్పగలము .......
ఇతరులను ప్రభావితులను చేసే ఉత్తమ మార్గం మనం ఒక ఉన్నత ఆదర్శానికి అంకితం కావడమే.
ప్రపంచమంతా వసుధైక కుటుంబమనీ, మనమంతా ఆత్మబంధువులం అనే సత్యాన్ని గ్రహించినపుడే మనకు నిజమైన నిస్వార్థ సేవ చేయడం తెలుస్తుంది.
ప్రాణికోటిని బాహ్యంగా చూస్తే ఎన్నో భేదాలు కనిపిస్తున్నా, వివిధ కుసుమాలను జతకూర్చేందుకు ఉపయోగించిన దారం ఏ విధంగా ఏకత్వాన్ని చూపిస్తోందో ఆ విధంగా మనందరిలో వెలయాడుతున్న చైతన్యం ఒక్కటే అన్న ఈ సామరస్యం మనకు బోధపడాలి.
ఒక మహావృక్షం వలె సేవ చేయగలగాలి, దాని కొమ్మలను నరికివేసినా అది చలించక ఆశ్రయాన్ని ఇస్తూనే ఉంటుంది, ఫలాలను అందిస్తూనే ఉంటుంది............... - - 🙏🙏 ...... - వలిశెట్టి లక్ష్మీశేఖర్ .......... - 98660 35557 ...... - 29 .03 .2024 ....
No comments:
Post a Comment