*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 224 / DAILY WISDOM - 224 🌹*
*🍀 📖 ఉపనిషత్తులపై పాఠాల నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🌻 11. మిమ్మల్ని మాత్రమే నిజమైన ఆత్మగా కోరుకుంటున్నారా? 🌻*
*మీరు విశ్వాత్మను కనుగొనాలంటే మీ స్వయం ఆత్మని కనుగొనాలి. మీరు మీ స్వయం ఆత్మని కనుగోనాలంటే మీరు వేరే ఎక్కడా వేతకక్కర్లేదు అని తెలుసుకుంటారు. ఉపనిషత్తులను అధ్యయనం చేసే ముందు మీరు పాటించవలసిన షరతు ఉంది. మీకు విశ్వాత్మ కుద్ద తానే అయి ఉన్న మీ ఆత్మ కావాలా? లేదా ఇంకా ఏవేవో కావాలా? అనేక ఇతర విషయాలను కోరుకునే వారు ఉపనిషత్తులు లేదా భగవద్గీత తత్వశాస్త్రం యొక్క అధ్యయనానికి సరిపోరు, ఎందుకంటే ఉపనిషత్తులు మరియు గీత మిమ్మల్ని విషయాల యొక్క మూలానికి తీసుకువెళతాయి, ఇది అన్ని విషయాల యొక్క వాస్తవికత.*
*మీరు దానిని అర్థం చేసుకున్నప్పుడు, దానిని సాధించినప్పుడు, దానిని చేరుకున్నప్పుడు, దానితో మిమ్మల్ని మీరు గుర్తించినప్పుడు, మీరు ఇంకేమీ అడగవలసిన అవసరం లేదు. ఇది వాస్తవికత యొక్క సముద్రం లాంటిది. దాని వెలుపల ఏమీ లేదు. కానీ ఏదైనా విషయాన్ని పొందాలనే కోరిక ఏ కొంచెమైనా మిగిలుంటే వాటిని తీర్చుకుని రావడం మంచిది. మీరు తీరని కోరికల యొక్క నిరాశతో గురువు దగ్గరకి రాకూడదు. గురువు దగ్గరకు వచ్చే ముందు అక్కడ ఉన్న షరతులను అన్నీ పాటించాలి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 DAILY WISDOM - 224 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 11. Do You Want Only Yourself as the True Spirit? 🌻*
*When you search for the Spirit of the world as a whole, the Spirit of your own Self, when you search for your Self, you conclude there is no need in searching for anything else. Here is the condition that you have to fulfil before studying the Upanishads. Do you want only your Self as the true Spirit, commensurate with the Spirit of the universe, or do you want many other things also? Those who want many other things are not fit students of the Upanishadic or even the Bhagavadgita philosophy, because the Upanishads and the Gita take you to the very essence of things, which is the Reality of all things.*
*When you get That, attain That, reach That, identify yourself with That, you will not have to ask for anything else. It is like the sea of Reality, and nothing is outside it. But if desire still persists—a little bit of pinching and a discovery of a frustration, and emotional tension: “Oh, I would like to have this”—and it is harassing you, then you had better finish with all your desires. You should fulfil all your requirements and not come to the Upanishadic teacher with the disease of a frustrated, unfulfilled desire.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment